nallamalla forest
-
సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం చోటుచేసుకుంది. జాతరకు భక్తులు పోటెత్తడంతో.. గుండెపోటుతో అమన్‌గల్‌కు చెందిన విజయ అనే మహిళ మృతిచెందింది. దీంతో సలేశ్వరం జాతరలో మరణించిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కసలాట జరిగి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. మృతులను నాగర్ కర్నూల్ జిల్లాకే చెందిన గొడుగు చంద్రయ్య (55), వనపర్తి జిల్లాకు చెందిన యువకుడు అభిషేక్‌గా (32) గుర్తించారు. కాగా నల్లమల్ల అడవుల్లోని సలేశ్వరంలో కొలువై ఉన్న శివుడిని (లింగమయ్య) దర్శించుకోవాలంటే దట్టమైన అడవీ, కొండలు, లోయల మార్గంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 4 కి.మీ. దూరం కాలినడకన నడవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సలేశ్వరం యాత్రకు భక్తులు పోటెత్తారు. లింగమయ్య నామస్మరణతో నల్లమల కొండలు మార్మోగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఈ యాత్ర కేవలం 3 రోజులు మాత్రమే కొనసాగనుండటం, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సలేశ్వరంలో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడి లోయల్లో భక్తులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు స్తంభించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తుల అసంతృప్తి సలేశ్వరం యాత్ర ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారం పది రోజులపాటు నిర్వహించవలసిన జాతరను కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలను చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సలేశ్వరం జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమవ్వగా శుక్రవారం వరకు జాతర కొనసాగనుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమస్తారు. -
శివనామస్మరణతో మార్మోగుతోన్న నల్లమల్ల ఫారెస్ట్
-
పచ్చర్ల జంగిల్ క్యాంప్.. అడవిలో ఆహ్లాదకర ప్రయాణం
వసంత కాలం వచ్చేసింది. ఆకులు రాల్చిన అడవి పచ్చదనాన్ని తొడిగి సరికొత్తగా కనిపిస్తోంది. పచ్చని చిలుకలు.. పాడే కోయిలలు సందడి చేస్తున్నాయి. ఎగిరే జింకలు.. దూకే వానరాలు.. ఉరికే ఉడతలు.. ఉత్సాహంగా ఉల్లాసంగా కనువిందు చేస్తున్నాయి. ఎత్తుగా నిటారుగా దర్పాన్ని ప్రదర్శించే వృక్షాలు..హొయలొలుకుతూ వయ్యారంగా అల్లుకున్న లతలు ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతున్నాయి. ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే పచ్చర్ల క్యాంప్‌కు వెళ్లాల్సిందే. ఆళ్లగడ్డ: నల్లమల.. రాష్ట్రంలోనే అతిపెద్ద అభయారణ్యం. విశేషమైన వృక్ష సంపద, లెక్కలేనన్ని వన్యప్రాణులు, ఎన్నో రకాల పక్షులు, క్రూరమృగాలైన పెద్దపులులు, చిరుతలు, ఔషధ మెక్కలు ఈ అడవి సొంతం. పర్యావరణ ప్రేమికులకు మరింత ఆసక్తిని, ఆనందాన్ని కలిగించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నల్లమల అందాలను దగ్గర నుంచి చూసే అరుదైన అవకాశం జంగిల్ సఫారీ పేరిట అందుబాటులోకి తెచ్చింది. కాటేజీలు అడవి గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, ఇక్కడ ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమలలోని పచ్చర్ల టైగర్ రిజర్వ్ అవకాశం కల్పిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. జంగిల్ క్యాంప్ పునఃప్రారంభం ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని పంచేందుకు, మనసును ఆహ్లాదపరిచేందుకు నల్లమలలోని ‘పచ్చర్ల’ జంగిల్ క్యాంప్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ దృష్ట్యా కొంతకాలం మూతపడిన సఫారీ మళ్లీ పునఃప్రారంభమైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మీదుగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు జంగిల్ సఫారీకి వస్తున్నారు. వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి సౌందర్యాన్ని చూడటానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుండటం విశేషం. జంగిల్ సఫారీలో పర్యాటకులు అందుబాటులో కాటేజీలు నంద్యాల, గిద్దలూరు మార్గంలో నంద్యాలకు 25, గిద్దలూరుకు 35 కి.మీ దూరంలో పచ్చర్ల జంగిల్ క్యాంప్ ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంప్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ రెండు ఓపెన్ టాప్ జీపులను పర్యాటకుల కోసం అందుబాటులో ఉంచారు. ఒక్కో వాహనంలో 10 మంది కూర్చొని సఫారీ చేయవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ. 200 చొప్పున చెల్లిస్తే ఐదుగురు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. మొత్తం రూ.1000 చెల్లించి ఇద్దరు ముగ్గురైనా సఫారీకి వెళ్లవచ్చు. జంగిల్ క్యాంప్‌లో నాలుగు కాటేజీలు, 2 మిలట్రీ టెంట్ హౌస్‌లు ఉన్నాయి. కాటేజీ అద్దె రూ. 4,000, మిలట్రీ టెంట్ అద్దె రూ. 5,000 (ఇద్దరికి), ఆరేళ్లు దాటిని పిల్లలకి రూ. 1,000 అదనంగా వసూలు చేస్తారు. బస చేసిన వారికి రెండు పూటలా భోజం, ఉదయం బెడ్ కాఫీ, టిఫిన్, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. జంగిల్ సఫారీ ఉచితంగా చేయవచ్చు. అడవిలో ఆహ్లాదకర ప్రయాణం నల్లమలలోని టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో సుమారు 25 కి.మీ ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. నెమళ్లు, వివిధ రకాల పక్షులు, జింకలు, దుప్పులు, అడవి పందులు, కొండ గొర్రెలు, భయపెట్టే కొండ చిలువలు, తాచు పాములు వీటి మధ్య పర్యటన కొనసాగుతుంది. మధ్యన రెండు చోట్ల వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. సందర్శకులు వీటిని ఎక్కితే నల్లమల అంతా చూడవచ్చు. ప్రస్తుతం నల్లమలలో దాదాపు 50 చిరుత పులులు, 70 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా. అప్పుడప్పుడు చిరుత, పెద్ద పులులు కూడా కనిపిస్తున్నాయి. అడవిలోకి వెళ్లే పర్యాటకులు అటవీ సిబ్బంది ఆపిన చోట మాత్రమే కిందకు దిగాలి. అటవీ మధ్యలో దిగడం, ఫొటోలు తీసుకోవడం చేయకూడదు. స్థానికంగా ఉండే చెంచులే టూరిస్టు గైడ్లు స్థానికంగా నివసించే చెంచులే గైడ్లుగా ఉంటూ నల్లమల అడవిని చూపిస్తారు. పర్యాటకులు వారితో మమేకమై ముచ్చటించేందుకు అటవీ శాఖ అవకాశం కల్పిస్తోంది. చెంచుల స్థితిగతులు, జీవనవిధానంపై అవగాహన కలుగుతుంది. నల్లమల అందాలను మనసారా ఆస్వాదించేలా అధికారులు ప్యాకేజీని రూపొందించారు. మళ్లీ రావాలని అనిపిస్తోంది స్నేహితుడి పెళ్లి అయిపోయిన తరువాత ఫొటో షూట్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని అనుకోలేదు. మళ్లీ రావాలని అనిపిస్తోంది. – కాశీబాబు, సాఫ్ట్వేర్ ఇంజినీర్, చెన్నై చాలా బాగుంది స్నేహితులతో కలిసి మొదటిసారి ఇక్కడికి వచ్చాను. పచ్చర్ల జంగిల్ సఫారీ చాలా బాగుంది. మరోసారి కుటుంబ సభ్యులం అందరం కలిసి రావాలని అనుకుంటున్నాం. – చందన, మార్కాపురం, ప్రకాశం జిల్లా లాభాపేక్ష లేకుండా సేవలు జంగిల్ క్యాంప్ ఆహ్లాదకరంగా ఉంటుంది. కాటేజీ బుక్ చేసుకున్నవారు ఒక్క రూపాయికూడా అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. భోజనాలు, టీ, టిఫిన్, స్నాక్స్ అన్నీ ఫ్రీగా అందజేస్తున్నాం. లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారు. పర్యాటకులు చెల్లించే మొత్తం ఇక్కడ పనిచేసే చెంచులకే ఖర్చు చేస్తున్నాం. – నరసయ్య, డీఆర్వో -
ప్రకృతి ఒడిలో.. హాయ్.. హాయ్!
