రాజ్యసభలో 10 కోట్లు వృధా
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లాగానే శీతాకాల సమావేశాలు కూడా దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. లోక్సభకన్నా రాజ్యసభ సమావేశాలు ఇంకా హుందాగా కొనసాగాలి. అందుకనే దాన్ని ‘పెద్దల సభ’ అని పిలుస్తారు. కానీ ఈసారి రాజ్యసభ సమావేశాలు 50 శాతం కూడా సక్రమంగా నడవలేదు. నిర్దిష్టమైన అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగిందీ కేవలం 14 శాతమే.
ఒక్కో సభ నిర్వహణకు ఒక్కో నిమిషానికి 29 వేల రూపాయల ప్రజా ధనం వృధా అవుతుంది. ఈ లెక్కన గంటకు 17.4 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంతరాయాలు, వాయిదాల కారణంగా రాజ్యసభ కాలం 55 గంటలు వృధా అయిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసర్చ్ వెల్లడించింది. అంటే పది కోట్ల రూపాయల ప్రజాధనం మురికి కాల్వలో పోసినట్టయింది. దీనికి ఎవరిని నిందించాలి?