pay scale
-
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేలు
సాక్షి, హైదరాబాద్: పట్టణ/గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా/సెర్ప్)ల ఉద్యోగులకు శుభవార్త. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మెప్మాలో పనిచేస్తున్న 378 మంది ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేలు వర్తింపజేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సెర్ప్‌లోని 3,974 మంది ఉద్యోగులకు సైతం పేస్కేలు వర్తింపజేస్తూ గత మార్చి 18న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జీవోలు బయటకు వచ్చాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి పేస్కేలు వర్తింపు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు 2023 ఏప్రిల్ 1 నుంచి పేస్కేల్ వర్తించనుంది. ప్రస్తుత కనీస వేతనానికి సమీపంలో ఉన్న పేస్కేళ్లను వర్తింపజేయనున్నారు. మెప్మా ఉద్యోగులకు ప్రస్తుత కనీస వేతనానికి రక్షణ కల్పిస్తారు. సెర్ప్ ఉద్యోగుల ప్రస్తుత స్థూల వేతనం, ఇతర అలవెన్సులకు రక్షణ లభించనుంది. పేస్కేలు వర్తింపజేసినా సెర్ప్, మెప్మా ఉద్యోగులు ఇప్పటి తరహాలోనే రిజిస్టర్డ్ సొసైటీ ఉద్యోగులుగా కొనసాగుతారని, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించినట్టు లేదా ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్టు పరిగణించడానికి వీలు లేదు. కాగా, వీరికి ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా ఇకపై ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే మెప్మాలో రెగ్యులర్/కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ పోస్టులను సృష్టించాలని ఆ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. మెప్మా కొత్త పేస్కేళ్లు ఇలా: మెప్మా ఉద్యోగులకు వారి హోదాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీ పేస్కేళ్లను వర్తింపజేయనున్నారు. స్టేట్ మిషన్ డైరెక్టర్లకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్లకు సూపరింటెండెంట్, ఎంఐఎస్ మేనేజర్లకు సీనియర్ అసిస్టెంట్, టౌన్ మిషన్ కోఆర్డినేటర్లకు సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్లకు కామన్ అసిస్టెంట్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు/జూనియర్ అసిస్టెంట్లు/డేటా ఎంట్రీ ఆపరేట ర్లకు జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్లకు డ్రైవర్, ఆఫీస్ సబా ర్డినేట్లకు ఆఫీస్ సబార్డినేట్ పే–స్కేళ్లు వర్తింపజేస్తారు. సెర్ప్‌లో పేస్కేళ్లు .. సెర్ప్‌లోని మండల సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్లు/ఆఫీస్ సబార్డినేట్లకు ఆఫీస్ సబార్డినేట్, మండల్ బుక్ కీపర్లకు రికార్డు అసిస్టెంట్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లకు సీనియర్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్లకు సూపరింటెండెంట్, ప్రాజెక్టు మేనేజర్లకు ఎంపీడీఓ, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్/ప్రాజెక్టు సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్లకు డ్రైవర్ల హోదాలో ప్రభుత్వ ఉద్యోగుల పేస్కేలు వర్తింపజేస్తారు. మెప్మాలో అడ్డదారిలో నియామకాలు? మెప్మా ఉద్యోగులకు పేస్కేలు వర్తింపజేస్తామని దాదాపు ఏడాది కిందటే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ తర్వాత మెప్మాలో కొంత మంది అధికారులు తమ పిల్లలను, బంధువులను దొడ్డిదారిలో నియమించుకున్నారని ఆరోపణలు న్నాయి. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవోతో వారికి సైతం ప్రయోజనం కలగనుందని విమర్శలు వస్తున్నాయి. -
Telangana VRAs: ‘పది’ పూర్తయితేనే పేస్కేల్!.. సర్కార్ చెప్తున్నదేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మందికి పైగా గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) పనిచేస్తుండగా, వారిలో పదో తరగతి, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న వారికే పేస్కేల్ వర్తింపజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు వీఆర్ఏ జేఏసీకి చెందిన 12 మంది నేతలతో జరిపిన చర్చల సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. చదువు లేని వాళ్లకు ఉద్యోగాలు క్రమబద్ధీకరించి వారికి పేస్కేల్ వర్తింపజేసేందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అసలు విద్యార్హత లేని 5వేల మందితో పాటు పదో తరగతిలోపు చదువుకున్న 7వేల మంది కలిపి మొత్తం 12 వేల మందికి పేస్కేల్ ఇచ్చే పరిస్థితి లేదని, ఏదైనా విషయం ఉంటే సీఎం కేసీఆర్ వద్ద మాట్లాడుకోవాలని జేఏసీ నేతలకు మంత్రి కేటీఆర్ చెప్పారని అంటున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ నేతలు చేసిన మరో ప్రతిపాదన కూడా సాధ్యం కాదనే రీతిలో అధికారులు బదులిచ్చినట్టు తెలుస్తోంది. విద్యార్హతలు సరిపోని వీఆర్ఏల కుటుంబ సభ్యులకు కారుణ్య ఉద్యోగాలిచ్చి, వారిలో విద్యార్హతలున్న వారికి పేస్కేల్ వర్తింపజేయాలని జేఏసీ నాయకులు కేటీఆర్‌ను కోరగా, అలాంటి ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తారని స్పష్టం చేశారని చెబుతున్నారు. అధికారులు మాత్రం తగిన విద్యార్హతలు లేకుండా, కారుణ్య నియామకాలిచ్చి పేస్కేల్ వర్తింపజేయడం న్యాయపరమైన సమస్యలకు దారితీస్తుందని చెప్పినట్టు సమాచారం. కాగా, సమ్మె కాలపు వేతనం, సమ్మెకాలంలో మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు ఆర్థిక సాయం, వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు లాంటి అంశాల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, త్వరలోనే సీఎం కేసీఆర్ వద్ద చర్చలుంటాయని మంత్రి కేటీఆర్ జేఏసీ నేతలకు చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో సమావేశం తర్వాత ఎవరికి పేస్కేల్ ఇవ్వాలనే అంశం తేలుతుందని, ఆ తర్వాతే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు కూడా వస్తాయని జేఏసీ నేతలు చెపుతున్నారు. -
AP: అక్టోబర్ 1 నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పేస్కేల్
సాక్షి, అమరావతి : ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులకు నేటి (అక్టోబరు 1) నుంచి ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నారు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని గతంలోనే ప్రభుత్వంలో విలీనం చేశారు. ఫలితంగా ఆర్టీసీపై ఉద్యోగుల జీతాల చెల్లింపు భారం తొలగిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ పే స్కేల్‌ను కూడా వర్తింపజేయడంతో దాదాపు 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలగనుంది. పే స్కేల్ నిమిత్తం ఆర్టీసీ ఉద్యోగుల కేడర్‌ను కూడా ఇప్పటికే ఖరారుచేశారు. ఇక దర్జాగా ప్రభుత్వ జీతాలు ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ప్రతినెలా ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఉండేది. ఆ అప్పుల మీద వడ్డీ భారమే ఏడాదికి రూ.350 కోట్లు చెల్లించాల్సి రావడంతో ఆర్టీసీ ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని 2020, జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేసింది. అప్పటి నుంచి దాదాపు 52 వేలమంది ఉద్యోగుల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,600 కోట్లు వెచ్చించింది. ఇలా ఇప్పటికి రెండేళ్ల 9 నెలల్లో రూ.9,900 కోట్లను ప్రభుత్వం జీతాల కింద చెల్లించింది. ప్రభుత్వ కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపుతో సర్కారుపై ఏడాదికి రూ.360 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, మొత్తం మీద రూ.3,960 కోట్ల ఆర్థికభారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. మరోవైపు.. ప్రభుత్వంలో సంస్థను విలీనం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే పలు ప్రయోజనాలూ పొందుతున్నారు. చదవండి: ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ -
వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు పేస్కేల్‌ను వర్తింపజేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఉద్యోగులు రెవెన్యూ శాఖలో వీఆర్ఏలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖతో మంగళవారం జరిపిన సంప్రదింపులు ఫలించాయి. ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 2 వేల మందికి ఇటీవల పదోన్నతులు కల్పించారు. పదోన్నతులు పొందిన వారు మినహా మిగిలిన ఉద్యోగులు అందరికీ సెప్టెంబరు ఒకటిన కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పదోన్నోతులు పొందిన వారి ఫైల్‌ను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. పదోన్నతులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వారికి కూడా కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతినిస్తుందని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభిస్తే వీరికి కూడా సెప్టెంబరు ఒకటిన కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తారు. లేకపోతే ఆక్టోబరు ఒకటి నుంచి కొత్త జీతాలు చెల్లిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ఎరియర్స్‌తో సహా జీతాలు చెల్లిస్తారని, ఎవరికీ ఇబ్బంది ఉండదని ఆర్టీసీవర్గాలు చెబుతున్నాయి. -
ఉద్యోగ భద్రత లేదా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య భద్రత, పింఛన్, పదోన్నతులకు ఆమడ దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో కొలువులు చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులు, పిల్లల విద్య, వైద్యం వ్యయాలను తాము భరించలేకపోతున్నామని, బతుకుబండి లాగాలంటే తమకు పేస్కేల్– ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. డిమాండ్ల సాధనకు 28 రోజులుగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో కీలకం.. రాష్ట్రంలో మొత్తం 23,000 మంది వీఆర్ఏలు ఉన్నారు. అందులో 20,000 మంది ఇదే వృత్తిని సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. వీరిలో గరిష్టంగా 80 ఏళ్ల వయసు వారు కూడా వీఆర్ఏలుగా కొనసాగుతున్నారు. వీరంతా రూ.10,500 వేతనంతో బతుకుబండి నెట్టుకువస్తున్నారు. కాగా, 23,000 మందిలో 3,000 మంది 2012లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యారు. వీరిలో 60 శాతం మంది మహిళలు ఉన్నారు. పంటల నమోదు, గ్రామాల్లో చెరువులను, కుంటలను, కుంట శిఖాలను, ప్రభుత్వ భూములను పరిరక్షించడం వీరి విధుల్లో ముఖ్యమైనవి. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు వారికి క్షేత్రస్థాయిలో సహకారం అందింస్తుంటారు. గ్రామాల్లో కీలకంగా ఉన్నా.. వీరికి ఎలాంటి పేస్కేలు, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, పింఛన్ వంటి సదుపాయాల్లేవు. 24 గంటల్లో ఏ క్షణమైనా విధులకు వెళ్లాల్సి ఉంటుంది. పనిభారం పెరిగినా.. పదోన్నతుల్లేవు! కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారికి ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. 2017లో వీరిలో అర్హులకు ప్రమోషన్లు రావాల్సి ఉండగా.. జిల్లాల విభజన వీరికి శరాఘాతంగా మారింది. అదనపు జిల్లాలు, మండలాలు, రెవెన్యూడివిజన్లతో పనిభారం పెరిగింది. వాస్తవానికి సర్వీస్‌రూల్స్ ప్రకారం.. మూడేళ్ల తరువాత వీఆర్ఏలను అటెండర్, నైట్ వాచ్‌మన్, జీపు డ్రైవర్‌గా ప్రమోట్ చేయాలి. అయితే వీరిలో కొందరు ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కనీసం పింఛన్ సదుపాయం కూడా లేదు. ఇపుడున్న వీఆర్ఏలలో చాలామంది 40 ఏళ్లు సర్వీసు ఉన్న వారూ నామమాత్రం వేతనానికి పనిచేస్తున్నారు. పదోన్నతులు ఇవ్వాల్సిందే దశాబ్దాలుగా పనిచేస్తున్నా మాకు కనీస హక్కులు అమలు కావడం లేదు. 2017లో సీఎంతో వీఆర్ఏలు భేటీ అయిన సందర్భంలో అర్హతలు ఉన్న వారికి వివిధ దశల్లో పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. కారుణ్యనియామకాల ద్వారా వచ్చిన వీఆర్ఏలకు డబుల్ బెడ్రూం, అటెండర్ ఉద్యోగాలిస్తామన్న హామీలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. – కందుకూరి బాపుదేవ్, వీఆర్ఏ రాష్ట్ర సహాధ్యక్షుడు మెటర్నిటీ లీవులు కరువు దేశంలో మహిళలకు, అందులోనూ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెటర్నిటీ లీవులు విధిగా ఇవ్వాలి. కానీ, ఇంతవరకూ వీఆర్ఏలకు ఇది అమలు కావడం లేదు. గర్భిణులుగా ఉన్నా.. రాత్రీ పగలు లేకుండా.. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నాం. బాలింతలు కూడా డ్యూటీలు చేయాల్సిన దుస్థితి ఉంది. – కంది శిరీషారెడ్డి, రాష్ట్ర జేఏసీ కో–కన్వీనర్ -