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలు వీక్షించేలా అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సహజ త్వంతో కూడిన సుందర దృశ్యాలను తిలకించేందుకు వస్తున్న పర్యావరణ ప్రేమికులకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావ రణం నడుమ అడవిలో సఫారీ చేసి రాత్రి బసచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకోసం నల్లమల అభయారణ్యంలో జంగిల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా తుమ్మ లబైలు ప్రాంతాన్ని ఎంపిక చేసింది. అత్యాధునిక వసతులతో కాటేజీలు, వెదురు గుడిసెలు, టెంట్లను ఏర్పాటు చేయనుంది. ప్రకృతి సిరిసంపదలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతంలోని గిరిజనగూడేల్లో సంస్కృతి, సంప్రదాయాలను నేరుగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించబోతోంది. పెద్దదోర్నాల: దట్టమైన నల్లమల అభయారణ్యంలో శీతోష్ణస్థితి మండలంగా గుర్తింపు పొందిన తుమ్మలబైలు గిరిజన గూడేన్ని అటవీశాఖ అధికారులు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. చెంచు గిరిజనులు నివసించే ప్రాంతంలోనే పర్యాటకులు బస చేసే అవకాశాన్ని కల్పించేందుకు చర్యలు చేప ట్టనున్నారు. నగరాలు, పట్టణాల్లో ఆధునిక జీవితానికి అలవాటు పడిన పర్యావరణ ప్రేమి కులు.. చెంచు గిరిజనుల ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వారు నివసించే గృహాలు, వారి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను నేరుగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు. దీంతో పాటు నల్లమలలోని ఆహ్లాదకరమైన వాతా వరణం, ఎత్తయిన పర్వతాలు, లోతైన లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలే కాక జల పాతాలు, సెలయేళ్లు, పచ్చని తివాచీ పరిచిన ట్లుండే అందమైన పచ్చికబయళ్లు, స్వేచ్ఛాయుత వాతావరణంలో సంచరించే పెద్దపులులు, చిరుతలు, జింకలు, దుప్పులు మరెన్నో వన్యప్రాణులు కనిపించనున్నాయి. మానవాళిని అబ్బురపరిచే అందమైన పుష్పజాతులు, పలు రకాల ఔషధ మొక్కలు, ఎన్నో వింతలు విశేషాలను తిలకించడంతో పాటు వాటి విశేషాలను తెలుసుకునే అధ్భుతమైన అవకాశాన్ని పర్యాటకులకు అటవీశాఖ కల్పించబోతోంది. గూడెంలో నివసించే కొంత మంది చైతన్యవంతులైన యువకులను గుర్తించి వారి ద్వారా గూడెంలోని చెంచు గిరిజనులకు జంగిల్ హట్స్, వాటి వలన చెంచు గిరిజనులకు వచ్చే ఆదాయ మార్గాలపై కొందరికి అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో గిరిజన గూడెంలో 10 వరకు జంగిల్ కాటేజీలు ఏర్పాటు చేయ నున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గదులలో సౌకర్యాలు ఇలా... త్వరలోనే జంగిల్ క్యాంపులు మరి కొద్ది రోజుల్లో జంగిల్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పైలెట్ ప్రాజెక్టుగా జంగిల్ సఫారీకి అనుసంధానంగా ఉన్న తుమ్మలబైలు గిరిజన గూడేన్ని గుర్తించాం. తుమ్మలబైలు గిరిజనగూడెంలో జంగిల్ క్యాంపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎకో డెవలప్మెంట్ కమిటీ ద్వారా కొంత భాగం గూడెం అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తాం. జంగిల్ కాటేజీలతో పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పెద్దదోర్నాల నిర్మాణాలపై అధికారుల దృష్టి... నల్లమల అభయారణ్యంలోని తుమ్మలబైలు గిరిజనగూడెంలో జంగిల్ కాటేజీలు, వెదురు గుడిసెల నిర్మాణాలపై అధికారుల దృష్టి సారించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కాటేజీలలో సకల సదుపాయాలు కల్పించనున్నారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసే టెంట్లు, కాటేజీలు, వెదురుతో కూడిన గుడిసెల్లో పర్యాటకులకు అవసరమయ్యే సకల సౌకర్యాలను అందుబాటులో ఉంచనున్నారు. జంగిల్ కాటేజీలలో ఒక్కో గదిలో ఇద్దరు సేద తీరడానికి రెండు బెడ్లు, గదికి సీలింగ్, ఆకర్షణీయమైన విధంగా లైటింగ్ సౌకర్యం, విలాసవంతమైన టాయిలెట్లు, రాత్రి పూట కాంప్లిమెంటరీ భోజనం ఏర్పాటు చేయనున్నారు. జంగిల్ సఫారీ చూసిన తర్వాత యాత్రికులు ఇక్కడే బస చేసేలా చర్యలు చేపడుతున్నారు. యాత్రికులు సఫారీతో పాటు రోజంతా నల్లమలలోని అటవీ ప్రాంతంలోనే గడిపే ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఇందు కోసం రూ.2,500 నుంచి 3,000 వరకు వసూలు చేయనున్నారు. అటవీశాఖ చేస్తున్న ఈ ఏర్పాట్లతో గిరిజనులకు, అటవీశాఖకు మరి కొంత ఆదాయం సమకూరనుందని అధికారులు పేర్కొంటున్నారు. -
పాపం పులి.. వేటకు వెళ్తూ వరుస మరణాలు!
పులి పంజా విసిరితే ఎలాంటి వన్యప్రాణి అయినా దానికి ఆహారం కావాల్సిందే. అయితే, ఆహారం కోసం వేటాడుతూ అరణ్యం దాటి బయటకొస్తున్న పులులు ప్రమాదాల బారినపడి మృత్యు వాతపడుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ తరచూ పులులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు పులుల సంతతి పెంచేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మరో వైపు వేటాడే నేపథ్యంలో అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో పులుల సంరక్షణపై అటవీశాఖ అధికారులు మరింత దృష్టి సారించారు. రెండేళ్లలో మృతిచెందిన పులుల వివరాలు... ► 2020 జనవరి 20వ తేదీ కర్నూలు–గుంటూరు రహదారిపై నల్లమలలోని ఆర్.చెలమ బావి వద్ద కోతులను వేటాడే క్రమంలో ఓ చిరుతకూన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ► 2020 ఏప్రిల్ నెలలో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండలో అటవీ ప్రాంతంలో వృద్ధాప్యంతో తీవ్రమైన ఎండవేడిమిని తట్టుకోలేక పెద్ద పులి మృతి చెందింది. ► 2021 నవంబర్ 12న గిద్దలూరు–నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తూ రైలు కింద పడి పెద్ద పులి మృతి చెందింది. ► తాజాగా కోతిని వేటాడే క్రమంలో మరో చిరుత బావిలో పడి మృతిచెందిన సంఘటన ఈనెల 6న వెలుగుచూసింది. మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతంలో వరుసగా పులులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వాటి సంరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. గడిచిన రెండేళ్లలో రెండు చిరుతలు, రెండు పెద్ద పులులు మృతి చెందాయి. ప్రధానంగా వేటాడే క్రమంలో ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి. నల్లమల అభయారణ్యాన్ని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ టైగర్ రిజర్వు ఫారెస్ట్ (రాజీవ్ అభయారణ్యం)గా ప్రకటించింది. దోర్నాల–శ్రీశైలం, శ్రీశైలం–తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ పరిధిలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పులుల సంచారం ఉన్నందున అటవీశాఖ గేట్లను ఏర్పాటు చేసి రహదారులపై రాకపోకలను నిలిపివేస్తోంది. వేటగాళ్ల నుంచి పులులను కాపాడేందుకు నల్లమలలో 24 బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 120 మంది టైగర్ ట్రాకర్లు పనిచేస్తున్నారు. ఒక్కో బేస్ క్యాంప్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరు కాకుండా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది అడవిలో తిరుగుతుంటారు. పులుల మృతికి కారణాలు... జంతువులను వేటాడుతూ అడవిలో నుంచి రోడ్లపైకి, రైల్వేట్రాక్‌లపైకి వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తూ వాహనాలు ఢీకొని పులులు మృతిచెందుతున్నాయి. వేసవిలో మంచినీటి కోసం జనారణ్యంలోకి వెళ్లే క్రమంలోనూ రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అదే సమయంలో పొలాల్లో అడవి పందుల కోసం వేసిన ఉచ్చులు, విద్యుత్ సరఫరాతో కూడిన కంచెల్లో చిక్కుకుని కూడా పులులు మృతిచెందే ప్రమాదం ఉంది. వేటాడే క్రమంలో అడవిలోని బావుల్లో పడి నీటిలో నుంచి బయటపడలేక కూడా తాజాగా చిరుత మృతిచెందింది. గతంతో పోలిస్తే నల్లమలలో పెరిగిన పులుల సంఖ్య... మన రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3,568 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో 65 పెద్ద పులులు, 75కిపైగా చిరుతలు ఉన్నాయి. వాటిలో మార్కాపురం డివిజన్ అటవీ ప్రాంతం దాదాపు 900 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇటీవల పులుల గణనను ప్రారంభించారు. వాటి కాలి గుర్తులు, ట్రాక్ చేసిన సీసీ కెమేరాల ద్వారా దాదాపు 65 పులులు ఉన్నట్లు గుర్తించారు. అందులో దాదాపు 5 పులులు తెలంగాణ అడవిలో కూడా సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. మార్కాపురం డీఎఫ్‌వో పరిధిలో శ్రీశైలం, నంద్యాల, గుంటూరు జిల్లా మాచర్ల, విజయపురిసౌత్ ప్రాంతాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పులుల సంఖ్యను అధికారికంగా లెక్కిస్తారు. దానిలో భాగంగా నాలుగేళ్ల క్రితం నల్లమలలో 40 నుంచి 48 పెద్ద పులులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 65కి చేరింది. ఇక చిరుత పులులు 75కిపైగా ఉన్నాయి. వాటితో పాటు అరుదైన అలుగు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు, నెమళ్లు, రేచుకుక్కలు, ముళ్ల పంది, ఈలుగ, ఎలుగుబంట్లు ఉన్నాయి. పులుల రక్షణకు ప్రత్యేక చర్యలు నల్లమలలో పులుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పులులతో పాటు ఇతర జంతువులకు తాగునీటి సమస్య లేకుండా చాలా ప్రాంతాల్లో సాసర్ పిట్లు ఏర్పాటుచేసి నీటి వసతి కల్పించాం. పులులు సంచరించే ప్రాంతాల్లో కెమేరాలు బిగించాం. బేస్‌క్యాంప్ సిబ్బంది 24 గంటల పాటు పులుల సంరక్షణపై దృష్టి పెడతారు. అడవుల్లోకి ఎవరొచ్చినా మాకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. నిబంధనలు అతిక్రమించి జంతువులపై దాడులకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం. నల్లమలలో మరో బేస్ క్యాంప్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గిద్దలూరు–నంద్యాల మధ్య ఉన్న రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రైళ్ల వేగం తగ్గించాలని ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు అండర్ పాస్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఉన్నాతాధికారులకు తెలిపారు. అటవీ ప్రాంతంలో నీటి కొరత లేకుండా చేశాం. కృష్ణా రివర్ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉన్నందున గట్టి భద్రతా చర్యలు తీసుకున్నాం. – విఘోష్ అప్పావ్, డీఎఫ్‌వో, మార్కాపురం -
ప్రకృతి అందాల ఖిల్లా.. నల్లమల
మహానంది/ ఆత్మకూరు రూరల్/ బండిఆత్మకూరు: దట్టమైన నల్లమల అడవుల్లో వెలిసిన మహానంది క్షేత్రం మహదానందానికి నిలయం. క్షేత్రానికి వచ్చిన భక్తులు నల్లమల అందాలు చూసి పరవశించిపోతుంటారు. ఆదిదేవుడైన పరమేశ్వరుడి చెంత ఉద్భవించిన స్వచ్ఛమైన గంగాజలంతో కూడిన కోనేరులు ప్రత్యేక ఆకర్షణ. అలాగే పరిసరాల్లోని నవనందుల్లో వినాయకనంది, గరుడనంది క్షేత్రాలతో పాటు సూర్యనంది క్షేత్రం ఉండటం మరో విశేషం. నంద్యాల–గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పురాతన దొరబావి వంతెన ఆకట్టుకుంటుంది. పచ్చర్ల వద్ద ఏర్పాటు చేసిన ఎకో టూరిజం, నల్లమలలోని బైరేనీ స్వామి దగ్గరున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. రుద్రకోడు.. నల్లమల అడవుల్లో వెలసిన పురాతన శైవ క్షేత్రాల్లో రుద్రకోడు ఒకటి. రుద్రాణి సమేతంగా రుద్రకోటీశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఔషధీయుక్తమైన జలాలతో ఉన్న రుద్రగుండం కోనేరు విశిష్టమైనది. ఈ ఆలయంలో సీతారామస్వామి కూడా కొలువై ఉండడం విశేషం. నల్లకాల్వ గ్రామం నుంచి నల్లమల అడవుల్లో 12 కి.మీ. వెళ్తే ఈ క్షేత్రం చేరుకోవచ్చు. దారిలో గాలేరు ,ముసళ్లవాగు వంటి కొండవాగులను దాటి వెళ్లాల్సి ఉంటుంది. దారిలో డాక్టర్ వైఎస్సార్ బయోడైవర్సిటి పార్క్ ఉంది. ఇందులో సుమారు 600 వృక్ష జాతులు సహజసిద్ధంగా ఉండడం విశేషం. రుద్రకోడు వెళ్లేందుకు నల్లకాల్వ నుంచి ఆటోల సౌకర్యం ఉంటుంది. జంగిల్ క్యాంప్.. ►ఆత్మకూరు అటవీ డివిజన్లోని బైర్లూటి గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిందే నల్లమలై జంగిల్ క్యాంప్. ►నల్లమలై జంగిల్ క్యాంప్‌లో కాటేజ్‌లు, టెంట్లు విశ్రాంతి కోసం నిర్మించారు. ►బైర్లూటి నుంచి నాగలూటి మీదుగా పురాతన వీరభధ్ర స్వామి ఆలయం దర్శించుకుని తిరిగి క్యాంప్ చేరుకునేలా జంగిల్ సఫారీ ►ఇలాంటి క్యాంప్‌లు తుమ్మల బయలు, పచ్చర్లలో కూడా ఉన్నాయి. ►సమీపంలోనే శ్రీశైలానికి రెడ్డి రాజులు నిర్మించిన మెట్ల దారిని కూడా చూడవచ్చు. మహిమాన్వితం.. ఓంకార క్షేత్రం బండిఆత్మకూరుకు తూర్పు దిశన వెలసిన ఓంకార క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాన మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడ ఉన్న పంచ బుగ్గల కోనేరులో స్నానం చేసి అమ్మవారు, ఓంకార సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ‘ఓం’ అనే శబ్దం వినిపిస్తుండేది.. అన్ని మంత్రాలకు బీజాక్షరమైన ఓం అనే ప్రవణాదం ఈ ప్రాంతంలో వినిపిస్తుండేది. దీంతో సిద్ధులు అనే మహర్షులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని ఓంకార సిద్ధేశ్వర స్వామిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్న కోనేరులో ఉన్న 5 బుగ్గలలో నుంచి నీరు వస్తుండేది. ఈ విధంగా పంచబుగ్గల కోనేరుగా పిలువబడింది. దొరబావి వంతెన.. రాష్ట్రంలో ఊగే రైలు వంతెన అంటే ముందుగా గుర్తొచ్చేది నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో బొగద టన్నెల్ వద్ద కనిపించే వంతెన. చలమ, బొగద రైల్వేస్టేషన్ సమీపంలో భూ మట్టానికి సుమారు 276 అడుగుల ఎత్తులో బ్రిడ్జి నిర్మించారు. 1884లో మొదలుపెట్టి 1887 నాటికి పూర్తి చేశారు. 110 ఏళ్ల పాటు వాడిన ఈ వంతెనను బ్రాడ్‌గేజ్ సమయంలో తొలగించారు. బొగద సొరంగం సౌత్‌సెంట్రల్ రైల్వేజోన్‌లో ఎక్కువ పొడవైనదని, 1,565 మీటర్లు ఉంటుందని సమాచారం. వైఎస్సార్ స్మృతివనం.. వైఎస్సార్ స్మృతివనం ప్రాజెక్ట్ 22 ఎకరాల్లో రూ.14 కోట్లతో నిర్మించిన ఈ ఉద్యానం వైవిధ్యానికి ప్రతీక. సుమారు 550 ఫల,పుష్ఫ,తీగ,వృక్షజాతులు ఒకే చోట ఉండడం అద్భుతం. ♦20 అడుగుల పొడవైన వైఎస్ఆర్ విగ్రహం చూడ చక్కనైనది. ♦అందమైన కాలినడక మార్గాలు, వివిధ జాతుల వృక్షాలు వీక్షించవచ్చు. ♦వ్యూ టవర్ పై నుంచి నల్లమల అందాలు తిలకించవచ్చు ♦కొరియన్ కార్పెట్ గ్రాస్‌తో ల్యాండ్ స్కేప్ పరిమళ వనం, సీతాకోక చిలుకల వనం, పవిత్రవనం, నక్షత్ర వనం ప్రత్యేకం ఓంకార క్షేత్రం ఆకట్టుకునే జలపాతాలు.. నల్లమలలోని మోట, మూడాకుల గడ్డ, బైరేనీ, చలమ ప్రాంతాల్లో అద్భుతమైన జలపాతాలున్నాయి. గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యంలోని గుండ్లబ్రహ్మేశ్వర ఆలయం వద్ద మూడు కోనేరులు ఉండగా ఎప్పటికీ నీరు తరగదు. బైరేనీ స్వామి కింద నుంచి వచ్చే అద్భుత నీటి ద్వారా నల్లమలలోని వన్యప్రాణులకు తాగునీరు లభిస్తుంది. మహానందిలోని రుద్రగుండం కోనేరు -
నల్లమలలో ఆర్కే కీ రోల్..!
ఒంగోలు: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఉరఫ్ ఆర్కే మృతి వార్తల ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు ఆర్కే సతీమణి నివాసం ఉండే టంగుటూరు మండలం ఆలకూరపాడులో కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. దట్టమైన నల్లమల అడవులు మావోయిస్టులకు కేంద్రంగా నిలిచాయి. నల్లమలలో దాదాపు 47 దళాలు పనిచేసేవి. రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ రామకృష్ణ ఈ దళాలకు మార్గదర్శకంగా వ్యవహరించేవారు. (చదవండి: భర్త చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టిన భార్య!) ఈ క్రమంలోనే మావోయిస్టులపై (అప్పట్లో నక్సలైట్లు) పోలీసులు ఉక్కుపాదం మోపడంతో రామకృష్ణ అండర్గ్రౌండుకు చేరుకున్నారు. ఇలా ఆయన అండర్‌గ్రౌండులో ఉన్న సమయంలోనే టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన కందుల శిరీష అలియాస్ పద్మను 1988లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి మున్నా అలియాస్ పృథ్వీ అలియాస్ శివాజీ జన్మించాడు. బిడ్డ పుట్టిన కొద్ది నెలల తరువాత రామకృష్ణ తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ చర్చలకు జిల్లా నుంచే బయటకు: జిల్లాలోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి. 2004 అక్టోబరు 15న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మావోయిస్టులతో చర్చలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో వారు దోర్నాల మండలం చినారుట్ల వద్ద నుంచి బయటకు వచ్చారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా గుత్తికొండ బిళం వద్ద మావోయిస్టులంతా కలుసుకుని చర్చలు జరిపి అనంతరం కారుల్లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం జిల్లా నుంచి తిరిగి దళాలు చినారుట్ల వద్ద నుంచే అడవుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో 2005లో ఒంగోలులో అప్పటి ఎస్పీ మహేష్‌చంద్ర లడ్హాపై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర పోలీసుశాఖ సీరియస్‌గా తీసుకుంది. కొద్ది నెలలకే యర్రగొండపాలెం మండలం పాలుట్ల అటవీ ప్రాంతంలో అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తోపాటు పలువురు ఎన్కౌంటర్ అయ్యారు. ఈ ఘటనలో అగ్రనేత ఆర్కే తప్పించుకున్నాడు. చదవండి: Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..? తండ్రి బాటలోనే తనయుడు: ఇంటర్ వరకు విద్యనభ్యసించిన మున్నా అలియాస్ పృథ్వీ అలియాస్ శివాజీ కూడా తండ్రి అడుగు జాడల్లోనే ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 2009లో తండ్రి చెంతకు చేరిన మున్నా అతి కొద్దికాలంలోనే టెక్నికల్ డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడు. తరువాత కొన్నాళ్లకు రామకృష్ణను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె రామకృష్ణ భార్యగా వెల్లడైంది. ఆమె పేరు శిరీష అని, పద్మగా పిలుస్తుంటారనేది తెలిసింది. అంతే కాకుండా విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకుడు కళ్యాణరావుకు శిరీష మరదలు కూడా కావడంతో మరింత నిఘా పెంచారు. ఏఓబీ ఇన్చార్జిగా: అయితే నల్లమలలో పోలీసుల పట్టు పెరగడం, అనేక మంది మావోయిస్టులు దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లో ఎన్కౌంటర్లకు గురికావడంతో మావోయిస్టులు నల్లమలను వదిలి దండకారణ్య ప్రాంతమైన ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌పై పట్టు పెంచారు. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలతో కలిసి కార్యకలాపాలు ఉధృతం అయ్యాయి. 2008లో బలిమెల ఘటనలో కృష్ణానదిలో ప్రయాణిస్తున్న భద్రతా దళాలపై జరిగిన దాడిలో జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం నాలుగు రాష్ట్రాలతో ప్రత్యేకమైన యాక్షన్ టీమును రంగంలోకి దించిన సందర్భంలో 2016లో పృథ్వీ మరణించగా ఆర్కే తప్పించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, తద్వారా ఆయన కన్నుమూసినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బంధువులు మాత్రం ఆయన మరణవార్తను నిర్థారించడం లేదు. మావోయిస్టు పార్టీ నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు. -
నల్లమల ఘాట్‌లో కొండను ఢీకొన్న లారీ
ఆత్మకూరు: నల్లమల ఘాట్ ప్రాంతంలో కొండను లారీ ఢీకొన్న ఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ విజయేంద్ర సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ లతన్ యోగి ఎడమకాలు విరిగి గాయాలయ్యాయి. రాజస్థాన్‌కి చెందిన లారీ విశాఖ నుంచి బళ్లారికి ఐరన్ షీట్లు తీసుకుని వెళుతోంది. దోర్నాల– ఆత్మకూరు నల్లమల ఘాట్‌లోని రోళ్లపెంట వద్ద మలుపు తిరిగే సమయంలో లారీ అదుపు తప్పి కొండను ఢీకొని రోడ్డుపై అడ్డుగా ఉండిపోయింది. దీంతో నల్లమలలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు ఎస్ఐ హరిప్రసాద్, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని, క్లీనర్‌ను బయటకు తీశారు. అనంతరం ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు. కొండను ఢీకొన్న ఐరన్షీట్ లారీ -
నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో చెంచుల ఆందోళన
-
18 ఏళ్ల వ్యక్తితో 22 ఏళ్ల యువతి ప్రేమ: చివరకు నల్లమలలో
లింగాల (అచ్చంపేట): ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వయసు మధ్య అంతరం ఉండడంతో పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి కుటుంబసభ్యులు వేరొకరితో నిశ్చితార్థం జరిపించి పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తట్టుకోలేక ఆ యువతి తన ప్రియుడితో కలిసి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన ఏదుల సలేశ్వరంగౌడ్ (18) ఇంటర్ చదివాడు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి అదే గ్రామానికి చెందిన ఉడ్తనూరి రాధ (22) పరిచయమైంది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన రాధ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామంలోనే ఉంటోంది. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి ప్రేమకు నిరాకరించారు. దీంతో రాధకు కుటుంబసభ్యులు కొన్ని రోజుల కిందట మరో వ్యక్తితో రాధకు నిశ్చితార్థం జరిపించారు. పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సలేశ్వరంగౌడ్ నాలుగు రోజుల కిందట హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చి రాధను తీసుకుని వెళ్లిపోయాడు. వారిద్దరూ అదృశ్యమవడంతో ఇరు కుటుంబాల వారు గాలిస్తున్నారు. ఎంత వెతికినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం సాయంత్రం నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుతున్న కాపరులకు రామచంద్రికుంట సమీపంలో వీరిద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా అక్కడికి వెళ్లి వారిని గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అమ్రాబాద్‌లో ‘పులి గర్జన’
