Mayor koneru sridhar
-
కౌన్సిల్ హాల్లో ఎన్టీఆర్, బాబు ఫొటోలు
విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు హాలును టీడీపీ కార్యాలయంగా మారుస్తున్నారని, ఎలాంటి సమాచారం లేకుండా మాజీ సీఎం ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను ఏర్పాటు చేయటం అధికార పార్టీ పక్షపాత ధోరణికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. కౌన్సిల్ హాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఫొటో కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది. పటమట : నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారం, నగరాభివృద్ధిపై జరిగిన వీఎంసీ కౌన్సిల్ సమావేశం ఆద్యంతం పాలకపక్ష అనుకూల నిర్ణయాలు తీర్మానించుకోవటానికి.. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలను ఆఫీసు రిమార్కులకు పంపే వేదికగా మారింది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షత శనివారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చర్చ జరగకుండానే, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండానే ముగిసింది. ఏకపక్షంగా సాగిన సమావేశంలో ఇప్పటి వరకు లేని మాజీ సీఎం ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను ఏర్పాటు చేయటంపై రగడ మొదలైంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వైఎస్ చిత్రపటాన్ని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. చిత్రపటాన్ని పట్టుకుని మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. దీనిపై మేయర్ ఆగ్రహంతో ఆందోళన చేస్తున్న ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, బీజాన్బీ, పాలా ఝాన్సీలక్ష్మి ని సస్పెండ్ చేశారు. ఈ పరిణామంపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. మేయర్ వైఖరికి వ్యతిరేకంగా కౌన్సిల్ హాలు బయట ఆందోళన చేపట్టారు. చర్చకు రాని అంశంపై.. ఎజెండాలో పొందుపరచని అంశం కాకుండా టీడీపీ కార్పొరేటర్లు బీసెంట్ రోడ్డు హాకర్ల గురించి చర్చించటంపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీసెంట్ రోడ్డులో ఆక్రమణలను తొలగించాలని, రోడ్డుకు మార్జిన్లు ఏర్పాటు చేపి హాకర్ జోన్ ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ప్రస్తావించారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్‌కుమార్ స్పందించి బీసెంట్ రోడ్డుపై పలువురు చిరు వ్యాపారులు ఆధారపడ్డారని, అలాంటి వారి జీవనాధారంపై వేటు వేయాలని చూడటం హేయమని అన్నారు. ఈ అంశం కేవలం కొంతమంది టీడీపీ నేతల వ్యక్తిగత ఎజెండా అని, నెలవారీ మామూళ్లు చెల్లించని హాకర్లను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయితే ఎజెండాలో ఈ అం«శం లేదని దీనిపై చర్చ జరిగేందుకు అవకాశం లేదని కార్పొరేటర్లు సూచించారు. దీంతో ఇరు పక్షాలు వెనక్కు తగ్గాయి. కీలకాంశాలు.. జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో జీప్లస్3 గృహ సముదాయంలో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి లబ్ధిదారుల వాటా రూ.66 వేల నుంచి రూ.1.56 లక్షలకు పెంపుదల చేసే అంశాన్ని సభ వాయిదా వేసింది. ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు, స్వాతంత్య్ర సమరయోధులు తలశిల వెంకటరామయ్యకు స్థలం కేటాయింపుపై వచ్చిన తీర్మానం ఆఫీస్ రిమార్కులకు పంపారు. వివాదాస్పదమైన ఫన్‌టైం క్లబ్ స్వాధీనం అంశంను తిరస్కరించారు. భాగ్యనగర్ గ్యాస్ ఏజన్సీకి స్థల కేటాయింపులపై కౌన్సిల్ ఆమోదం చేస్తూ తీర్మానం చేసింది. ఎన్టీయార్ సర్కిల్ నుంచి ఆటోనగర్ చెక్‌పోస్టు వరకు బందరు రోడ్డు విస్తరణలో భాగంగా నిర్వాసితులవుతున్న వారందరికీ టీడీఆర్ బాండ్లు కాకుండా నగదు రూపంలో చెల్లింపులు జరగాలని వచ్చిన ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కార్పొరేటర్ల ఉదారత.. నాలుగుసార్లు కార్పొరేటర్‌గా పని చేసిన తాజ్నోత్ దాసు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను ఆదుకోవాలని వచ్చిన ప్రతిపాదనపై సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. ప్రతి కార్పొరేటర్ ఓ నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు గూడు కల్పించాలనే విషయంలో జీప్లస్3 గృహ సముదాయాల్లో ఇంటికి కేటాయించాలని కమిషనర్‌ను కోరగా ఆయన అంగీకరించారు. సమాధానాలు రావటం లేదు.. ఆఫీస్ రిమార్కులకు వెళ్లిన వాటిపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదని పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు కూడా అసమగ్రంగా ఉంటున్నాయని ఆరోపించారు. దీనిపై కమిషనర్ కల్పించుకుని ఈసారి ఇలాంటి పొరపాటు జరగదని, కార్పొరేటర్లు కూడా ప్రశ్నలను 15 రోజుల ముందుగా అధికారులకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను జప్తు చేయాల్సిందే.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాలల నుంచి కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోతున్నామని, ఆయా సంస్థలు వీఎంసీకి ఎలాంటి పన్నులు చెల్లించటం లేదని, ఇలాంటి సంస్థలను జప్తు చేస్తామని అధికారులు నోటీసులు పంపాలని కొందరు కోరారు. బందరు రోడ్డులో ఇటీవల నిర్మించిన ఆర్అండ్బీ రాష్ట్ర కార్యాలయం నుంచి పన్నులేమీ రాలేదని, అలాగే పక్కనే ఉన్న పోలీసు గ్రౌండ్స్‌లో ఉన్న వ్యాస్ కాంప్లెక్స్ భవనానికి అనుమతి ఉన్నదీ లేనిదీ తెలియదని, పన్నులు చెల్లిస్తున్నారో లేదో విచారణ చేయాల్సి ఉందని మేయర్ కోనేరు శ్రీధర్ ప్రస్తావించారు. భవానీపురంలో శుక్రవారం జరిగిన పోలీస్ స్టేషన్ నూతన భవన శంకుస్థాపన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అనుమతి, ప్లాను లేకుండా నిర్మాణం చేపడితే టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు చేపట్టాలని కౌన్సిల్‌ల్లో ప్రస్తావించారు. -
ఎమ్మెల్యే దగ్గరకొచ్చేసరికి కాకపుట్టిందా?
