The opposition
-
అధ్యక్షా..! ఇదీ మా బడి... ఇదీ మా ఊరు
లిటిల్ రిపోర్టర్ బడి బాగుంటే చదువు బాగుంటుంది. ఊరు బాగుంటే బతుకు బాగుంటుంది. బాగుండడం అంటే ఏంటి? స్కూల్లో ఉండాల్సిన వసతులన్నీ ఉండడం. ఊళ్లో నీళ్లకు, నిలువ నీడకు కరువు లేకుండా ఉండడం. అయితే అన్ని స్కూళ్లు, అన్ని ఊళ్లు ఇలాగే ఉన్నాయా? లేవు! లేవన్న విషయం ఎలా తెలుస్తుంది? పేపర్లు రాస్తాయి. పేపర్వాళ్లకు ఎలా తెలుస్తుంది? రిపోర్టర్లు రాసి పంపుతారు. రిపోర్టర్లు అంటే పేపర్లలో పనిచేసేవాళ్లు మాత్రమే కాదు, సమస్యను గుర్తించి దానిని నలుగురి దృష్టికీ తెచ్చేవాళ్లు కూడా. ఇదిగో.. వీళ్లంతా చిన్నారి రిపోర్టర్లు. ఇవన్నీ ఈ చిన్నారులు రిపోర్ట్ చేసిన సమస్యలు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ‘సాక్షి ఫ్యామిలీ’ వీటిని ప్రచురిస్తోంది. వీటిపై.. ‘అధ్యక్షా...’ అంటూ ప్రతిపక్షాలు లోకల్ లీడర్లను ఎలాగూ ప్రశ్నించకుండా వదలవు. చూడాలి మరి. ప్రభుత్వాలు ఏమాత్రం స్పందిస్తాయో, పరిస్థితిని ఎప్పటికి చక్కదిద్దుతాయో! పాస్ ఉంది... బస్సు లేదు! మా ఊరు పాడేరు. నేను చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్నాను. మా ఊరికి రోడ్డు సౌకర్యం లేనందు వల్ల బస్సు రావడం లేదు. గతంలో బస్సు వచ్చేది. ప్రస్తుతం బస్సులు లేకపోవడంతో ఆటోలలో వెళ్లాల్సి వస్తోంది. వానా కాలంలో అదీకష్టమే. చాలా మంది ఆటోలకు డబ్బులు పెట్టలేక బడికి రావడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలను ఆటోల్లో పంపించడానికి భయపడి స్కూలు మానిపించేస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఆర్టీసీ వారికి అర్జీ పెట్టుకున్నాం. మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. బస్సు పాసులు ఇచ్చారే కానీ బస్సులు వేయలేదు. ప్రస్తుతం మా యందు దయ తలచి బస్సు సౌకర్యం కల్పించవలసినదిగా కోరుచున్నాం. – వి. వెంగమ్మ, 8వ తరగతి, పాడేరు, చేజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా టీచర్లు ఇద్దరే మా పాఠశాలలో నీటి సౌకర్యం లేదు. దాహం వేస్తే బయట అంగడికెళ్లి మంచినీళ్లు తెచ్చుకుని తాగుతున్నాం. మా పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటే గది. అన్ని తరగతుల వాళ్లమూ ఆ గదిలోనే చదువుకోవాలి. మాకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. అన్ని క్లాసులకూ వాళ్లే పాఠాలు చెప్పాలి. మాకు తరగతి గదులు కట్టించి, టీచర్లను నియమించాలి. అలాగే మున్సిపాలిటీ నుంచి నీటి కుళాయి కనెక్షన్ ఇప్పించాలి. కనీసం ఒక కుండ అయినా ఇప్పిస్తే మేమే నీళ్లు పట్టుకుంటాం. – లక్ష్మీదుర్గ, 5వ తరగతి ఎస్.ఆర్.పురం మున్సిపల్ స్కూల్, కావలి పట్టణం, నెల్లూరు జిల్లా మరుగుదొడ్లకు తలుపుల్లేవు మాది రాజవొమ్మంగి. మా పాఠశాలను మోడల్ స్కూల్‌గా గుర్తించారు. అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని సంబరపడ్డాం. అయితే మా మండల పరిషత్ ఇంగ్లీష్‌మీడియం పాఠశాలలో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు లేడు. ఇక ఈ పాఠశాలను మోడల్ స్కూల్‌గా మార్చామని ఎలా చెపుతున్నారో అర్ధం కావడం లేదు. అదే విధంగా మంచినీటి సౌకర్యం లేదు. పిల్లలమే చందాలు వేసుకొని కుండ కొనుక్కున్నాం. మరుగుదొడ్లు కట్టారు, కానీ వాటికి తలుపులు లేవు. నీళ్ల ట్యాప్‌లు లేవు. – షేక్ ముజాహిద్దీన్ ఆలీషా, 4వ తరగతి, రాజవొమ్మంగి, విశాఖపట్టణం చెత్త తియ్యరు... కుక్కలను తోలరు! మా ఇల్లు కాకినాడలోని అశోక్‌నగర్, అచ్యుతాపురం. మా ఇంటి వద్ద కరెంటు స్థంభం ఉంది. ఆరు నెలల నుంచి వీధిలైట్లు వెలగడంలేదు. చీకటి పడితే బయట అడుగుపెట్టాలంటే భయం. కుక్కలు తరుముతాయి. వీథిలో చెత్త కుప్పలను అలాగే వదిలేయడంతో కుక్కలు యధేచ్ఛగా తిరుగుతుంటాయి. వీ«ధిలైట్లు వెలగక పోవడంతో రాత్రిళ్లు దొంగల భయం ఉంటోంది. ఈ ఉత్తరం చదివిన తర్వాత అయినా పెద్దలు, అధికారులు çసమస్యలు పరిష్కరించాలి. – జి. సాయి తేజేష్, 4వ తరగతి, కాకినాడ నీటి కోసం ఎదురు చూపు... బాపట్ల పట్టణంలో మంచినీళ్లు ఎప్పుడొస్తాయో తెలియదు. రోజంతా మంచినీటి కోసం ఎదురు చూడడంలోనే సరిపోతుంటుంది అమ్మావాళ్లకు. వచ్చినా అరగంట సేపటికే ఆగిపోతాయి. మంచినీటి కుళాయిలు తగినన్ని పెంచినా ఈ ఇబ్బంది కొంత తగ్గుతుంది. ఒకే కుళాయి దగ్గర అందరూ గుమిగూడి తగవులాడుకోవడం రోజూ మామూలే ఇక్కడ. ట్యాంకర్ల కోసం ఎదురు చూడడం, వచ్చాక నీళ్లు మోసుకోవడంతోనే సరిపోతోంది. ఇక ఏ పనులకు వెళ్లాలన్నా కుదరడం లేదు. – ఎం. సుష్వాంత్, 8వ తరగతి, బాపట్ల కంప్యూటర్ ఎవరు నేర్పిస్తారు! నేను ఆలేరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మా స్కూలుకి కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్ టీచర్ని నియమించలేదు. దాంతో అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. మాకు పీఈటీ టీచర్ లేరు. ఆట సామగ్రి లేదు. ఏటా మాకు దుస్తులు ఇచ్చేవారు. గడచిన ఏడాది ఇవ్వలేదు. పాత వాటినే వేసుకున్నాం. రాబోయే ఏడాదికైనా కంప్యూటర్ టీచర్ని నియమిస్తే మంచిగ నేర్చుకుంటాం. – బి. సాయికుమార్, 8వ తరగతి, ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా మద్యం సీసాలమయం! మా స్కూలు భవనం పూర్తిగా కుంగిపోయి గోడలు పగుళ్లు బారాయి. వర్షం వస్తే స్లాబు కారుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మరమ్మత్తులు జరగలేదు. హైస్కూల్లో బాలికలం ఉన్నాం. వాష్‌రూములు సరిగ్గా లేవు. ఇంకా పెద్ద ఇబ్బంది ఏమిటంటే... మా స్కూలు సెలవు రోజు స్కూలు ఆవరణ తాగుబోతుల రాజ్యం అవుతోంది. ఫుడ్ పార్సిల్ కవర్లు, ఖాళీ మద్యం సీసాలను పడేస్తున్నారు. పగిలిన గాజు పెంకులతో ఆవరణంతా అసహ్యంగా ఉంటుంది. సోమవారం స్కూలు తెరవగానే మేము ఆవరణ అంతా శుభ్రం చేసుకోవాలి. ఒక్కోసారి గాజు పెంకులు గుచ్చుకుంటాయి కూడ. ఈ కష్టం తప్పించండి ప్లీజ్. – బి. ఇందుమతి, పునాదిపాడు, కంకిపాడు, కృష్ణాజిల్లా ఆటో బోల్తా... చదువుకు డుమ్మా! నేను రోజూ స్కూలుకి ఏడు కిలోమీటర్లు ఆటోలో వెళ్లేవాడిని. ఒక రోజు మా ఆటో బోల్తా పడింది. ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాంతో ఆ ఇద్దరూ బడి మానేశారు. మాకు హైస్కూలుకు పోవడం అంటే పరాయి దేశం పోయినట్లే. అంతగా భయపడతారు. ప్రాథమిక స్కూలుతోనే చదువాపేస్తున్నారు చాలామంది. మా తాండకు దారి సరిగ్గా ఉండదు. మట్టిబాటలో వెళ్లాలి. దాంతో మా ఊరికి బస్సులు లేవు. రోడ్డు వేసి బస్సులు వేస్తే మాలాంటి చాలా మంది చదువుకుంటారు. మా తండాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వీథిదీపాలు లేవు. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. అందుకే పేపర్‌కు రాస్తున్నా. – ఎం. అరవింద్ నాయక్, 10వ తరగతి, లత్తవరంతాండ, అనంతపురం జిల్లా కాలువ పొంగితే... విజయనగరం పట్టణంలో ఉడాకాలనీ మాది. కాలనీలో రోడ్డు మొత్తం బురదమయం. నీరు నిలిచి ఉంటుంది. పందులు తిరుగుతూ బురదను తిరగతోడుతుంటాయి. దోమలతో అంటువ్యాధులు వస్తున్నాయి. మురుగునీరు కాలువలో నుంచి పొంగి రోడ్డు మీదకు పారుతుంటుంది. ప్లాస్టిక్ సంచులు కాలువలను బ్లాక్ చేస్తుంటాయి. ప్రభుత్వం మా కాలనీ సమస్యలను పట్టించుకుని పరిష్కరించాలి. – హర్షిత, 6వ తరగతి, కంటోన్మెంట్, విజయనగరం నది దాటడం గగనమే.. మాది పందలపాక గ్రామం. నేను ఆరవ తరగతి చదువుకుంటున్నాను. మా పాఠశాలకు గ్రామానికి మధ్యలో తుల్యభాగా నది ప్రవహిస్తుంటుంది. దానిపై నిర్మించిన కాలిబాట వంతెన ఇరుకుగా ఉంది. అంతే కాదు... అది శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల దూరంగా ఉండడంతో సైకిల్ పై వంతెన దాటి వెళ్ళాలి. ఎప్పుడు విరిగిపడుతుందో తెలియనంతగా పాడైపోయింది వంతెన. చాలామంది పడిపోయారు, గాయాలయ్యాయి. వంతెన ఇరుకుగా ఉండడంతో గోడలు గీరుకుపోయి రక్తం వస్తుంటుంది. ఇదంతా మాకు రోజూ ఎదురయ్యే అనుభవం. దీంతో పాఠశాలకు వెళ్లే సుమారు 800 మంది విద్యార్థులం చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కూలు పిల్లలమే కాదు పెద్దవాళ్లకు కూడా ఆ వంతెన మీద నుంచి ప్రయాణించాలంటే భయమే. మంచి వంతెన నిర్మిస్తే తప్ప మా కష్టాలు తీరవు. – షేక్. ముమీనా, పడాల పెదపుల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల, పందలపాక, బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లా – సాక్షి నెట్వర్క్ సహకారంతో... -
