Paul Krugman
-
‘అచ్ఛేదిన్ పీఎం అంగీకరించరు’
సాక్షి, న్యూఢిల్లీ : తయారీ రంగం కుంటుపడితే దేశంలో సామూహిక నిరుద్యోగం తలెత్తుతుందని నోబెల్ గ్రహీత పాల్ క్రుగ్మన్ చేసిన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌ను టార్గెట్ చేశారు. గత రెండేళ్లుగా తాము చెబుతున్నదే ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్త క్రుగ్మన్ చెప్పారని..అయినా ప్రధాని మోదీ అంగీకరించే పరిస్థితిలో లేరని రాహుల్ అన్నారు. అచ్ఛేదిన్‌పై ఊదరగొడుతున్న మోదీ నినాదం మసకబారుతుందని ఈ నివేదికను ప్రస్తావిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. గత రెండేళ్లకు పైగా తాము చెబుతున్న విషయాలను నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆర్థికవ్తేత పాల్ క్రుగ్మన్ ఇప్పుడు నిర్ధారించారని రాహుల్ వ్యాఖ్యానించారు. తయారీ రంగాన్ని చక్కదిద్దకుంటే ఉపాధి రంగం కుదేలవుతుందన్న హెచ్చరికలను మోదీ పెడచెవిన పెడుతున్నారన్నారు. నిరుద్యోగంలో కూరుకుపోయిన యువత భారత్‌కు అతిపెద్ద సవాల్‌గా మారినా దురదృష్టవశాత్తూ మన ప్రధాని అంగీకరించే పరిస్థితిలో లేరని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఇటీవల క్రుగ్మన్ పలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తీవ్రస్ధాయిలో అసమానతలున్నాయని, దేశం ఆర్థికంగా అద్భుత ప్రగతి సాధిస్తున్నా..వాటి ఫలితాలు సమానంగా పంపిణీ కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్ 150 ఏళ్లలో సాధించిన పురోగతిని భారత్ కేవలం మూడు దశాబ్ధాల్లోనే సాధించిందని చెప్పారు. -
6 శాతం వృద్ధి రేటు నిరాశాజనకం
♦ నోట్ల రద్దు, ఆర్బీఐ కఠిన పాలసీ, బలమైన రూపాయే తక్కువ వృద్ధికి కారణాలు ♦ ‘నోబెల్’ ఆర్థికవేత్త పాల్క్రుగ్మన్ ముంబై: భారత్ వంటి దేశానికి 6 శాతం వృద్ధి రేటు నిరాశ కలిగించే విషయమని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత పాల్క్రుగ్మన్ అన్నారు. మోదీ సర్కారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఆర్బీఐ కఠిన విధానం, బలమైన రూపాయి ఇవే వృద్ధి నిదానంగా ఉండడానికి కారణాలుగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అధిక సంఖ్యలో పనిచేసే శ్రామిక శక్తిని కలిగి ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ ఆ మేర ఫలితాలను చూపించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. 6% వృద్ధి రేటు నిరాశపరిచిందని, కనీసం 8–9% అయినా నమోదు చేయాల్సి ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.1%గా నమోదవడం తెలిసిందే. అబివృద్ధి చెందిన దేశాల మాదిరిగా కాకుండా భారత్‌ను సంప్రదాయ స్థూల ఆర్థిక అంశాలు బాధిస్తున్నాయన్నారు. అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే, ఆర్బీఐ కఠిన విధానాన్ని కొనసాగించడం, బలమైన రూపాయి ఎగుమతుల్లో పోటీ పడలేకుండా చేశాయన్నారు. ఆర్బీఐ విధానాన్ని ఎందుకు సరళతరం చేయలేదో తనకు అర్థం కాలేదని ఆయన పేర్కొన్నారు. -
నోట్ల రద్దుతో ప్రజల్లో మార్పు రాదు..
నోబెల్ గ్రహీత పాల్ క్రుగ్మన్ అభిప్రాయం న్యూఢిల్లీ: నోట్ల రద్దు భారీ స్థారుులో నష్టం కలిగించే చర్య అని నోబెల్ పురస్కార గ్రహీత, అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు పాల్ క్రుగ్మన్ అన్నారు. ఇది ప్రజల ఆలోచనను మార్చలేదన్నారు. మనీ లాండరింగ్ విషయంలో మరింత జాగ్రత్త పడతారని, పక్కదారులు వెతుకుతారని, మరోసారి ఇలానే చేస్తే తమను తాము రక్షించుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆచరిస్తున్న విధానం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగించేదిగా పేర్కొన్నారు. క్రుగ్మన్ అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన హెచ్‌టీ నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. డీమోనిటైజేషన్ను అసాధారణ చర్యగా పేర్కొన్నారు. రూ.2,000 నోటు విడుదల సరైంది కాదన్న ఆయన... నల్లధనాన్ని ఏరిపారేయడానికి ఇదొక ప్రయత్నమని చెప్పారు.