విజయవాడ కార్పొరేషన్ పాలకవర్గంలో కాక మొదలైంది. మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహార శైలి నచ్చక అధికార పార్టీ కార్పొరేటర్లు కారాలూ మిరియాలు నూరుతుండటం.. ఈ నేపథ్యంలో అధిష్టానం దూతగా అర్బన్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాట్లు చేసిన సమావేశం గరం.. గరంగా సాగింది. కార్పొరేటర్లలో అధిక శాతం మంది మేయర్‌ను తొలగించాలని గళం వినిపించారు. బుద్ధా వెంకన్నతో జరిగిన సమావేశంలో మేయర్ శ్రీధర్, తన వద్ద కార్పొరేటర్ల అవినీతి చిట్టా ఉందని, తనను ఎవరూ ఏమీచేయలేరని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌తో కార్పొరేషన్లో రాజకీయ కాక రాజుకున్నట్లు స్పష్టమవుతోంది. అమరావతిబ్యూరో/భవానీపురం : ‘మేయర్‌గా కోనేరు ఉంటే.. మేమేంటో చూపిస్తాం.. ఆయన అవినీతిని ఎండగడతాం.. పార్టీ విషయం పక్కన పెట్టండి.. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోరు.. ఆయన నోటిదురుసు ఇక సహించలేం.. మేయర్‌ను మార్పుచేయాల్సిందే.. రోటేషన్ పద్ధతిలో పదవి ఇవ్వండి.. లేదు.. కాదు అంటే మేమేందో చూపిస్తాం..’ ఇదీ విజయవాడ కార్పొరేషన్ పాలకపక్ష కార్పొరేటర్లు మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహార శైలిపై సంధించిన మాటలు. ‘నాతోనే గేమ్స్ ఆడతారా?.. కార్పొరేటర్ల అవినీతిని అడ్డుకుంటే నన్ను మార్చేస్తారా?.. నేను ఎవరిని చులకనగా మాట్లాడను.. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని.. కొంచెం మాటతీరు అలా ఉంటుంది.. నేను సీఎంకు కావాల్సిన వ్యక్తినే.. నేనేం చేయాలో నాకు తెల్సు’ ఇదీ మేయర్ శ్రీధర్ అంతర్గత సమావేశంలో ఆవేశపూరిత ప్రసంగం. నగర మేయర్ కోనేరు శ్రీధర్, పాలక పక్ష„ కార్పొరేటర్ల మధ్య రగులుతున్న వివాదం మరింత జఠిలంగా మారింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రంగంలోకి దిగిన అర్బన్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నకు బుధవారం ఇరు పక్షాలు చుక్కలు చూపించారు. కేశినేని భవన్లో కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశం గరం గరంగా సాగింది. కార్పొరేటర్లు మేయర్ వ్యవహారశైలి బాగాలేదని రెచ్చిపోయారు . ఆయన కావాలో, మేమో తేల్చుకోమంటూ తెగేసి చెప్పారు. మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినా వారు వినిపించుకోలేదు. అధిష్టానానికి మా అభిప్రాయం చెప్పండని, మేయర్‌ను తప్పక మార్చాల్సిందేనని ఎక్కువ మంది కార్పొరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో వివాదంతోనైనా మీలో చలనం వచ్చిందా? అంటూ నిలదీశారు. ఆ నియోజకవర్గానికి చెందిన ఎక్కువ మంది కార్పొరేటర్లు మేయర్‌పై కత్తులు దూశారని సమాచారం. మేయర్‌ను తక్షణమే తప్పించాలని, లేనిపక్షంలో ఆయన అవినీతి చిట్టా విప్పి ఎండగడతానని కార్పొరేటర్ నజీర్ హుస్సేన్ తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు తెలిసింది. ఆయన్ని ఇంకా కొనసాగనిస్తే పేపర్లకెక్కాల్సి వస్తుందని కూడా చెప్పినట్లు తెలిసింది. గతంలో కార్పొరేటర్లందరూ టూరుకు వెళ్లిన సందర్భంలో జరిగిన సంఘటనపై మేయర్ వారినే తప్పుపట్టటం, రొటేషన్ పద్ధతిలో పదవులు కేటాయించాలన్న అంశంలో మేయర్‌కు వ్యతిరేకంగా సుమారు 27 మంది సంతకాలు పెట్టి ఇస్తే పక్కన పడేసిన నగర అధ్యక్షుడు వెంకన్న, ఇప్పుడు ఎమ్మెల్యే గద్దె విషయానికొచ్చేసరికి కాక పుట్టిందా? అంటూ కొందరు కార్పొరేటర్లు గుసగుసలాడుకున్నట్లు తెలిసింది. పార్టీని నమ్ముకుని జెండా మోస్తున్న కార్యకర్తలు కొందరు చిన్నచిన్న కాంట్రాక్ట్ వర్క్‌లు చేసుకుంటే వారి బిల్లులు పాస్ చేయించకుండా మేయర్ మాత్రం తన బినామీ కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం పూర్తి స్థాయిలో తీసుకోవడం ఎంతవరకు సమంజసమని కార్పొరేటర్ వై.రామయ్య ప్రశ్నించినట్లు తెలిసింది. కార్పొరేటర్ స్థాయిథనుంచి మేయర్ స్థానానికి ఎదిగిన శ్రీధర్ కార్యకర్తలను గుర్తించాలని కోరినట్లు సమాచారం. స్టాండింగ్ కమిటీ సమావేశంలో తాను మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఆయన వ్యంగ్యంగా మాట్లాడి ఆవేదనకు గురిచేశాడని రామయ్య ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. రోటేషన్ పద్ధతిలో పదవులను కేటాయిస్తే సీనియర్లకు అవకాశం లభిస్తుందని జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, ముప్పా వెంకటేశ్వరరావును దృష్టిలో పెట్టుకుని నజీర్ హుస్సేన్ చెప్పినట్లు తెలిసింది. దీంతో రొటేషన్ పద్ధతిలో అయితే కాపు సామాజిక వర్గానికి మేయర్ పదవి కేటాయించాలని నెలబండ్ల బాలస్వామి కోరినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మేయర్‌ను మార్చటం మంచిది కాదని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కార్పొరేటర్లు వి.హరనాధస్వామి, కె.వెంకటేశ్వరరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. నేనూ చిట్టా విప్పుతా : మేయర్ అంతకు ముందు బుద్ధా వెంకన్న మేయర్ శ్రీధర్‌తో సమావేశం అయ్యారు. ఇద్దరి మధ్య చర్చ రసవత్తరంగా సాగింది. నన్ను విభేదించే కార్పొరేటర్ల అవినీతి చిట్టా తన వద్ద ఉందని అది బయటపడితే వారి పరువుపోతుందని చెప్పినట్లు తెలిసింది. వారు భయపడితే తాను భయపడనని, నాకు సీఎం తెలుసునని చెప్పినట్లు సమాచారం. నేను మేయర్‌గా ఏవిధంగా ఎంపికయ్యానో మీకు తెలుసని, నాపై అభాండాలు వేసి తొలగిస్తే మాత్రం నేనేం చేయాలో తెలుసని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం వద్దే తేల్చుకుంటానని మేయర్ చెప్పడంతో బుద్ధా వారించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో అధిష్టానం సీరియస్‌గా ఉందని ప్రస్తుతానికి ఎవరూ మీడియా ముందుకు రావద్దని, జరిగిన విషయాలు సీఎం, లోకేష్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చూపుతారని, అంతవరకు మౌనం దాల్చాలని సూచించారు. ఆపై మేయర్ ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు. అందరం కలసికట్టుగా సమన్వయంతో పనిచేసుకుంటామని ప్రకటన ద్వారా మేయర్ వెల్లడించారు. -
రగులుతున్న మేయర్-కార్పొరేటర్ల పోరు!
సాక్షి, విజయవాడ: నగర మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తలెత్తిన అసమ్మతిపోరు ఇంకా సద్దుమణగలేదు. నోటి దురుసుతో అందరినీ బూతులు తిడుతున్న మేయర్ శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని స్వపక్ష కార్పొరేటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లతో పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం సమావేశమయ్యారు. మేయర్ శ్రీధర్‌ను తప్పించాల్సిందేనని ఈ సమావేశంలో కార్పొరేటర్లు బుద్దాను డిమాండ్ చేశారు. రొటేషన్ పద్ధతిలో మేయర్ పీఠాన్ని వేరేవారికి అప్పగించాలని కోరారు. మేయర్ ను తప్పించడమనేది తన పరిధిలో లేదని, మీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్న బుద్దా కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు. ఈ వివాదంపై చర్చించేందుకు మధ్యాహ్నం మేయర్ శ్రీధర్‌తో ఎమ్మెల్సీ బుద్దా సమావేశం కానున్నారు. ఈ రోజు సమావేశానికి ముగ్గురు మినహా కార్పొరేటర్లంతా హాజరయ్యారని, మేయర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్పొరేటర్లు తనకు ఫిర్యాదు చేశారని బుద్ధా మీడియాతో తెలిపాఈరు. సమన్వయలోపంతోనే మేయర్, కార్పొరేటర్లు మధ్య వివాదం తలెత్తిందని, మధ్యాహ్నం మేయర్‌తో సమావేశమై.. అందరినీ కలుపుపోవలని ఆయనకు సూచిస్తామని బుద్ధా పేర్కొన్నారు. మిగతా కులాల వారికి రొటేషన్ పద్ధతిలో చైర్మన్ పదవి ఇవ్వాలని కార్పొరేటర్లు కోరుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇతర ప్రాంతాలలో ప్రభావం.. విజయవాడ మేయర్‌ను మారిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న అధికార పార్టీ మేయర్లపై పడుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల రెండేళ్లకు ఒకరు మేయర్‌గా ఉండాలన్న ఒప్పందాలు అమలుకాక పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీధర్‌ను మారిస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించి కొనసాగుతున్న తమ మేయర్లను కూడా మార్చాలని, ఇతర ప్రాంతాలలోని ఆశావహులు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది. -
రగులుతున్న అసమ్మతి.. టీడీపీ మేయర్‌పై తిరుగుబాటు!
సాక్షి, విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ అధికారపక్షంలో అసమ్మతి సెగ రగులుతోంది. విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్‌పై టీడీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. మేయర్ వెంటనే మార్చాలంటూ పార్టీ నేతలకు లేఖాస్త్రాన్ని సంధించారు. మేయర్‌పై ఎదురుతిరిగిన అసమ్మతి కార్పొరేటర్లకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామోహ్మన్ అండగా నిలిచారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ అండతో మేయర్ అక్రమాలకు పాల్పడుతున్నారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ముందే పంచాయితీ పెట్టాలని అసంతృప్త కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నతో కార్పొరేటర్లు భేటీ అయ్యారు. -
జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లకు.. మంగళం!
హౌసింగ్‌కు అప్పగించేందుకు నిర్ణయం మేయర్ అధ్యక్షతన సీనియర్ కార్పొరేటర్ల భేటీ త్వరలో మంత్రి నారాయణ వద్దకు నెరవేరని పేదల కలలు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా నగరానికి 28,152 గృహాలు మంజూరయ్యాయి. ఇందులో 9,976 ఇళ్లు కట్టలేమని కార్పొరేషన్ చేతులెత్తేసింది. హౌసింగ్‌కి బదలాయిస్తూ గతేడాది కౌన్సిల్లో తీర్మానం చేసింది. తాజాగా వివిధ దశల్లో ఉన్న నాలుగు వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి కూడా తప్పుకొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సోమవారం చాంబర్లో మేయర్ కోనేరు శ్రీధర్ టీడీపీ సీనియర్ కార్పొరేటర్లతో భేటీ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతల్ని వదిలించుకునేందుకు మున్సిపల్ మంత్రి పి.నారాయణతో భేటీ అవ్వాలనే ఆలోచనకు వచ్చారు. ఇలా మొదలైంది... జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా నగరానికి 28,152 ఇళ్లను 2006లో కేటాయించారు. కృష్ణానది, బుడమేరు వరద బాధితులు, అభ్యంతరకర పరిస్థితుల్లో నివసించేవారికి జీ ప్లస్ త్రీ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. మొదటి విడతలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. స్థలాల కొరత వెంటాడటంతో విజయవాడ రూరల్, జక్కంపూడి, గొల్లపూడి ప్రాంతాల్లో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో 226.56 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. 60 శాతం వాటా కింద 130 ఎకరాలు రైతులకు, 40 శాతం వాటాగా కార్పొరేషన్‌కు వచ్చిన 96.56 ఎకరాల్లో గృహనిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. నాలుగు విడతల్లో 18,176 గృహ నిర్మాణాలను చేపట్టగా 14,176 ఇళ్లను పూర్తి చేశారు. ఇందులో 11,676 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిర్మాణాలు పూర్తయిన మరో 2,500 ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉంది. 2,500 ఇళ్లు పంపిణీ చేస్తే.. దండిగా ఆదాయం... గృహనిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు రూ.572 కోట్లు కేటాయించగా, రూ.432 కోట్లతో పనులు పూర్తి చేశారు. నిధులు పక్కదారి పట్టాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీయూఎఫ్ఐడీసీ) తన వాటాగా ఇవ్వాల్సిన రూ.55 కోట్లను నిలుపుదల చేసింది. రూ.72 కోట్లు లబ్ధిదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. రూ.10 కోట్లు కార్పొరేషన్ భరించాల్సి ఉంది. నిర్మాణం పూర్తయిన 2,500 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించినట్లయితే నగరపాలక సంస్థకు దండిగా ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థలాల కొరత కారణంగా 9,976 ఇళ్లను నిర్మించలేమని చేతులెత్తేసిన కార్పొరేషన్ అదనపు భారం పడుతోందనే వంకతో మరో నాలుగువేల ఇళ్లకు మంగళం పాడింది. గతంలో రూ.40 వేలకు ఇళ్లు కేటాయించారు. పెరిగిన ధరల దృష్ట్యా ఈ మొత్తాన్ని రూ.66 వేలు చేశారు. పేదల ఆశలు ఆవిరి జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు దక్కుతాయనుకున్న పేదల ఆశలు ఆవిరైపోతున్నాయి. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా 59 డివిజన్లలో నిర్వహించిన గ్రామసభల్లో 86 వేల దరఖాస్తులు అధికారులకు అందాయి. ఇందులో 51 వేల దరఖాస్తులు ఇళ్ల కోసం వచ్చాయి. రాజధాని ప్రకటన నేపథ్యంలో విజయవాడలో ఇళ్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. శివారు ప్రాంతాల్లో సైతం ఇంటి అద్దెలు రూ.4 వేలకు చేరాయి. నగరపాలక సంస్థ చేపట్టిన గృహ నిర్మాణాలను తీసుకొని తాము పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు ససేమిరా అంటున్నారు. ధరల పెరుగుదల, డిజైన్ల నిర్మాణంలో తేడాలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తంమీద అధికార పార్టీ నేతల తీరుతో పేదోడి సొంత ఇంటి కలలు నెరవేరడం లేదు. -
పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ ఉచితం
- 100 గజాల్లోపు ఉంటేనే అవకాశం - తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి - కుటుంబానికి ఒక ఇంటికే చాన్స్ - మేయర్ కోనేరు శ్రీధర్ విజయవాడ సెంట్రల్ : వంద గజాల లోపు ఉన్న పేదల గృహాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని మేయర్ కోనేరు శ్రీధర్ టౌన్‌ప్లానింగ్ అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ 296 ప్రకారం ప్రభుత్వ స్థలంలో పేదలు వంద గజాల లోపు ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. విధి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి.సునీత మాట్లాడుతూ 2014 జనవరి ఒకటో తేదీలోపు నిర్మించిన గృహాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. ఆగస్ట్ 15 నుంచి 120 రోజుల్లోపు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆక్రమణదారుడు తప్పనిసరిగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. కుటుంబానికి ఒక్క ఇల్లు మాత్రమే క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్, నదీ పరీవాహక ప్రాంతాలు, ప్రజల ప్రయోజనం కోసం కేటాయించిన స్థలాలు, ఫుట్‌పాత్‌ల మీద ఉన్న ఆక్రమణల్ని రెగ్యులరైజ్ చేయబోమని తెలిపారు. దరఖాస్తుతో పాటు ఆధార్ జిరాక్స్‌ను తప్పనిసరిగా జతచేయాలన్నారు. పూర్తి వివరాల కోసం టౌన్‌ప్లానింగ్‌లో సంప్రదించాలని సూచించారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు, సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రచ్చరచ్చ
హోరెత్తిన కౌన్సిల్ సమావేశం గద్దె డెరైక్షన్‌లో రసవత్తరంగా నడిచిన కనకదుర్గ లేఅవుట్ కథ ప్రతిపక్షాలను తోసిపుచ్చి ‘పచ్చ’జెండా ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ సభ్యుల సస్పెన్షన్ అరుపులు.. కేకలు.. తోపులాటలతో బుధవారం కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చగా సాగింది. పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ ఆమోదం కౌన్సిల్‌ను కుదిపేసింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు చర్చకు పట్టుబట్టినా టీడీపీ మొండిగా వ్యవహరించింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డెరైక్షన్‌లో కథంతా రసవత్తరంగా సాగింది. ఇదేంటని ప్రశ్నించిన తొమ్మిది మంది వైఎస్సార్ సీపీ సభ్యుల్ని సభ నుంచి బహిష్కరించారు. లేఅవుట్ ఆమోదంలో ఎలాంటి తప్పు లేదంటూ కొందరు టీడీపీ కార్పొరేటర్లు చప్పుట్లు చరుచుకున్నా.. తప్పు జరిగిందంటూ మూడు నెలల కిందట గగ్గోలు పెట్టిన మరికొందరు పెద్దల హుకుంతో నోరు మెదపలేదు. విజయవాడ సెంట్రల్ : శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్‌ను కౌన్సిల్ ఆమోదించడం పెనుదుమారాన్నే రేపింది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10.50 గంటలకు సభ ప్రారంభమైంది. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తుండగా, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల అభ్యంతరం చెప్పారు. గత కౌన్సిల్లో ఆమోదించిన శ్రీకనకదుర్గ లేఅవుట్ ధ్రువీకరణను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమోదాన్ని రద్దు చేయాల్సిందిగా కోరారు. టీడీపీ సభ్యుడు జాస్తి సాంబశివరావు రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించారు. అక్కడ ఏ తప్పు జరగలేదన్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ జి.వీరపాండియన్ చెప్పారన్నారు. టీడీపీ అంటించుకున్న అవినీతి బురదను తాము అంటించుకోలేమని పుణ్యశీల ఎద్దేవా చేశారు. సెక్షన్ 679 ప్రకారం అధికారాన్ని అధిగమించి నిర్ణయాలు తీసుకుంటే మేయర్ పదవిపోతుందని హెచ్చరించారు. దీనిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా మాటల యుద్ధానికి దిగారు. దొంగలు మీరంటే మీరు టీడీపీ కార్పొరేటర్ ఆతుకూరి రవికుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ దొంగల పార్టీ అన్నారు. దీనిని వైఎస్సార్ సీపీ సభ్యుడు బుల్లా విజయ్ తీవ్రంగా ఖండించి ప్రతిఘటించారు. ‘ఓటుకు కోటు వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడిన రేవంత్‌రెడ్డి మీ పార్టీలోనే ఉన్నాడు. మీదే దొంగల పార్టీ..’ అన్నారు. ఈక్రమంలో రెండు పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో పరిస్థితి చేయిదాటిపోయింది. దీంతో సభను 11.45కు పదినిమిషాల పాటు వాయిదా వేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అరంగేట్రం చేశాక 12.10 గంటలకు సభ ప్రారంభమైంది. చర్చ జరపాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ ససేమిరా అన్నారు. దీంతో ఇరుపార్టీల సభ్యులు ఆరోపణలతో హోరెత్తించారు. టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. మధ్యాహ్నం 12.20కు మళ్లీ సభను వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. వైఎస్సార్ సీపీ సభ్యుల సస్పెన్షన్ మేయర్ చాంబర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, బీజేపీ ఫ్లోర్‌లీడర్లు పుణ్యశీల, ఆదిలక్ష్మి, ఉత్తమ్‌చంద్ బండారీతో చర్చలు జరిపారు. లేఅవుట్ ఆమోదానికి సహకరించాల్సిందిగా కోరారు. పుణ్యశీల ససేమిరా అన్నారు. సుమారు గంటన్నర సేపు చర్చలు జరిపినప్పటికీ ప్రతిపక్షాలు మెత్తపడలేదు. వైఎస్సార్ సీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించి మేయర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు మేయర్ సభను ప్రారంభించారు. పోడియం వదిలి వెళ్లకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. చర్చ జరపాల్సిందేనని వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, సభ్యులు ఆసిఫ్, బుల్లా విజయ్, బి.బహుదూర్, అవుతు శ్రీశైలజ, కరీమున్నీసా, బి.సంధ్యారాణి, జె.పూర్ణమ్మ, పి.సుభాషిణి లను సస్పెండ్ చేశారు. శ్రీకనకదుర్గ లేఅవుట్పై వైఎస్సార్ సీపీ, సీపీఎం ఇచ్చిన సవ రణ తీర్మానాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు. లేఅవుట్ ఆమోదానికి అడ్డగోలుగా ‘పచ్చ’జెండా ఊపారు. -
మీరు ఊ అంటే.. ఆదాయం
- ఫ్లోర్‌లీడర్లతో మేయర్ భేటీ - ఐవీ ప్యాలెస్, బృందావన్ అపార్ట్మెంట్స్పై చర్చ - ఆదాయం వస్తుందని సూచన - తర్వాత చెబుతామన్న పుణ్యశీల విజయవాడ సెంట్రల్ : ‘నగరపాలక సంస్థ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది.. మీరు సహకరిస్తే ఆదాయం రాబట్టొచ్చ’ని మేయర్ కోనేరు శ్రీధర్ ఫ్లోర్‌లీడర్లతో అన్నారు. తన చాంబర్లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సోమవారం ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఐవీ ప్యాలెస్ బకాయిలు రూ.8,50,34,241 ఉన్నాయన్నారు. లీజుదారుడైన అరుణ్‌కుమార్‌కు జనవరిలో నోటీసులు ఇచ్చామన్నారు.కోర్టు కండిషన్ ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో ఐవీ ప్యాలెస్ బకాయిలు వసూలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. ఈక్రమంలో అరుణ్‌కుమార్‌తో చర్చలు సాగించగా రూ.6 కోట్లు అయితే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారన్నారు. ప్రస్తుతం రూ.1.55 లక్షలు చెల్లిస్తున్న అద్దెను రూ.5.85 లక్షల చొప్పున వసూలు చేసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదనకు అన్ని పార్టీల సభ్యులు సహకరించినట్లైతే రూ.6 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అపార్ట్మెంట్స్ బేరం పెడదాం.. కార్పొరేషన్‌కు చెందిన బృందావన్ అపార్ట్మెంట్స్లోని ఆరు ప్లాట్లు విక్రయిస్తే రూ.7.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. మొత్తం 15 ఫ్లాట్స్‌కు గాను మూడు అద్దెకు ఇవ్వగా మిగిలినవి కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయన్నారు. ఇందులో ఆరు అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇటీవలే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చారన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వీటిని విక్రయిస్తే కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు. వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ బి.ఎన్. పుణ్యశీల మాట్లాడుతూ విమర్శలకు తావులేకుండా ఏకాభిప్రాయంతోనే ఏదైనా చేయాలన్నారు. ఇందుకు గాను తమపార్టీ సభ్యులతో చర్చించి రెండు మూడు రోజుల్లో తమ అభిప్రాయాన్ని చెబుతామన్నారు. టీడీపీ, బీజేపీ, సీపీఎం ఫ్లోర్ లీడర్లు జి.హరిబాబు, ఉత్తమ్‌చంద్ బండారీ, జి.ఆదిలక్ష్మి, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
నగరం ఇక స్మార్ట్!
- ‘అమృత్’లో బెజవాడకు స్థానం - నగరవాసుల్లో ‘స్మార్ట్’ ఆశలు - మంత్రి వెంకయ్యతో మేయర్ భేటీ - జిల్లాలో మచిలీపట్నం, గుడివాడకూ చోటు విజయవాడ సెంట్రల్ : షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఐనాక్స్ థియేటర్లతో భాసిల్లుతున్న బెజవాడ నగరం భవిష్యత్‌తో మరింత ఆకర్షణీయ (స్మార్ట్) హంగులను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి పథకం అటల్ అర్బన్ మోడ్రనైజేషన్ రెన్యువల్ స్కీం (అమృత్)లో నగరానికి చోటు దక్కడంతో అభివృద్ధి పరుగు పెడుతుందన్న ఆశలు రేకెత్తుతున్నాయి. దేశంలో 100 స్మార్ట్ సిటీలు, 500 అమృత నగరాలను తీర్చిదిద్దాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో గురువారం పట్టణ స్మార్ట్ సిటీ మిషన్, అటల్ అర్బన్ మోడ్రనైజేషన్ రెన్యువల్ స్కీం సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో నగర మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ పాల్గొన్నారు. శుక్రవారంతో ఈ వర్క్‌షాప్ పూర్తి కానుంది. సమష్టి కృషితో అభివృద్ధి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగరపాలక సంస్థ సమష్టిగా కృషి చేస్తేనే విజయవాడ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని ఈ వర్క్‌షాప్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్, గుడివాడ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే విజయవాడను అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాల్సిందిగా కోరారు. నగరంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను అందించారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు చేయూత నివ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వెంకయ్య మాట్లాడుతూ సమష్టి కృషితో అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటీ అంటే... అన్నీ అనుకున్నట్లే జరిగి నిధుల వరద వస్తే నగర రూపురేఖలు మారిపోతాయనడంతో సందేహం లేదు. మెట్రో రైలు, సువిశాలమైన రోడ్లు, గ్రీన్ ఫీల్డ్, అత్యాధునిక టెక్నాలజీతో శానిటేషన్ అభివృద్ధి, 24 గంటలు విద్యుత్ సౌకర్యం, రోజంతా నగర ప్రజలకు అందుబాటులో శుద్ధమైన మంచినీరు, ఆధునిక హంగులతో కూడిన రైల్వేస్టేషన్, బస్టాండ్, విమానాశ్రయం, సిటీ మొత్తం వైఫై సౌకర్యం, గ్రీన్ ఫీల్డ్, డిస్నీల్యాండ్, కాలువల్లో బోటింగ్‌లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయి. జేఎన్ఎన్యూఆర్ఎం,‘రే’ కనుమరుగు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం), రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకాలు ఇకపై కనుమరుగు కానున్నాయి. 2007లో విజయవాడ నగరం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద ఎంపికైంది. రూ.1,422 కోట్లతో నగరాభివృద్ధి, గృహ నిర్మాణాలను ప్రారంభించారు. అర్బన్ ఇన్ఫాస్ట్రక్చర్ గవర్నెన్స్ (యూఐజీ) కింద రోడ్లు, డ్రెయిన్లు, భూగర్భ డ్రెయినేజ్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, వాటర్ ప్లాంట్ల పనులు రూ.724 కోట్లతో చేపట్టారు. ఇందులో 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఆనాడు చేసిన సర్వేలో లక్షా 4 వేల మందికి గృహాలు కావాలని తేలింది. తొలి విడతగా 28,152 గృహ నిర్మాణాలను చేపట్టాలని కార్పొరేషన్ నిర్ణయించింది. స్థలాల కొరత నేపథ్యంలో 18,176 గృహ నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 14,345 పూర్తి చేశారు. 3,841 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకం కింద ఎన్ఎస్సీ బోస్ నగర్లో 1,413, దాల్మిల్ ప్రాంతంలో 304 గృహ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి దాల్మిల్ ఏరియాలో శంకుస్థాపన కూడా చేశారు. నిధుల లేమి కారణంగా ఇంత వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చిన నేపథ్యంలో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులు, గృహ నిర్మాణాల పేరు అమృత్‌గా మారనుంది. మచిలీపట్నం, గుడివాడకు మహర్దశ జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ పురపాలక సంఘాలకు మహర్దశ పట్టనుంది. నగరంతో పాటు జిల్లా నుంచి ఈ రెండు పట్టణాలు కూడా అమృత్ పథకంలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఇవి కూడా స్మార్ట్ పట్టణాలుగా అభివృద్ధి చెందనున్నాయి. బందరు మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, కమిషనర్ మారుతీదివాకర్, గుడివాడ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ జి.ప్రదీప్‌కుమార్ కూడా ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. -
తీర్మానంలో తిరకాసు
- ప్రభుత్వ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ తీర్మానం - నాలుగు వేల మంది కార్మికుల జీతాల్లో కోత - నేడు ఆందోళన విజయవాడ సెంట్రల్ : కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా తయారైంది నగరపాకల సంస్థలో ఔట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి. ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి టెండర్ పిలవాలని ఈనెల ఏడో తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టారు. దీనిపై కార్మికులు కదం తొక్కారు. కౌన్సిల్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ ఆ ప్రతిపాదనను కమిషనర్ పెట్టారని, పాత పద్ధతిలోనే ఔట్సోర్సింగ్ కార్మికుల్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు కౌన్సిల్లో తీర్మానం చేశారు. యాదృచ్ఛికంగా జరిగిందో, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందో తెలియదు కానీ కార్మికుల్ని ఆర్థికంగా నష్టపరిచేలా తీర్మానం జరిగింది. ఎలా అంటే 2975 మెమో ప్రకారం ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాన్ని రూ.6,700 నుంచి రూ.8,300కు పెంపుదల చేస్తూ 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమే కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నారు. 2975 మెమోను రద్దు చేస్తూ పాత విధానాన్నే (నెలకు రూ.6,700) కొనసాగిస్తూ ఏడాది పాటు కార్మికుల్ని కొనసాగించాలని కౌన్సిల్ తాజా తీర్మానంలో పేర్కొన్నారు. నేడు ధర్నా ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పార్కులు తదితర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న సుమారు నాలుగు వేల మంది కార్మికులు దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉందని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు చెప్పారు. పాలకుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
కౌన్సిల్ గరంగరం...
పాలక, ప్రతిపక్ష సభ్యుల మాటల తూటాలు వైఎస్సార్ సీపీ సభ్యుడు సస్పెన్షన్ అధికారులే టార్గెట్‌గా సమావేశం విజయవాడ సెంట్రల్ : ⇒ ఏమ్మా.. మేయర్ కూర్చోమంటే కూర్చోవాలి. ⇒ సార్.. కూర్చోవాల్సింది మీరు. మేం కాదు. సభ్యులు నిలబడి మాట్లాడటం సభా సంప్రదాయం. ⇒ ఇది రోడ్డు కాదమ్మా.. ⇒ చర్చించేందుకే ఇక్కడికి వచ్చాం సార్. సభ్యుల్ని మాట్లాడనివ్వండి.. అంటూ మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల మధ్య మాటల తూటాలు పేలాయి. వీరికి పాలక, ప్రతిపక్ష సభ్యులు గొంతు కలపడంతో కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా సాగింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన గురువారం జరిగింది. సెక్రటరీ సెల్ అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని పుణ్యశీల ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చే ప్రశ్నకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. దీంతో సభలో వాగ్వాదం చెలరేగింది. ఒకరికొకరు వాగ్యుద్ధం నగరంలో తాగునీటి సమస్యపై అధికారులు సమాధానం చెప్పలేదని వైఎస్సార్ సీపీ సభ్యుడు బహుదూర్ ఆరోపించారు. సభ నిర్వహించడం మేయర్‌కు చేతకావడం లేదన్నారు. సోది మాటలతో నడిపేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై టీడీపీ ఫ్లోర్‌లీడర్ హరిబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నీ లాంటి సభ్యుడు సభకు రావడం దురదృష్టకరం’ అన్నారు. దీంతో పాలక, ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం మొదలైంది. బహుదూర్‌ను కూర్చోవాల్సిందిగా మేయర్ ఆదేశించారు. సమాధానం చెబితేనే కూర్చుంటాననడంతో ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు. 22 ప్రశ్నలకు ఏడు ప్రశ్నలతోనే చర్చ ముగిసింది. అధికారులపై ముప్పేట దాడి అధికారుల తీరుపై పాలక, ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. పెంచిన ఏడుశాతం నీటి చార్జీలను తగ్గించమని ఆరు నెలల కిందట తీర్మానం చేసినా ఎందుకు తగ్గించలేదని టీడీపీ సభ్యులు ముప్పా వెంకటేశ్వరరావు, జాస్తి సాంబశివరావు కో-ఆప్షన్ సభ్యుడు సిద్ధెం నాగేంద్రరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని సీఈ ఎంఏ షుకూర్ సమాధానమిచ్చారు. కార్పొరేటర్లకు ఏం అధికారాలు ఉన్నాయో చెప్పకుండా ఎందుకు మభ్యపెడుతున్నారని బీజేపీ సభ్యుడు ఉత్తమ్‌చంద్ బండారీ నిలదీశారు. ప్రశాంతి ఆస్పత్రి సమీపంలో నిర్మిస్తున్న ఒక భవనం ఖాళీ స్థలం పన్ను కోటి రూపాయల బకాయి ఉంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతిచ్చారని వైఎస్సార్ సీపీ సభ్యురాలు పి.సుభాషిణి ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామని కమిషనర్ వీరపాండియన్ బదులిచ్చారు. సర్కిల్-1 పరిధిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ప్రయివేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకుని డివిజన్లలో వసూళ్ల దందా చెలాయిస్తున్నారని టీడీపీ ఫ్లోర్‌లీడర్ హరిబాబు సభ దృష్టికి తెచ్చారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని మేయర్ చురకలు అంటించారు. కుక్కల బెడద తీర్చండి : కుక్కల బెడదకు శాశ్వత పరి ష్కారం చూపాలని వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఎం సభ్యు లు డిమాండ్ చేశారు. గోశాల తరహాలోనే కుక్కల పెంప కానికి కొంత స్థలాన్ని కేటాయించి, దాని నిర్వహణ బాధ్యతను జీవకారుణ్య సంస్థకు అప్పగించాలని పుణ్యశీల సూచి ంచారు. కమిషనర్ మాట్లాడుతూ కుక్కల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. త్వరలో ఎల్ఈడీ లైట్లు : వీధి దీపాల నిర్వహణ నగరంలో అధ్వానంగా మారిందని వైఎస్సార్ సీపీ సభ్యురాలు అవుతు శ్రీశైలజ ఆరోపించారు. రియల్ ఎనర్జీ సంస్థ నిర్వాహకులు సక్రమంగా పనిచేయడం లేదని సభ్యులు ఆరోపించారు. దీనికి కమిషనర్ సమాధానమిస్తూ పదివారాల్లో నగరంలో 30వేల ఎల్ఈడీ లైట్లు అమర్చనున్నట్లు చెప్పారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌కు ఆ కాంట్రాక్ట్ అప్పగించామని చెప్పారు. రోల్‌బ్యాక్ పింఛన్లు ఏడు నెలలు రావాల్సి ఉండగా, ఒక్కనెలే ఇవ్వడంపై లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ సభ్యుడు చందన సురేష్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని కమిషనర్ పేర్కొన్నారు. బారికేడ్లు తొలగించండి బారికేడ్ల ఏర్పాటు విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పుణ్యశీల ఆరోపించారు. బందరురోడ్డులో బారికేడ్లు ఏర్పాటుచేయడం సరికాదన్నారు. టీడీపీ సభ్యుడు సీహెచ్ గాంధీ మాట్లాడుతూ ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరగాల్సి ఉండగా, సీపీ ఆఫీసులో సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ఔట్‌గోయింగ్ కట్ : నగరపాలక సంస్థలో ల్యాండ్‌లైన్ ఫోన్లకు ఔట్ గోయింగ్ కట్ చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. అధికారులు, సిబ్బంది అందరికీ సెల్ఫోన్లు ఉం డగా రూ.5 లక్షల ల్యాండ్‌లైన్ బిల్లు రావడంతో దుబారా పెరుగుతోందన్నారు. అనంతరం భూకంప మృతులు, పర్వతారోహుడు మస్తాన్‌బాబు, జింఖానా స్విమ్మింగ్ పూల్‌లో మృతిచెందిన మనీష్‌కు కౌన్సిల్ సంతాపం తెలిపింది. -
దిక్కులేని దివాణం
కార్పొరేషన్లో పడకేసిన పాలన బోసిపోతున్న కార్యాలయం ఎక్కడి పనులు అక్కడే.. సిబ్బంది ఇష్టారాజ్యం 7న కౌన్సిల్ సమావేశంతో హైరానా విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో పాలన పడకేసింది. కమిషనర్ జి.వీరపాండియన్ ఏప్రిల్ 24 నుంచి సెలవులో ఉన్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రధాన విభాగాల్లోని ఫైళ్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కీలక విభాగాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సీట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకే కొందరు ఉద్యోగులు ఇంటిదారి పడుతున్నారు. కమిషనర్ ఉన్న సమయంలో రాత్రి 7 గంటల వరకు ప్రజాప్రతినిధులు, ప్రజలతో సందడిగా ఉండే వరండా జనాల్లేక బోసిపోయింది. ఈ నేపథ్యంలో ఈనెల ఏడో తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ కోనేరు శ్రీధర్ నిర్ణయించారు. దీంతో అధికారులు హైరానా పడుతున్నారు. సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై కమిషనర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గడువు ముంచుకురావడంతో ఇన్చార్జి కమిషనర్ జి.