విపక్షాలు పూర్తిగా విఫలం -మంత్రి హరీశ్‌రావు
విపక్షాలు ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నాయి హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. విపక్షాలు ఒక వ్యూహమంటూ లేకుండానే వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో తమదే పూర్తిగా పైచేయి అయిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి సమర్థంగా చెప్పుకుంటున్నామని ఆయన వివరించారు. గతంలో తాము కూడా ప్రతిపక్షంలో ఉన్నామని, ప్రస్తుత ప్రతిపక్షాలకు భిన్నంగా ఒక వ్యూహంతో వ్యవహరించేవారమని గుర్తు చేశారు. అన్ని అంశాలపై మాట్లాడాలనుకుని ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు వారి దగ్గర ఏ అంశమూ లేదని అన్నారు. సహజంగా ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒకటీ రెండు అంశాలను తీసుకుని పూర్తి స్థాయిలో వాటివెంటే పడుతూ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తాయని, కానీ ఇప్పుడు విపక్షాలు ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట నగదు రహితానికి ‘ఆధార్ పే’ సిద్దిపేటను నగదు రహిత లావాదేవీలకు మార్చేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న నేపథ్యంలో బ్యాంకు ప్రతినిధులు కొందరు మంత్రి హరీశ్‌రావును అసెంబ్లీలోని ఆయన చాంబర్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తీసుకువచ్చిన కొత్త ‘ఆధార్ పే మర్చంట్ డివైజ్’ను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సిద్దిపేటలో అన్ని రకాల లావాదేవీలకు ‘ఆధార్ పే’యంత్రాలను అమర్చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. తగినన్ని మెషిన్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు అధికారులు గతంలో రూ.10వేలు వెచ్చించి కొనుగోలు చేసిన మైక్రో ఏటీఎంల స్థానే రూ. 1800 విలువ చేసే ఆధార్ ఆధారిత మర్చంట్ ఫింగర్ ప్రింట్ మిషన్ పనితీరునూ మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ మర్చంట్ మిషన్‌ను రూ.వెయ్యికే ఇవ్వాలని మంత్రి బ్యాంకర్లను కోరారు. 5 వేల మర్చంట్ మిషన్లలకు మంత్రి వెంటనే ఆర్డర్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు తన ఆధార్ నంబర్‌ను బ్యాంకు అకౌంట్‌తో స్వయంగా లింక్ చేసుకున్నారు. -
అస్త్రశస్త్రాలతో సిద్ధం
21 నుంచి బెల్గాంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సమస్యలపై ప్రశ్నలు సంధించనున్న విపక్షాలు దీటుగా ఎదుర్కోవడానికి సహచరులకు సీఎం దిశానిర్దేశం బెంగళూరు : రెండో రాజధాని బెల్గాంలో ఈసారి శీతాకాల శాసనసభ సమావేశాలు వాడీ వేడిగా జరుగనున్నారుు. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారుు. అరుుతే వీటిని దీటుగా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని సీఎం సిద్ధరామయ్య తన సహరులకు ఇప్పటికే దిశ నిర్దేశం చేశారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 2 వరకూ బెళగావిలోని సువర్ణ సౌధలో శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా కరువు కాటకాల్లో మునిగిపోరుున రైతులను ఆదుకోవడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రైతు సంఘం నాయకులు సమావేశాల మొదటి రోజు సువర్ణసౌధ ముట్టడికి ఇప్పటికే పిలుపునిచ్చారు. చెరకు బకారుుల సత్వరం చెల్లించడంతో పాటు ఎకరాకు రూ. 15 వేలు నష్టపరిహారం, ఇక సహకార రుణాలు మాఫీ చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు బీజేపీ, జేడీఎస్ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. సమావేశాల మొదటి రోజును సభను స్తంభింప చేయాలని విపక్షాలు ఏకతాటిపైకి వచ్చారుు. అరుుతే కరువు తాలూకాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో రుణాలు రద్దు చేసి కొంత వరకు రైతు సంఘం నాయకులు శాంతింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక కావేరి వివాదంపై చర్చించడానికి రెండుసార్లు ప్రత్యేక శాసనసభ సమావేశాలను జరిపిన సిద్ధరామయ్య ప్రభుత్వం మహదారుు వివాదం పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ ప్రాంతానికి చెందిన విపక్ష నేతలు భావిస్తున్నారు. ఇక వేసవి మొదలు కాకుండానే తాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు ఉత్పన్న మవుతున్న విషయానికి సంబంధిం విపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి అవసరమైన గణాంకాలను సేకరిస్తున్నారుు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలపై... ఇక రాష్ట్రంలో శాంతిభద్రత విషయంపై కూడా విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలతో బీజేపీ శ్రేణులు మండిపోతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే సిద్ధు సర్కార్‌పై బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఇక మంత్రి తన్వీర్ వ్యవహారం, ఎంఈఎస్ ప్రాబల్యం ఉన్న బెల్గాంలో ఈ సారి శీతాకాల సమావేశాలు అధికార పార్టీకి చెమటలు పట్టిస్తాయనడంలో సందేహం లేదు. -
మెదక్‌లో భగ్గుమన్న విపక్షం
అతిచిన్న జిల్లా ఏర్పాటుపై నిరసన గంటపాటు రాస్తారోకో భారీగా నిలిచిన వాహనాలు మద్దతు పలికిన న్యాయవాదులు 24 మండలాలతో జిల్లా కావాలని డిమాండ్ మెదక్:మెదక్‌ను అతి చిన్న జిల్లాగా ఏర్పాటుకు సన్నాహాలు చేయడంపై ఈ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. ఒకప్పుడు సుభాగా వెలుగొందిన మెదక్ జిల్లాకు నాడు సమైక్య రాష్ట్రంలో పాలకులు అన్యాయం చేస్తే... నేడు స్వరాష్ట్రంలోనూ అదే అన్యాయం కొనసాగుతోందంటుఆన్నరు. కేవలం 14 మండలాలతో జిల్లాను సరిపెట్టడంపై విపక్షాలు నిరసన గళమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జిల్లా కేంద్ర సాధన సమితి, మెదక్ అభివృద్ధి పోరాట సమితి, కార్మిక, కుల సంఘాల నాయకులు శుక్రవారం మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక రాందాస్ చౌరస్తాలో ధూంధాం నిర్వహించారు. ఈ నిరసనకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. 24 మండలాలతో కూడిన జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారికి వినతిపత్రం సమర్పించారు. మెదక్‌కు తీరని అన్యాయమే... పాలకులు పథకం ప్రకారమే మెదక్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు మండిపడ్డారు. ఐఐటీ, జేఎన్టీయూతోపాటు బీడీఎల్ వంటి పెద్ద సంస్థలు మెదక్ పేరిట మంజూరు కాగా వాటిని సంగారెడ్డి ప్రాంతంలో నెలకొల్పారన్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏవీ లేవన్నారు. మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ... జిల్లా కేంద్ర సాధన కోసం రాందాస్ అనే సామాజిక కార్యకర్త నాలుగు దశాబ్దాల క్రితం 40రోజులపాటు నిరాహార దీక్షచేసి అమరుడయ్యాడన్నారు. అప్పట్లో పాలకుల నిర్లక్ష్యం వల్లే జిల్లా ఏర్పాటు కాలేదన్నారు. 