Rarandoi vedukachudham
-
రండి... వేడుక చూద్దాం!
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఉగాది పండగ రోజున ‘రారండోయ్... వేడుక చూద్దాం’ అంటూ అభిమానులను పలకరించారు. ఇంతకీ నాగ్ ఏ వేడుకకు పిలిచారు? చైతూ–సమంతల పెళ్లి వేడుకకా? అంటే... దానికి ఇంకా టైముంది. ఇప్పుడు నాగ్ ఇలా ఆహ్వానించింది చైతూ సినిమా కోసం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెండు లుక్స్‌ను ఒకేసారి విడుదల చేయడం విశేషం. ఇలా అభిమానులకు పండగ రోజున డబుల్ ధమాకా ఇచ్చారు. ఈ లుక్స్‌ని విడుదల చేసి, ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఏప్రిల్ చివరి వారంలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. చైతూ సూపర్‌గా యాక్ట్ చేస్తున్నాడు. అతని కెరీర్‌కి మంచి మైలురాయిలా నిలిచిపోయే చిత్రం అవుతుంది. కమర్షియల్‌గా హిట్ కొడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమేరా: ఎస్.వి విశ్వేశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: సాహి సురేశ్. -
'రారండోయ్.. వేడుక చూద్దాం' ఫస్ట్ లుక్స్
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. నాగార్జున హీరోగా 'సొగ్గాడే చిన్ని నాయనా' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. నాగ్ కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచిపోయినా నిన్నే పెళ్లాడతా తరహాలో నాగచైతన్యకు ఈ సినిమా మెమరబుల్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాకు సంబంధించి రెండు పోస్టర్లను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ విషయంలో దర్శకుడు కళ్యాన్ కృష్ణ, నిర్మాత నాగార్జునలు రెండు డిఫరెంట్ మోడల్స్‌ను సెలెక్ట్ చేయటంతో రెండు పోస్టర్లను ఒకేసారి రిలీజ్ చేశారు. నాగ్ సెలెక్ట్ చేసిన పోస్టర్లో నాగచైతన్య యాక్షన్ మోడ్‌లో కనిపిస్తుంటే.., డైరెక్టర్ సెలెక్ట్ చేసిన పోస్టర్ టైటిల్‌ను జస్టిఫై చేస్తూ పండుగ వాతావరణం కనిపించేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆడియో, సినిమా రిలీజ్ డేట్ లను త్వరలోనే వెల్లడించనున్నారు. Here we go the first look of #NC13!!the 1st one is my choice and the 2nd @kalyankrishna_k/#rarandoiVedukachudham💐 pic.twitter.com/SfK1cn2xUW — Nagarjuna Akkineni (@iamnagarjuna) 29 March 2017