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ పులుల అభయారణ్యం(ఏటీఆర్)లో ఉన్న పులుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. అక్కడ పధ్నాలుగు పులులున్నట్టుగా అటవీ అధికారులు గుర్తించారు. ఏటీఆర్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న వన్యప్రాణుల వివరాలనుఅటవీశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పులులతోపాటు మొత్తం 43 రకాల వన్యప్రాణులు ఉన్నట్టు అటవీశాఖ గుర్తించింది. నివేదిక ప్రకారం... వన్యప్రాణుల్లో అరుదైన హానీ బాడ్జర్ లాంటి జంతువులు, వందలాది రకాల పక్షిజాతులు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఇతర వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి ఏడాది నిర్వహించే కసరత్తులో భాగంగా స్టేటస్ ఆఫ్ టైగర్స్ అండ్ ప్రే బేస్ ఇన్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2021 (వైల్డ్‌లైఫ్ సెన్సెస్ రిపోర్ట్)ను శుక్రవారం విడుదల చేశారు. నల్లమల అటవీప్రాంతమైన (2,611 చదరపు కిలోమీటర్ల పరిధి) అమ్రాబాద్‌లోని కోర్ ఏరియాలో పరిశీలన చేశారు. లైన్ ట్రాన్సిక్ట్ మెథడ్, వాటర్ హోల్ సెన్సస్‌ల ఆధారంగా జంతువులను లెక్కించారు. పులులతోపాటు వాటి వేటకు ఆధారమైన శాఖాహార జంతువుల లభ్యతను కూడా పరిశీలించారు. ప్రతిచదరపు కిలోమీటరు విస్తీర్ణంలో జింకలు, చుక్కల దుప్పులు, అడవిపందులు, సాంబార్, లంగూర్ లాంటి జంతువులను లెక్కించారు. పులుల సంఖ్య పెరిగేందుకు వీలుగా అటవీ సంరక్షణకు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని నివేదిక విడుదల సందర్భంగా పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. తెలంగాణలో 26 పులులు 2018లో జాతీయస్థాయిలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో పులుల సెన్సెస్ నిర్వహించగా తెలంగాణలో 26 పులులు(అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ కలిపి) ఉన్నట్లు వెల్లడైంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ కొత్త సెన్సెస్ నివేదికను కేంద్రం వెల్లడించనుంది. 2022 సెన్సెస్ నాటికి 32–34 దాకా పులుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కీలకంగా మారిన పులుల సంరక్షణ అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం, వన్యప్రాణులు ఇలా వివిధ అంశాలన్నీ పులుల సంఖ్య, వాటి స్వేచ్ఛాజీవనంపై ఆధారపడి ఉంటాయి. ఒక్కో పులి స్థిరనివాసంతోపాటు మనుగడ సాగించేందుకు 50 చ.కి.మీ. మేర అటవీ ప్రాంతం అవసరం. పులిపై ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో మిగతా వన్యప్రాణులు, జీవరాశులు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటిని సంరక్షించుకోవడం కీలకంగా మారింది. మనుషుల వేలిముద్రలు, చేతిగుర్తుల మాదిరిగా ఏ రెండు పులుల చారలు, గుర్తులు ఒకేలా ఉండవు. 14 కంటే ఎక్కువగానే పులులుండొచ్చు... ‘అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో పులులు, ఇతర జంతువుల సంఖ్య పెరగడం మంచి పరిణామం. ఇక్కడ 14 పులులున్నట్టుగా తేలింది. అయితే సెన్సెస్ చేసే ఏటీఆర్ పరిధిని మరింత విస్తృతపరిస్తే వీటి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. గతంతో పోల్చితే వీటి సంఖ్య 12 నుంచి 14కు పెరిగింది’ – బి.శ్రీనివాస్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స, ఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ -
కెమెరాకు చిక్కిన పెద్దపులి
నాగర్‌కర్నూల్ : నల్లమల్ల దట్టమైన అడవీ ప్రాంతంలో విహరిస్తున్న పెద్ద పులి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహబాద్ అటవీ శాఖ సిబ్బందిలో ఒకరు ఈ దృశ్యాలను తన సెల్ ఫోన్లో బంధించారు. ఇందులో పులి గాండ్రింపు శబ్దం స్పష్టంగా రికార్డయ్యింది. పులి సంచరించిన ప్రాంతంలో నీళ్లు ఉండటంతో, అవి తాగడానికి పులి అటుగా వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
ప్రతాపరుద్రుని కోటలో కలెక్టర్ శర్మన్
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామ శివారులోని నల్లమలలో ఉన్న ప్రతాప రుద్రుని కోటను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. అటవీ శాఖా, పర్యాటక శాఖాధికారులతో కలిసి ఆదివారం ఉదయం ఆయన చారిత్రాత్మకమైన ప్రతాప రుద్రుని కోటను పరిశీలించారు. కొండలపై ఉన్న కోటను ఆయన కాలినడకన వెళ్లారు. పర్యాటకంగా కోటను అభివృద్ది చేసేందుకు గల చర్యలపై అధికారులతో కలెక్టర్ శర్మన్ చర్చించారు. (తెలంగాణలో కొత్తగా 2,924 కేసులు, 10 మరణాలు) శ్రీశైలం వెళ్లే పర్యాటకులు కోటపై నుంచి నల్లమల అందాలను వీక్షించే ఏర్పాట్ల చేస్తే పర్యాటకులు మధురానుభూతి పొందుతారని తెలిపారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రతాప రుద్రుని కోటపై ఏడు రకాల జలపాతాలు, పుష్కరిణులు ఉన్నాయి. వాటిని అభివృద్ది చేసి పర్యాటకులకు చేరువ చేస్తే బాగుంటుందని స్థానికులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కాగా కొత్తగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన శర్మన్ ప్రతాప రుద్రుని కోటను సందర్శంచడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మంటల్లో నల్లమల
-
అదిగో పులి..
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు, మంచిర్యాల జిల్లా జన్నారం పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల గణన వేగంగా కొనసాగుతోంది. టైగర్ రిజర్వ్ ఫారెస్టులలో యేటా నిర్వహించే జంతుగణనలో భాగంగా ఈ ఏడాది కూడా జంతు గణన ప్రారంభమైంది. తొలి విడతగా పులులు, అనంతరం ఇతర జంతువులను లెక్కించనున్నారు. ఇందుకోసం అటవీ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను బిగించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పర్యవేక్షణలో గణన కొనసాగుతోంది. ముందుగా పులుల గణన దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ కారిడార్లలో ప్రతియేటా అటవీ శాఖ అధికారులు పులుల గణన చేపడతారు. అందులో భాగంగానే తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులలో పది రోజుల క్రితం గణన ప్రారంభమైం ది. ఇందుకు అడవిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో నిక్షిప్తమైన గుర్తుల ప్రకారం వాటి సంఖ్యను లెక్కిస్తారు. పాదముద్రలు, విసర్జితాలు, ఇతర అవశేషాలను సైతం లెక్కలోకి తీసుకొని జంతువుల గణన చేపడతారు. 3,027.53 చ.కి.మీలలో అభయారణ్యం నల్లమల అటవీ ప్రాంతం సుమారు 3,563 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా అందులో 3,027.53 చదరపు కిలోమీటర్లలో అభయారణ్యం ఉంది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంగా పిలుస్తారు. ప్రస్తుతం అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలో 150 రకాల జంతువులు, 60 రకాల పక్షులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని రెండు బ్లాక్‌లుగా విభజించి గణన చేపట్టారు. మన్ననూర్, దోమలపెంట రేంజ్‌ను మొదటి బ్లాక్‌గా, మద్దిమడుగు, అమ్రాబాద్ ప్రాంతాలను రెండో బ్లాక్‌గా విభజించారు. బ్లాక్–1లో 100 కెమెరాలు, బ్లాక్–2 లో 117 సీసీ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పదిరోజులుగా కెమెరా ల్లో నిక్షిప్తమైన అటవీ జంతువుల వివరాలను అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు. 134 మంది సిబ్బంది 700 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో తిరుగు తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ముందుగా నెలరోజుల పాటు పులుల గణన చేపట్టనున్నారు. గతేడాది లెక్కల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 20 పెద్దపులులు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా. కవ్వాల్‌లో.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని కాగజ్‌నగర్, బెల్లపల్లి డివిజన్లలో అటవీ ప్రాంతంలో 120 చోట్ల 240 కెమెరాలను అమర్చారు. జన్నారం, చెన్నూర్ డివిజన్లలోనూ లెక్కింపు కొనసాగుతోంది. చెన్నూర్‌లో 3, జన్నారంలో ఒకటి, కాగజ్‌నగర్‌లో 5 వరకు పులులు ఉన్నట్లు తెలిసింది. గణన అనంతరం పులుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. గణన కొనసాగుతోంది అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని వన్యప్రాణుల గణనకు ఏర్పాట్లు చేశాం. అటవీశాఖ పర్యవేక్షణలో హిట్కాస్ సంస్థ ఎన్జీవో సభ్యులు కూడా గణనలో పాల్గొంటున్నారు.– జోజి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ సీసీ ట్రాప్ కెమెరాలతో పరిశీలిస్తున్నాం అమ్రాబాద్ అభయారణ్యంలో బిగించిన సీసీ ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తులను పరిశీలించి పులుల లెక్కింపు చేపడుతున్నాం. ఈ సారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పులులను లెక్కిస్తున్నాం. – బాపురెడ్డి,రీసెర్చ్ ఆఫీసర్, ఎన్టీసీ, అమ్రాబాద్ ఇన్చార్జ్ నల్లమలలో 2018లో గుర్తించిన వన్యప్రాణుల సంఖ్య పెద్ద పులులు: 20 చుక్కల దుప్పులు: 3,040 కణితి: 4,608 అడవి పందులు: 2,272 కొండ గొర్రెలు: 1,072 మనుబోతులు: 480 బుర్ర జింకలు: 1,888 కొండ ముచ్చులు: 11,600 -
సేవ్ నల్లమల