18 మండలాలతో కూడిన రెవెన్యూడివిజన్ ఉన్న మెదక్‌ను 14మండలాలతో జిల్లా చేయడం ఏమిటని ప్రశ్నించారు. నర్సాపూర్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాలతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి మండలాన్ని సైతం మెదక్‌లో కలిపి ఈ జిల్లాకు ఓ స్వరూపం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు సురేందర్‌గౌడ్, మామిళ్ల ఆంజనేయులు, మధుసూదన్‌రావు, కిషన్‌గౌడ్, గూడూరి ఆంజనేయులుగౌడ్, బీజేపీ నాయకులు గడ్డం శ్రీనివాస్, ముత్యంగౌడ్, జనార్దన్, మల్లేశం, జిల్లా కేంద్ర సాధన సమితి నాయకులు మల్కాజి సత్యనారాయణ, సుభాష్ చంద్రబోస్గౌడ్, గోవింద్రాజ్, జివ్వాజి విజయ్‌కుమార్, మ్యాప్స్ అధ్యక్షుడు హర్కార్ మహిపాల్, టీడీపీ నాయకులు బట్టి జగపతి, అఫ్జల్, మాణిక్యరెడ్డి, సీపీఎం, సీపీఐలతోపాటు పలు కుల సంఘాలు నాయకులు బాల్‌రాజ్, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
‘సాగర్’కు ‘మల్లన్న’తో జీవం
బాన్సువాడ : ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన నిజాంసాగర్ సమైక్య పాలకుల తీరుతో ఎడారిగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లనసాగర్తోనే నిజాంసాగర్‌కు పూర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడలోని తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ఈ వర్షాకాలంలో సగటు వర్షపాతం 402 మిల్లీమీటర్ల కాగా 17 శాతం అధికంగా 429 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, కానీ నిజాంసాగర్, పోచంపాడ్ ప్రాజెక్టుల్లో ఆశించినంత నీరు చేరలేదని పేర్కొన్నారు. ప్రాణహిత నదినుంచి వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. ప్రాణహిత–ఇంద్రావతి నదుల నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్‌కు మళ్లిస్తే జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. కాళేశ్వరం ద్వారా ఉత్తర తెలంగాణాలోని 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతాయని, మరో 20 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు లభిస్తుందని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఎల్తైన ప్రదేశంలో ఉన్నందున, ఎత్తిపోతల ద్వారా అక్కడి వరకు నీరును తీసుకువచ్చి, నేరుగా రోజు నిజామాబాద్ జిల్లాకు 3 టీఎంసీల చొప్పున నీరు అందించవచ్చన్నారు. ఇప్పటికే రూ. 13 వేల కోట్లతో టెండర్లను ఆహ్వానించామన్నారు. మల్లన్నసాగర్ నిర్మిస్తే కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలు, ఎల్లారెడ్డిలో లక్ష, బాన్సువాడలో 30 వేలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్ష, బాల్కొండలో 30 వేలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 10 వేల ఎకరాలకు సాగు నీర అందుతుందని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం గల మల్లన్నసాగర్‌ను నిర్మించకుండా, ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, మల్లన్నసాగర్ నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు భూములు అప్పగిస్తున్నారని, వారికి పాదాభివందనం తెలుపుతున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ మంగళవారం రైతులతో చలో నిజాంసాగర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గర్భంలో నిర్వహించే కార్యక్రమంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారన్నారు. నిజాంసాగర్ దుస్థితిని ప్రపంచానికి చూపించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీలకతీతంగా రైతులు పాల్గొనాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో మంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహ్మద్ ఎజాస్, భాస్కర్, సురేశ్, శ్రీనివాస్, స్వరూప, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మాగ్నటిక్ సంస్థతో సంబంధం లేదు: పల్లా
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళపరుస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంసెట్ పరీక్ష నిర్వహించిన మాగ్నటిక్ సంస్థతో టీఆర్ఎస్ నేతలెవరికీ సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఉనికి చాటుకోవడానికి విమర్శలు చేస్తున్నారన్నారు. లీకేజీ వ్యవహారం బహిర్గతం కాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టిందని, చట్టప్రకారం ముందుకు వెళ్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. గతంలో కూడా చాలాసార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని గుర్తు చేశారు. అసత్య ప్రచారాలతో ప్రతిపక్షాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో మంత్రులకు సంబంధం లేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. -
సయోధ్య..
‘లోకాయుక్త’పై చర్చకు ఒకరోజు సమయం స్పీకర్ హామీతో శాంతించిన విపక్షాలు నిరసన ఉపసంహరణ సజావుగా సభా కార్యక్రమాలు బెంగళూరు: ఎట్టకేలకు విపక్షాలు శాంతించాయి. దీంతో రాష్ట్ర చట్టసభల్లో కార్యక్రమాలు మంగళవారం సజావుగా సాగాయి. లోకాయుక్తను నిర్వీర్యం చేయడానికే అవినీతి నిరోధక దళం పేరుతో కొత్త వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెబుతూ భారతీయ జనతా పార్టీతో పాటు జేడీఎస్ సభ్యులు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో సమావేశాలు ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. ఈ సమయంలో కలుగజేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీబీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోదని స్పష్టం చేశారు. దీంతో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని స్పీకర్ అధికార, విపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను తన కార్యాలయంలోకి పిలిపించి వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. ప్రజలు తాగు, సాగునీటి కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పై చర్చించాలని సూచించారు. అదే సందర్భంలో లోకాయుక్త నిర్వీర్యం కాకుండా సంస్థ మరింత బలోపేతం కావడానికి చర్యలు చేపట్టే విషయమై చట్ట సభలో చర్చ జరపాలని ఇందుకు ఒక రోజు మొత్తాన్ని కేటాయిస్తానని తెలిపారు. ఇందుకు అధికార పక్షం సభ్యులతో పాటు విపక్షాలు కూడా అంగీకరించాయి. ఇదే విషయాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప శాసనసభలో ప్రకటించారు. దీంతో అప్పటి వరకూ నిరసనకు దిగిన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌తో పాటు ఇతర విపక్ష సభ్యులు ‘విలువైన సభా సమయంలో ప్రజా సమస్యలపై చర్చించాలని భావిస్తూ నిరసనను వెనక్కు తీసుకుంటున్నాం. అయితే లోకాయుక్తను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఆందోళనకు దిగుతాం.’ అని పేర్కొంటూ విపక్ష సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కుర్చొండి పోయారు. దీంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగాయి. -
కోట్లకు అధిపతి కాకూడదా?
నగర కార్యదర్శి, నగర పాలక సంస్థ చైర్పర్సన్లు వంద కోట్ల మేరకు ఆస్తి కలిగి ఉంటే తమ అధినేత్రి జయలలిత కోట్లకు అధిపతి ఎందుకు కాకూడదంటూ మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అవినీతి తాండవం చేస్తోందని, ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఏకంగా మంత్రులు ఏ మేరకు అక్రమార్జన సాగిస్తున్నారో చిట్టాలను సైతం ప్రకటిస్తూ వస్తున్నాయి. మరికొన్ని పార్టీలు అయితే ఫలాన అధికార పక్షం నేతకు వద్ద ఇన్ని కోట్లు ఉన్నాయని, ఫలాన నేత ఈ నాలుగేళ్లలో ఇన్ని కోట్లు సంపాదించాడని ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధ్యత కల్గిన పద విలో ఉన్న మంత్రి ఏకంగా ప్రతిపక్షాల ఆరోపణల్ని సమర్థించే రీతిలో కోట్లు, అధిపతి అంటూ ప్రస్తావించడం అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. గుడియాత్తంలో అన్నాడీఎంకే సర్కారు నాలుగున్నరేళ్ల ప్రగతిని చాటుతూ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గుడియాత్తం నగర కార్యదర్శి జెకేఎన్ పళని నేతృత్వంలో అక్కడి బస్టాండ్ ఆవరణలో సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి, పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ హాజరయ్యారు. కేసీ వీరమణి మాట్లాడుతూ గుడియాత్తం నగర పార్టీ కార్యదర్శి జేకే ఎన్ పళని, నగర చైర్ పర్సన్ అముదాలు వంద కోట్ల ఆస్తిపరులుగా పేర్కొనడంతో సభలో ఒక్కసారిగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్యదర్శి, చైర్పర్సన్లే వంద కోట్ల ఆస్తి పరులుగా ఉంటే తమ అధినేత్రి, అమ్మ జె జయలలిత కోట్లకు అధిపతిగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఇంతలో నాంజిల్ సంపత్ అందుకుని వంద కోట్ల ఆస్తి పరుడు ఇక్కడ కార్యదర్శిగా పార్టీకి సేవల్ని అందించడం బట్టి చూస్తే ఏ మేరకు వారు దోపిడీకి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యలను అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణిం చాయి. ఈ వ్యాఖ్యలపై అమ్మ ఎలా స్పందిస్తారనే చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో అతనిపై చర్యలు తప్పవని అంటున్నారు. -
ఆత్మహత్యలపై విపక్షాల రాద్ధాంతం
మండిపడిన టీఆర్ఎస్ ఎంపీలు నిజామాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పదేళ్లు పాలించిన కాం గ్రెస్ పార్టీ రైతాంగాన్ని విస్మరించడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సహా 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రి పోచారం మాట్లాడుతూ త్వరలోనే ఉత్తర, దక్షణ తెలంగాణల్లో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే ప్రాణహిత-చేవెళ్లను రూ. 35 వేల కోట్లతో చేపట్టామని చెప్పారు. 13 లక్షల 40 వేల మంది రైతులకు రూ.4 వేల కోట్ల ఇన్‌పుట్స్‌ను అందించామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు రూ.50 కోట్లు అందించి రైతు ఆత్మహత్యలను నివారిస్తామన్నారు. కేసీఆర్ తెలంగాణ తొలి సీఎం కావడం అదృష్టమని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. 2004, 2009లలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన డీఎస్ ఆ పార్టీని వీడారంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్, పరిస్థితి అర్థం చేసుకోవాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పనికి మాలిన విమర్శలు చేస్తోందని విమర్శించారు. సమావేశంలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, బాల్క సుమన్, జి.నగేశ్, సీతారాంనాయక్, ప్రభాకర్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, బి.బి.పాటిల్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, నగర మేయర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షం గొంతునొక్కుతున్న అధికార పార్టీ
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ: ప్రతిపక్షం గొంతు నొక్కి అసెంబ్లీని అధికార పార్టీ ఏకపక్షంగా నిర్వహించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పట్టణంలోని పల్నాడురోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారెడీ మాత్రమేనని తప్పులు లెక్కలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి దగా చేశారని విమర్శించారు. అధికారపక్షం అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు వ్యక్తిగత ఆరోపణలను ఏకైక మార్గంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ఎవరికి మేలు చేసేలా లేదని కేవలం కాంట్రాక్టర్లకు కోసమే అన్న విధంగా బడ్జెట్‌ను రూపొందించార ని ఆరోపించారు. రైతులకు మొండి చేయి చూపించారన్నారు. రైతులు దయనీయ పరిస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారణమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని బాబు వస్తే జాబు వస్తుందన్నారు. జాబు వచ్చేంది ఎలా ఉన్న ఉన్న జాబులను పీకేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ చేయలేదు. డ్వాక్వా సంఘాలకు, చేనేత కార్మికులకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డున పడ్డా వారి గోడు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజులు కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. వరికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తానని బీసీ ఓట్లు వేయించుకుని వారిని దగా చేశారన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చింతలచెర్వు వెంకిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, శావల్యాపురం కన్వీనర్ చుండూరు వెంకటేశ్వర్లు, చీరపురెడ్డి కోటిరెడ్డి , పట్టణ కన్వీనర్ నరాలశెట్టి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ చింతా ఆదిరెడ్డి, జిల్లా కార్యదర్శి డూమావత్ గోవిందునాయక్, మాజీ సర్పంచ్‌లు గంధం బాలిరెడ్డి, దండు చెన్నయ్య, పీఎస్ ఖాన్, మాజీ కౌన్సిలర్ చల్లా కొండయ్య, కాల్వ రవిరాజు, ఎపిపి పట్రా కోటేశ్వరరావు, ఎంఎల్ రెడ్డి, ఎన్ వెంకటేశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి, శ్రీలక్ష్మీ, శ్రీరెడ్డి, గుత్తా కోటేశ్వరరావు, గురవయ్య, శ్రీనివాసరెడ్డి, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
దద్దరిల్లిన అసెంబ్లీ
చెరుకు రైతులకు బకాయిపై ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్షాలు రెండేళ్లుగా బకాయిలు చెల్లించ లేదని మండిపాటు నెలలోపు బకాయిలు చెల్లిస్తామన్న మంత్రి డీకేశి బెంగళూరు : రైతాంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ విపక్షాలు మండిపడ్డాయి. రెండేళ్లుగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకపోవడంపై నిప్పులు చెరిగాయి. దీంతో గురువారం అసెంబ్లీ కార్యకలాపాలు దద్ధరిల్లాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన గందరగోళాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు సభను ఏకంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాసనసభలో గురువారం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే విపక్ష నేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... చెరుకు రైతులకు చక్కెర కర్మాగారాల యజమానులు రెండేళ్లుగా బకాయిపడ్డారని, ఈ మొత్తాన్ని చెల్లించడంలో యాజమాన్యలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పోషణ భారమైన అన్నదాతలు రోడ్డుపై చేరుకుని ఆందోళనలు చేపట్టాల్సిన దుర్గతిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. చక్కెర కర్మాగారాల యజమానుల నుంచి చెరుకు రైతులకు రూ.1,700 కోట్లు అందాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శెట్టర్ వాదనలకు బీజేపీతో పాటు పలువురు జేడీఎస్ సభ్యులు మద్దతు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.శివమూర్తి జోక్యం చేసుకుంటూ బీజేపీకి చెందిన ప్రభాకర్‌కోరే, మురుగేష్ నిరాణి, ఉమేష్ కత్తిలాంటి వారే రైతులకు రూ. కోట్లు బకాయి ఉన్నారని ఆరోపించారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే బదులు వారి నుంచి రైతుల బకాయిలు ఇప్పించవచ్చు గదా అని హితవు పలికారు. శివమూర్తి వాదనకు అధికార పక్షం సభ్యులు గొంతు కలిపారు. దీంతో సభలో వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న శివశంకర్‌రెడ్డి ప్రకటించారు. నెలలోపు బాకీ మొత్తం చెల్లిస్తాం అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దాదాపు పది నిమిషాల పాటు ఈ పర్వం కొనసాగింది. అనంతరం ఇంధన శాఖ మంత్రి డీ.కే శివకుమార్ మాట్లాడుతూ....‘నెల లోపు రైతుల బాకీ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తాం. చెరుకు కర్మాగారాల్లో నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇందుకు వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెరుకు రైతులకు అందజేస్తాం. ఈ మొత్తం ప్రక్రియ ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది.’ అని స్పష్టం చేశారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందిన విపక్షాలు ధర్నాను విరమించుకున్నాయి. -
సమస్యలపై పోరాడే సీఎంపై విమర్శలా?
