హే రామ్...
గాంధీ ఆస్పత్రి: విషజ్వరాలతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రికి వస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం నగరంలోని నలు మూలల నుంచి పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఓపీ చిట్టీ కౌంటర్లు, వార్డులు, ఉచిత మందుల ఫార్మసీల వద్ద బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోలేక వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ∙ఫార్మసీలో సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాపుల పంట పండింది.