no evidence
-
నిరాధార ఆరోపణలు... అనవసర ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అడ్డగోలు ఆరోపణలు చేసిన కెనడా తీరును భారత్ మరోసారి తూర్పారబట్టింది. ఈ విషయమై ఏ ఆధారాలూ లేకున్నా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాధ్యతారహితంగా చేసిన తీవ్ర ఆరోపణలే ఇరు దేశాల మధ్య తాజా దౌత్య వివాదానికి ఆజ్యం పోశాయంటూ ఆక్షేపించింది. నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్లున్నారన్న తన ఆరోపణలకు నిఘా సమాచారమే ఆధారం తప్ప దాన్ని నిరూపించేందుకు ఎలాంటి రుజువులూ తమ వద్ద లేవని ట్రూడో బుధవారం స్వయంగా అంగీకరించడం తెలిసిందే. భారత్‌పై ఆయన ఆరోపణల్లో పస ఎంతో దీన్నిబట్టే అర్థమవుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. నిజ్జర్ ఉదంతానికి సంబంధించి కెనడా తమకు ఇప్పటిదాకా ఎలాంటి రుజువులూ ఇవ్వలేదని భారత్ పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందేది.దొంగ ఏడ్పులు...నిజ్జర్ హత్య వెనక కూడా బిష్ణోయ్ గ్యాంగే ఉందని కెనడా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత్‌లో అరాచకాలకు పాల్పడుతున్న ఆ గ్యాంగ్‌కు చెందిన పలువురు సభ్యులను అరెస్టు చేసి అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా స్పందనే లేదని జైస్వాల్ స్పష్టం చేశారు. ‘‘కెనడా గడ్డపై ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ శక్తుల్లో గుర్జీత్‌సింగ్, గుర్జీందర్‌సింగ్, అర్‡్షదీప్‌సింగ్ గిల్, లఖ్బీర్సింగ్ లండా, గుర్‌ప్రీత్‌సింగ్ తదితరుల పేర్లను ట్రూడో సర్కారుకు ఎప్పుడో ఇచ్చాం. వీరిలో పలువురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులూ ఉన్నారు. వీరంతా ఉగ్రవాదం తదితర తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. వీరిని అప్పగించాల్సిందిగా ఏళ్ల క్రితమే కోరాం. తాజాగా ఇటీవల కూడా విజ్ఞప్తి చేశాం. కానీ కనీస స్పందన లేదు’’ అని వివరించారు. ‘‘ఇలాంటి కనీసం 26 విజ్ఞప్తులు కెనడా వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. భారత భద్రత కోణం నుంచి చూస్తే ఇది చాలా తీవ్రమైన అంశం’’ అని వివరించారు. ‘‘వారిపై కనీసం గట్టి చర్యలైనా తీసుకోవాలని భారత్ ఎన్నిసార్లు కోరినా ట్రూడో సర్కారు పెడచెవిన పెడూతూ వస్తోంది. వారి రెచ్చగొట్టే ప్రసంగాలను భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చూసీ చూడనట్టు వదిలేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘ఓవైపేమో భారత్ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారిని ఉద్దేశపూర్వకంగానే పట్టుకోవడం లేదు. మరోవైపు అదే బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు భారత ఆదేశాల మేరకు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడుస్తోంది’’ అంటూ జైస్వాల్ నిప్పులు చెరిగారు. ట్రూడో సర్కారు తాలూకు ఈ ప్రవర్తన కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని ఆయన స్పష్టం చేశారు. మరో ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. -
మళ్లీ ‘నీట్’కు ఆదేశించలేం: సుప్రీం
న్యూఢిల్లీ: నీట్–యూజీ 2024 పరీక్ష సమగ్రతకే తూట్లు పొడిచేంతటి భారీ స్థాయిలో వ్యవస్థీకృత లీకేజీ జరిగినట్టు ఇప్పటికైతే ఎలాంటి రుజువులూ లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆదేశించలేమని స్పష్టం చేసింది. సీజేఐ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్డీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున సీజేఐ 63 పేజీల తీర్పు రాశారు. ‘‘సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటివాది ద్వారా ప్రశ్నపత్రాన్ని విస్తృతంగా లీక్ చేశారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. లీకేజీ ప్రధానంగా పటా్న, హజారీబాగ్ ప్రాంతాలకే పరిమితమైనట్టు తేలింది. తద్వారా లబ్ధి పొందిన విద్యార్థులను గుర్తించడం కష్టమేమీ కాదు. వారెంత మందో సీబీఐ దర్యాప్తు ఇప్పటికే తేలి్చంది. కనుక మళ్లీ పరీక్ష నిర్వహించడం అనవసరం. పైగా దానివల్ల ఈ దశలో విద్యా సంవత్సరం దెబ్బ తింటుంది’’ అని పేర్కొన్నారు. ఎన్టీఏకి తలంటిన సీజేఐనీట్–యూజీ వంటి కీలక పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవహరించిన తీరు దారుణమని సీజేఐ దుయ్యబట్టారు. ముందు తప్పుడు నిర్ణయాలు తీసుకుని తర్వాత దిద్దుబాటుకు దిగడం దారుణమన్నారు. ‘‘లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ బృహత్తర కార్యక్రమమే. అందుకు భారీ వనరులు, సమన్వయం, ప్రణాళిక అవసరం. మేమేమీ కాదనడం లేదు. కానీ ఎన్టీఏ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది అందుకే కదా! ఈసారి జరిగిన తప్పిదాలను నివారించేందుకు కావాల్సినన్ని నిధులు, సమయం ఎన్టీఏకు అందుబాటులో ఉన్నాయి. కనుక ఒకే కేంద్రంలో భారీ సంఖ్యలో అభ్యర్థులను అనుమతించడం వంటివి లీకేజీకి కారణాలని చెప్పడం కుదరదు. పైగా హజారీబాగ్ పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యమూ చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూం వెనక తలుపు తెరిచి అనధికార వ్యక్తులు ప్రశ్నపత్రాలను చేజిక్కించుకున్నారు. వాటిని ఇ–రిక్షాల్లో తరలించుకుపోయి అభ్యర్థల చేతిలో పెట్టారు. ఫలితంగానే 67 మందికి నూరు వాతం మార్కులొచ్చాయి. అనుమానితులైన 1,563 మందికి తిరిగి పరీక్ష పెడితే ఆ సంఖ్య అంతిమంగా 17కు తగ్గింది. అది కూడా అభ్యర్థుల ఆక్రందనలు, మీడియా రిపోర్టులు, కోర్టు జోక్యం అనంతరం! ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండానే ప్రజలు విశ్వసించేలా పనితీరు ఉండాలి. ఇకనైనా మరింత జాగరూకంగా ఉండండి’’ అంటూ ఎన్టీఏను మందలించారు. తీర్పులో పేర్కొన్న అన్ని అంశాలపైనా దృష్టి పెట్టి ఇకపై పరీక్షల నిర్వహణ పూర్తిగా దోషరహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు సిఫార్సు చేసే విషయంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలని రాధాకృష్ణన్ ప్యానెల్‌ను సీజేఐ నిర్దేశించారు. అభ్యర్థుల గుర్తింపు నిర్ధారణ పద్ధతిని లోపరహితం చేయడం, పరీక్షల నిర్వహణ, ప్రక్రియ తాలూకు భద్రత, డేటా సెక్యూరిటీ తదితరాలపైనా సిఫార్సులు చేయాలని నిర్దేశించారు. -
Hyderabad: సాక్ష్యాలు లేక క్లోజవుతున్న కేసులు.. 2021లో ఎన్నో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నేరం జరిగింది... ఫిర్యాదు అందింది... కేసు నమోదైంది... అయితే నిందితుడిని పట్టుకోవడానికి అవసరమైన సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నగరంలో అనేక కేసులు మూతపడుతున్నాయి. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 23.66 శాతం కేసులు 2021లో క్లోజ్ అయ్యాయి. నగర కమిషనరేట్ పరిధిలో గత ఏడాది మొత్తమ్మీద 20,142 కేసులు నమోదు కాగా... వీటిలో 4,766 ఈ కారణంగానే మూతపడ్డాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణాన్నే పోలీసు పరిభాషలో ‘ట్రూ బట్ ఇన్సఫీయంట్ ఎవిడెన్స్/అన్ ట్రేస్డ్/నో క్లూ’ అంటారు. ‘ఇలా మూతపడిన కేసులన్నీ గతేడాదికే సంబంధించినవి కాకపోవచ్చు. అంతకు ముందు సంవత్సరాల్లో రిజిస్టరైనవి కూడా ఉండి ఉంటాయి’ అని నగరానికి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రెండు చట్టాల కింద కేసులు.. ► సాధారణంగా పోలీసులు రెండు రకాలైన చట్టాల కింద కేసులు నమోదు చేస్తుంటారు. మొదటిని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అయితే... రెండోది ఎస్ఎల్ఎల్గా పిలిచే స్థానిక చట్టాలు. 2021కి సంబంధించి సిటీలో ఐపీసీ కేసులు 17,951, ఎస్ఎల్ఎల్ కేసులు 2191 నమోదయ్యాయి. వీటిలో 4034, 723 కేసులు ఇలా క్లోజ్ అయినవే. ► మహిళలపై జరిగే నేరాలకు ఇతర కేసుల కంటే ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ కేటగిరీకి చెందిన కేసులూ ఆధారాలు లేక క్లోజ్ అయిపోతున్నాయి. క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్‌కి సంబంధించి గతేడాది మొత్తం 2755 కేసులు నమోదు కాగా వీటిలో 598 ఇలానే మూతపడ్డాయి. చిన్నారులపై జరిగిన నేరాలు కేసులు 621 రిజిస్టర్ కాగా... 89 ఇలా క్లోజ్ అయ్యాయి. వృద్ధులపై జరిగిన నేరాల సంఖ్య 314గా, మూతపడినవి 101గా ఉన్నాయి. ► షెడ్యూల్డ్ కులాలపై జరిగిన నేరాలకు సంబధించి 104 కేసులు నమోదు కాగా వీటిలో 34 ఆధారాలు లేక క్లోజ్ అయ్యాయి. షెడ్యూల్ తెగలకు సంబంధించి 28 నమోదు కాగా, 8 ఇలానే మూతపడ్డాయి. ఆర్థిక నేరాల కేసులు 4860 కాగా 1479 ఆధారాలు లభించక మూతపడ్డాయి. సైబర్ నేరాల విషయానికి వస్తే నమోదైన కేసులు 3303, ఇలా మూతపడినవి 1873గా ఉన్నాయి. నగరంలోనే ఎక్కువ.. ► ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకుని, దాడికి పాల్పడిన ఉదంతాలు 2021లో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య హైదరాబాద్ 20గా ఉండగా... ముంబై 10, ఢిల్లీ 8, బెంగళూరు 7 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ప్రవర్తించడం వంటి ఉదంతాలకు సంబంధించిన కేసుల విషయంలోనూ సిటీ మొదటి స్థానంలో ఉంది. ఈ కేటగిరీకి చెందిన కేసులు నగరంలో 28 రిజిస్టర్ కాగా... ఢిల్లీ 17, కోల్‌కతా 13, బెంగళూరు 10, ముంబై 5 నమోదయ్యాయి. ► వివిధ రకాలైన మోసాలతో కూడిన ఫ్రాడ్స్ కేటగిరీ కేసుల నమోదులోనూ హైదరాబాద్ కమిషనరేట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఈ కేటగిరీలకు చెందిన 2771 కేసులు నమోదయ్యాయి. ఇతర మెట్రో నగరాలైన జైపూర్, ఢిల్లీ, జైపూర్, ముంబై, బెంగళూరుల్లో వీటి సంఖ్య 1488, 1414, 970, 362గా ఉంది. (క్లిక్: హైదరాబాద్‌లో మరో నేతపై పీడీ యాక్ట్) -
Drug Case: షారూక్ కొడుక్కు క్లీన్చిట్
ముంబై/న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్చిట్ లభించింది. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీటు సమర్పించింది. ఆర్యన్, మరో ఐదుగురి పేర్లను అందులో ప్రస్తావించలేదు. సంజయ్‌కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపి 14 మందిపై ఎన్డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి కోర్టుకు సమర్పించింది. ‘‘ఆర్యన్‌కు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలేవీ దొరకలేదు. దాంతో అతన్ని, మరో ఐదుగురిని చార్జిషీటు నుంచి మినహాయించాం’’ అని ఎన్సీబీ చీఫ్ ఎస్.ఎన్.ప్రధాన్ చెప్పారు. ఆర్యన్, మొహక్ల దగ్గర డ్రగ్స్ లభించలేదన్నారు. సత్యమే గెలిచిందని ఆర్యన్ తరఫున వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు. ఎన్సీబీ తన తప్పిదాన్ని అంగీకరించిందని చెప్పారు. ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) హర్షం వ్యక్తం చేసింది. ఆర్యన్ అనుభవించిన మనస్తాపానికి ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్‌గా కేసులో ప్రాథమిక విచారణ చేసిన సమీర్ వాంఖెడే బాధ్యత వహించాలంది. తప్పుల తడకగా విచారణ జరిపినందుకు వాంఖెడేపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఏం జరిగింది..? ముంబై నుంచి గోవా వెళ్తున్న ఓడలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో 2021 అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు చేసిన దాడుల్లో ఆర్యన్‌ఖాన్ దొరికిపోయాడు. ఆర్యన్‌తో పాటు మొత్తం 8 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో లింకులున్నాయని ఎన్సీబీ వాదించడంతో ఆర్యన్, అర్బాజ్, దమేచాలను కోర్టు రిమాండ్‌కు అప్పగించింది. ఆర్యన్‌ను జైల్లో పెట్టారు. 22 రోజుల తర్వాత వారికి బెయిల్ దొరికింది. కేసు వీగింది ఇందుకే... ► ముంబై క్రూయిజ్‌లో ఆర్యన్‌ను అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఎలాంటి మాదకద్రవ్యాలూ దొరకలేదు. పడవలో అరెస్టు చేసిన ఇతర నిందితుల వద్ద లభించిన డ్రగ్స్‌నే అరెస్టు చేసిన వారందరి దగ్గర నుంచి గంపగుత్తగా లభించినట్టు చూపారు. ఇది ఎన్డీపీఎస్ నిబంధనలకు విరుద్ధం. ► ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించడానికి వైద్య పరీక్షలేవీ చేయలేదు. ► పడవలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడి చేశామంటున్న ఎన్సీబీ వీడియో ఫుటేజ్ సమర్పించలేదు. ► ఆర్యన్ ఫోన్ చాటింగ్స్ ఈ కేసుకు సంబంధించినవి కావు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో అతనికి లింకులున్నట్టు వాటిలో ఆధారాలేవీ లేవు. ► ఎన్సీబీ సాక్షులు విచారణలో ఎదురు తిరిగారు. అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఒకరు, ఆ సమయంలో తాము ఆ పరిసరాల్లోనే లేమని మరో ఇద్దరు చెప్పారు. -
వంగవీటి రాధాకు ఎలాంటి ముప్పూ లేదు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వంగవీటి రాధాకు ఎలాంటి ముప్పూలేదని, ఆయన భద్రతపై ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ నగర పోలీసు క మిషనర్ టి.కె.రాణా స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాణా మా ట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉంద ని బహిరంగ వేదికపై రాధా చేసిన ప్ర కటనపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేశా మన్నారు. రాధా ప్రకటనతో పోలీస్ విచారణతో సంబంధం లేకుండా ప్రభుత్వం తక్షణమే గన్‌మెన్‌ను ఏర్పా టు చేసిందని చెప్పారు. అప్పటి నుంచి పోలీస్‌శాఖతో పాటు, మల్టిపు ల్ ఏజెన్సీల ద్వారా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశామన్నారు. ఆయన ఇంటి పరిసరాలు, నగరంలోని అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు చెప్పారు. రెక్కీపై నిర్దిష్టమైన ఆధారా లు లేవని తెలిపారు. ఆయన్ని ఇబ్బం దులు పెట్టేలా ఎవరూ ప్రయత్నిం చలేదని, ఆయన ఇంటి వద్ద ఎవరూ రెక్కీ నిర్వహించలేదని వెల్లడైందన్నా రు. అయినప్పటికీ అన్ని కోణాల్లో ఇంకా విచారణ సాగిస్తున్నామని తెలి పారు. దీనిపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని కో రారు. ఈ ఘటనపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు పోలీస్ శాఖపై చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఎలాంటి నేరపూరిత ఘటన జరగని ఈ ప్రకటనపై జీరో ఎఫ్ఐఆర్ నమో దు చేసేందుకు ఆస్కారం లేదని చె ప్పారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. దీనికి భంగం కలిగించొద్దని కోరారు. -
బూస్టర్ డోసు అవసరం లేదు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి బూస్టర్ డోసు కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్న వాదన ఇటీవల గట్టిగా వినిపిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి నియంత్రణకు బూస్టర్ డోసు అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డాక్టర్ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. దేశంలో అర్హులైన వారందరికీ కరోనా టీకా రెండో డోసు పంపిణీని పూర్తి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచమంతటా అర్హులకు కరోనా వ్యాక్సిన్ అందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా విభాగం(ఎన్టీఏజీఐ) త్వరలో భేటీ కానుంది. బూస్టర్ డోసుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. బూస్టర్ డోసు అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవలే స్పందించారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా రెండు డోసులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అది నెరవేరాక బూస్టర్ డోసుపై నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బూస్టర్ డోసు ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్, నిపుణుల బృందం సూచిస్తే కచ్చితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అధికార వర్గాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. భారత్‌లో అర్హులైనవారిలో ఇప్పటివరకు 82 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. 43 శాతం రెండో డోసు కూడా తీసుకున్నారు. గడువు ముగిసినప్పటికీ 12 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఇంకా రెండో డోసు తీసుకోలేదు. ప్రపంచంలో పరిస్థితేంటి? ‘బూస్టర్’ అంటే! కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్స్ తీసుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు మన శరీరంలో వృద్ధి చెందుతాయి. ఇవి వైరస్ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. వ్యాక్సిన్స్ రెండుడోసులు తీసుకొని ఐదారునెలలు గడిచాక వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. వ్యాక్సిన్ ప్రభావశీలత క్రమేపీ తగ్గుతుంది. అప్పుడేం చేయాలి? అదనంగా మరో డోసు... మూడో డోసు (దీన్నే బూస్టర్ డోసు) తీసుకోవాలి. 60 ఏళ్ల పైబడిన వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, స్టెరాయిడ్ల వాడటం మూలంగా రోగనిరోధక తగ్గినవారిని అధిక రిస్కు కలిగిన వారిగా భావించి... పలుదేశాలు మొదట వీరికి బూస్టర్ డోసులను సిఫారసు చేశాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మార్కెట్లు తెరుచుకొని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు యధావిధిగా సాగాలన్నా, ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కాలన్నా... కోవిడ్ నుంచి రక్షణతో జనం స్వేచ్ఛగా విహరించే పరిస్థితినే పలుదేశాలు కోరుకుంటున్నాయి. ఏయే దేశాలు ఇస్తున్నాయంటే... నవంబరు నెలారంభం నాటికే ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు బూస్టర్ డోసులను మొదలుపెట్టేశాయి లేదా ఆరంభించే క్రమంలో ఉన్నాయి. ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ బూస్టర్ డోసులిస్తున్నాయి. ఇజ్రాయెల్, యూకే, ద.కొరియా, టర్కీ, బ్రెజిల్ ఈ జాబితాలో ఉన్నాయి. స్వీడన్, స్పెయిన్ వయోధికులకు మొదలుపెట్టాయి. అమెరికా, కెనడా ఒకట్రెండు రోజుల్లో ఆరంభించనున్నాయి. 12 % బూస్టర్లే అందుబాటులో ఉన్న లెక్కలకు బట్టి చూస్తే ఒక్క నవంబరు 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన డోస్‌లలో 12 శాతం బూస్టర్ డోస్‌లేనట! ప్రతి 100 మంది జనాభాలో అత్యధికులకు బూస్టర్ డోసులు ఇచ్చిన దేశాల జాబితాలో ఇజ్రాయెల్, చిలీ, ఉరుగ్వే ముందున్నాయి. పేద దేశాలకు అన్యాయం చేయొద్దు: డబ్ల్యూహెచ్‌వో బూస్టర్ డోసులు అవసరమనడానికి ఆధారాలు పరిమితంగా, అసంపూర్తిగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంటోంది. ఆధునిక దేశాలు అప్పుడే మూడో డోసులు ఇవ్వడం మొదలపెడితే అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద ఆఫ్రికా దేశాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలకు దారితీస్తుందని డబ్ల్యూహెచ్‌వో డెరెక్టర్ జనరల్ ట్రెడోస్ అథనోమ్ ఘెబ్రెయాసస్ ఈనెల 13న హెచ్చరించారు. కొన్ని దేశాల్లో ప్రతి 100 మందిలో 20లోపు మందికే తొలి డోసు అందిందని, ఆఫ్రికా దేశాల్లోనయితే కేవలం 5 శాతం మందే తొలిడోసును పొందగలిగారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం జనాభాలో 52.6 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందింది. – నేషనల్ డెస్క్, సాక్షి భారత్‌లో.. మనదేశంలో ఇప్పటిదాకా 115 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. రెండు డోసులు తీసుకున్న వారు 38.11 కోట్లు ఉండగా... 37. 45 కోట్ల మంది ఒక్కడోసు (ఈనెల 17 నాటికి కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవియా చెప్పిన ప్రకారం) తీసుకున్నారు. -
ఆర్యన్ కుట్ర చేశారనడానికి ఆధారాల్లేవ్
ముంబై: ముంబైలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ నేరానికి సంబంధించి ముందస్తు కుట్ర పన్నాడనడానికి ప్రాథమిక ఆధారాలు లభించలేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్యన్‌ఖాన్, సహ నిందితులైన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసినప్పుడు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని బాంబే హైకోర్టు శనివారం విడుదల చేసింది. డ్రగ్స్ కేసులో జడ్జి జస్టిస్ ఎన్.డబ్ల్యూ. సాంబ్రే అక్టోబర్ 28న నిందితులందరికీ బెయిల్ మంజూరు ఇచ్చారు. ఆర్యన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో లింకులున్నాయని అతని వాట్సాప్ చాట్ల ద్వారా తెలుస్తోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఆర్యన్ వాట్సాప్ సంభాషణల్లో అభ్యంతరకరమైన అంశాలేవీ లేవని జడ్జి తీర్పులో స్పష్టం చేశారు. అధికారులు రికార్డు చేసిన ఆర్యన్ నేరాంగీకారాన్ని విచారణ కోసమే వినియోగించాలన్నారు. ఎన్డీపీసీ చట్టం కింద అతను నేరం చేశాడని చెప్పలేమని జడ్జి పేర్కొన్నారు. ఆర్యన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని చెప్పడానికి తగిన ఆధారాలులేవని వెల్లడించారు. ఆర్యన్, అర్బాజ్, మున్మున్ కుట్ర చేశారని చెప్పడానికి ఎన్సీబీకి ఆధారాలు లభించలేదని ఆ తీర్పులో వివరించారు. -
శ్మశానవాటికలో మైనర్ బాలిక హత్యాచారం: ఆధారాల్లేవ్!
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఇటీవల 9 ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైన ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు ధ్రువపరిచే ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదని పోలీసులు శుక్రవారం కోర్టుకు తెలిపారు. అయితే, నలుగురు నిందితులకుగాను శ్మశాన వాటికలో పూజారి రాధేశ్యామ్, శ్మశానవాటిక ఉద్యోగి కుల్దీప్ సింగ్ మాత్రం అత్యాచారం చేసి, బాలికను చంపినట్లు వెల్లడించారని కోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. మిగతా ఇద్దరు నిందితులు సలీం అహ్మద్, లక్ష్మీనారాయణ బాలిక మృతదే హాన్ని దహనం చేయడంలో వారికి సహకరించారన్నారు. హత్యకు ముందు రేప్‌నకు గురైనట్లు ఆధారాల్లేవు ‘హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అని నిర్ధారించేందుకు ఏ విధమైన ఆధారాలు లభించలేదు. అందుకే ఈ సమయంలో బాలిక అత్యాచారానికి గురైందీ లేనిదీ స్పష్టంగా చెప్పలేం. ఇలా, ఏ విధమైన ఆధారాలు లేకుండా నిందితులు పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలాలను చట్టం అంగీకరించదు’ అని స్పెషల్ జడ్జి అశుతోష్ కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు. అయితే, కూతురును కోల్పోయిన బాలిక తల్లికి తాత్కాలిక సాయంగా రూ.2.5 లక్షలను అందించాలని ఆయన ఆదేశించారు. పోలీసులు అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరించిన తర్వాత.. చట్ట ప్రకారం అందాల్సిన రూ.10 లక్షల్లో మిగతా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిందితులు నలుగురికీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించారు. బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులు కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే మృతదేహాన్ని దహనం చేసినట్లు ఈ నెల ఒకటో తేదీన ఢిల్లీ పోలీసులు హత్య, అత్యాచారం పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
కరోనా థర్డ్‌వేవ్: అందుకు తగిన ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: కోవిడ్ తర్వాతి వేవ్‌లో చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందనే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని కోవిడ్–19 వర్కింగ్ గ్రూప్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా ప్రకటించారు. ‘దేశంలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ స్ట్రెయిన్స్ ఏవీ కూడా యువతపైనో, చిన్నారులపైనో ప్రత్యేకంగా ప్రభావం చూపేవి కావని డేటా చెబుతోంది. అయితే, ఈ రెండు గ్రూపుల్లో బాధితుల సంఖ్య మాత్రం పెరుగు తోం ది’ అని వివరించారు. దేశంలో థర్డ్ వేవ్ వస్తుందని ఇప్పటికిప్పుడే చెప్పడం సాధ్యం కాదన్నారు. ‘మన దేశంతోపాటు, ఇతర దేశాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే.. తర్వాతి వేవ్‌లోగానీ, రానున్న వారాలు, నెలల్లో గానీ చిన్నారులే ఎక్కువ కోవిడ్ బారిన పడతారని భావించేందుకు ఎటువంటి కారణాలు కనిపించడం లేదు’ అని అరోరా వెల్లడించారు. పీడియాట్రిక్ కోవిడ్ సేవలను మెరుగు పరిచేందుకు అదనపు వనరులను సమకూర్చు కోవాలన్నారు. ‘నవజాత శిశువులు, చిన్నారులు, గర్భిణిలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అవసరమవుతాయి. పదేళ్లలోపు పిల్లలకు తల్లి, తండ్రి, లేదా సంరక్షకులు కావాలి. కోవిడ్ బారిన పడే గర్భిణి నెలలు నిండకుండా ప్రసవించే ప్రమాదముంటుంది. ఈ ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, చికిత్స విధానాలను, ఆస్పత్రుల్లో చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై సూచనలను సిద్ధం చేశాం’ అని ఆయన తెలిపారు. చదవండి: (కరోనా మృతుల ముక్కు, గొంతులో.. 24 గంటల్లో వైరస్ నిర్వీర్యం) -
‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: కంపెనీ టాప్ మేనేజ్మెంట్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంకా ప్రాథమిక ఆధారాలేమీ లభించలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ‘ప్రస్తుతం ప్రాథమిక ఆధారాలేమీ లేవు. గుర్తు తెలియనివారు చేసిన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణల విశ్వనీయత, నిజానిజాల గురించి కంపెనీ వ్యాఖ్యానించే పరిస్థితిలో లేదు‘ అని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీకి (ఎన్ఎస్ఈ) తెలియజేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీని నియమించుకున్నామని, అలాగే అంతర్గతంగా స్వతంత్ర ఆడిటర్ ఎర్న్స్ట్ అండ్ యంగ్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఆరోపణల్లో ప్రస్తావించిన నిర్దిష్ట ప్రక్రియలను సమీక్షించాల్సిందిగా స్వతంత్ర ఆడిటర్‌ను కోరినట్లు ఇన్ఫీ వివరించింది. భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సత్వరం ఇన్ఫోసిస్ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అటు అమెరికాలో కూడా సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజీ (ఎస్ఈసీ) దీనిపై విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణల గురించి ముందుగానే ఎందుకు వెల్లడించలేదన్న దానిపై ఎన్ఎస్ఈ వివరణ కోరిన మీదట.. ఇన్ఫోసిస్ తాజా అంశాలు తెలియజేసింది. సోమవారం ఇన్ఫోసిస్ షేరు 3 శాతం పెరిగి రూ. 709 వద్ద క్లోజయ్యింది. -
మళ్లీ అదే తరహా చోరీ
నిజామాబాద్ రూరల్ : చోరీలు చేయడంలో ఆరితేరిన దొంగలు.. సాక్ష్యాలు దొరకకుండా యత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హబీబ్‌నగర్‌లో శనివారం రాత్రి దొంగతనం చేసిన నిందితులు.. ఇంటికి నిప్పు పెట్టి వెళ్లారు. అదే తరహాలో ఆదివారం రాత్రి నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడిన దుండగులు.. ఇంట్లోని వస్తువులకు నిప్పు పెట్టి పరారయ్యారు. ముబారక్‌నగర్‌కు చెందిన సర్వేశ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. రాత్రి వేళ తాళం పగులగొట్టి లోనికి చొరబడిన దొంగలు.. బీరువాలో దాచిన రూ.10 వేల నగదు, తులం బంగారం అపహరించారు. అనంతరం సాక్ష్యాలు దొరకకుండా ఇంట్లో నిప్పుపెట్టి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ డీఎస్పీ సుదర్శన్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీధర్‌గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కీలక ప్రకటన చేసిన ఐసీసీ
సాక్షి, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించటంతో క్రీడా లోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీనిపై తక్షణ విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. స్పాట్ ఫిక్సింగ్ జరిగిందనటానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఐసీసీ యాంటీ కరప్షన్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ దీనిపై స్పందిస్తూ... ఫిక్సింగ్ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణించాం. మా బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగానే ఈ విచారణ చేపట్టాం. ఈ ఫిక్సింగ్ ఆరోపణలు టీ20 టోర్నీలతో పాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లపై ప్రభావం చూపుతాయి. మా విచారణలో అన్ని అంశాలను పరిగణనలోకి దీనిపై విచారణ చేస్తున్నాం అని ఆయన వివరించారు. కాగా, యాషెస్ సిరీస్ సందర్భంగా పెర్త్ లో వాకా మైదానం వేదికగా గురువారం నుంచి జరగబోయే మూడో టెస్ట్ స్పాట్ ఫిక్సింగ్ అయినట్లు ఆరోపణలు వినిపించాయి. భారత్ కు చెందిన ఇద్దరు బుకీలు ఈ స్కాంలో ఉన్నట్లు బ్రిటీష్ పత్రిక ది సన్ ఆరోపణలు గుప్పించింది. అయితే ఇరు జట్లకు చెందిన సభ్యుల పేర్లు ఆ కథనంలో ప్రస్తావించపోగా.. ఆస్ట్రేలియాకు చెందిన బుకీ గ్రూప్ ‘ది సైలెంట్ మాన్’ భారీ మొత్తానికి ఈ మ్యాచ్‌ను ప్రభావితం చేసేందుకు ప్రణాళిక పన్నిందని ఆ కథనం వివరిచింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంతో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
మాల్యాపై ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేవు
లండన్: వేలకోట్ల రూపాయలు ఎగవేసి విదేశానికి పారిపోయిన లిక్కర్‌కింగ్ విజయ్‌మాల్యాను తిరిగి దేశానికి రప్పించే క్రమంలో లండన్‌లో రెండవ రోజు వాదనలు కొనసాగాయి. లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా మాల్యా పై నగదు బదిలీ అభియోగాలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ వాదించింది. మాల్యా తరపు లాయర్ క్లారా మోంట్‌గోమెరీ మంగళవారం తన వాదనలను వినిపిస్తూ మాల్యాపై ఆరోపణలను సమర్ధించటానికి ఎటువంటి ఆధారం లేదన్నారు. మాల్యా రుణాలు తీసుకుని మోసం చేశారన్న వాదనకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర సరైన సాక్ష్యాలు లేవని ఆమె పేర్కొన్నారు. సీపీఎస్ సమర్పించిన సాక్ష్యం విశ్వసనీయంగా లేదని వాదించారు. ఈ కేసు విచారణలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ భారత ప్రభుత్వం తరఫున వాదిస్తోంది. బుధవారం, శుక్రవారం సెలవు రోజులు కావడంతో తదుపరి విచారణ డిసెంబర్ 14కి వాయిదా పడింది. కాగా వివిధ బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల మోసం, అక్రమ నగదు లావాదేవీల ఆరోపణలు విజయ్ మాల్యాపై ఉండగా గత ఏడాది మార్చిలో దేశం విడిచి లండన్ వెళ్లిపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. -
బెంగళూరులో ఏం జరగలేదా?
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు న్యూఇయర్ వేడుకల్లో మహిళలు, యువతులపై జరిగిన భారీ లైంగిక వేధింపుల ఘటనపై మొన్న ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యలు చేయగా తాజాగా సిటీ పోలీస్ బాస్ ప్రవీణ్ సూద్ వ్యాఖ్యలు చేశారు. అసలు బెంగళూరులో పెద్ద మొత్తంలో లైంగిక వేధింపులు జరిగినట్లు ఆధారాలే లేవని అన్నారు. 30 సెకన్లపాటు జరిగిన దాన్ని మాత్రమే పదేపదే చూపించి హడావుడి చేశారని, దానికి ముందు దానికి వెనుక ఏంజరిగిందో ఎవ్వరికీ తెలియదంటూ సమాధానం ఇచ్చారు. అయినా, దాదాపు కోటి జనాభా ఉండే బెంగళూరులో ఇలాంటివి జరిగి ఉండొచ్చని తర్వాత అన్నారు. ఈ ఘటనను మాస్ మోలెస్టేషన్(పెద్దమొత్తంలో జరిగిన లైంగిక వేధింపులు) అంటూ పిలవడాన్ని తాను ఒప్పుకోనని, మహిళల విషయంలో పెద్ద తప్పు జరిగిందని మాత్రం చెప్పారు. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో పెద్దమొత్తంలో అమ్మాయిలు, మహిళలపై యువకులు లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పలు కథనాలు వచ్చాయి, ఫొటోలు కొన్ని వీడియోలు కూడా ఆ సంఘటనను రుజువు చేశాయి. దీంతో అక్కడి పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారికి మొన్న రాష్ట్ర హోంమంత్రి అండగా నిలవగా తాజాగా సీటీ పోలీస్ చీఫ్ ప్రవీణ్ సూద్ మద్దతిచ్చారు. 'డిసెంబర్ 31న పోలీసులు అక్కడే ఉన్నారు. 20 మీడియాలకు చెందిన ఓబీ వాహనాలు ఎంజీ రోడ్డులోనే ఉన్నాయి. అక్కడి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు జనవరి 1వ తేదిన ఏ ఒక్కరూ రిపోర్టు చేయలేదు. నిజంగా ఏదైనా తప్పు జరిగితే ఈ రోజుల్లో క్షణాల్లో వైరల్‌గా మారుతుంది.. కనీసం ఏ ఒక్కరు కూడా ఆరోజు ఈ విషయాన్ని లేవనెత్తలేదు' అని మీడియాతో అన్నారు. అంటే ఆ రోజు బెంగళూరులో ఏమీ జరగలేదని అంటారా అన్న ప్రశ్నకు బదులిస్తూ 'అది జరగలేదనే నేను చెబుతున్నాను' అంటూ బదులిచ్చారు. అయితే, పది మిలియన్ల జనాభా ఉన్న బెంగళూరులో ఇలాంటి కార్యక్రమం(న్యూఇయర్ వేడుక) సందర్భంలో ఏం జరగలేదని మాత్రం చెప్పలేము. నిజంగా మూడు రోజుల కిందట ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా తమవద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆ రోజు ఫుటేజీ మొత్తాన్ని మీడియా వక్రీకరించిందని, 30 సెకన్ల వీడియోని మాత్రమే పదేపదే చూపిందని, కానీ దాని తర్వాత ఏం జరిగిందో మాత్రం చూపలేదని అన్నారు. అయితే డిసెంబర్ 31 తేదిన రాత్రి ఎం,జీ, రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో మహిళలపై దాడుల్లో మీడియాలో వచ్చిన ఆధారాల ప్రకారం సిటీలోని అశోక్‌నగర, ఇందిరానగర, కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్లలో సుమోటోగా మూడు కేసులు నమోదు చేసినట్లు ప్రవీణ్ సూద్ తెలిపారు. ఎవరైనా పూర్తి ఆధారాలు అందజేస్తే కేసును మరింత వేగవంతంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా న్యూఇయర్ వేడుకలను కవర్ చేసిన 45 సీసీటీవీ కెమెరాలన్నింటిలో అమ్మాయిలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీసిన సన్నివేశాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
కన్హయ్య చేసిన నేరమేంటి: దిగ్విజయ్
న్యూఢిల్లీ: విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) రూ.10 వేల జరిమానా విధించడాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. దయచేసి కన్హయ్య చేసిన నేరమేంటో ఎవరైనా మాకు చెప్పుతారా అంటూ ప్రశ్నించారు. కన్హయ్యను దొషిగా తేల్చడానికి ఎలాంటి ఆధారాలు లేవు, అలాంటప్పుడు ఎందుకు అతన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారిని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు జేఎన్‌యూ సోమవారం రూ.10 వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఉమర్ ఖాలిద్ సహా ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 9 నాటి కార్యక్రమంపై దర్యాప్తు జరిపేందుకు వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ.. సాక్ష్యాలు, వీడియో క్లిప్పింగులు తదితరాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ఈ మేరకు ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు బహిష్కరించింది. జేఎన్‌యూలో వచ్చే ఐదేళ్ల వరకు ఎలాంటి కోర్సు చేయకుండా భట్టాచార్యపై నిషేధం విధించింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. మొత్తంగా 14 మందిపై జరిమానా విధించింది. అయితే పరిపాలన శాఖ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. Kanhaiya fined 10000/-. Would anyone pl tell us what is his crime ? Why is he being persecuted ? There is no evidence against him. — digvijaya singh (@digvijaya_28) 26 April 2016