ఘనంగా సత్యసాయి జయంతి వేడుకలు
సత్యసాయి బాబా 88వ జయంతి వేడుకలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శనివారం ఘనంగా జరిగాయి. పలు ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సాయిబాబా సమాధిని సందర్శించుకున్నారు.
జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. సత్యసాయిబాబా పేరిట రూ.5 స్టాంప్‌ను విడుదల చేశారు. రూ.80కోట్లతో చేపట్టిన మంచినీటి పథకాన్ని సత్యసాయి ట్రస్ట్ ప్రారంభించింది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కృపారాణి పరిశీలించారు. బాబా జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో రామ్‌నగర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ సత్యసాయి బాలవికాస్ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.