విపక్షాలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం ప్రజావిశ్వాసానికి ప్రతీక కంటోన్మెంట్ గెలుపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం హైదరాబాద్: సమస్యలపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని తెలంగాణ ఇరిగేషన్, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. గల్లీగల్లీ తిరుగుతూ సమస్యల వద్దకే సీఎం వెళుతుండటంతో భవిష్యత్తులో తమ ఉనికే ఉండదనే ఇష్టారీతిన పేలుతున్నాయని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను విశ్వసించడంలేదని...2009 నుంచి ఏ రకమైన ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పక్షానే నిలబడుతున్నారని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో హరీశ్‌రావు మంగళవారం ఇక్కడి తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. కం టోన్మెంటు ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై మద్యం, డబ్బు పంపిణీ చేశాయని ఆయన ఆరోపించారు. అయినా టీడీపీ, బీజేపీ కూటమి ఒక్క వార్డునైనా గెలుచుకోలేదని చెప్పారు. కంటోన్మెంటు ప్రాంతంలో ఎమ్మెల్యే, ఎంపీలు టీడీపీకి చెందినవారని, ఒకవిధంగా టీఆర్ఎస్ అక్కడ జీరో అయినా ప్రభుత్వ పనితీరును చూసి ప్రజలు తమ పార్టీని గెలిపించారని, వారికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. కంటోన్మెంట్ గెలుపు టీఆర్ఎస్పై ప్రజావిశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. విపక్షాలు ఇకనైనా చీటికీమాటికీ విమర్శించడం మాని ఎందుకు ఓడిపోతున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగురుతుందని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. పొన్నాల.. చెల్లని నోటు టీపీసీసీఅధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను చెల్లని నోటుగా హరీశ్‌రావు అభివర్ణించా రు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన పొన్నాల వరంగల్‌లో ఒక్క సమస్యనూ పరిష్కరిం చలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అక్కడే ఉండి సమస్యలను పరిష్కరిస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శించ డం సిగ్గుచేటన్నారు. ‘పొన్నాల తన సొంత నియోజకవర్గం జనగామలో ఒక్క రాత్ర న్నా నిద్ర చేశారా? సుమారు 40 గ్రామాలకు ఆయన వెళ్లనే లేదు. అందుకే ఓటమి పాలయ్యారు. అయినా సోయి రాలేదు’ అని హరీశ్ మండిపడ్డారు. ఉద్యమకారులపై కేసులు పెట్టించిన పొన్నాల... అమరవీరులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించడం హాస్యాస్పదమన్నా రు. మంత్రిగా ఆయన ఒక్క అమరవీరుని కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. ఏడు నెలల పాలనలో కేసీఆర్ ఏం పనిచేశాడో పొన్నాల జనగామకు వెళ్లి కనుక్కోవాలని హరీశ్‌రావు అన్నారు. -
మార్పులు ఒప్పుకోం
ఉపాధి హామీపై రాజ్యసభలో ధ్వజమెత్తిన విపక్షాలు న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలపై రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని మూసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తాయి. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 100 రోజులు ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధి హామీపై సావధాన తీర్మానం ఇచ్చిన సీపీఐ ఎంపీ డి.రాజా మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యపరచి, ఆ తర్వాత స్వస్తి పలికే ప్రయత్నాలు చేస్తోందన్నారు. పథకంలో మార్పులు చేసి అవినీతికి కేంద్రం దోహదం చేస్తోందని సీపీఐతోపాటు విపక్ష సభ్యులు విమర్శించారు. దీనిపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ మాట్లాడుతూ... ఎనిమిదేళ్లలో ఈ పథకం మంచి ఫలితాలను సాధించిందని, రూ.1.80లక్షల కోట్లు వేతనాల కింద చెల్లించామని, ఐదుకోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయని, దీనిని మరింత సమర్థంగా అమలుచేసేందుకు ఆస్తుల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు. -
నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం
‘సాక్షి’తో వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీల అమలు తీరును నాలుగైదు నెలలు పరిశీలించాలనే భావనతో ఉన్నాం వైఎస్సార్ మాదిరిగా సంక్షేమం ఉండాలనుకుంటున్నాం అసెంబ్లీలోనూ వాగ్దానాల అమలును కోరతాం వలసలను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్య హైదరాబాద్: తెలంగాణలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో నాలుగైదు నెలల సమయమివ్వాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వైఎస్సార్ మరణంతో మనోవేదన కు గురై తనువు చాలించిన వారి కుటుంబాలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ప్రతినెలా ఒక జిల్లాలో దాదాపు వారంపాటు పర్యటించి పరామర్శిస్తారని తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు.. ప్రభుత్వ వైఫల్యాలపై మీ భావన ఏమిటి? తెలంగాణలో విద్యుత్ కొరతకు కారణాలు ఏవైనప్పటికీ.. అదొక పెద్ద సమస్యగా మారింది. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇవ్వలేమనే వాస్తవాన్ని సీఎం కేసీఆర్ ప్రజలకు వివరిం చి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ నేతలు చేస్తున్న రైతుల ఓదార్పు బోగస్. కాంగ్రెస్ హయాంలోని విధానాలు కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలఅమలు ఎలా ఉంది? దివంగత సీఎం రాజశేఖరరెడ్డి చేపట్టినట్లుగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని మేం కోరుతున్నాం. వైఎస్ చేసిన అభివృద్ధి, బడుగు, బలహీనవర్గాలకు అందిన ప్రయోజనాల గురించి ఇప్పటికీ వారు గుర్తుచేసుకుంటున్నారు. అసెంబ్లీలో ఎలాంటి వైఖరి అవలంబిస్తారు? ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. భూపంపిణీ తదతర పథకాలను లాంఛనంగా ప్రారంభించారే తప్ప.. అవి పూర్తి స్థాయిలో కొనసాగడం లేదు. దళితులతో పాటు గిరిజనులకు కూడా భూమి పంపిణీ చేయాలి. ఇలాంటి అంశాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. ఎంపీగా రాష్ట్రం కోసం లోక్‌సభలో మీ పాత్ర? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌ను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని లోక్‌సభలో గ ట్టిగా కోరాను. ఆ ప్రాజెక్టుల టెండర్లను రద్దుచేసి ముందుకు సాగకుండా చేస్తున్నారు. నాగార్జునసాగర్ కెనాల్‌కు ఫీడ్ చేసి ఖమ్మం, ఆపై ప్రాంతాలకు నీళ్లు ఇవ్వవచ్చు. ఈ విషయమై మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడాను. వలసల ప్రోత్సాహంపై ఏమంటారు? వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఆయనపై అనర్హత వేటు ఖా యం. ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కచ్చితంగా గెలిచి తీరుతారు. వలసలను ప్రోత్సహించే సంస్కృతి తప్పు. పార్టీపరంగా భవిష్యత్ కార్యాచరణ? శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరిస్తాను. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జిల్లాల్లో పార్టీని పటిష్టానికి చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర కమిటీలోని 11 మంది సభ్యులం సమావేశమై గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై చర్చిస్తాం. -
స్పీకర్‌పై ‘అవిశ్వాసా’నికీ వెనుకాడం
ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ అధికారపక్షానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడి హితవు ► ప్రజల వాణిని వినిపిస్తున్న ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు ► ఇలాగే కొనసాగితే సభాపతిపై అవిశ్వాసం పెట్టేందుకూ సిద్ధం ► ఇద్దరు ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలి ► మరో సభ్యుడిపై హక్కుల నోటీసునూ ఉపసంహరించాలి ► నా ప్రసంగానికి 106 నిమిషాలు అంతరాయం కలిగించారు హైదరాబాద్: శాసనసభలో ప్రజావాణిని వినిపిస్తున్న ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్న తీరు ఇలాగే కొనసాగితే సభాపతిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా తాము వెనుకాడబోమని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ ఇంత అన్యాయంగా బడ్జెట్ సమావేశాలు జరిగి ఉండవేమోనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే.. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికీ వెనుకడుగువేయబోమన్నారు. మంగళవారం శాసనసభ వాయి దాపడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో సహచర ఎమ్మెల్యేలతో కలసి జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే వరకూ పరిస్థితిని రానివ్వకూడదన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసిన తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని కోరారు. మరో సభ్యునిపై ప్రతిపాదించిన సభా హక్కుల నోటీసును కూడా వెనక్కి తీసుకోవాలన్నారు. మాట్లాడుతోంటే మైక్ కట్ చేస్తున్నారు... ప్రతిపక్ష నాయకుడు ఒక అంశంపై తాను నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేయాలనుకుంటున్నానని, మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని మొర పెట్టుకున్నా సభాపతి మైక్ ఇవ్వని పరిస్థితి ఉం దని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా సభలో నుంచి వెళ్లిపోండి అనే తీరు బహుశా ఎపుడూ లేదేమోనన్నారు. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని.. బడ్జెట్‌పై తన ప్రసంగం పూర్తికాక ముందే మైక్‌ను కట్ చేశారని ఆయన చెప్పారు. ‘‘సోమవారం నేను 11.08 గంటలకు ప్రసంగం మొదలు పెట్టాను. ప్రజల సమస్యల మీద, బడ్జెట్లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల మీద మాట్లాడాను. చంద్రబాబు, అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆ హామీల ఆధారంగా వారు వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులపైనే మాట్లాడాను. ఒక్కదానిపై కూడా నేను డీవియేట్ కాలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఎవ్వరినీ దూషించలేదు. పూర్తిగా సబ్జెక్ట్ మీదే మాట్లాడాను. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో వాటికి ఎన్ని కేటాయింపులు చేసిందనే అంశాలు తప్ప వేరే ఏమీ మాట్లాడలేదు. కానీ నా ప్రసంగానికి 17 సార్లు అంతరాయం కలిగించారు. అధికారపక్ష సభ్యు లు అడ్డుతగిలి గంటా ఆరు నిమిషాలపాటు అం తరాయం కలిగించారు. మా పార్టీ నేతలు మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీవీలో చూసి స్పష్టంగా అంతరాయాలు ఎన్నిసార్లు, ఎపుడెపుడు జరిగాయని సమయంతో సహా నమోదు చేశారు. 11.08గంటలకు నేను ప్రసంగం ప్రారం భిస్తే ఈ అంతరాయాలు కలుపుకొని మధ్యాహ్నం 1.40 గంటలకు మైక్‌ను కట్ చేశారు. ఈ రెండున్నర గంటల సమయంలో అంతరాయా లు కలిగిస్తూనేపోయారు. రెండు మూడు నిమిషాలు మాట్లాడితే చాలు మైక్ కట్ చేయడం.. అధికారపక్షానికి అవకాశం ఇవ్వడం, మరో నా లుగు నిమిషాలు మాట్లాడాక మళ్లీ మైక్ కట్.. మరో పది నిమిషాలు మాట్లాడిన తరువాత మళ్లీ మైక్ కట్.. బహుశా ఇంతటి అన్యాయమైన పరి స్థితులు ఎవరికీ ఎదురై ఉండవేమో!’’ అని జగన్ ఆశ్యర్యం వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారమే చేస్తున్నారా? జగన్ ఈసందర్భంగా అసెంబ్లీ రూల్స్ బుక్‌లోని పలు నిబంధనలను మీడియా ప్రతినిధులకు చదివి వినిపించారు. ‘‘151వ నిబంధనలోని 3వ సబ్ సెక్షన్లో బడ్జెట్‌కు సంబంధించి ఆరు రోజు లపాటు సాధారణ చర్చ జరగాలని కచ్చితంగా నిర్దేశించారు. అలాగే వివిధ డిమాండ్లపై చర్చ, ఆమోదానికి ఎనిమిది రోజుల సమయం కేటాయించాలని ఉంది. ఇవి కచ్చితంగా అనివార్యం గా పాటించి తీరాల్సిన నిబంధనలు. అలా జరగాల్సిన సాధారణ చర్చను కేవలం నాలుగు రో జులకు కుదించారు. శాసనసభలో ఉన్నది రెండే రెండు పక్షాలు.. ప్రతిపక్షంలో ఉన్నది మా పార్టీ ఒక్కటే అయినా గంటన్నర సమయమే ఇస్తారని చెప్తున్నారు. బడ్జెట్‌పై సాధారణ చర్చలో నేను మాట్లాడటానికి మరో 20 నిమిషాల సమయం కావాలని అడిగితే.. అదీ ఇవ్వలేదు.. నాకు ఇవ్వకపోగా అధికారపక్షానికి మైక్ ఇచ్చి మాట్లాడమనడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని వివరించారు. విపక్షం గొంతు నొక్కితే ప్రజలు హర్షించరు శాసనసభలో ఉన్నది అధికార, ప్రతిపక్షాలేనని.. ప్రతిపక్షమన్నది ప్రజల గొంతు కనుక వాళ్ల గొంతు ప్రజలు వినాలనుకుంటారని.. ప్రతిపక్షం గొంతు వినపడేలా అవకాశం కల్పించడం స్పీకర్ ధర్మమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం గొం తు పూర్తిగా నొక్కేయాలి, వినపడకూడదనే ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు హర్షించరని అన్నారు. వాస్తవానికి నిజమైన ప్రతిపక్షం తాము కాదని, ప్రజలే నిజమైన ప్రతి పక్షమని అందుకే ప్రజల తరఫున తాము మాట్లాడేటపుడు గొంతును వినడానికి అధికారపక్షానికి ఓపిక ఉండాలని, ఆ ప్ర కారం అందరూ మార్పు తెచ్చుకోవాలని జగన్ విజ్ఞప్తిచేశారు. తమ పార్టీ సభ్యుల సస్పెన్షన్‌ను ఉపసంహరించడంతో పాటుగా తమ గొంతు వి నే ఓపిక తెచ్చుకుని సభ నడిపితే మంచిదన్నారు. ఆత్మస్తుతి-పరనింద తప్ప ఇంకేమీ ఉండదు సభలో ప్రతిపక్షం గొంతు నొక్కితే ‘ఆత్మస్తుతి-పరనింద’ తప్ప ఇంకేమీ మిగలదని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘సభ ఉండేది మీ గురించి మీరు డబ్బా కొట్టుకోవడానికి.. వైఎస్‌ను విమర్శించడానికే అనుకుంటే ఇంకేమీ మిగలదు’’ అని అధికారపక్షానికి హితవుపలికారు. తమవైపు నుంచి చర్చ బాగా జరగాలనే ఉద్దేశంతోనే పలు అంశాలపై నిరసన తెలుపుతూ సభలో కూర్చుంటున్నామని, మైక్ కట్ చేసినా బాధను దిగమింగుకుని తమవైపు నుంచి నాలుగడుగులు ముందుకేసి సహకరిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఎవరో అర్థం కావట్లేదు.. శాసనసభ జరుగుతున్న తీరును జగన్ తీవ్రం గా తప్పుబట్టారు. ‘‘అధికారపక్షం వారికి మైక్ ఇస్తూ చంద్రబాబును గొప్పగా పొగిడించుకోవడం, దివంగత రాజశేఖరరెడ్డిని తిట్టించడం మాత్రమే జరుగుతోంది. అసలు ముఖ్యమంత్రి వైఎస్సా లేక చంద్రబాబునాయుడా? అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. వైఎస్ చనిపోయి కూడా ఐదేళ్లు దాటింది. అయినా ఇంకా ఆయననే తిట్టడం ఎంత దారుణం? మా పార్టీ సభ్యులు టీడీపీ విధానాలపై విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే చాలు.. వెంటనే మైక్ కట్ చేస్తున్నారు.. టీవీల్లో ప్రసారాలను గమనించే వారికి ఇది స్పష్టంగా కనబడుతోంది. టీవీ ఫోకస్ కూడా ఎక్కువగా అధికారపక్ష సభ్యుల మీదనే ఉంటోంది. మా వాళ్లు (వైఎస్సార్ సీపీ సభ్యులు) బాగా మాట్లాడుతుంటే టీవీల్లో చూపించరు. అదే టీడీపీ వాళ్లు మమ్మల్ని తిట్టేది అదే పనిగా చూపిస్తారు. అందుకు కారణమేమంటే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించే హక్కులు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వాళ్లకు ఇచ్చారు. ఇక టీవీల్లో కూడా వాళ్లు చూపించాలనుకున్నదే చూపిస్తున్నారు. చెప్పాలనుకున్నదే చెప్తున్నారు. ప్రతి పక్షం గొంతు అనేది ఎక్కడా వినిపించకూడదు, కనిపించకూడదు అన్నట్లు చేస్తోంటే ఇక ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా?’’ అ ని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ సభ్యులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇవ్వాల్సిన మంత్రులు మాట్లాడుతున్నప్పుడు అదే పని గా వై.ఎస్.రాజశేఖరరెడ్డిని నిందించడం అం దరూ గమనిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. అవి కూడా తప్పుడు తిట్లేనని, వారు చెప్పేవన్నీ అబద్ధాలేనని.. తాము మళ్లీ వాటిపై వివరణలు అడుగుదామంటే మైక్ ఇవ్వరని చెప్పా రు. అన్యాయం జరుగుతోందని తాము నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా టీవీల్లో కనిపించదన్నారు. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేస్తూ శాసనసభను నడుపుతున్నారంటే నిజంగా రాష్ట్రం మొత్తం సిగ్గుతో తలొం చుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. సత్సంప్రదాయాలను నెలకొల్పుదాం... ‘‘శాసనసభలో ఇలాంటి దుస్సంప్రదాయాలను నెలకొల్పవద్దు.. అధికారంలో ఇవాళ మీరుండొచ్చు... రేప్పొద్దున మేము రావొచ్చు. ఇలాంటి సంస్కృతి పునరావృతమైతే భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మా పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.. మరో సభ్యునిపై సభాహక్కుల తీర్మానాన్ని ఇచ్చారు.. అసలు వీరెందుకు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు? అలా నిరసనలు తెలపకుండా వారిని పిలిచి మాట్లా డి సమయం కేటాయించాలన్న ఆలోచన ఎందుకు చేయరు?’’ అని జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పార్టీకు న్న బలం మేరకు సభా కార్యక్రమాల సమయంలో 40 శాతం తమ పార్టీకి కేటాయిం చాలనీ, అంత సమయం ఇస్తున్నారా అన్న ది ఒక్కసారి ప్రశ్నించుకోవాలని సూచిం చారు. అసెంబ్లీ నడిపే తీరు కూడా దిగజారిపోయింద ని ఆందోళన వ్యక్తంచేశారు. ఇచ్చిన సమయంపైనా అబద్ధం చెప్తున్నారు తమ పార్టీకి గంటన్నర సమయం కేటాయి స్తూ బీఏసీలో చెప్పినప్పుడు జ్యోతుల నెహ్రూ, అమర్నాథ్రెడ్డి అంగీకరించారన డం అబద్ధమేనని జగన్ స్పష్టంచేశారు. ‘మీరు చెప్తున్నది తప్పు సార్’ అంటూ సభలోనే స్పీకర్‌తో అమర్నాథ్రెడ్డి చెప్పారని, జ్యోతుల నెహ్రూ తనకు మైక్ ఇవ్వకపోయి నా గట్టిగా అరుస్తూ ‘అబద్ధం’ అని చెప్పార ని, స్పీకర్ స్వయంగా ఒకసారి తనకు 2.30 గంటలు కేటాయించినట్లు, మరోసారి 1.30 గంటలు కేటాయించినట్లు చెప్పారని గుర్తుచేశారు. తన ప్రసంగానికి 21 నిమిషా లే అంతరాయం కలిగించారని స్పీకర్ చెప్ప డం సరికాదన్నారు. ‘‘అందరూ టీవీలు చూశారు కదా అంతరాయం కలిగించింది అంతేనా? ఏమిటీ అన్యాయం? నా ప్రసంగాన్ని 52 నిమిషాల సేపు అడ్డుకున్నారని జాబితాను స్పీకర్‌కూ ఇచ్చాం. ఆ తర్వాత కూడా ఇంకా అంతరాయాలు జరిగాయి. నేను మాట్లాడుతున్నప్పుడు 1.06 గంటల పాటు అడ్డుకున్నారు.. ఇంతకంటే దారుణమేమైనా ఉందా?’’ అని ప్రశ్నించారు. -
'సభ'లో సడేమియాలు
కేంద్రంలో బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం మొదలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం దాకా - అసలు ప్రతిపక్షం అనేది లేకపోతే బాగుండునన్న ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నది.అటు కేంద్రంలో చూస్తే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా దాటవేసి ఏకపక్ష పాలనకు బీజేపీ దారులు వెతుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే రీతిలో నడుస్తోంది. సభలో ఏకైక విపక్షంగా ఎంపికైన వైఎస్ఆర్సీపీ సభ్యులను ఆ పార్టీ నుంచి ‘ఖాళీ’ చేయించి ఏకపక్ష పాలన సాగించుకోవాలని చూస్తోంది. బ్రిటిష్ పాలనా కాలం నాటి సెంట్రల్ లెజిస్లేచర్‌లో గానీ, స్వాతంత్య్రానంతరం తొలి పార్లమెంటులోగానీ, లెజిస్లేచర్ల సభాపతుల స్థానాలను అధిష్టించిన విఠల్ భాయ్ పటేల్, దాదాసాహెబ్ గణేశ్ వాసుదేవ్ మావ లంకర్, అనంతశయనం అయ్యంగార్, నీలం సంజీవ రెడ్డి వంటి హేమాహేమీలు ఏదో ఒక రాజకీయ పక్షానికి చెందినవారే. అయినా ఒకసారి అన్ని పక్షాలు కలసి ఆ ఉన్నత స్థానానికి ఎంపిక చేసిన తరువాత పాక్షిక రాజకీయాల నుంచీ, ఆ స్థానాల నుంచీ వ్యాఖ్యలు చేయలేదు. తీర్పులు ఇవ్వలేదు. అంతటి సమున్నత విలువలతో వారు సభలను నడిపించారు. ఏవీ ఆ అడుగుజాడలు తొలి లోక్‌సభ స్పీకర్ మావలంకర్. ఆయన అంతకు ముందు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెం బ్లీ (1946-47) అధ్యక్షుడు. రాజ్యాంగ సభకు, తాత్కా లిక పార్లమెంటుకు (1947-1950) మావలంకర్ అధ్య క్షునిగా పనిచేశారు. సభా గౌరవానికి దీటుగా సభాప తులు ఎలా వ్యవహరించాలో ఆయనే కొన్ని సూత్రాలను నిర్దేశించారు. పార్లమెంటరీ వ్యవస్థ సక్రమ పద్ధతులలో నడవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రతిపా దిస్తూ ఎన్నటికీ మరపురాని మహోపన్యాసం చేశారు. తొలి స్పీకర్‌గా మావలంకర్ పేరును ప్రతిపాదిస్తూ ప్రథమ ప్రధాని నెహ్రూ తీర్మానాన్ని ప్రతిపాదించగానే (మే 15, 1952) సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తరువాత మావలంకర్ ఇచ్చిన ఉపన్యాసంలో కలకాలం స్మరించుకోదగిన ఆణిముత్యాలను పేర్కొన్నారు. ‘మనం అందరం దేనికోసం కృషి చేయాలో రాజ్యాం గం ఉపోద్ఘాతంలోనే స్పష్టంగా ఉంది. దేశ ప్రజలందరికి సమన్యాయం. స్వేచ్ఛ, సమత్వం, సౌభ్రాత్రం సాధించి పెట్టాలన్నదే ఆ ఆదేశం. లెజిస్లేచర్‌లో మనం మాట్లాడే ప్రతి మాటనూ, ప్రతి చర్యనూ ఈ సమష్టి లక్ష్యం నుంచే చూడాలి. ఆచరించాలి. రాజ్యాంగం ఆశిస్తున్న ఈ ప్రాథ మిక ఆదర్శాలకు మనం కట్టుబడి ఉంటే, పార్లమెంటరీ వ్యవస్థ సమర్థంగా నడిచేందుకు తగిన శుభకరమైన వాతావరణం ఏర్పడుతుంది’ అన్నారాయన. వీటన్నిటినీ గౌరవించే ప్రభుత్వాలు ఉంటేనే మంచి వాతావరణానికి అవసరమైన ఆదర్శవంతమైన చర్చ సాగించగలవని ఆయన ఆశించారు. సభలోని అన్ని పక్షాలు కలసి స్పీకర్ పదవికి ఎంపిక చేసిన వ్యక్తి ఆ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏ పార్టీకి ‘అనుబంధ గొంతు’గా కాకుండా అందరి వాణినీ, వ్యాఖ్యనీ, తీర్పునూ వినిపిం చాలని మావలంకర్ అన్నారు. అలా అని స్పీకర్ ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాకుండా పోడు. కానీ, ఆ పార్టీకి ఆయన అనుబంధంగా ఉండడానికి వీలులేదు. ‘అందు వల్ల సభాపతి విశిష్ట సంప్రదాయాలకు ప్రతినిధిగా నడుచుకోకుంటే దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ సుస్థిర ప్రభుత్వాలు నిలదొక్కుకోలేవు. మన స్పీకర్లు తమ తమ పార్టీల చర్చలకూ వాటి వివాదాలకూ దూరంగా ఉండవచ్చు గాని స్పీకర్ అయినంత మాత్రాన ఆ వ్యక్తి అసలు రాజకీయవేత్త కాకుండా పోడు’ అని కూడా మావలంకర్ చెప్పారు. విపక్షాన్ని ఖాళీ చేయడమే ధ్యేయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇటీవలి సరళిని బట్టి చర్చలు పక్కదారులు పడుతున్నాయని ప్రజలు భావిస్తున్నా రంటే, అందులో తప్పులేదని అనిపిస్తుంది. నిజానికి జాతీయ స్థాయిలో పాలకపక్షాలు అనుసరిస్తున్న పెడధో రణుల ఫలితంగానే ఈ పరిణామం చోటు చేసుకుం టోంది. కేంద్రంలో బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం మొదలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం దాకా - అసలు ప్రతిపక్షం అనేది లేకపోతే బాగుండునన్న ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నది. అటు కేంద్రంలో చూస్తే కాం గ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా దాటవేసి ఏకపక్ష పాలనకు బీజేపీ దారులు వెతుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే రీతిలో నడుస్తోంది. సభలో ఏకైక విపక్షంగా ఎంపికైన వైఎస్ఆర్సీపీ సభ్యు లను ఆ పార్టీ నుంచి ‘ఖాళీ’ చేయించి ఏకపక్ష పాలన సాగించుకోవాలని చూస్తోంది. ఇక్కడ అసెంబ్లీ సమావే శాలూ, అక్కడ పార్లమెంటు సమావేశాలూ ప్రారంభం కాకముందు నుంచే ‘ప్రతిపక్ష’ సభ్యులకు ‘ఎర’ పెట్టి ఫిరాయింపులకు ప్రోత్సహించడాన్ని ప్రజలూ పరిశీల కులూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రానికి ‘హామీలు’ తప్ప ఇవ్వలేని, వాటిని నెరవేర్చి చూపలేని ప్రభుత్వాలన్నీ ధనస్వామ్య వ్యవస్థలో తొక్కే అడ్డదారులన్నీ ఇలాగే ఉంటాయి. చర్చను పక్కదోవ పట్టించే కుట్ర ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రెండు రోజుల పాటు చర్చంతా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల హత్యల చుట్టూనే సాగింది. ఎన్నికల తరు వాత గత మూడు నెలల్లో తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తలను టీడీపీ వారు హత్య చేశారనీ, ఆ అంశాన్ని చర్చించాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుపట్టారు. కానీ అధికార పక్షం బాధ్యతా రాహిత్యంతో ఈ సమస్యతో ఏమీ సం బంధం లేని మరొక అనవసర చర్చకు తెరలేపింది. ఈ చర్చలో ఆరోపించడానికి ఏమీ దొరక్క, ‘వెనుకటికి మీ తాత పొగచుట్ట తాగాడ’న్న ఫిర్యాదు లాంటి ఆరోప ణలను పాలకపక్షం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హంత కుడని, రుజువులు చూపకుండా విమర్శలు కురిపిస్తే, వాటి గురించి చెప్పడానికి ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. ఆయన తనయుడు జగన్‌ను ‘రాజకీయ ఉన్మాది’ అనీ, ‘ఆర్థిక ఉన్మాది’ అనీ పాలకపక్షం విమర్శిస్తున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టిన కేసులను ఆధా రం చేసుకుని, ఇంకా రుజువు కాని కేసులను పట్టుకుని టీడీపీ సభ్యులు ఈ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే విపక్షం ఇన్ని విమర్శలు కురిపిస్తున్నా తన తాతగారు రాజారెడ్డి హత్యోదంతాన్ని ఈ సందర్భంగా జగన్ ఉపయోగించుకోకపోవడం గమనించవలసిన విషయం. నిజానికి తమ పార్టీ కార్యకర్తల హత్యలపై, శాంతి భద్ర తలపై చర్చ జరగాలని జగన్ పట్టుపట్టిన తరువాతే, పాత హత్యలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ కుటుంబం మీద అధికార పక్షం ఎదురుదాడిని మొదలుపెట్టింది. పరిటాల రవి, వంగవీటి రంగా హత్యల ప్రస్తావన అలా వచ్చిందే. కానీ ఇటీవల జరిగిన హత్యలను గురించి ప్రస్తావించడం టీడీపీ వారికి ఇష్టం ఉండదు. చిత్రం ఏమిటంటే పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొన్న జగన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా సరే, తెలుగుదేశం సభ్యులు అదే అంశాన్ని పట్టుకుని సాగతీస్తున్నారు. జగన్ నిర్దోషిత్వం గురించి వెల్లడికాకుండా జాగ్రత్త పడుతున్నారు. పరిటాల రవి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిగి దోషులకు శిక్షలు కూడా పడ్డాయి. ఇంతకీ ఈ కేసులో నిందితులు జేసీ సోదరులకు టీడీపీయే టికెట్లు ఇవ్వడం దీనికి కొసమె రుపు. ఇలాంటి వారందరినీ తన పంచన చేర్చుకుని ఎదురుదాడికి దిగడం, విపక్షం నోరు నొక్కాలని యత్నిం చడం ఏం న్యాయం? వాస్తవానికి తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన హత్యలకూ, ఎన్కౌంటర్లకూ అంతే లేదు. విజయవాడలో జరిగిన వంగవీటి రంగా హత్య కూడా అందులో భాగమేనన్న ఆరోపణల నుంచి ఇంత వరకు తెలుగుదేశం బయటపడలేదు. ఈ కేసులో ముద్దా యి వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. నిజాయితీ ఉంటే బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని చెప్పాలి. ఆ కుటుంబాలకు సాంత్వన ఇవ్వాలి. అంతేగానీ మృతులను తాగుబోతులని నిందించడం సబబు కాదు. ఇవన్నీ వదిలిపెట్టి జగన్ మీద చేసిన ఆరోపణలనే ఎన్నాళ్లు చేస్తారు? ఇది ఎంత వరకు సబబు? సభను అగౌరవపరిచే పదజాలం వైఎస్ఆర్సీపీనీ, ఆ పార్టీ నేత జగన్‌నూ ‘హంతకులు’, నరహంతకులు’ వంటి పదాలతో తెలుగుదేశం సభ్యులు నిందలు వేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరు ద్ధం. ఇలాంటి పదాలను అధికారికంగా నిషేధించిన సం గతి అధికార పార్టీ సభ్యులకు తెలిసినట్టు లేదు. పార్ల మెంటరీ పరిభాషా పదాలను క్రోడీకరించి, తొలి పది లోక్‌సభలలో సభ్యులు ప్రయోగించిన అభ్యంతరకర పదాలను కలిపి 1999లో లోక్‌సభ సచివాలయం పుస్త కంగా వెలువరించింది. నిషేధించినవాటిలో ‘మర్డరర్స్’ (పే.239) అన్న పదం ఒకటి. కానీ ఈ పదాలను యథే చ్ఛగా వాడినా తప్పించుకుంటున్న వారు ‘బఫూన్’, ‘చిలిపి ప్రవర్తన’, ‘అవివేక ప్రవర్తన’ వంటి పదాలు జగన్ నోటి నుంచి వచ్చినందుకు ఎదురుదాడికి దిగారు. నిజానికి ఈ ప్రయోగాలు ఏవీ నిషేధిత పదాల పట్టికలో చేరలేదు. దాచేస్తే దాగవు సత్యాలు అసలు టీడీపీ హయాంలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగా యి! ఎన్ని స్కాములు జరిగాయి! మురళీధరన్, ముది గొండ పద్మలను అంతమొందించిన తీరు ఎలాంటిది? డాక్టర్ రామనాథం, జాపా లక్ష్మారెడ్డిల హత్యలు ఏం చెబుతున్నాయి? దాదాపు 300 మంది నక్సల్స్‌ను ఎన్ కౌంటర్ చేసిన ఘనత ఎవరిది? గద్దర్ గుండెను గురిచే సిన తుపాకీ ఏ ప్రభుత్వం హయాంలోనిది? అలాగే ఎన్టీఆర్‌పై జరిగినట్టు చెబుతున్న హత్యాయత్నం గురిం చి కూడా కొంచెం చెప్పుకోవాలి. మల్లెల బాబ్జీ అనే యువకుడు జరిపినట్టు చెబుతున్న ఈ హత్యాయత్నం కథ విఠల ఆచార్య సినిమా ఫక్కీలో నడిచింది. చివరికి ఆ బాబ్జీదే విదూషకుడి ఆత్మహత్యలా చూపించిన తీరు నభూతో నభవిష్యతి కాదా! ఈ ఉదంతం మీద రోజుకో బుట్టలో నుంచి ఒక్కొక్క కొత్త పాము బయటకు వస్తుం టే, ఎందుకైనా మంచిది అని బాబ్జీ హత్యాయత్నం ఉ దంతం మీద జస్టిస్ శ్రీరాములు కమిషన్‌ను నియమిం చారు. ఈ కమిషన్ ఆ హత్యాయత్నం కేసంతా ఒక డ్రామా అని తేల్చి చెప్పలేదా? ఆ రికార్డు ఇప్పటికీ సచి వాలయంలో ఉందా? లేదా? ఈ విషయాలన్నీ మాజీ ముఖ్యమంత్రి, నాటి ఆర్థికమంత్రి నాదెండ్ల భాస్కర రావు జీవిత చరిత్ర (నా జీవిత ప్రస్థానం)లో నమోదైనా యా, లేదా! అసలు ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న శాంతిభద్రతల చర్చకు ముఖ్యమంత్రి ఎందుకు గైర్హాజరై నట్టు? చర్చ ఆరంభంలో తాను నీతిమంతుణ్ని అని చాటుకున్న ముఖ్యమంత్రి ఎందుకు ముఖం చాటేస్తు న్నట్టు? ధనస్వామ్య పాలకులు తెచ్చి పెట్టుకున్న అహంకారాలు నిజాన్ని దాచలేవు. చిత్రం ఏమిటంటే పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొన్న జగన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా సరే, తెలుగుదేశం సభ్యులు అదే అంశాన్ని పట్టుకుని సాగతీస్తున్నారు. జగన్ నిర్దోషిత్వం గురించి వెల్లడికాకుండా జాగ్రత్త పడుతున్నారు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఏబీకే ప్రసాద్ -
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేది: పల్లె
అనంతపురం:ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేదని, ఇప్పు డు అధికారం చేతిలో ఉన్నా రైతులకు న్యాయం చేయలేకపోతున్నామని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో ఆయన మాట్లాడారు. డీడీలు చెల్లించి ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేకపోతున్నామన్నారు. దీనిపై సమాధానం చెప్పే పరిస్థితి లేక గ్రామాల్లోకి వె ళ్లాలంటేనే ఇబ్బందిగా మారిందన్నారు.