నాగరాజు ప్రియాంబుల్స్పై సంతకాలు చేసే పనిలో పడ్డారు. ‘ప్రజారోగ్యా’నికి అనారోగ్యం ప్రజారోగ్య విభాగంలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ మూడు రోజులుగా సెలవులో ఉన్నారు. ఏఎంవోహెచ్‌ల పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో డివిజన్లలో చెత్తకుప్పలు పేరుకుపోయి పారిశుధ్యం క్షీణిస్తోందని ప్రజలు ఆరోపిస్తూ 103కు ఫిర్యాదులు చేస్తున్నారు. నగరపాలక సంస్థలో పనిచేసే డ్వాక్వా, సీఎంఈవై పారిశుధ్య కార్మికులకు సంబంధించి టెండర్ పిలవాలన్న సీడీఎంఏ నిర్ణయం మేరకు ఆ ప్రక్రియ చేపట్టాల్సిందిగా కమిషనర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. గ్రేటర్ విశాఖపట్నంలో ఇదే విషయమై కార్మికులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రజారోగ్యశాఖాధికారులు పునరాలోచలో పడినట్టు తెలుస్తోంది. కమిషనర్ వస్తే కానీ, టెండర్‌పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని సమాచారం. అధికారుల ఎదురుచూపులు టౌన్‌ప్లానింగ్ విభాగంలో నలుగురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లుగా, టీపీఎస్ రాంబాబు టీపీవోగా పదోన్నతిపై వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కమిషనర్ లేకపోవడంతో వీరు విధుల నుంచి రిలీవ్ కాలేదు. రాష్ట్రంలోని మిగితా జిల్లాల్లో పదోన్నతులు పొందిన ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో జాయిన్ కాగా, ఇక్కడి ఉద్యోగులు మాత్రం కమిషనర్ రాకకోసం ఎదురుచూస్తున్నారు. కమిషనర్ ఈనెల 3, 4 తేదీల్లో వస్తారని ఒకవైపు ప్రచారం సాగుతుండగా, కౌన్సిల్ మీటింగ్ వరకు వచ్చే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సూపరింటెండెంట్లతో పాటు వివిధ విభాగాల్లో బదిలీలకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్ పడ్డాయి. బదిలీ అయిన ఉద్యోగులు కొందరు ఇంకా విధుల్లో చేరలేదని భోగట్టా. ఈ మొత్తం పరిస్థితుల నేపథ్యంలో కమిషనర్ లేకపోవడంతో కార్పొరేషన్ దిక్కులేని దివాణంలా తయారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
బది‘లీలలు’ రాయబేరాలు
మేయర్ ఆదేశాలు బేఖాతర్ పదిరోజులు తిరక్కుండానే కోరుకున్న చోటుకు ప్రజారోగ్య శాఖలో సి‘ఫార్సు’లు మెత్తబడుతున్న అధికారులు విజయవాడ సెంట్రల్ : ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ పాట గుర్తొస్తోంది నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖలో జరుగుతున్న అంతర్గత బదిలీలను చూస్తుంటే. పట్టు మని పది రోజులు కూడా కాకుం డానే తమకు కావాల్సిన డివిజన్లలో పాగా వేసేందుకు కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు (ఎస్.ఐ.లు) పావులు కదుపుతున్నారు. ఇందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడగడుతున్నారు. మూడేళ్లకు పైగా ఒకే సీట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని కదిలించాలని మేయర్ కోనేరు శ్రీధర్ కమిషనర్ జి.వీరపాండియన్‌ను కోరారు. ఈ క్రమంలో ఆయన అన్ని విభాగాల దుమ్ము దులిపారు. ఇష్టమైనా.. కష్టమైనా కదలాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పారు. అవకతవకలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో లాటరీ విధానంలో బదిలీలు చేశారు. కొద్దిపాటి వివాదాలు మినహా బదిలీలు ప్రశాంతంగానే సాగాయి. డివిజన్లో బాధ్యతలు చేపట్టిన రెండో రోజు నుంచే తాము కోరుకున్న డివిజన్ల కోసం కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. పావులు కదుపుతున్నారు.. డివిజన్ పెద్దదైంది. మేం చేయలేం. మమ్మల్ని చిన్న డివిజన్‌కు పంపా లంటూ శానిటరీ ఇన్స్పెక్టర్లు రాయ‘బేరాలు’ సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్య శాఖలో 55 ఎస్.ఐ.ల పోస్టులకు గాను 36 మందిని బదిలీ చేశారు. లాటరీ విధానంలో దండిగా ఆదాయం వచ్చే డివిజన్లను కొందరు కోల్పోయారు. దీంతో తిరిగి వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వన్‌టౌన్, సూర్యారావుపేట, సింగ్‌నగర్ ప్రాంతాల్లోని కొన్ని డివిజన్లలో ఎస్.ఐ. పోస్టుల్లో మార్పులు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఎస్.ఐ.ల మార్పులకు సంబంధించి గట్టిగా పట్టుబడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 21వ డివిజన్లో నైట్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మార్పుకు సంబంధించి పాలక పక్షానికి చెందిన కార్పొరేటర్ దగ్గరుండి పనిచేయించారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. మీరు కమిషనర్‌కు ఫైల్ పెట్టండి.. మేం మాట్లాడుకుంటాం అంటూ హుకుం జారీ చేయడంతో అధికారులు కిమ్మనకుండా చెప్పినట్లు చేస్తున్నారని తెలుస్తోంది. రెండు నెలల కిందట 56 మంది శానిటరీ మేస్త్రుల్ని లాటరీ పద్ధతిలో అంతర్గత బదిలీలు చేశారు. ఇందులో 17 మంది పోస్టింగ్ ఇచ్చిన డివిజన్లలో కాకుండా తాము పనిచేద్దామనుకున్న డివిజన్లలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు లేనట్లు సమాచారం. ఇదే తరహాలో ఎస్.ఐ. పోస్టుల్ని మార్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కొత్త డీసీఆర్ కోసం టీడీపీ ఎమ్మెల్యే యత్నం.. నగరపాలక సంస్థలో మేయర్ ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. ఒకే సీటులో మూడేళ్లు దాటిన వారిని కదల్చడం ద్వారా కొంత వరకు అవినీతిని కట్టడి చేయవచ్చన్నది మేయర్ ఆలోచన. కమిషనర్ సహకారంతో పీఠాలు కదిలించగలిగారు. అయితే ఇది మూణ్ణాళ్ల ముచ్చటేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు టౌన్‌ప్లానింగ్‌ను శాసిస్తున్నారు. మరి కొందరు ప్రజారోగ్య శాఖలో చక్రం తిప్పుతున్నారు. అవసరమైతే తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చెప్పి పనిచేయించుకుంటున్నారనే వాదనలు న్నాయి. డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి త్వరలో రిలీవ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఖాళీ అవుతున్న డీసీఆర్ పోస్టులో తనకు అనుకూలంగా ఉండే అధికారిని తెచ్చుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణతో సంప్రదింపులు జరిపారని సమాచారం. మేయర్‌తో సంబంధం లేకుండానే పోస్టింగ్‌లు.. ఊస్టింగ్‌లు జరిగిపోవడంతో ఆయన ఒకింత ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. -
చెప్పింది చెయ్!