వీఆర్ఏల వివరాలు మరోసారి.. తహసీల్దార్లకు సీసీఎల్ఏ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వివరాలను ప్రభుత్వం మరోసారి సేకరిస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 22 వేల మందికిపైగా వీఆర్ఏలు 19 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను సేకరించాలని నిర్ణయించడం గమనార్హం. వీఆర్ఏల ప్రధాన డిమాండ్ అయిన పేస్కేల్ అంశాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే యుద్ధప్రాతిపదికన వారి వివరాలను పంపాలని తహసీల్దార్లకు సీసీఎల్ఏ నుంచి ఆదేశం వచ్చిందని, అందుకే ఈ వివరాలను సేకరిస్తోందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీఆర్ఏలకు పేస్కేల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గౌరవ వేతనంపై నియమితులైన వీఆర్ఏలందరికీ పేస్కేల్ ఇవ్వడం సాధ్యం కాదని, డిగ్రీ విద్యార్హత ఉన్న వారికి మాత్రమే పేస్కేల్ ఇచ్చి వారిని రెవెన్యూలో కొనసాగించాలని, మిగిలిన వారికి గౌరవ వేతనాన్ని యథాతథంగా ఉంచి రెవెన్యూతోపాటు ఇతర విభాగాల్లో వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అంశాలివే..: వీఆర్ఏల వివరాలను పంపాలంటూ సీసీఎల్ఏ నుంచి వివిధ అంశాలతో కూడిన ఫార్మాట్ మళ్లీ తహసీల్దార్లకు అందింది. గతంలోనూ ఈ వివరాలను సేకరించినప్పటికీ అన్ని జిల్లాల నుంచి సమగ్ర సమాచారం అందలేదని, ఈ నేపథ్యంలోనే మళ్లీ కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకుంటున్నారని తహసీల్దార్లు చెబుతున్నారు. వీఆర్ఏల పేరు, పనిచేస్తున్న గ్రామం, మండలం, తండ్రి పేరు, కులం, విద్యార్హత, అపాయింట్మెంట్ తేదీ, ఎలా నియమితులయ్యారు, పుట్టిన తేదీ, ప్రస్తుత వయసు, క్రమశిక్షణ చర్యలు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా?, వీఆర్ఏ మొబైల్ నంబర్ వివరాలను ప్రభుత్వం మళ్లీ తీసుకుంటోంది. చదవండి: (Munugode- TRS Party: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు.. ఆయనకు టికెట్టా!) -
Telangana VRAs Pay Scale Issue: పది పాసైతేనే పేస్కేల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పేస్కేల్ అంశాన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వీఆర్ఏల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వాలని, మిగతా వారందరికీ గౌరవ వేతనంతోనే సరిపెట్టాలనే ప్రతిపాదన సిద్ధమైందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫైల్‌పై సీఎం సంతకం పెట్టడమే తరువాయి అని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 25 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తుండగా.. అందులో 3–6 తరగతుల మధ్య, 7–9 తరగతుల మధ్య, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలను రెవెన్యూ శాఖ సేకరించింది. ఇదే సమయంలో 1 నుంచి 9వ తరగతి వరకు.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలనూ తీసుకుంది. ఈ కేటగిరీల మేరకు పదో తరగతి, ఆపై చదివినవారు 5 వేల మంది వరకు ఉంటారని, వారికి పేస్కేల్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా. రెవెన్యూ సంఘాలు ఈ ప్రతిపాదనల విషయంగా ఉన్నతాధికారులను సంప్రదించినా.. విద్యార్హతల ఆధారంగా ప్రతిపాదనలు పంపుతున్నామని, తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నట్టు తెలిసింది. పోస్టింగ్ ఎక్కడెక్కడ? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలలో ఎంత మందిని ఏయే శాఖలకు పంపుతారనే దానిపై రెవెన్యూ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తారని.. అయితే డిప్యూటేషన్‌పై ఇతర శాఖలకు పంపుతారనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. అలాకాకుండా పేస్కేల్ వర్తించేవారు, డైరెక్ట్ రిక్రూటీలను మాత్రమే రెవెన్యూలో కొనసాగించి.. మిగతా వారిని వివిధ శాఖలకు పంపుతారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు డైరెక్ట్ రిక్రూటీలలో కొందరిని వ్యవసాయశాఖకు కూడా పంపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికారులు అంటున్నారు. గౌరవ వేతనం కేటగిరీలోకి వచ్చే వీఆర్ఏలను ప్రభుత్వం తన అవసరాలను బట్టి వివిధ శాఖల్లో ఉపయోగించుకుంటుందని, ఈ మేరకు నీటిపారుదల శాఖలోకి లష్కర్లుగా వెళ్లేవారికి గౌరవ వేతనమే ఉంటుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. అంతా గప్‌చుప్‌గా..! వీఆర్ఏలు, వీఆర్వోల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై నోరు మెదిపేందుకు