సాక్షి, నాగర్‌కర్నూల్: కొన్నిరోజులుగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరి నోటా ‘సేవ్ నల్లమల’ అనే మాటే వినపడుతోంది. సోషల్‌మీడియాలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. దేశంలో తరగని సంపద ఉందని.. దానికంటే ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అందరూ కోరుతున్నారు.. ఇదే విషయమై ఆదివారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని నల్లమల ప్రజలకు భరోసా ఇచ్చే మాటిచ్చారు. ఆందోళన సినీ రంగాన్ని కూడా కదిలించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన అధినేత, సినీ హీరో ప్రవన్ కళ్యాణ్, దేవరకొండ విజయ్, యాంకర్లు, డైరెక్టర్లు యురేనియానికి వ్యతిరేకంగా మద్దతు తెలిపారు. భావితరాలకి, బంగారు తెలంగాణ ఇస్తారా.? యురేనియం కాలుష్య తెలంగాణ ఇద్దమా? అని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. యురేనియం కొనొచ్చు.. కానీ అడవిని కొనగలమా? యురేనియం కోసం నల్లమలను నాశనం చేస్తారా అని సినీనటుడు విజయ్ దేవరకొండ ట్విట్ చేస్తూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. వీరిదారిలోనే రాహుల్ రామకృష్ణ, దర్శకుడు శేఖర్ కమ్ముల, సురేంధర్‌రెడ్డి, నాగ్ ఆశ్విన్, ఆడివి శేష్, నటి సుమంత, రామ్, వరుణ్‌తేజ్, సాయితేజ్, అనసూయ, వివి వినాయక్ యురేనియానికి వ్యతిరేకంగా ట్విట్ చేస్తూ సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు. నల్లమలలో యురేనియం త్వవకాలకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు నినాదాలు చేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వంలో కదలిక.. సీఎం ప్రకటనతో ఊరట సేవ్ నల్లమల ఉద్యమం ప్రభుత్వాన్ని కదిలించింది. దీనిపై రెండు రోజుల క్రితం కేటీఆర్ సీఎం దృష్టికి తీసికెళతామని, ప్రజల ఉద్యమాన్ని పరిగణంలోకి తీసుకుంటామని చెప్పిన విధంగానే ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ యురేనియం తవ్వకాలను అనుమంతిచబోమని ప్రకటించారు. యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎవరికి అనుమతులు ఇవ్వలేదని, ఇచ్చే ఆలోచన కూడా లేదని, భవిష్యత్‌లో కూడా ఇవ్వబోమన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గతంలో 2009లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, కడపలో తవ్వుతున్నారని, రైతాంగానికి అన్నం పెట్టే ప్రధానమైన కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టులు కలుషితమై నాశనం అయ్యే పరిస్థితి ఉందని, హైదరాబాద్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉండటం చేత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని, ఇదీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణ యమని స్పష్టం చేశారు. కేంద్రం గట్టిగా పట్టుపడితే అందరం కలిసి కొట్లాడుద్దామని సీఎం ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున యురేనియం పరిశోధన, తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో ఇవ్వ బోదని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ శాసన మం డలిæలో స్పష్టం చేశారు. దీనిని సంతృప్తి చెందని ఈ ప్రాంత ఉద్యమకారు లు సీఎం ప్రకటనను స్వాగితిస్తూనే మన పోరాటంతో అప్రమత్తంగా ఉండాలని, ప్ర మాదం ఏరూపంలోనైనా ముంచుక రా వచ్చని ప్రకటించింది. సీఎం ప్రకటన వల్ల ఉద్యమం నిలిచిపోతుందా! యథావిధిగా కొనసాగిస్తారనే దానిపై స్పష్టత రాలేదు. మేమెప్పుడూ ప్రజాపక్షం.. నల్లమల సురక్షితం తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నా.. యురేనియం తవ్వకాలు జరిగితే ప్రజల పక్షాన తానే ముందుండి పోరాడతానని. ప్రతి పక్షాల కుట్రలను సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారు. యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. భవిష్యత్‌లో కూడా ఇవ్వబోమని సీఎం తేల్చి చెప్పారు. ఇదీ ప్రకృతి పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఉన్న నిబద్దత. నల్లమల సురక్షితంగా ఉంటుంది. తాను సంతకాలు పెట్టారని కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు. – గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే అచ్చంపేట -
‘కేటీఆర్ ట్వీట్ కొండంత అండనిచ్చింది’
సాక్షి, హైదరాబాద్: సేవ్ నల్లమల్ల పేరుతో మేధావులు, సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతో ఊపిరినిచ్చిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నల్లమల్లకు మద్దతుగా చేసిన ట్విట్ మాకు కొండంత అండగా అనిపించిందిని సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గతంలో వజ్ర నిక్షేపాలు రాబర్ట్ వాద్రాకు కేటాయిస్తే సీఎం కేసీఆర్‌తో కలిసి తామంతా ముక్తకంఠంతో ఖండించినట్లు ఆయన గుర్తుచేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇంత మంది అండగా ఉంటూ నాకు మరింత ధైర్యం ఇచ్చారన్నారు. నల్లమల్ల యూరేనియం తవ్వకాలపై కేసీఆర్ స్పందించటం లేదు అనటం పూర్తి అవాస్తవమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘టీఆర్ఎస్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకునే నైజం మాది కాదు. ఉద్యమం చేసి తెలంగాణ సాధించాం. పోరాటం చేసే శక్తి మాకుంది. నల్లమల్లపై కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రధానమంత్రి స్వయంగా పులుల దినోత్సవం రోజు అమ్రాబాద్‌లో పులుల సంఖ్యను చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద పులులు ఉన్న అడవిగా ఆమ్రాబాద్‌కు పేరుంది. అడవులు కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ అటవిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. యురేనియంపై నేను ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తా. సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు తీసుకొని మరో ఉద్యమానికి స్వీకారం చూడతాం. నా నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉన్న మీడియా,సామాజిక కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించారు. -
మాజీ మంత్రికి క్షమాపణలు చెప్పిన అనసూయ
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్లో సేవ్ నల్లమల ఫారెస్ట్ అని ట్రెండ్ అవుతోంది. హీరోలు, హీరోయిన్లు అందరూ దీనిపై స్పందిస్తున్నారు. పనిలో పనిగా అన్నట్లు అనసూయ భరద్వాజ్ కూడా ఓ ట్వీట్ చేసింది. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. తనకు కరెంట్ అఫైర్స్ పట్టు లేనందున ఓ తప్పు దొర్లింది. ఆ ట్వీట్‌ను అటవీ శాఖమంత్రి జోగు రామన్న అంటూ ట్యాగ్ చేసింది. అయితే అది గత ప్రభుత్వంలో అన్న విషయం ఆమెకు కాస్త లేట్‌గా తెలిసి వచ్చింది. దీంతో మరో ట్వీట్‌ను చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు క్షమాపణలు తెలిపింది. తనకు కరెంట్ అఫైర్స్ మీద అంత అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పి ప్రస్తుత అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ట్యాగ్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సేవ్ నల్లమల ఫారెస్ట్ అనే ఉద్యమం మంచి ఊపందుకుంటోంది. నల్లమల అడవిలో యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా ఇప్పటికే విజయ్ దేవరకొండ, సమంతలాంటి ప్రముఖులు స్పందిస్తూ.. ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు. Apologies for wrong tag Shri @JoguRamannaTRS .. Never thought I would one day feel the need so forgive my lack of knowledge on current affairs..Sir .. this is to address you Shri @IKReddyAllola Please consider my intention and not any other diversion🙏🏻🙏🏻 https://t.co/n8YFsd8lKS — Anasuya Bharadwaj (@anusuyakhasba) September 12, 2019 -
‘యురేనియం’తో మానవ మనుగడకు ప్రమాదం