వార్నింగ్ ఇచ్చిన పాలకపక్షం కార్పొరేటర్లు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన అధికారి గుణదల ప్లాట్లపైనా కన్ను తలపట్టుకుంటున్న మేయర్ స్థలాలకు పన్ను కట్టాలని నోటీసులిస్తే అధికార పార్టీ కార్పొరేటర్లు ఆందోళన చేస్తామంటున్నార్ సార్.. కమిషనర్‌కు ఓ అధికారి ఫిర్యాదు. గుణదల ప్లాట్లు కార్పొరేటర్లకే రేటు కట్టి విక్రయించాలి. దీనికోసం కలిసికట్టుగా అధిష్టానంపై ఒత్తిడి తెద్దాం... పాలకపక్షంలో కొంతమంది కార్పొరేటర్ల ఆలోచన ఇది. విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తమ మాట వినని అధికారుల్ని బెదరేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. నగరంలో 35 వేల ఖాళీ స్థలాల నుంచి రూ.11.96 కోట్ల పన్ను వసూలు చేయాలని మేయర్ కోనేరు శ్రీధర్ లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ అంచనాల్లో పొందుపరిచారు. గతంలో 11 వేల స్థలాల నుంచి రూ.7 కోట్లు మాత్రమే రెవెన్యూ అధికారులు వసూలు చేసేవారు. తాజా డిమాండ్ ప్రకారం రెవెన్యూ అధికారులు నోటీసులు సిద్ధం చేసి సంబంధిత యజమానులకు పంపుతున్నారు. టీడీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. లేకుంటే అల్లరి చేస్తామని ఓ రేంజ్లో వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో కంగుతిన్న అధికారి విషయాన్ని కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విభాగాధిపతులతో సమీక్ష జరుగుతున్న సమయంలోనే ఆ అధికారి కార్పొరేటర్ల తీరుపై ఫిర్యాదు చేశారు. పన్నులు వసూలు చేయకుంటే మేయర్ ఊరుకోవడం లేదు. వసూలు చేద్దామంటే వాళ్ల పార్టీ కార్పొరేటర్లే బెదిరిస్తున్నారు. ఇలా అయితే ఎలా సార్ అంటూ ఆ అధికారి కమిషనర్ వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. గుణదల ప్లాట్లపై కొత్త ప్రతిపాదన గుణదల ప్రాంతంలో ఉద్యోగులకు కేటాయించగా మిగిలిన 72 ప్లాట్లపై కొంతమంది టీడీడీ కార్పొరేటర్ల కన్ను పడింది. ఏదో ఒక రేటు కట్టి తమకే కేటాయించాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇందుకు తమ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సాయం కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను మేయర్ శ్రీధర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.7.89 కోట్లు వస్తుందని మేయర్ అంచనా వేశారు. బహిరంగ వేలం ద్వారానే ప్లాట్లు విక్రయించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకే కేటాయించాల్సివస్తే మార్కెట్ ధరకు రెట్టింపు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 1995లో ప్లాట్లు విక్రయించిన సమయంలో కూడా అప్పటి మార్కెట్ ధరకు రెట్టింపు ధరతో విక్రయించారని, అదే విధానాన్ని ఇప్పుడూ కొనసాగిద్దామనే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. టీడీపీలోని కొందరు కార్పొరేటర్లు మాత్రం ప్లాట్లను ఎలా నొక్కేయాలనేదానిపై వ్యూహరచన చేస్తున్నట్లు వినికిడి. ముఖ్యమంత్రి ఆరా.. టీడీపీలోని కొందరు కార్పొరేటర్ల వైఖరి మేయర్‌కు కొత్త తలనొప్పులు తెస్తోంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కార్పొరేషన్‌ను చక్కదిద్దేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు స్వపక్షానికి చెందిన వారే గండి కొట్టడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఇటీవల ఇంటెలిజెన్స్ రిపోర్టు కోరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మేయర్ పనితీరు బాగుందని చెబుతూనే కొందరు కార్పొరేటర్ల వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉందంటూ ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. -
ఢీ అంటే ఢీ
బడ్జెట్‌పై పాలక, ప్రతిపక్షాల ఫైట్ రూ.486 కోట్లతో ఆమోదం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రెవెన్యూ బడ్జెట్ సమావేశంలో అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అన్నాయి. పన్ను భారాలతో ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ విపక్షాలు మండిపడ్డాయి. పన్నుల బాదుడు లేకుండానే అదనపు ఆదాయాన్ని తెచ్చి చూపిస్తానని మేయర్ కౌంటర్ ఇచ్చారు. కార్పొరేషన్ రెవెన్యూ బడ్జెట్ సమావేశం బుధవారం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.486 కోట్ల 94 లక్షల 27 వేల 327 బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. ఈ సమావేశం పాలక, ప్రతిపక్షాల మాటల తూటాల నడుమ వాడీవేడిగా సాగింది. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బి.నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ.. ఆస్తి పన్ను రూ.74 కోట్ల నుంచి రూ.132 కోట్లకు పెంచడాన్ని తప్పుబట్టారు. పన్నుల బాదుడుకు మేయర్ శ్రీకారం చుడుతున్నారని ఆరోపించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.120 కోట్లు చూపారు కదా.. ఇప్పటివరకు ఎంత వసూలుచేశారని ప్రశ్నించారు. డిప్యూటీ కమిషనర్ డి.వెంకటలక్ష్మి మాట్లాడుతూ రూ.74 కోట్ల సాధారణ డిమాండ్‌లో రూ.55 కోట్లు వసూలయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 30 కోట్లు, వివిధ కోర్టు కేసుల పరిష్కారం అయితే రూ.8 కోట్లు వసూలవుతాయన్నారు. వీటన్నింటినీ గత బడ్జెట్లో చూపామన్నారు. మీరు పాతవే సక్రమంగా వసూలు చేయకుండా కొత్తగా రూ.132 కోట్లు వస్తోందని అంచనాల్లో చూపడం వల్ల ఉపయోగం ఏమిటని పుణ్యశీల ప్రశ్నించారు. దొడ్డిదారిన పన్నులు పెంచేందుకు పాలకపక్షం పన్నిన కుట్రగా దీన్ని అభివర్ణించారు. ఆదాయం పెంచుతాం ప్రతిపక్షాలది పసలేని వాదనగా మేయర్ కొట్టిపారేశారు. రాజధానిగా నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతాయన్నారు. తద్వారా ఆస్తిపన్ను పెరుగుతుందన్నారు. నగరంలో చేపట్టిన సమగ్ర సర్వేలో లొసుగులు బయటపడుతున్నాయన్నారు. ఇప్పటివరకు 31,158 అసెస్మెంట్లను సర్వే చేస్తే 648 గృహాల వారు పన్ను చెల్లించడం లేదని, 7,699 మంది చెల్లించాల్సిన దానికంటే తక్కువ చెల్లిస్తున్నారని తేలిందన్నారు. వీటిన్నింటినీ సరిచేస్తే ఆదాయం ఎందుకు పెరగదన్నారు. గతంలో 27 వేల డీఅండ్‌వో ట్రేడ్ లెసైన్స్‌ల ద్వారా రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక 32,700 ట్రేడ్స్ నుంచి రూ.6 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ప్రకారం నగరంలో 65 వేల ట్రేడ్స్ ఉన్నాయన్నారు. వీటన్నింటి నుంచి పన్నులు రాబట్టగలిగితే రూ.10 కోట్ల ఆదాయం కచ్చితంగా వస్తుందని చెప్పారు. సింగ్‌నగర్, జక్కంపూడి, వన్‌టౌన్ ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్ల ద్వారా ఆదాయాన్ని రాబడతామన్నారు. నగరంలో 31 వేల ఖాళీ స్థలాలు ఉండగా ప్రస్తుతం 12 వేల స్థలాల నుంచే పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలా పెరిగాయో చెప్పండి! సీపీఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ తాజా బడ్జెట్లో రూ.148 కోట్ల మేర ప్రజలపై భారాలు వేశారని ఆరోపించారు. దీనిపై మేయర్ ఆగ్రహించారు. ఆ మేర పన్నులు ఎలా పడ్డాయో సభకు వివరించాలన్నారు. అనూహ్య పరిణామంతో సీపీఎం సభ్యురాలు కంగుతిన్నారు. కార్పొరేషన్లో మాట్లాడటం, ప్రెస్‌మీట్ పెట్టడం చాలా తేలిక, నోరుంది కదా అని ఆరోపణలు చేయొద్దంటూ మేయర్ ఎదురుదాడికి దిగారు. రూ.600 కోట్లు తూచ్ సమగ్ర సర్వే ద్వారా రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని ఎలా ప్రకటించారో చెప్పాలని పుణ్యశీల నిలదీశారు. తాను ఎప్పుడూ అలా చెప్పలేదని మేయర్ సమాధానమిచ్చారు. అధికారులు మాత్రమే ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారన్నారు. సకాలంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో పాలకపక్షం విఫలమైందని, వాస్తవ విరుద్ధంగా ఉన్న బడ్జెట్‌ను తాము ఆమోదించడం లేదని పుణ్యశీల, ఆదిలక్ష్మి అన్నారు. టీడీపీ సభ్యుడు జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ.. ఇది ప్రజారంజక బడ్జెట్ అని అభివర్ణించారు. కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. క్యాపిటల్ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. పాలకపక్షం సభ్యులు బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్ జి.వీరపాండియన్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ముప్పా వెంకటేశ్వరరావు, వీరమాచినేని లలిత, షేక్ బీజాన్బీ, కోఆప్షన్ సభ్యులు సిద్ధం నాగేంద్రరెడ్డి, సి.ఉషారాణి తదితరులు మాట్లాడారు. -
పన్ను పోటు
