millars
-
రైతులకు మేలు జరిగేలా మిల్లర్లు సహకరించాలని కోరిన వైఎస్ ఆర్సీపి నేతలు
-
ఫలించిన వ్యూహం
మిల్లర్లపై కేసులున్నా ధాన్యం ఆడుకునేందుకు అవకాశం పునరుద్ధరించని సీఎంఆర్ ట్యాగింగ్ 73 తనిఖీలకు 12 కేసులు నమోదు.. రోజులు గడుస్తున్నా లభించని పరిష్కారం అధికారుల తీరుపై విస్తుపోతున్న మిల్లర్లు విజయనగరం కంటోన్మెంట్: పెద్దయ్య గారు పలకరు... చిన్నయ్య గారు చూడరు... కేసులెత్తేస్తామన్నారు. ఇప్పటికీ ఏమీ తేల్చరు. కేసులు నమోదు చేసినా మిల్లింగ్‌కు అవకాశం ఇచ్చారు. కానీ కేసులు ఎత్తేస్తామని నెల రోజులవుతున్నా నేటికీ పట్టించుకోవడం లేదు. ఈ రోజు... రేపంటున్నారు.’ ఇదీ పాపం మిల్లర్ల ఆవేదన. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో పెద్ద హై డ్రామా నడచిన సంగతి తెల్సిందే! అక్రమాలు జరుగుతున్నాయంటూ సాక్షాత్తూ ప్రజా ప్రతి నిధులు గగ్గోలు పెట్టడంతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికార యంత్రా ంగాన్ని గట్టిగా మందలించి తనిఖీల కు పంపించారు. సరిగా చేయకపోవడంతో నోటీసులతో అధికారులను ఉరుకులు పరుగులెత్తించారు. సుమా రు 73 తనిఖీలు చేసి నివేదికలు సిద్ధం చేశారు. కానీ కేసులు మాత్రం పన్నెం డు మాత్రమే! అందులోనూ జాయింట్ కలెక్టర్ పరిధిలో 9 కేసులు, జిల్లా కలెక్టర్ స్థాయిలోనివి మూడు పెద్ద కేసులు. మిల్లర్లు మొండికేసినా... అధికారులు దాడులు తీవ్ర తరం చేయడంతో మిల్లర్లు మిల్లులను మూసేసి నిరసన చేపట్టారు. సమావేశం నిర్వహించుకుని ఇలాగయితే మిల్లులను తెరిచేది లేదని భీష్మించుక్కూచున్నారు. జిల్లా అధికారులు ఏం అనుమతులు ఇచ్చారో..?ఎలా వారిని ఒప్పించారో..? దాడుల తీవ్రత తగ్గిపోయింది. మిల్లులను తెరిచారు. అధికారులతో పోరాటంలో మనదే పై చేయి అయిందనీ. కేసులన్నీ ఎత్తేస్తారనీ మిల్లులను తెరవవచ్చనీ మిల్లర్లు సంబర పడ్డారు. వీరితో పాటు సీజింగ్, కేసులు నమోదయిన వారు కూడా మిల్లులను తెరచి ఎంచక్కా మిల్లింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడో ట్విస్టుంది. కేసులు నమోదు అయిన వారు మిల్లింగ్ చేసుకుంటున్నా వారికి సీఎంఆర్ ట్యాగింగ్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. ముందుగా వారనుకున్నట్టు మిల్లులపై కేసులు కూడా ఎత్తేయలేదు. అయితే అక్రమాలు జరుగుతున్నాయంటూ సాక్షాత్తూ జిల్లా అధికారులే గుర్తించి, దాడులు నిర్వహించి వాహనాలను సీజ్ చేసినా ఏ నేపథ్యంలో కేసులను ఎత్తివేస్తారని మిల్లర్లు భావిస్తున్నారో తెలియడం లేదు. జిల్లా వ్యాప్తంగా సీజ్ చేసిన సరుకులకు సంబంధించి మిల్లింగ్ జరుగుతున్నా హోల్డింగ్‌లో ఉన్న సరుకులకు సంబంధించి బిల్లులు కావాల్సి ఉంది. మరో పక్క పూర్తిగా ధాన్యం దాదాపు మిల్లర్ల వద్దే ఉంది. ఇంకా రావాల్సిన ధాన్యం మాత్రం చాలా తక్కువగా ఉంది. వ్యూహాత్మకంగా వ్యవహరించిన కలెక్టర్? జిల్లాలో మిల్లర్లు అధికారుల మధ్య వాగ్వాదాల మూలంగానే కేసులు విచారించడం లేదని తెలుస్తున్నది. మిల్లర్లు మిల్లులను మూసేసి ముందుగా వారికి నచ్చజెప్పినట్టు చెప్పి మిల్లింగ్‌కు రంగంలోకి దించిన అధికారులు ఆ తరువాత కేసుల విషయమై మరి తేల్చలేదు. అలాగే నిత్యం మిల్లర్లు తిరుగుతున్నా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు, జేసీ క్యాంపులు ఇలా వరుసగా వారికి చుక్కెదురవుతునే ఉన్నాయి తప్ప వారి పనులు చేయడం లేదు. ఇది కాకతాళీయమా.. లేక ఉద్దేశపూరితమా అనేది తెలియడం లేదు. ముఖ్యంగా గతంలో అధికారులతో వాదనలకు దిగడం వల్లే ఈ పరిస్థితి ఇలా వచ్చిందని మాత్రం అనుకుంటున్నారు. సీజన్ ముగిసిపోతోంది. సీఎంఆర్ వెళ్లిపోతోంది. కేసులు నమోదు చేసిన కొన్ని మిల్లులకు మాత్రం సీఎంఆర్ ట్యాగింగ్ చేయడం లేదు. మొత్తమ్మీద మిల్లింగ్‌కు ఇబ్బంది లేకుండా... వారి దారికి వెళ్లకుండా అధికారుల వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది. -
