అర్థరాత్రి తర్వాతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం !
నల్గొండ: వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల తుది ఫలితాలు గురువారం అర్థరాత్రి తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ గెలుపునకు 7,013 ఓట్లు కావాల్సి ఉండగా, బీజేపీ గెలుపునకు 19,736 ఓట్లు కావాల్సి ఉందని వెల్లడించారు.
మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ పూర్తి అయిందన్నారు. అలాగే రెండో ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు.