మంథని జేఎన్టీయూలో విద్యార్థుల ఆందోళన
కరీంనగర్: జేఎన్ టీయూ మంథని క్యాంపస్ విద్యార్థులు ఆందోళనబాటపట్టారు. క్యాపస్ లోని క్లాస్ రూమ్ లు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బుధవారం కళాశాల ఎదుట నిరసనకు దిగారు.
వసతుల కల్పనతోపాటు శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించి తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.