కల్తీ కల్లు తాగి 25 మందికి అస్వస్థత
రొద్దం: మండలంలో కల్తీకల్లు తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. పి.రొప్పాలలో కల్తీ కల్లు తాగి 20 మంది అస్వస్థతకు గురి కా గా, నల్లూరులో మరో ఐదుగురు కల్తీ కల్లు తాగి వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వారిలో ఎనిమిది మం ది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పి.రొప్పాల గ్రామస్తులు తెలిపారు. వారందరినీ హిందూపురం, పెనుకొండ, మడకశిర ఆస్పత్రులకు తరలించి నట్లు చెప్పారు. అంజినప్ప(50), సిద్దమ్మ(60), అంజినమ్మ(65), కిష్టప్ప(70), లక్ష్మినరసమ్మ(70), హెచ్.అంజినమ్మ(59), సిద్దన్నగారి లక్ష్మినరసమ్మ(70), తిప్పన్న(75), కదిరమ్మ(70), రామక్క(60), నరసమ్మ(67), వడుసలప్ప(73), కిష్టప్ప(90), నంజమ్మ(65) తదితరులు అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు.
ఎక్సైజ్ సీఐ రేవతి, ఎస్ఐ శ్రీధర్ ఏమంటున్నారంటే...
పి.రొప్పాలలో ప్రభుత్వ కల్లు దుకా ణం ఏర్పాటుకు మేం అనుమతి ఇవ్వలేదు. కర్ణాటక సరిహద్దు ప్రాం తం కావడంతో కల్తీ కల్లు ఎక్కడ తాగారన్న విషయం తెలియడం లేదు. విచారణ చేస్తున్నాం.