ఉన్నతాధికారులెవరూ ముందుకు రావడం లేదు. సీసీఎల్ఏ అధికారులను ఎప్పుడు అడిగినా.. తమకేం తెలియదంటూ దాటవేస్తున్నారని, కనీసం ఏం జరుగుతుందో కూడా చెప్పడం లేదని వీఆర్ఏల సంఘాలు వాపోతున్నాయి. మరోవైపు కొన్ని వీఆర్ఏ సంఘాలు ఈనెల 23న పేస్కేల్ కోసం సీసీఎల్ఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇప్పుడే వీఆర్ఏ పేస్కేల్ అంశం పరిష్కారం కావాలని.. లేకుంటే ఎన్నికల సమయం వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంటుందనే ఆందోళన వీఆర్ఏలలో కనిపిస్తోంది. ఐదేళ్లుగా నాన్చుడే.. అర్హతల మేరకు సర్వీసు క్రమబద్ధీకరణ, డ్యూటీ చార్ట్, పేస్కేల్ ఇస్తామని సీఎం స్పష్టంగా మూడుసార్లు ప్రకటించారు. దేవుడు వరమిచ్చినా పూజారి అనుగ్రహించ నట్టు.. అధికారులు మా సమస్యను ఐదేళ్లుగా నాన్చుతున్నారు. డైరెక్ట్ రిక్రూటీలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది. – రమేశ్ బహదూర్, వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆందోళన బాట వీడం న్యాయమైన మా సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నాం. వేల మంది వీఆర్ఏలకు సంబంధించిన అంశాన్ని వీలైనంత త్వరగా సానుకూలంగా పరిశీలించాలి. ఈనెల 23న సీసీఎల్ఏ వద్ద నిరసన చేపడతాం. అవసరమైతే సమ్మెలోకి వెళ్తాం. – వెంకటేశ్ యాదవ్, వీఆర్ఏ అసోసియేషన్ కార్యదర్శి -
Andhra Pradesh: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2019 మార్చి 1 నుంచి, 2021 నవంబర్ 30లోగా రిటైరైన ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2017– పే స్కేల్ బకాయిలను రెండు విడతలుగా చెల్లించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడత మొత్తాన్ని సోమవారమే వారి ఖాతాల్లో జమ చేసింది. తద్వారా 5 వేల మందికి ప్రయోజనం కలగనుంది. త్వరలోనే రెండో విడత బకాయిలను కూడా చెల్లించనుంది. ఈ నిర్ణయంపై ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, దామోదరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వి.రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహం, వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్పీ రావు, ముఖ్య ఉపాధ్యక్షుడు నాయుడు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి ) -
APSRTC: ఆర్టీసీలో అదృష్టవంతులు
సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ విప్లవాత్మక విధాన నిర్ణయం ఆ సంస్థ ఉద్యోగులకు వరంగా మారింది. 2020, జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజా రవాణా విభాగం(పీటీడీ) ఏర్పాటు చేయడంతో తాజా పీఆర్సీ సిఫార్సుల్లో ఆ సంస్థ ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం కలగనుంది. పీటీడీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కలగనున్నాయని పీఆర్సీ నివేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు పీటీడీ ఉద్యోగులకు 32 గ్రేడ్లు, 83 దశలతో కూడిన రివైజ్డ్ పే స్కేల్‌ను సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా... ► పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సమానమైన పే స్కేల్‌ను కేటాయించారు. ఆర్టీసీలో 9 లేదా 18ఏళ్లు స్టాగ్నేషన్ గ్రేడ్ పే స్కేల్ డ్రా చేస్తున్నవారికి స్పెషల్ గ్రేడ్ పోస్ట్ పే స్కేల్, స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ ఐబీ / స్పెషల్ అడహాక్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ ఐబీ కేటాయించాలని సిఫార్సు చేశారు. ► ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే స్కేల్స్‌లో గ్రేడ్ 25 ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రయోజనాలు అందజేస్తారు. ► పీటీడీ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ 2020, జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. 2018, జూలై 1 కంటే ముందు సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వేతన స్థిరీకరణ రెండు దశల్లో చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. అంటే ముందు 2018, జూలై 1నాటికి నోషనల్‌గా నిర్ణయించి, ఆపై 2020, జనవరి 1నాటికి పే ని మళ్లీ నిర్ణయిస్తారు. మొదటి దశ కింద 2018, జూలై 1 నాటికి 1.6శాతం ఫిట్మెంట్ ప్రయోజనాన్ని కమిషన్ సిఫార్సు చేసింది. 2018, జూలై 1 నుంచి 2020, జనవరి 1 మధ్య సర్వీసులో చేరిన ఉద్యోగుల వేతన స్థిరీకరణకు కూడా సిఫార్సు చేశారు. అన్ని ప్రయోజనాలూ జనవరి 1, 2020 నుంచి వర్తింపు.. ► పీటీడీ ఉద్యోగులకు డీఏ ప్రభుత్వ ఉద్యోగులతోసమానంగా 2020, జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. ► ఇంటి అద్దె అలవెన్స్(హెచ్ఆర్ఏ) కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2020, జనవరి 1 నుంచి వర్తిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని వర్క్ స్టేషన్లలోని పీటీడీ ఉద్యోగులకు గరిష్టంగా రూ. 26వేలకు లోబడి 30శాతం హెచ్ఆర్ఏ సిఫార్సు చేశారు. ► సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని వర్క్ స్టేషన్లలోని పీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక రేట్లను సూచించింది. ► ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పీటీడీ ఉద్యోగులకు కూడా ఇతర సేవా ప్రయోజనాలు కల్పించాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్, కారుణ్య నియామకాల పథకం, ఏపీజీఎల్ఐ/ జీఐఎస్ బీమా రక్షణ తదితర ప్రయోజనాలను 2020, జనవరి 1 నుంచి వర్తింపజేస్తారు. ► పీటీడీ ఉద్యోగులకు పింఛన్ ప్రయోజనాల కోసం ఈపీఎస్–95 పథకంగానీ సీపీఎస్ పథకాన్నిగానీ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. సీపీఎస్ పథకాన్ని ఎంపిక చేసుకునేవారు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే డీసీఆర్జీ పథకం కిందకు వస్తారు. ఈపీఎస్–95 పథకంలో కొనసాగాలని ఎంపిక చేసుకునేవారికి గతంలో ఏపీఎస్ఆర్టీసీ గ్రాట్యుటీ విధానంలో ప్రయోజనం కల్పిస్తారు. ► ఇక రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్జిత సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్, ఈహెచ్ఎస్ కవరేజీ, మెడికల్ అలవెన్స్, వైద్య కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనాలు, డెత్ రిలీఫ్ తదితరమైనవన్నీ వర్తిస్తాయి. ‘అప్పటి పెన్షన్ విధానాన్ని కల్పించండి’ ఆర్టీసీ ఉద్యోగులకు 2004కు ముందు అమల్లో ఉన్న పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, ఐ.శ్రీనివాసరావు కోరారు. ఎస్ఆర్బీఎస్ను రద్దు చేసినందున 2020 జనవరి 1 తరువాత రిటైరయ్యే ఉద్యోగులకు కొంత పెన్షన్ కూడా రాని పరిస్థితి తలెత్తిందన్నారు. కాబట్టి తమకు 2004 ముందునాటి పెన్షన్ విధానాన్ని వర్తింపజేసి ఆర్థిక భద్రత కల్పించాలని సోమవారం ఓ ప్రకటనలో కోరారు. -
ఉద్యోగుల ఆశలపై మళ్లీ నీళ్లు చల్లిన కరోనా మహమ్మారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ (పీఆర్సీ) ఆశలపై కరోనా మహమ్మారి మరోసారి నీళ్లు చల్లింది! ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేస్తామని, ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీ వేదికగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఈలోగా కరోనా మళ్లీ విజృంభించడంతో పీఆర్సీ అమలు మళ్లీ అటకెక్కిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ అమలు విధివిధానాలను ప్రకటిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం జరుగుతుండటమే ఇందుకు కారణం. ముసాయిదా జీవోకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదముద్ర వేసిన వెంటనే ఈ ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. పీఆర్సీ జీవో ఎప్పుడు జారీ అవుతుందో స్పష్టత లేకపోవడంతో ప్రస్తుత మూల వేతనాల ఆధారంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రెజరీలు ఉద్యోగుల జీతాల బిల్లులను రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పాత వేతనాలనే అందుకుంటారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా తొలి వేవ్ కారణంగా పీఆర్సీ ప్రకటనలో తీవ్ర జాప్యం జరగ్గా రెండో వేవ్ కారణంగా పీఆర్సీ అమలు మళ్లీ వాయిదా పడే పరిస్థితులు తలెత్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటం, కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ ఇంకా కోలుకుంటుండటంతో పీఆర్సీ అమలుపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోలేకపోయిందని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం పీఆర్సీపై జీవో జారీ చేసినా పెరిగిన జీతాలను ఉద్యోగులు జూన్‌లోనే అందుకుంటారని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పీఆర్సీ జీవో వచ్చాక ఏ తేదీ నుంచి వేతన సవరణ వర్తింపజేయాలి అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యక వేతన సవరణ ప్రయోజనాలు ఉద్యోగులు లభించనున్నాయి. చిరుద్యోగుల భారీ ఆశలు... వేతన సవరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వంలోని చిరుద్యోగులు భారీ ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏలు, వీఏఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, డెయిలీ వేజ్ తదితర కేటగిరీలు కలుపుకొని 9,17,797 మంది ఉద్యోగుల వేతనాలను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రూప్–4 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు రూ. 12 వేల కనీస వేతనం లభిస్తుండగా దాన్ని రూ. 19 వేలకు పెంచాలని సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గ్రూప్–3 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను రూ. 15 వేలు/19,500 నుంచి రూ. 22 వేలకు పెంచాలని సూచించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏటా రూ. 1,000 ఇంక్రిమెంట్ ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల అమలుపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు భారీ ఆశలతో ఎదురుచూస్తున్నారు. -
మాకు పేస్కేల్ అమలు చేయాలి
విజయవాడ: లైసెన్సుడ్ సర్వేయర్లను అసిస్టెంట్ సర్వేయర్లుగా నియమించాలని సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని కోరారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ఆర్ రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీర్చుటకు లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ తెచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మమ్ములను అసిస్టెంట్ సర్వేయర్ల పేరుతో జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ ప్రకటించి అమలు చేయలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పాదయాత్రలో మా సమస్యలు విని సానుకూలంగా స్పందించారని ఇప్పుడు ముఖ్యమంత్రిగా గెలిచినందున వెంటనే మాకు పేస్కేల్ అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు -
అర్చకులకు పే స్కేల్
-
అర్చకులకు పే స్కేల్
► ప్రభుత్వ ఉద్యోగుల తరహా వేతనాలు ► నవంబర్ నుంచి అమలు ► ప్రస్తుతం ‘ధూపదీప నైవేద్యం’ అమలవుతున్న దేవాలయాలు1,805 ► అదనంగా వర్తింప చేయనున్న దేవాలయాలు 3,000 ► ఆలయాల ఆధ్వర్యంలో ఉన్న భూములు (ఎకరాల్లో) 83,000 సాక్షి, హైదరాబాద్: అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వచ్చే నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పే స్కేల్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1,805 దేవాలయాల్లో అమలవుతున్న ధూపదీప నైవేద్య పథకాన్ని అదనంగా మరో 3 వేల దేవాలయాలకు వర్తింపచేస్తామని ప్రకటించారు. దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాలను పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అర్చకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ‘‘దేవాలయాల భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో 83 వేల ఎకరాల భూములు దేవాలయాల ఆధ్వర్యంలో ఉన్నట్లు లెక్క ఉంది. ఈ భూమిని రక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అర్చకులు కూడా దేవాలయాల నిర్వహణ, దైవ సంబంధ కార్యక్రమాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. పొరపాట్లు కాకుండా చూడాలి. అర్చన బాగా చేస్తే భగవంతుడు కూడా మనల్ని దీవిస్తాడు. ఉద్యమ సమయంలో మీరంతా బాగా పూజలు చేసి, ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరుకున్నారు. నేను ఏ గుడికి వెళ్లినా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, తెలంగాణ ప్రాప్తిరస్తు అని దీవించేవారు. దేవుడు అనుగ్రహించాడు. మీ దీవెనలు ఫలించాయి. రాష్ట్రం వచ్చింది. దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమం, బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం. ధార్మిక పరిషత్‌ను మరింత విస్తృతపరుస్తాం. శృంగేరి పీఠాధిపతులు, చినజీయర్ స్వామి, కంచి