ఆస్తిపన్ను పెంపునకు రంగంసిద్ధం రూ.40 కోట్ల మేర భారం వారంలో అఖిలపక్ష సమావేశం మంత్రి డెరైక్షన్.. మేయర్ యూక్షన్.. విజయవాడ సెంట్రల్ : నగరంలో ఆస్తిపన్ను పెంపునకు రంగం సిద్ధమైంది. ఇంటి అద్దెల ఆధారంగా 50శాతం మేర పన్ను పెంచాలనే యోచనకు పాలకులు వచ్చేశారు. ఈ మేరకు నగరంలో సర్వే పూర్తిచేసినట్లు సమాచారం. దీనిద్వారా నగరపాలక సంస్థకు సుమారు రూ.40కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఏటా ఐదు శాతం చొప్పున పన్ను పెంచుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జీవో జారీ చేయనున్న నేపథ్యంలో.. అంతకుముందే పన్ను పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరపాలక సంస్థలోని రాజకీయ పక్షాల ఫ్లోర్‌లీడర్లతో సమావేశం నిర్వహించిన మేయర్ కోనేరు శ్రీధర్.. నెలాఖరులోపు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, మేధావులతోనూ చర్చించేందుకు సన్నద్ధమవుతున్నారు. మునిసిపల్ మంత్రి పి.నారాయణ డెరైక్షన్లోనే ఇదంతా జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాదుడే బాదుడు పేద, మధ్యతరగతి వర్గాలపై ఆస్తిపన్ను పెంపు తీవ్ర ప్రభావం చూపనుంది. నగరాన్ని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఇళ్ల అద్దెలు అనూహ్యంగా పెరిగాయి. కార్పొరేషన్ పన్ను పెంచితే మరోమారు అద్దెల దరువు తప్పదనడంలో సందేహం లేదు. 2007లో గృహ సముదాయాల్ని మినహాయించి వ్యాపార, వాణిజ్య సంస్థలకు 50శాతం మేర పన్ను పెంచారు. ఏడేళ్లలో చెత్త, మంచినీరు, డ్రెరుునేజీ, పార్కింగ్, డీఅండ్‌వో ట్రేడ్ లెసైన్స్‌లు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్ల నుంచి రూ.250 కోట్ల మేర పన్నుల మోత మోగించారు. కార్పొరేషన్లో టీడీపీ అధికారం చేపట్టాక డ్రెయినేజీ, నీటి చార్జీలను ఏడుశాతం పెంచారు. అదేమంటే.. స్పెషల్ అధికారుల పాలనలో ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారని ప్రజల్ని మాయ చేశారు. ప్రస్తుతం ఆస్తిపన్ను రూపంలో రూ.74 కోట్లు వసూలవుతుండగా, తాజా పెంపు ద్వారా రూ.114 కోట్ల్ల ఆదాయం వస్తుందని పాలకపక్షం అంచనా వేస్తోంది. అవినీతికి పెట్టి.. జనాన్ని కొట్టి.. నగరంలోని రెండు డివిజన్లలో సర్వే చేస్రూ.74 లక్షల మేర అవకతవకలు బయటపడ్డాయి. మిగిలిన డివిజన్లలో సర్వే పూర్తిచేస్తే కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుందని గత మునిసిపల్ కమిషనర్ సి.హరికిరణ్ చెప్పారు. ఆయన బదిలీ నేపథ్యంలో సర్వే అటకెక్కింది. టౌన్‌ప్లానింగ్‌లో బిల్డింగ్ పీనలైజేషన్ అమలు చేస్తే దండిగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నది బహిరంగ రహస్యం. ప్రజారోగ్యశాఖతో పాటు కార్పొరేషన్ ప్రధాన విభాగాలపై దృష్టిపెడితే లెక్కలేనన్ని దుబారాను అరికట్టవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం పేరుతో ఇంజినీరింగ్ విభాగం కార్పొరేషన్‌ను గుల్ల చేసింది. పనులు పూర్తి చేయకుండానే నిధులు ఖర్చు చేసేశారు. దీనికి సంబంధించి ఆడిట్ పూర్తికాలేదు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకుంటే కోట్ల రూపాయలు రికవరీ అయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్లో భారీగా అవినీతి జరిగిందని నగర టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ అసెంబ్లీలో ఫిర్యాదుచేశారు. విచారణ కమిటీ వేస్తానని ముఖ్యమంత్రి చెప్పినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్రమాల లెక్క తేల్చలేని పాలకులు ప్రజలపై భారాల బండి మోపేందుకు మాత్రం సిద్ధమవ్వడం విమర్శలకు తావిస్తోంది. -
నగరానికి కొత్త ప్రాజెక్టులు తెస్తా
విజయవాడ సెంట్రల్ : ‘ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రణాళిక రూపొందించా. మార్చిలోపు జేఎన్ఎన్యూఆర్ఎం పనులు పూర్తిచేస్తాం. కొత్త సంవత్సరంలో నగరపాలక సంస్థకు నూతన ప్రాజెక్టులు తెస్తా..’ అని మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014వ సంవత్సరం టీడీపీకి అచ్చొచ్చిందని పేర్కొన్నారు. రాజధాని నగరానికి తొలి మేయర్ కావడం సంతోషంగా ఉందన్నారు. జూలై 3వ తేదీన తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టే సమయానికి నగరపాలక సంస్థ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఉద్యోగులకు నాలుగు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించి రూ.70 కోట్ల నిధులు రాబట్టగలిగానని తెలిపారు. ఉద్యోగులకు మూడు నెలల జీతాలు చెల్లించినట్లు పేర్కొన్నారు. చిన్న, పెద్ద కాంట్రాక్టర్లకు రూ.12.50 కోట్లు చెల్లించినట్లు వివరించారు. అనుమతులు లేకుండా గత పాలకులు చేపట్టిన 127 పనులను ర్యాటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి పంపామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం డీటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) లను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపామని వివరించారు. పేదలకు ఇళ్ల కేటాయింపునకు కృషి నగరంలో నిర్మించిన 3,500 గృహాలను అర్హులైన పేదలకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. జనవరి నెలాఖరుకు రాజీవ్ ఆవాస యోజన(రే) పథకానికి రూ.21కోట్లు విడుదలవుతాయని, ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వన్‌టౌన్‌లో రూ.3కోట్లతో వాటర్ ట్యాంక్, పాలప్రాజెక్ట్ వద్ద రూ.50 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణ పనులను చేపట్టామని పేర్కొన్నారు. సింగ్‌నగర్, పాయకాపురం, వాంబేకాలనీ ప్రాంతాల్లో మార్చిలోపు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టామని వివరించారు. రూ.1.89 కోట్లతో సింగ్‌నగర్‌లో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. -
పేపరోళ్లు కార్పొరేషన్లో తిరగొద్దు
చాంబర్లకు ఎందుకు వెళుతున్నారు? విలేకరులపై అక్కసు వెళ్లగక్కిన మేయర్ కోనేరు శ్రీధర్ విజయవాడ సెంట్రల్ : పేపరోళ్లు కార్పొరేషన్లో తిరగడానికి వీల్లేదు. అధికారుల చాంబర్లలో వారికి పనేంటి? అదేమైనా మీ హక్కు అనుకుంటున్నారా? మీడియా పాయింట్ పెడతాం. వార్తలు చెబుదామనుకున్నవాళ్లు అక్కడకే వస్తారు.. అంటూ మేయర్ కోనేరు శ్రీధర్ విలేకరులపై అక్కసు వెళ్లగక్కారు. తన చాంబర్లో బుధవారం ఆయన విలేకరులను ఉద్దేశించి మాట్లాడారు. ‘వార్తల కోసం తిరుగుతున్నామని..’ విలేకరులు చెప్పగా ‘అక్కర్లేదు.. త్వరలోనే మీకు మీడియా పాయింట్ పెడతాం. అక్కడే ఉండండి..’ అన్నారు. ‘పేపర్లు చదవద్దని మా మంత్రిగారు చెప్పారు. ఎవరేం రాసుకున్నా ఫరవాలేదు..’ అన్నారు. ఇమేజ్ డామేజ్ ఇటీవలికాలంలో మేయర్ శ్రీధర్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మితో చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో ఉద్యోగులు ఆయన్ను గట్టిగానే హెచ్చరించారు. ఆ తరువాత ఎంపీ కేశినేని కార్యాలయంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలోనూ పలువురు కార్పొరేటర్లు మేయర్ తీరును ఎండగట్టారు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా పార్టీ పెద్దలు తమదైన శైలిలో హెచ్చరించారు. ఈ విషయాలు పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో మేయర్ ఇమేజ్ డామేజ్ అయింది. ఈ క్రమంలో పత్రికల్ని టార్గెట్ చేయాలన్న యోచనకు మేయర్ వచ్చినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న అంతరం చీటికీ మాటికీ కోప్పడటం.. ప్రతి దానికీ అరవడంతో ఉద్యోగులు మేయర్‌పై విసుగెత్తిపోయారు. కమిషనర్ ద్వారా సమాచారం తెప్పించుకుని పాలన సాగించాల్సిన మేయర్ అన్నీ తానై వ్యవహరించడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సిల్ తీర్మానాలను తారుమారు చేయడం, స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కమిషనర్ తిరిగి మార్పు చేయడం వంటి పరిణామాలు మేయర్ పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ‘ఆయన వైఖరి ఎప్పుడు, ఎలా ఉంటుందో తెలియక చస్తున్నాం..’ అంటూ సొంత పార్టీవారే వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -
సీఎం వద్దే డబ్బుల్లేవు.. మనకేం ఇస్తారు!
హైదరాబాద్ : ‘రాష్ట్ర ఖజానా నిండుకుండ అయితే ముఖ్యమంత్రిని నిధులు అడగొచ్చు. సీఎం వద్దే డబ్బుల్లేవు. కార్పొరేషన్‌కు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు’ అని నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. ఆయన నిన్న విలేకర్లతో మాట్లాడారు. కార్పొరేషన్లో అధికారులు జీవోలను సక్రమంగా అమలు చేస్తే ఎవర్నీ నిధులు కోసం అడగక్కర్లేదన్నారు. నగరపాలక సంస్థ రూ.350 కోట్ల అప్పుల్లో ఉందన్నారు. దీనిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రకటించారు. నగరానికి శనివారం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు. డంపింగ్ యార్డుకు స్థల సేకరణ, విజయవాడను గ్రేటర్ సిటీ చేయాలని, ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, అర్ధంతరంగా నిలిచిపోయిన జేఎన్ఎన్యూఆర్ఎం పనులకు నిధులు ఇవ్వాలని చంద్రబాబును కోరతామని వివరించారు. డంపింగ్‌యార్డుకు ఆగి రిపల్లి మండలంలో 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. స్థల కేటాయింపు విషయమై నూజివీడు సబ్ కలెక్టర్‌తో చర్చించామన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డు సమస్య పరిష్కారమవుతుందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాల వల్లే కార్పొరేషన్ దివాళా తీసిందని దుయ్యబట్టారు.