టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఉగాది పండగ రోజున ‘రారండోయ్... వేడుక చూద్దాం’ అంటూ అభిమానులను పలకరించారు. ఇంతకీ నాగ్ ఏ వేడుకకు పిలిచారు? చైతూ–సమంతల పెళ్లి వేడుకకా? అంటే... దానికి ఇంకా టైముంది. ఇప్పుడు నాగ్ ఇలా ఆహ్వానించింది చైతూ సినిమా కోసం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన రెండు లుక్స్‌ను ఒకేసారి విడుదల చేయడం విశేషం. ఇలా అభిమానులకు పండగ రోజున డబుల్ ధమాకా ఇచ్చారు. ఈ లుక్స్‌ని విడుదల చేసి, ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఏప్రిల్ చివరి వారంలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం.
చైతూ సూపర్‌గా యాక్ట్ చేస్తున్నాడు. అతని కెరీర్‌కి మంచి మైలురాయిలా నిలిచిపోయే చిత్రం అవుతుంది. కమర్షియల్‌గా హిట్ కొడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమేరా: ఎస్.వి విశ్వేశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: సాహి సురేశ్.
రండి... వేడుక చూద్దాం!
Published Wed, Mar 29 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
Advertisement
Advertisement