సాక్షి, షాద్‌నగర్: నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిగితే వన్యప్రాణులతో పాటుగా మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని సామాజిక ఉద్యమకారిణి, సీనియర్ పాత్రికేయురాలు సజయ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలను ఎందుకు వ్యతిరేకించాలనే అంశంపై పట్టణంలోని పెన్షనర్ భవనంలో గురువారం ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజయ హాజరై మాట్లాడారు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలు జరిపితే ఎంతోమంది ఉపాధిని కోల్పోయి నిరాశ్రయులుగా మారతారన్నారు. కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు కృష్ణానది నీటిని వినియోగించడమే కాకుండా అడవిలో 4వేల బోర్లను తవ్వించేందుకు నిర్ణయించిందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతం బోరు బావులు, కృష్ణానది ప్రాజెక్టులోని నీరు పూర్తిగా కలుషితమయంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియాన్ని వెలికితీసే క్రమంలో నీటితో పాటుగా వాతావరణం కలుషితంగా మారుతుందన్నారు. నల్లమల్ల అడవుల చుట్టూ ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతోపాటు కృష్ణానది నీటిని వినియోగించే ప్రాంతాలు యురేనియంతో ప్రత్యక్ష, పరోక్షంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. యురేనియం వెలికితీసి అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని కేంద్రం చెబుతోందని తెలిపారు. యురేనియం భూమిలో ఉన్నంత వరకు జీవకోటికి ఎలాంటి హాని లేదని, దానిని బయటకు తీసేటప్పుడు వెలువడే రేడియేషన్ వల్ల భూమి, వాతావరణం, నీళ్లు పూర్తిగా కలుషితమతాయని చెప్పారు. తద్వారా చర్మవ్యాధులు రావడంతో పాటుగా రేడియేషన్ తీవ్రత పెరిగి ప్రజలకు భయానకమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పుట్టబోయే శిశువులు అంగవైకల్యం వస్తుందని, రోగాల బారిన పడతారని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ ప్రశ్నించే గొంతుకగా మారాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలు, పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. యురేనియం వ్యతిరేక పోరాటం తెలంగాణ ఉద్యమ తరహాలో చేపట్టాలని అన్నారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీర్లపల్లి శంకర్, బాల్‌రాజ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, అశోక్, ప్రజాసంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, రవీంద్రనాథ్, తిరుమలయ్య, అర్జునప్ప, చంద్రారెడ్డి, సత్యం, శివారెడ్డి, శ్రీనివాస్, సిద్ధార్థ, కరుణాకర్, రఘు తదితరులు ఉన్నారు. -
నల్లమలలో యురేనియం రగడ
సాక్షి, నాగర్‌కర్నూల్: యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమలలో ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయి. యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ ఓ వైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, రాజకీయ పారీ్టలు, స్థానిక ప్రజలు ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు తవ్వకాలకు సంబంధించిన సన్నాహాలను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ముమ్మరం చేసింది. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో 21 వేల ఎకరాల విస్తీర్ణంలో నమూనాల సేకరణకు కేంద్ర అణుశక్తి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని మొత్తం 83 కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యతలను తెలుసుకునేందుకు అనుమతిం చాలని తెలంగాణ అటవీ శాఖను కోరింది. అందుకనుగుణంగా నాగర్‌కర్నూలు జిల్లా అటవీశాఖ అధికారులు నివేదికలను తయారు చేసినట్లు సమాచారం. అయితే బోర్లు ఎక్కడెక్కడ వేస్తారన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో ముందే బోర్ పాయింట్లను గుర్తించేందుకు జియాలజిస్టులను రంగంలోకి దింపారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా దేవరకొండకు చేరుకున్న 30 మంది జియాలజిస్టులు నేడో, రేపో నాగర్‌కర్నూలు జిల్లా పరి«ధిలోని నల్లమలకు వచ్చే అవకాశం ఉంది. జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం ప్రకృతి సంపద, జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన అటవీ ప్రాంతంలో యురేనియం నమూనాల సేకరణకే 4వేల బోర్లు వేయనుండటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. యురేనియం అన్వేషణకు నాగర్‌కర్నూలు జిల్లా ఉడిమిల్ల, పదర, నల్లగొండ జిల్లా అటవీ డివిజన్లోని నారాయణ పురం నల్లమల పెద్ద పులుల రక్షిత ప్రాంతంలో 4 వేల బోర్లు వేస్తామని ఏఎండీ పేర్కొంది. బోర్ల తవ్వకాలు, వాహనాల శబ్దాలు, జన సంచారంతో నల్లమల అటవీ ప్రాంతానికి, పెద్ద పులులతో సహా వన్యప్రాణులకు తీవ్ర నష్టం జరుగనుందనే ఆం దోళన వ్యక్తం అవుతుంది. యురేనియం తవ్వకాలు జరిగే ప్రదేశంలో వెలువడే కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. యురేనియం శుద్ధికి కృష్ణా జలాలను వినియోగిస్తే మత్స్య సంపద నాశనమవుతుందని పర్యావరణ వేత్తలంటున్నారు. అలాగే హైదరాబాద్ వాసులకు మంచి నీరు బదులు విషపు నీరు సరఫరా అవుతుందని, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, నల్లగొండతో పాటు ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు దెబ్బతింటాయని వెల్లడిస్తున్నారు. వ్యతిరేక ఉద్యమాలు ఉధృతం.. నల్లమలలో 112 చెంచుపెంటల్లో దాదాపు 12 వేల మంది చెంచులు నివసిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల అడవిని నమ్ముకొని జీవిస్తున్న చెంచులు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచి్చంది. సుమారు 70 రకాల వన్యప్రాణులకు కూడా ముప్పు కలగనుంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని దాదాపు 18 గ్రామ పంచాయతీలు ప్రమాదంలో పడనున్నాయి. దీంతో యురేనియం తవ్వకాల వల్ల ఆ చెంచు జాతిని మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలపై ప్రజా సంఘాలు, పారీ్టలు పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. యురేనియంను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఉద్యమానికి సిద్ధం కావడం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా యురేనియం తవ్వకాలను జరపొద్దంటూ ప్రకటించడం, కోదండరాం, రేవంత్‌రెడ్డి ఇప్పటికే నల్లమలలో పర్యటించడంతో ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9న నల్లమల బంద్ కూడా విజయవంతమైంది. జిల్లాకు జియాలజిస్టులు రాలేదు యురేనియం తవ్వకాల సర్వే కోసం బోర్పాయింట్లు గుర్తించేందుకు జిల్లాకు జియాలజిస్టులు రాలేదు. కేంద్ర అణుశక్తి సంస్థ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఆమ్రాబాద్, పదర మండలాల పరిధిలో దాదాపు 21 వేల ఎకరాలు భూమి కావాల్సి ఉంటుంది. అందులో 4 వేల బోర్లు వేయనున్నారు. బోర్‌వెల్స్ గుర్తించిన పాయింట్లకు ఏవిధంగా వెళ్లాలి. బోర్ పాయింట్లు ఎక్కడనేది స్పష్టత వస్తే ప్రభావంపై అంచనా వేస్తాం. ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు పంపలేదు. – జోజి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ -
గో బ్యాక్ నినాదాలు.. పోలీసుల రంగ ప్రవేశం
-
దేవరకొండలో ఉద్రిక్తత
సాక్షి, నల్గొండ: నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాల్లో భాగంగా సర్వే కోసం వచ్చిన అధికారులకు దేవరకొండ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో పర్యటించేందుకు సోమవారం రాత్రి ఇక్కడి చేరుకున్న 30 మంది అధికారులు దేవరకొండ సమీపంలోని ఓ లాడ్జ్‌లో బస చేశారు. మంగళవారం ఉదయం అడవిలోకి వెళ్లేందుకు బయటకు వచ్చన వారిని విద్యావంతుల వేదిక నాయకులు అడ్డుకున్నారు. నల్లమల్లకు వెళ్లొదంటూ తీవ్రంగా ప్రతిఘటించారు. గో బ్యాక్ అంటూ నినాదాలతో దేవరకొండ సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి. విషయం తెలుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా కృష్ణానది తీర ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో యురేనియం ఖనిజం తవ్వకాలు జరపాలని, అపారమైన నిల్వలు వెలికితీసి ఖర్మాగారాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రదేశమంతా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయతీరాలలోనే ఉండటంతో ఆయా ప్రాంతాలలోని నివాసితులంతా యురేనియం నిల్వలు వెలికి తీసేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేవరకొండకు చేరుకున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. నల్లమల్లలో ప్రవేశిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
‘ప్రభుత్వం నల్లమల అడవుల్ని కాపాడాలి’
