ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు పెంచండి
ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్స లు పెంచాలని కలెక్టర్ కేవీ రమణ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఆయన మొదటి అంతస్తులోని ఎస్ఎన్సీయూ వార్డును సందర్శించారు. వార్డులో చిన్నపిల్లలకు ఎలాంటి సేవలు చేస్తున్నారని సిబ్బందితో ఆరా తీశారు. ఆస్పత్రిలోని శుభ్రత, వైద్య సేవలపై సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రహరీ చాలా తక్కువ ఎత్తులో ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్థోతోపాటు ఇతర శస్త్ర చికిత్సలు కూడా చేయాలని కలెక్టర్ సూచించారు. ఆస్పత్రిలో సౌకర్యాలను పూ ర్తిస్థాయిలో మెరుగుపరుస్తామని కలెక్టర్ జిల్లా ఆస్పత్రి వైద్యాధికారులకు తెలిపారు. ముఖ్యం గా సిజేరియన్లు రెగ్యులర్‌గా నిర్వహించాలని సూపరింటెండెంట్ ఎస్ఎన్మూర్తితో పేర్కొన్నారు. ఆస్పత్రిలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రఘునాథరెడ్డి, తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డి, ఆర్ఎంఓ బుసిరెడ్డి పాల్గొన్నారు. తక్కువ జీతంతో చాలా కాలంగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం కలెక్టర్ కేవీ రమణను కోరారు. ఈ సందర్భంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రామ్మోహన్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు.
చాపాడు: ప్రభుత్వాధికారులు ఎలాంటి చిన్న తప్పులు చేసినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కేవీ రమణ హెచ్చారించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా మంగళవారం సాయంత్రం చాపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, రెవెన్యూ కార్యాలయం, పీహెచ్‌సీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ను జెడ్పీటీసీ బాలనర సింహారెడ్డి, బీసీ మండల కన్వీనర్, ఎంపీపీ కొండమ్మ భర్త బిర్రు రామచంద్రయ్య, చియ్యపాడు-2 ఎంపీటీసీ మహేష్‌యాదవ్ కలిశారు. పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలి
ప్రొద్దుటూరు కల్చరల్: విద్యార్థులు స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ కేవీ రమణ సూచించారు. స్థానిక పెన్నానదీ తీరంలోని త్యాగరాజరెడ్డి కల్యాణ మండపంలో మంగళవారం రామకృష్ణమిషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్ ఫార్మిం గ్ యూత్ టు ట్రాన్స్ఫార్మ ఇండియా యూత్ కన్వెన్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుని అడుగు జాడల్లో నడచి దేశాభ్యున్నతికి కృషి చేయాలని విద్యార్థులను కోరారు. సీనియర్ సివిల్‌జడ్జి ప్రభాకరరావు మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను, నీతి, నిజాయితీ, సేవా కలిగి ఉం డాలన్నారు. హైదరాబాదుకు చెందిన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డెరైక్టర్ బోధమాయానంద మహరాజ్, వక్త శివాజీ శంకర్ మాట్లాడారు.