కొన్నది కొంతే
ఐకేపీ కేంద్రాల్లో మందగించిన ధాన్యం కొనుగోళ్లు సేకరణ లక్ష్యం 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు కొన్నది 40 శాతమే అందులోనూ మిల్లర్లు సేకరించిందే ఎక్కువ భీమవరం : ’జిల్లాలోని రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లో సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఐకేపీ కేంద్రాలు, సొసైటీల ద్వారా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, సీజన్ ముగుస్తున్నా ఇప్పటివరకు 40 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. సార్వా సాగు ప్రారంభంలో సాగునీటి కొరత, చీడపీడలు వంటి ఇబ్బందుల నడుమ 5.50 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన అధికారులు 10 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గత నెలలో ఐకేపీ కేంద్రాలు, సొసైటీల ద్వారా 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఈనెల 15వ తేదీ నాటికి 38,475 మంది రైతుల నుంచి 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులోనూ మిల్లర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు వచ్చిన ధాన్యమే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ధాన్యం అమ్మిన రైతులకు రూ.575.61 కోట్లను చెల్లించాల్సి ఉండగా, రూ.485 కోట్లు చెల్లించారు. కష్టాలు అదనం మొన్నటి వరకు మంచు అధికంగా ఉండటం, యంత్రాలతో కోయించడం వంటి పరిస్థితుల వల్ల ధాన్యంలో తేమ శాతం పెరిగింది. ఈ కారణంగా మద్దతు ధరలో భారీగా కోత విధించారు. కూలీల సాయంతో ధాన్యాన్ని రోజుల తరబడి ఆరబెట్టినా తేమ శాతం తగ్గలేదు. ఫలితంగా, రైతులకు ఖర్చులు పెరిగిపోగా, గిట్టుబాటు ధర దక్కలేదు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడం, సాప్ట్వేర్ ఇబ్బందుల వల్ల రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. తెలంగాణలో ధర ఎక్కువ పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ధాన్యానికి మంచి ధర ఇచ్చింది. మన రాష్ట్రంలో ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,510, కామన్ రకం ధాన్యానికి రూ.1,470 చొప్పున ధర నిర్ణయించారు. తెలంగాణలో మాత్రం రెండు రకాల ధాన్యంపై క్వింటాల్‌కు బోనస్ రూపంలో రూ.60 అదనంగా చెల్లించారు. ఇక్కడి రైతులకు బోనస్ ఇవ్వకపోగా, తేమ శాతం పేరిట కనీస మద్దతు ధరలోనూ భారీగా కోత విధించారు. దీంతో ఖమ్మం జిల్లాకు సరిహద్దున గల రైతులు తెలంగాణ రాష్ట్రానికి తరలించి విక్రయించారు. ముందుగానే కొనుగోలు చేసిన మిల్లర్లు కొవ్వూరు డివిజన్లో అక్టోబర్ నెలలోనే సార్వా మాసూళ్లు ప్రారంభం కాగా, రైస్ మిల్లర్లు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఆలస్యంగా నవంబర్ 7న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో అప్పటికే మిల్లర్లు మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. అప్పట్లో క్వింటాల్‌కు రూ.100 చొప్పున అదనంగా చెల్లించారు. ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరగలేదని అధికారులు చెబుతున్నారు.