MLC Budha Venkanna
-
రగులుతున్న మేయర్-కార్పొరేటర్ల పోరు!
-
అంబటి రాంబాబు హౌస్ అరెస్ట్..
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును సోమవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో జన్మభూమి కమిటీలు చేస్తోన్న అక్రమాలను బయటపెట్టేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పెన్షన్ల జారీలో అక్రమాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విసిరిన సవాలును స్వీకరించిన అంబటి.. ఈ మేరకు చర్చకోసం బయలుదేరగా.. అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. అంబటి హౌస్ అరెస్ట్ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. దమ్ముంటే చర్చకు రండి : ‘‘పెన్షన్లలో అక్రమాల విషయమై ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నేను చేసిన ఆరోపణలు తప్పని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాలు విసిరారు. నేను కూడా సిద్ధమేనని చెప్పాను. సోమవారం ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి సెంటర్లో చర్చ జరగాల్సిఉంది. కానీ నన్ను అక్కడికి వెళ్లనీయకుండా టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుంది. హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అసలు పోలీసులను పురమాయించి అరెస్టులు చేయించేవాళ్లు అసలు సవాలెందుకు చేసినట్లు? ఇప్పటికైనా దమ్ముంటే చర్చకు రావాలి. పెన్షన్ల విషయంలో ప్రభుత్వ బండారం మొత్తం బయటపెడతా’’ అని రాంబాబు అన్నారు. -
శివప్రసాద్‌పై టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు
- ఎంపీ వ్యక్తిగత విషయాలపై ఎమ్మెల్సీ బుద్ధా విమర్శలు విజయవాడ: చంద్రబాబు పాలనలో దళితులకు న్యాయం జరగడంలేదంటూ నిరసన గళం విప్పిన చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ పై సొంతపార్టీ నేతల విమర్శలదాడి ఆగలేదు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రులు జవహర్, అమర్నాథ్రెడ్డిలు శివప్రసాద్‌ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరో అడుగు ముందుకువేసి శివప్రసాద్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేశారు. ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన బుద్ధా.. ‘శివప్రసాద్ దళితుల కొసం పొరాడేవాడైతే, దళితులను ఎందుకు పెళ్లి చేసుకొలేదు?’ అని ప్రశ్నించారు. శివప్రసాద్ భూకబ్జా ఫైల్ పై సంతకం పెట్టక పోవడం వల్లే చంద్రబాబును దళిత ద్రోహి అని విమర్శిస్తున్నాడని ఆరోపించారు. శివప్రసాద్ కి రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబేనని, కుప్పంలో వచ్చిన మెజార్టీ వల్లే చిత్తూరు ఎంపీగా శివ ప్రసాద్ గెలిచిన సంగతి గుర్తుచేసుకోవాలన్నారు. చంద్రబాబు మద్దతు లేకుంటే చితూరు ఎంపీ నియోజకవర్గంలొ శివప్రసాద్ సర్పంచ్ గా కుడా గెలవలేరని బుద్ధా అన్నారు. ‘శివప్రసాద్ మంత్రిగా ఉన్నప్పుడు దళితుల ఇండ్లలో ఏనాడైనా భోజనం చేశారా? దళితులపై ఆయనకు ప్రేమ ఉంటే ఆ వర్గానికి చెందినవారిని ఎందుకు పెళ్లిచేసుకోలేదు? అవసరం కోసం దళితులను వాడుకోవడం శివప్రసాద్ నైజం. మరోసారి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తిరుపతి వచ్చి భాగోతం బయటపెడతా’ అని బుద్ధా వెంకన్న విమర్శించారు. (చదవండి: చంద్రబాబుపై శివప్రసాద్ ధ్వజం) (నేనేం తప్పు మాట్లాడాను?) -
కాల్‌మనీ కేసులో బుద్దా వెంకన్న సోదరుడికి బెయిల్
వన్‌టౌన్ (విజయవాడ): కాల్‌మనీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావుకు వన్‌టౌన్ పోలీసులు గురువారం స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వన్‌టౌన్ పోలీసులు బుద్దా నాగేశ్వరరావు కేసును చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టారు. దానిపై స్పందించిన న్యాయమూర్తి.. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చని, కోర్టులో ఎందుకు పెడుతున్నారని అంటూ కేసును రిటర్న్ చేశారు. దాంతో వన్‌టౌన్ పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదించారు. అనంతరం నాగేశ్వరరావుకు స్టేషన్ బెయిల్‌ను మంజూరు చేశారు. -
'పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ బుద్దా సోదరుడు'
విజయవాడ (వన్‌టౌన్): శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావును వన్‌టౌన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్ మనీ నేరాలకు సంబంధించి నగరంలో అత్యంత పెద్ద వ్యాపారిగా ఉన్న బుద్దా నాగేశ్వరరావు ఇంటిపై పోలీసులు మంగళవారం ఉదయం దాడి చేసి అతడిన అదుపులోకి తీసుకున్నారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకోవడం స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది. సోదరుడు బుద్దా వెంకన్నను అడ్డం పెట్టుకొని నాగేశ్వరరావు అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు అతని ఇంటిపై దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. అందులో రూ.3 లక్షల నగదు, 25 ప్రామిసరీ నోట్లు, పలు విలువైన ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లక్షల్లో అప్పులిచ్చి కోట్ల రూపాయాల విలువైన ఆస్తులను స్వల్ప కాల వ్యవధిలోనే చెల్లించలేదని వాటిని కాజేసినట్లు నాగేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. మరో మూడు బృందాలు కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లపై దాడి చేశాయి. అందులో రౌడీషీటర్‌గా ఉన్న లంకలపల్లి సతీష్ ఇంటిపై దాడి చేయగా అతని ఇంట్లో రోజువారి చిట్ వివరాలను రాసే చిన్నసైజు ఖాళీ పుస్తకాలు 64 దొరికాయి. మొయిన్ బజార్లో స్వీట్స్ వ్యాపారం చేసే సముద్రాల నాగేశ్వరరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించగా ఎటువంటి పత్రాలు, నగదు లభించలేదు. నాలుగో వ్యక్తిగా ఉన్న మరో రౌడీషీటర్ లంకలపల్లి మల్లేశ్వరరావు (మల్లి) మాచవరం గంగిరెద్దులదిబ్బ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతని ఇంటికి వెళ్లేసరికి మల్లి పరారవ్వగా.. ఇంట్లో సోదాలు చేయగా రూ.4 లక్షల నగదు, పలు చెక్కులు, ప్రామిసరీ నోట్లు లభించాయి. మల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బుద్దా నాగేశ్వరరావుకు పోలీసులు రాచమర్యాదలు! కాల్‌మనీ వ్యాపారి బుద్దా నాగేశ్వరరావుకు వన్‌టౌన్ పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న విషయం బయటకు రావడంతో మీడియా అంతా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. నాగేశ్వరరావును మీడియాకు చూపించాలని పదేపదే అడిగినా సీఐ పి.వెంకటేశ్వర్లు అందుకు నిరాకరించారు. నగర వ్యాప్తంగా దాడులు నిర్వహించారని, అందులో బుద్దా నాగేశ్వరరావును గుర్తించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఉన్నత అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నాగేశ్వరరావును మీడియా కంట పడకుండా దాచిపెడుతున్నారని పలువురు ఆరోపించారు