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై గళమెత్తుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ విషయంపై స్పందించారు. ‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యవారణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని ట్వీట్ చేశారు. #savenallamala pic.twitter.com/ytsPoP2kuL — Sekhar Kammula (@sekharkammula) August 27, 2019 -
రైలు ఢీకొని పెద్దపులి మృతి
-
కరువు రక్కసి@బొల్లాపల్లి తండాలు
సాక్షి , బొల్లాపల్లి(గుంటూరు) : బొల్లాపల్లి మండల తండాల్లో పేదరికం విసిరిన బతుకులు వలసదారుల్లో తరలిపోతున్నాయి. పండుగలాంటి పల్లె వాకిట పస్తుల తోరణాలు వేలాడుతున్నాయి. కరువు రక్కసి నోట చిక్కిన ఇళ్లు.. తాళం బుర్రలు కప్పుకుని కన్నీరొలుకుతున్నాయి. వానజాడ లేక, సాగర్ నీళ్లు రాక తడారిన పంట పొలాలు నెర్రెలిచ్చి ఘొల్లుమంటున్నాయి. మెతుకు దొరికే తావు చూపండయ్యా అంటూ ఏకరువు పెడుతున్నాయి. ప్రకాశం జిల్లా సరిహద్దు నల్లమల అటవీ ప్రాంతానికి ముఖ ద్వారంగా ఉన్న బొల్లాపల్లి ప్రాంతం జిల్లాలోనే వెనుకబడినదిగా గుర్తింపు పొందింది. ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరమైంది తీవ్ర పంట నష్టం.. మండలంలో సుమారు 12 వేలకు పైగా హెక్టార్లలో మాగాణి, మెట్ట భూమి ఉంది. ఇక్కడ చిన్నా.. సన్నకారు రైతులు మిరప, పత్తి, పొగాకు, కంది పంటలు సాగు చేస్తుంటారు. గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావం.. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల నుంచి కూడా నీళ్లు రాకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు ఎండమావులను తలపిస్తున్నాయి. దీనికి తోడు గిట్టుబాటు ధరలు లేకపోవడం కూడా అన్నదాతలను కుంగదీసింది. ఖరీఫ్, రబీ పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. వాణిజ్య పంటలైన మిరప, పత్తి సుమారు 4,500 హెక్టార్లలో సాగు చేస్తే 3,200 హెక్టార్లలో, పత్తి 3 వేల హెక్టార్లలో సాగుచేస్తే 2,700 హెక్టార్లలో దెబ్బతింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు, రైతు కూలీలు పొట్ట చేతపట్టుకొని సొంత గ్రామాన్ని, పొలాలను వదిలి వేరే ప్రాంతాలకు వలసబాట పట్టారు. గొంతు తడవని పరిస్థితి ప్రస్తుతం మండల గ్రామాలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రేమిడిచర్ల, రావులాపురం, గండిగనుమల, దొమల గుండం, గుమ్మనంపాడు, గరికపాడు, పమిడిపాడు, జయంతిరామపురం, మర్రిపాలెం, బండ్లమోటు, అయ్యన్నపాలెం, గుట్లపల్లి పంచాయతీల్లో తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. బోర్లు అడుగంటడంతో.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మారుమూల తండాల్లోని ప్రజలు ట్యాంకులు వచ్చేంత వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. గతంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వాటర్ గ్రిడ్ పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామీ గుప్పించారు. ఆ తర్వాత దానిని విస్మరించారు. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి కష్టాలు మరింత పెరగనున్నాయి. ఇంకా పూరి గుడిసెల్లోనే! ప్రభుత్వం అందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేశామంటూ ఊదరగొతుంది. కానీ, మండలంలోని మారు మూల తండాల్లో ప్రజలు చాలా వరకు పూరిగుడెసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. కొంత మంది ప్రభుత్వం మాట నమ్మి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఉన్న ఇంటిని తొలగించి దాని స్థానంలో కొత్త ఇంటి నిర్మాణానికి పునాదులు వేశారు. అంతే నిధులు మంజూరు కాకపోవడంతో ఆ నిర్మాణాలు అక్కడితోనే నిలిచిపోయాయి. కరువుకు తార్కాణం మండలంలో నల్లమలకు ఆనుకుని 30కి పైగా గిరిజన తండాలున్నాయి. కరువు రక్కసి ధాటికి విలవిల్లాడుతున్నాయి. మన్నేపల్లితండా, గండిగనుమలపైతండా, దొమల గుండం తండా చక్రాయపాలెం, గంగుపల్లి తండా, లింగంగుంట తండా, చెంచుకుంట తండాల నుంచి సుమారు 2 వేల కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వలస బాటపట్టాయి. అయినా ప్రభుత్వం కరువు పరిస్థితిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బండ్లమోటు వద్ద 1969లో ఏర్పాటు చేసిన హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ మైనింగ్ 2002లో మూతపడింది. ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగించిన 1500 కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఆ తర్వాత సరైన ఉపాధి లభించక వేరే వేరే ప్రాంతాలకు వలసబాట పట్టాయి. ఎప్పటికైనా ఆశ తీరకపోతుందా అని.. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని నాలుగు మండలాల కరువు నియంత్రణకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలో దొమ్మర్లగొంది ప్రాజెక్టు పూర్తి చేస్తే చెరువులు నిండి కరువు చాయలు దరిచేరవని ఈ ప్రాంత వాసుల ఆశ. గుంటూరు జిల్లా వెల్దుర్తితో పాటు దుర్గి, బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలాలకు తాగునీటితో పాటు సాగు నీరందిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. చెరువులు నిండటం వలన భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది. వైద్యం దైన్యం.. విద్య దూరం ఎస్టీ, ఎస్సీ, బీసీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో విద్య, వైద్య ఖర్చులు సైతం భరించలేని దయనీయ స్థితిలో ప్రజలున్నారు. పదో తరగతి తర్వాత పై స్థాయి విద్యకు విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కేవలం రెండు బాలుర గిరిజన వసతి గృహాలు మాత్రమే ఉన్నాయి. బాలికా విద్యకు సరైన పోత్సాహం లేదు. వెనుకబడిన ప్రాంతంలో కనీసం ఇంటర్‌పై స్థాయితో పాటు సాంకేతిక కళాశాలలు ఏర్పాటు చేస్తే బాలికల విద్యాశాతంపెరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆశ్రమ పాఠశాల మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. మండల కేంద్రంలో పేరుకే 24 గంటల ఆరు పడకల ఆస్పత్రి ఉంది. గతేడాది వరకు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం చేపట్టలేదు. ప్రస్తుతం వైద్యులు ఉన్నా..సమయానికి అందుబాటులో ఉండని దుస్థితి. ఐదేళ్ల కిందట నిర్మించిన వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేటికీ వైద్యులులేరు. గతంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో పాటు అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సీహెచ్‌సీని ప్రారంభించి వదిలేశారు. అంతా మోసం.. మండలాభివృద్ధికి కేటాయించిన నిధులను టీడీపీ నాయకులు పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. అదే విధంగా కరువు మండలం కింద నిధుల మంజూరైతే వాటిని వేరే మండలానికి మళ్లించారు. పంచాయతీ నిధులను తాగునీటికి వెచ్చించాలని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సుమారు రూ 1.50 కోట్లను ఆయా పంచాయతీల్లో సిమెంట్ రోడ్లుకు కేటాయించి, ఆ పనుల్లోనూ చేతివాటం చూపించారు. నీరు– చెట్టు కింద సుమారు రూ 3.50 కోట్లు చెరువు పూడిక తీత, చెక్ డ్వామ్ల నిర్మాణాల పేరుతో జేబుల్లో వేసుకున్నారు. ఇదంతా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల అండదండలతో కింది స్థాయి టీడీపీ నాయకులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అధ్వానంగా రవాణా సౌకర్యం గ్రామాలను కలుపుతూ ఉండే లింకు రోడ్లు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. కనుమల చెర్వు పంచాయతీ శివారు నెహ్రునగర్ తండాకు వెళ్లాలంటే అటవీ మార్గంలో సుమారు 5 కిలోమీటర్లు వెళ్లాలి. అయితే నాగార్జునసాగర్ కుడి కాలువ పై బ్రిడ్జి నిర్మిస్తే ఆ ప్రాంతాన్ని చేరుకోవడం సులభమవుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి పలుసార్లు శంకుస్థాపనలు చేశారు గానీ, పనులు మొదలుపెట్టలేదు. నిమ్మలసుబ్బయ్య కుంట తండాకు రోడ్డు సౌకర్యం లేదు. బస్సులు రావు, అత్యవసర సమయాల్లో నానా ఇబ్బందులు పడాలి. పంచాయతీ కేంద్రం గుమ్మనంపాడుకు అటవీ ప్రాంతం నుంచి 7 కిలోమీటర్లు దూరం నడవాలి. పంచాయతీలు : 23 జనాభా : 58 వేలు వలస కుటుంబాలు : 2 వేలు గిరిజన తండాలు : 30 సాగు భూమి : 12వేల హెక్టార్లు అటవీ ప్రాంతం : 33వేల చదరపు హెక్టార్లు