New 500
-
కొత్త నోట్ల ప్రింటింగ్ ఖర్చుఎంతో తెలుసా?
న్యూడిల్లీ: నవంబర్ 9 న పెద్దమొత్తంలోచలామణిలోవున్న రూ. 500, 1000 నోట్లను రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ముద్రించిన కొత్త నోట్ల విలువ ఎంతో తెలుసా? ఈ వివరాలను ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. కొత్తగా చెలామణిలోకి తీసుకొచ్చిన రూ.500, రూ.2000 నోట్లను ముద్రణ ఖర్చు వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలియ చేశారు. రాజ్యసభలో లిఖిత పూర్వకంగా ఈ వివరాలను ఆయన వెల్లడించారు. రూ.500 నోటు ప్రింట్ చేసేందుకు రూ.2.87 నుంచి రూ.3.09, రూ.2000 నోటు ముద్రణకు రూ.3.54 నుంచి రూ.3.77 మేర వెచ్చిస్తున్నట్లు రాజ్యసభలో మేఘవాల్ తెలిపారు. కొత్త నోట్ల ప్రింటింగ్ ఇంకా కొనసాగుతున్నకారణంగా పూర్తి ఖర్చు వివరాలను ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త కరెన్సీ నోట్లను ముద్రించే పేపర్ ను కొనుగోలు రిజర్వు బ్యాంకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. నిర్దిష్ట సరఫరాదారులకు తప్ప ఇతరులు అనుమతి లేదని, ఈ వివరాలను ఎవరికీ అందించలేమన్నారు.అ లాగే "రహస్యంగా మరియు ప్రత్యేకంగా" అనే నిబంధన ఒప్పందంలో చేర్చినట్టు మంత్రి తెలిపారు. అలాగే ఫిబ్రవరి 24, 2017 నాటికి దేశంలో రూ. 11.64 లక్షల కోట్ల కరెన్సీ చెలామణీలో ఉన్నట్టు వెల్లడించారు. 2016 డిసెంబర్ 10 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత రూ.500, రూ.1000 నోట్లు కరెన్సీ విలువ సుమారు రూ.12.44 లక్షల కోట్లు అని.. దీనిపై ఇంకా పరిశాలన జరుగుతోందని చెప్పారు. కాగా ప్రస్తుతం ఏటీఎం లు సరిగా పనిచేయకపోవడం, కొత్త నోట్ల కొరత కొనసాగుతుండడం పై కూడా ప్రశ్నలు చెలరేగాయి. అయితేదీనిపై స్పందించిన ఆయన. దేశవ్యాప్తంగా 2.18 లక్షల ఏటీఎంలు ఉండగా.. ఈ ఏడాది జనవరి 4 నాటికి 1.98 లక్షల ఏటీఎంల పునరుద్ధరణ జరిగినట్లు సమాధానమిచ్చారు. కొత్త నోట్ల కొరత త్వరలోనే పూర్తిగా తీరిపోనుందని అర్జున్ రామ్ సభలో హామీ ఇవ్వడం విశేషం. -
సర్ప్రైజ్.. ప్రభుత్వ పెద్దలకే తెలియదు!
- విరామం లేకుండా కొత్త నోట్ల ముద్రణ న్యూఢిల్లీ: పాత కరెన్సీ నోట్ల రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది సేపటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీలో కీలక మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతిని రూపుమాపడమే కాక ఆర్థిక స్వావలంబన సాధించేందుకే పాత నోట్లు రద్దుచేసి, కొత్తవాటిని తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. నవంబర్ 10(గురువారం) నుంచి కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ వర్గాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని, క్షణం విశ్రాంతి లేకుండా నోట్లను ముద్రిస్తున్నామని తెలిపారు. పాత నోట్ల రద్దుతో హోల్ సేల్ వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన అన్నారు. సర్ప్రైజ్.. ప్రభుత్వ పెద్దలకే తెలియదు! పాత నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశ్చర్యకరమైన ఈ నిర్ణయం గురించి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్బీఐలోని అతికొద్ది మంది ముఖ్యులకు తప్ప కనీసం ప్రభుత్వ పెద్దలకు కూడా ఏమీ తెలియదని, నోట్ల రద్దు నిర్ణయాన్ని పకడ్బందీగా వెల్లడించాలనే ఉద్దేశంతోనే సమాచారాన్ని గోప్యంగా ఉంచామని శక్తికాంత అన్నారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా పాత నోట్లను సేకరిస్తామన్న ఆర్థిక శాఖ కార్యదర్శి.. ఆమేరకు అవసరమైన ఏర్పాట్లపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామన్నారు. బుధవారం బ్యాంకులు మూసివేస్తామని, గురువారం నుంచి కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకూ హెల్ప్ లైన్స్ ఏర్పాటుచేశామని, సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు. -
నోట్ల రద్దు.. ప్రభుత్వ పెద్దలకే తెలియదు!