మద్దతు ధరకు ఢోకా ఉండదు: కేంద్రం
న్యూఢి ల్లీ: ఆహార భద్రత బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రైతుల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) లభిస్తుందని కేంద్రం హామీ ఇచ్చింది. బిల్లుపై చర్చలో వ్యక్తమైన ఆందోళనలపై ఆహార మంత్రి కేవీ థామస్ స్పందించారు. ‘ఎంఎస్పీలను దె బ్బతీయం. మండీలకు వచ్చిన ఏ ధాన్యాన్నయినా సేకరిస్తాం, పంపిణీ చేస్తాం’ అని చెప్పారు. ఎంఎస్పీలను నిర్ధారించే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేసినా ప్రభుత్వం అంగీకరిస్తుందని తెలిపారు. దేశంలో ధాన్యాల నిల్వ సామర్థాన్ని 5.5 కోట్ల టన్నుల నుంచి 7.5 కోట్ల టన్నులకు పెంచామన్నారు.