భారతదేశ సంపద యువతే
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి
కరీంనగర్, న్యూస్‌లైన్ : యుువతే భారతదేశ సంపద అని, దేశ ఔన్నత్యాన్ని మరింత పెంచేందుకు నేటి యువతకు జ్ఞానం, శీలం, ఏకత అవసరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. కరీంనగర్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో భాగంగా బుధవారం ‘జనమంచి గౌరీశంకర్ యువ పురస్కార్’ అవార్డు ప్రదానోత్సవం చేశారు. ఉత్తమ సేవలందించినందుకు మహబూబ్‌నగర్ జిల్లా మునగ్రాల వాసి, డాక్టర్ రాజశేఖర్‌కు ఈ అవార్డు అందించారు. ఈ కార్యక్రవూనికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, చైన్ స్నాచింగ్ కేసుల్లో అత్యధికులు ఇంజనీరింగ్ అభ్యసించిన వారున్నారంటే మన బోధన ఏ వైపు నడిపిస్తోందో చర్చించాలన్నారు.