ravela Kishore Babu
-
తాడికొండతో...తరాల అనుబంధం
సాక్షి, తాడికొండ : గుంటూరు జిల్లాలో ప్రధాన పార్టీల తరుఫున ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులే అధికంగా పోటీ చేయడం విశేషం. మొత్తం 8 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గుంటూరు ఎంపీగా వైఎస్సార్ సీపీ తరఫున తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల ఎంపీగా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన నందిగం సురేష్ బరిలో నిలిచారు. ఇక అసెంబ్లీ అభ్యర్థులుగా ఫిరంగిపురం గ్రామానికి చెందిన మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్థానికత కోటాలో తాడికొండ నియోజకవర్గానికి ఉండవల్లి శ్రీదేవి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, పెదపరిమి గ్రామానికి చెందిన నంబూరు శంకర్రావు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాడికొండ గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తఫా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండో సారి ఎన్నికలకు వెళ్తున్నారు. సీపీఐ తరుఫున మంగళగిరి నుంచి తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రావెల కిషోర్‌బాబుది తాడికొండ మండలం రావెల గ్రామమే. -
తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ
సాక్షి, ప్రత్తిపాడు : ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు ఓ అంశం చర్చనీయాంశమవుతోంది. అందరి నోళ్లలోనూ ఇదే నానుతోంది. ఇది ప్రత్తిపాడు నియోజకవర్గమా లేక తాడికొండ నియోజకవర్గమా అంటూ ఓటర్లు ఛలోక్తులు విసురుతున్నారు. కారణం ప్రత్తిపాడు అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తాడికొండ నియోజకవర్గ వాసులు, ఆ నియోజకవర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులే కావడంతో పొలిటికల్ కారిడార్‌లో చక్కర్లు కొడుతుందీ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత స్వగ్రామం తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం. ఈమె 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో సైతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్‌బాబుది సైతం తాడికొండ నియోజకవర్గమే. తాడికొండ మండలం రావెల గ్రామం. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా తాడికొండ నియోజకవర్గానికి సుపరిచితులే. స్వగ్రామం ఆ నియోజకవర్గం కాకున్నప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా అక్కడి ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తాడికొండ నియోజకవర్గ అల్లుడికే ప్రత్తిపాడు సీటును కేటాయించింది. వృతిరీత్యా వైద్యుడైన డాక్టర్ చల్లగాలి కిషోర్ తాడికొండకు చెందిన డాక్టర్ సబితను వివాహం చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం ప్రత్తిపాడు నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. -
ఏమి సేతుర లింగా..
ఒరేయ్ ఎంకిగా మన పరిస్థితి ఏందిరిట్టా తయారైంది. ఆనాడు ఆ అయ్యగారిని (రావెల కిషోర్‌బాబు) తీసకొచ్చి మననెత్తిన కూకోబెట్టారు. ఏదో సుడి ఉండి గాలివాటంతో గెలిసిండు. నడమంత్రపు సిరి నడిసొచ్చినట్టు అయ్యోరు ఏకంగా అమాత్యుడయ్యిండు. ఆ రావెల సారేమో గద్దెనెక్కించినన మనల్ని ఒదిలేసి పద మూడు జిల్లాలు పదమూడు జిల్లాలంటూ రాష్ట్రమంతా చక్కర్లు కొట్టేశారు. నియోజకవర్గంలో పార్టీని గాలికొదిలేసిండు. వర్గాలు చేసి, కుంపట్లు పెట్టి మన క్యాడర్‌ను ముక్కలు