పీఠాధిపతుల సలహాలు, సూచనలు పాటించి ధార్మిక పరిషత్ కార్యక్రమాలు రూపొందిస్తాం. అర్చకుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇతర ముఖ్య నిర్ణయాలు తీసుకున్న ఈ సమయంలో నాకు 15 లడ్డూలు తిన్నంత ఆనందంగా ఉంది’’అని ముఖ్యమంత్రి అన్నారు. అర్చకుల హర్షం.. సుదీర్ఘకాలంగా ఉన్న తమ డిమాండ్‌ను పరిష్కరించినందుకు తెలంగాణ అర్చక, ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి, అధ్యక్షుడు రంగారెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అర్చకులతో సీఎం భేటీ సందర్భంగా నల్లకుంట నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు అర్చక, ఉద్యోగులు ర్యాలీగా తరలివెళ్లారు. -
అదేమీ యుద్ధం కాదు:దీపికా
ముంబై: బాలీవుడ్ లో హీరోలకు-హీరోయిన్ లకు మధ్య చెలరేగుతున్న పారితోషికం వివాదం ఇప్పట్లో ముగిసేటట్లు కనబడుటలేదు. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటి దీపికా పదుకునే గళం విప్పింది. పారితోషికం విషయంలో పురుషలతో పోల్చుకుంటే మహిళలకు చాలా తక్కువగానే ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. అయితే ఆ పారితోషికం అంశంపై తాము చేస్తున్నది యుద్ధం మాత్రం కాదని స్పష్టం చేసింది. బాలీవుడ్ లో విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. హీరోయిన్స్ కు అంతంగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. దీనిపై తన సహచర నటీమణులంతా గట్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. 'మీ(పురుషుల) పారితోషికంతో పోల్చుకుంటే మా పారితోషికం తక్కువ. ఇది నిజం. గత రెండు సంవత్సరాల్లో పోల్చుకుంటే హీరోల పారితోషికంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మాకు మాత్రం అలా జరుగలేదు. ఈ విషయంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా'అని దీపికా తెలిపింది. అయితే ఇదే యుద్ధం కాదని, తమకు కూడా పారితోషికం పెంచాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది. దీపికా నటించిన సినిమాల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతున్నా.. అసలు బాక్సాఫీస్ దృష్టిలో పెట్టుకుని సినిమాలు ప్లాన్ చేసుకోనని తెలిపింది. -
టీచర్లకు ప్రత్యేక వేతన స్కేళ్లు ఇవ్వాలి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ఉపాధ్యాయులకు ప్రత్యేక వేతన స్కేళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు కెఎస్.లక్ష్మణరావు, వి.బాలసుబ్రమణ్యం పదవ వేతన సంఘం కమిషనర్ పీకే అగర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం లో ఆయనను కలిసి ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలు జరిపారు. వారు మాట్లాడుతూ ప్రతిభావంతులకూ, నిబద్ధతతో పనిచేస్తున్న టీచర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ప్రతి వేతన కమిటీ అమలులో సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతున్నారన్నారు. సర్వీస్ వెయిటేజీ ఇవ్వటం ద్వారా స్పెషల్ ప్రమోషన్ స్కేలు పొందడానికి ఉపాధ్యాయులందరికీ ఒకే అర్హత, ఒకే వేతనం అందివ్వాలన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా సెలవులు, ఎల్టీసీ అలవెన్సులు చెల్లించాలన్నారు. కనీస వేతనం చెల్లిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనాలు చెల్లించాలని కోరారు. 15 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. 60శాతం పెన్షన్, రూ. 8 నుంచి రూ 15 లక్షల వరకు గ్రాట్యుటీ పెంపు తదితర అంశాలను పరిశీలించాలని ఎమ్మెల్సీలు కమిషనర్‌ను కోరారు. కంప్యూటర్ విద్య కొనసాగించాలి.... ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ను విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, వి బాలసుబ్రమణ్యంలు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రాజేశ్వర్‌తివారి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాణిమోహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కంప్యూటర్ ఉపాధ్యాయులను నూతనంగా ప్రారంభం కాబోతున్న 4,031 పాఠశాల ప్రాజెక్టుల్లోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న నిధుల్లో 25శాతం నిధులు వెచ్చిస్తే కంప్యూటర్ ఉపాధ్యాయులను కొనసాగించవచ్చని వారు తెలిపారు.