'ఆమెను అమ్మకు చూపించాను'
అచ్చం బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా పోలికలతో ఓ భామ సోషల్ మీడియాలో పాపులర్ అయిన విషయం తెలిసిందే. కెనడాలోని వాంకోవర్‌లో ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న నవ్ ప్రీత్ బంగా.. పిగ్గీ చాప్స్ పోలికలతో ఇటీవల బాగా ఫేమస్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, యూట్యూబ్‌లోని ఆమె చానెల్‌ను చాలామంది అభిమానులే అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అప్ లోడ్ చేస్తూ యమా క్రేజ్ తెచ్చుకుంటోంది.
నవ్ ప్రీత్ హల్ చల్ అంతా ప్రియాంక చెవిన పడనే పడింది. స్పోర్టివ్‌గా తీసుకున్న ప్రియాంక వెంటనే ఆ అమ్మాయి ఫొటోలను తను చూడటమే కాకుండా.. తన తల్లికి కూడా చూపించి సరదాగా ఆటపట్టించింది. ఆల్ మోస్ట్ అమ్మను ఫూల్‌ని చేశాను అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపింది. తనలానే మరొకరు కనిపించడం అసాధరణ విషయమంటూ సంభ్రమాశ్చర్యాలను వ్యక్తం చేసింది క్వాంటికో స్టార్ ప్రియాంకా చోప్రా.
Showed this to mom & almost fooled her hahaha! @navpreetbanga,this is uncanny but #MomKnowsBest #Doppelgangerhttps://t.co/B5NuVBZYLH
— PRIYANKA (@priyankachopra) 14 July 2016