గుప్తనిధుల డబ్బులు ఇస్తానని..
విద్యావంతులు కూడా మూఢ నమ్మకాల బారిన పడుతున్నారు. గుప్త నిధుల పేరిట జరిగిన వాగ్వాదం.. ఓ హత్యకు దారి తీసింది. ఆలశ్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న సంతోష్ రెడ్డి.. తన బాబాయి కుమారుడు మైనిక్ రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు ఆశా చూయించి అతని వద్ద నుంచి రూ.10లక్షల వరకూ తీసుకున్నాడు.
తనకు గుప్త నిధులు లభించాయని.. వాటికి శాంతి పూజ చేయడానికి అవసరమైన రూ.2లక్షలు ఇస్తే పూజలు అనంతరం రూ.15లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
డబ్బుకు ఆశపడిన అన్న పది లక్షల వరకూ ఇచ్చినా.. తమ్ముడు నిధికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు అన్నను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఏడాది జనవరి 30న సంతోష్‌రెడ్డి మిస్సింగ్ కేసు నమోదవడంతో.. విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు.