మళ్లీ అదే తరహా చోరీ | Same type Of Thefts Are Occurred in Nizamabad | Sakshi
Sakshi News home page

Published Tue, May 29 2018 8:10 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Same type Of Thefts Are Occurred in Nizamabad - Sakshi

దుండగులు దగ్ధం చేసిన దుస్తులు 

నిజామాబాద్‌ రూరల్‌ : చోరీలు చేయడంలో ఆరితేరిన దొంగలు.. సాక్ష్యాలు దొరకకుండా యత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హబీబ్‌నగర్‌లో శనివారం రాత్రి దొంగతనం చేసిన నిందితులు.. ఇంటికి నిప్పు పెట్టి వెళ్లారు. అదే తరహాలో ఆదివారం రాత్రి నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీకి పాల్పడిన దుండగులు.. ఇంట్లోని వస్తువులకు నిప్పు పెట్టి పరారయ్యారు.

ముబారక్‌నగర్‌కు చెందిన సర్వేశ్‌ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. రాత్రి వేళ తాళం పగులగొట్టి లోనికి చొరబడిన దొంగలు.. బీరువాలో దాచిన రూ.10 వేల నగదు, తులం బంగారం అపహరించారు. అనంతరం సాక్ష్యాలు దొరకకుండా ఇంట్లో నిప్పుపెట్టి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్‌ డీఎస్పీ సుదర్శన్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీధర్‌గౌడ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement