Parar
-
ప్రేమజంట పరార్
హాలియా : నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. విషయం తెలిసి అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటిపై దాడి చేయడం, దానికి వారు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో హాలియాలోని ఎస్సీ కాలనీలో తీ వ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన మారపాక నరేష్(20), పడిగిమర్రి సునిత(19) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమవ్యవహరం పెద్దలకు తెలియడంతో గతంలోనే మందలించారు. దీంతో ఇద్దరు సోమవారం ఇళ్ల నుంచి పారిపోయారు. సునిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిం చారు. దీంతో వారు నరేష్ పెంపుడు తండ్రి వెంకటయ్యను పిలిపించి ఆచూకీ కోసం విచారించారు.వారి ఆచూకీ తెలుసుకుని తీసుకొస్తానని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తుల దాడి వెంకటయ్య మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు వచ్చి దాడిచేశారు. ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు వెంకటయ్యను చితకబాదారు. బాధితుడి అరుపులు విని చట్టుపక్కల వారు రావడంతో గుర్తుతెలియని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన వెంకటయ్యను తొలుత సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి అటు నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. యువతి బంధువు ఇంటిపై.. మారపాక వెంటయ్యపై దాడిచేయించింది నకిరేకంటి సైదులే అని ఆరోపిస్తూ కాలనీవాసులు సుమారు 200 మం ది అతడి ఇంటిపై దాడిచేశారు. దీంతో సైదులు భయాందోళన చెంది ఇంటి వెనుక నుంచి పరారయ్యాడు. కాంగ్రెస్ నాయకుడు కుందూరు వెంకట్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నాడు. దీంతో కాలనీవాసులు సైదులును అప్పగించాలని కోరినా వెంకట్‌రెడ్డి నుంచి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు అతడి ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని పోలీ సులు వచ్చి కాలనీవాసులను చెదరగొట్టి సైదులును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాలనీని సందర్శించిన ఏఎస్పీ ఇరువర్గాల ఘర్షణ విషయం తెలుసుకుని ఏఎస్పీ రమారాజేశ్వరి హాలియా ఎస్సీ కాలనీని సందర్శించారు. ఘర్షణకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కాలనీలో పది మంది ఎస్ఐలు, సీఐతో పాటు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆమె వెంట మిర్యాలగూడ డీఎస్పీ కుంచ మోహన్, సీఐ శివశంకర్‌గౌడ్, ఎస్ఐలు సురేష్‌కుమార్, రాజశేఖర్‌గౌడ్ ఉన్నారు. కేసు నమోదు సునీతను అపహరించాడనే అభియోగంతో నరేష్‌పై కిడ్నాప్ కేసు,పరస్పర దాడుల నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన సుమారు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
లాకప్ నుంచి నలుగురు పరార్
నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ :పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు పారిపోయారు. నరసాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో చోరీ కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న తోటి ప్రసాద్, అతని భార్య లక్ష్మి, పెనుగొండకు చెందిన ఉండవల్లి వెంకటేష్, నరసాపురానికి చెందిన బూసిని శ్రీకాంత్ పరారయ్యారు. నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో ఉన్న పోలీస్‌స్టేషన్ లాకప్‌కు రంధ్రం చేసుకుని పారిపోయారని పోలీసులు చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టణ పోలీస్‌స్టేషన్ వెనుకే సీఐ కార్యాలయం కూడా ఉంది. ఇక్కడ సెం ట్రీ డ్యూటీ కూడా 24 గంటలూ ఉంటుంది. సిమెం ట్‌తో నిర్మించిన లాకప్ గోడ పగులగొట్టి పారి పోయారని పోలీసులు చెప్పటం అనుమానాలకు దారి తీసింది. వివరాలు ఇవి..కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన తోటి ప్రసాద్ కార్లు దొంగిలించి వాటిపైనే అతని భార్య లక్ష్మిని, పిల్లలను తిప్పుతూ ఇంటి దొంగతనాలకు పాల్పడేవాడు. ఇతను పలు జిల్లాల్లోని 10 దొంగతనం కేసుల్లో నిందితుడు. ప్రసాద్, లక్ష్మిలను నెల కిందట నరసాపురం పట్టణ పోలీసులు బెంగళూరులోఅదుపులోకి తీసుకున్నారు. వారికి సహకరించిన పెనుగొండకు చెందిన ఉండవల్లి వెంకటేష్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరినుంచి కేజీన్నర బంగారం, 70 బైక్‌లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో చోరిసొత్తును స్వాధీనం చేసుకున్న పోలీ సులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీరి తోబాటు బైక్ దొంగతనంలో పట్టుబడ్డ స్థానికుడు బూసిని శ్రీకాంత్ కూడా లాక ప్లో ఉన్నాడు. ఇతనిపై ఓ హత్య కేసు కూడా ఉంది. వీరిని పట్టణ పోలీసులు విచారణ చేస్తూ వచ్చారు. ఇతర జిల్లాల్లో కూడా వీరు చోరీలకు పాల్పడినట్టు తెలిసి ఆయా జిల్లాల పోలీసులు వీరిని విచారణ చేసేందుకు నరసాపురం రానున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వీరిని చాలా కాలంగా స్టేషన్లో ఉంచడంతో సిబ్బందిని వారు లోబరుకుని, వారి సహకారంతోనే పరారై ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరువు పోతుందని లాకప్‌కు రంధ్రం చేసి పారిపోయారనే ప్రచారాన్ని పోలీసులు లేవనెత్తి ఉంటారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఎస్పీ సీరియస్ ! నరసాపురంలో పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ అయినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో లాకప్‌లో ఉన్నవారు పరారు కావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. రూరల్ పోలీస్‌స్టేషన్‌నుంచి 10రోజులు క్రితం ముగ్గురు నిందితులు పరారైన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. తాజాగా పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి నలుగురు నిందితులు పరారు కావడం చర్చనీయాంశమైంది. వీఆర్‌లోకి ఎస్సై, ముగ్గురు పీసీలు ఈ ఘటనతో పట్టణ ఎస్సై ప్రసాద్‌తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లను వీఆర్‌లోకి పంపించారు. ఈ ఘటనపై విచారకు సీఐ పూర్ణచంద్రరావును నియమించారు.