చేసిండు. సాపకింద ఉన్న అసమ్మతి సెగని పైకిలేపిండు. అంతన్నాడు.. ఇంతన్నాడు.. తుర్రుమంటూ పక్క పార్టీలోనికి ఎగిరిపోయిండు. ఇప్పుడే మనం ఏమిసేతురా ఎంకిగా.. ఏమి సేతు కొత్త పక్షి కోసం.. ఇదీ ప్రత్తిపాడు దేశంలో తెలుగు తమ్ముళ్ల మనోవ్యథ. కాదు కాదు రొద. అవును పార్టీలో నాలుగున్నరేళ్ల పాటు హల్చల్ చేసిన మాజీ మంత్రి, తాజా మాజీ శాసన సభ్యుడు రావెల కిషోర్‌బాబు పార్టీ వీడి వెళ్లిపోవడంతో సేనాని లేని సైనికుడిలా పార్టీ పరిస్థితి తయారైంది. రావెల కిషోర్‌బాబు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కాలంలో మరో దళిత నాయకుడు ఇక్కడ ఎదగకుండా వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటూ వచ్చారు. అదేవిధంగా టీడీపీలో ప్రధాన భూమిక పోషించే కీలక సామాజిక వర్గం నాయకుల ఆధిపత్యానికి సైతం గండికొట్టారు. ఈ తరుణంలో నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయిలో దళిత నాయకులు పెద్దగా లేకపోవడంతో ఆ పార్టీ అధినాయకత్వంతో పాటు క్యాడర్ కూడా కొత్త పక్షి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఫ్లెక్చీల్లోనే నాయకులు.. అరే లింగా.. ఇది ఇన్నావా. మన పార్టీ పొజిషన్ ఎంత దయనీయంగా ఉందో. మనూళ్లో బస్టాండు దగ్గర ఒక నాయకుడు, సినిమా హాల్ ఎదురు ఇంకోకాయన, అంకమ్మగుడికాడ మరొకసారు.. పెద్దపెద్ద ఫ్లెక్చీలు కట్టేచారు. ఇప్పటిదాకా ఆళ్లను చూడటం కూడా లేదు. కనీసం పేర్లు కూడా ఇన్నది లేదు. ఉన్నపళ్లంగా వీళ్లంతా ఏడనుంచో ఊడి ఈడపడ్డారు. ఒక్కరిదీ మన నియోజకవర్గం కూడా కాదాయే. రాయెల సారు పోయి ఇన్ని దినాలవుతున్నా ఒక్కనాడైనా ఆ ఫ్లెక్చీల్లో ఉన్న నాయకులు మనకు కనిపించిడ్రా అంటే అదీ లేదు. వాళ్లు ఫ్లెక్చీల్లోనే నాయకులేమోరో ఎంకిగో. మన నియోజకవర్గంలో ఉన్న ఒక్క దళిత నాయకుడినీ పార్టీ అధిష్టానమేమో పట్టింసుకుంటున్నట్లు లేదు ఏమీ సేతురా లింగా. మళ్లీ మన నెత్తినే పెడతారేమో.. ఓరేయ్ లింగా. మన చంద్రాలు సారు మళ్లీ పవనాల సార్‌తో కలుత్తే తప్పేంటి. కలిసి పోటీచేత్తే తప్పేంటని ప్లేటు మారుత్తుండు. ఒకాళ అదే జరిగితే మనోళ్ల సంగతేంటి. ఇప్పుడుదాకా మన రావెలోరిని పార్టీ నుంచి వెళ్లిన నాటి నుంచి తిట్టిపోత్తన్నారు. శుధ్దంటూ ఇగ్రహాలు కడిగిపారేశారు. ఒకాళ చంద్రాలు సారు జనసేనతో కలిత్తే,, పత్తిపాడులో మళ్లీ రావెల గారికిత్తరేమో. అప్పుడు మళ్లీ మనోళ్లంతా ఆయన దగ్గరకెల్లి ఒంగిఒంగి దండాలెట్టాల. ఆయనకే ఓట్టేయ్యింసాలా. ఏమోరా సత్తి జరిగినా ఆచ్చర్యం అక్కర్లేదు. పూటకోమాట మారుతున్న మన చంద్రాలు సారు ఏం చేత్తరో ఆ దేవుడికే ఎరుక. ఆళ్లంతా ఏరిరా..? అరేయ్ సత్తి అప్పుడు రావెల సారున్నప్పుడు ఆయన కారెనక కార్లలో తిరుగుతూ, పెద్ద పెద్ద కాంటాక్టులు చేసినోల్లంతా ఏమయ్యిండ్రు. ఆయన పోయినాక ఒక్కరూ అగపడట్లేదు. అజ్ఞాతంలోకి పోయిండ్రా లేక ఆళ్లు కూడా పార్టీ మారుతుండ్రా ఏంటి. అదీ నిజమేరా లింగా.. అప్పుడు ఆయనున్నప్పుడు ఆళ్లు చేసిన హడావిడీ మామూలుగా లేదు. నల్లకళ్లద్దాలు, ఖరీదైన కార్లలో తిరుగుతూ మామలుగా సందడి సేయలేదు. అంతేకాదురోయ్ మండలాల్లో మనం ఎన్నుకున్న నాయకులు కూడా రావెలంత వీరుడూ, సూరుడూ లేడని ఇప్పుడేమో కొత్త పాట అందుకున్నారు. 2014కు ముందేమో కందుకూరి వీరయ్య వద్దన్నారు.. ఇప్పుడేమో వీరయ్యకే టిక్కెట్టిమ్మంటుండ్రు. మనోళ్లు దేనికైనా సమర్థులేరా ఎంకిగో. -
టీడీపీలో కుమ్ములాటల పర్వం
సాక్షి, గుంటూరు: జిల్లా టీడీపీలో కుమ్ములాటలు అధికమయ్యాయి. అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు గ్రూపులుగా, సామాజిక వర్గాలవారీగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. జిల్లాలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడడంతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో టిక్కెట్ల కోసం ద్వితీయ శ్రేణి నేతలు గ్రూపులు కట్టి సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటంతో టీడీపీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జి దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు...ఎమ్మెల్యే నుంచి ఎంపీ, మంత్రుల వరకు ఎవరినీ లెక్క చేయకుండా ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు అసమ్మతి బావుటా ఎగురవేస్తున్నారు. జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు టిక్కెట్టు తమదంటే తమదంటూ నియోజకవర్గాల్లో ప్రచారాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అగమ్యగోచరంలో పార్టీ శ్రేణులు గుంటూరు జిల్లాలో మూడు పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాని దయనీయ స్థితి అధికార పార్టీలో నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరనున్న నేపథ్యంలో అక్కడ అధికార పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక్కడ సరైన అభ్యర్థి దొరక్క గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారికి టిక్కెట్టు ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మద్దాళి గిరికి టిక్కెట్టు దక్కే అవకాశం లేదని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారికి టిక్కెట్టు కేటాయించాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. దీంతో మద్దాళి గిరి సామాజిక వర్గానికి చెందిన ఆర్యవైశ్య నేతలు టీడీపీపై రగిలిపోతున్నారు. బాపట్లలో ఎవరికి వారే యమునా తీరే! బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, వేగేశన నరేంద్రవర్మ రాజు, గాదె వెంకటరెడ్డి తదితరులు టిక్కెట్టు తమదంటే తమదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వీరిలో ఎవరికి దక్కకపోయినా ఎదుటి వారిని ఓడించేం దుకు సైతం వీరు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మాచర్ల నియోజకవర్గంలో ఇన్చార్జిగా ఉన్న చలమారెడ్డికి ఈసారి టిక్కెట్టు దక్కే అవకాశం కనిపించడం లేదు. అయితే టీడీపీకి సరైన అభ్యర్థి దొరక్క సతమతమవుతోంది. అక్కడ సైతం ఒకరికి టిక్కెట్టు ఇస్తే మరొకరు ఓడిం చేందుకు గ్రూపులు కట్టి మరీ అసమ్మతి రాజేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గ పరిసి ్థతి మరింత దయనీయంగా మారింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులుకు అసమ్మతి నేతలు నిద్రపట్టకుండా చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ద్వితీయ శ్రేణి నేతలు గ్రూపులుగా ఏర్పడి ఈసారి జీవీకి టిక్కెట్టు ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల శివప్రసాదరావు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన కుటుంబంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయన్ను ఎంపీగా పంపి, ఆ రెండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను దింపాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. రేపల్లె టిక్కెట్టు మళ్లీ అనగాని సత్యప్రసాద్‌కు ఇస్తున్నట్లుగా వార్తలు వినిపించడంతో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గతంలో టీడీపీ తరఫున పోటీ చేసిన బీసీ నాయకుడు కేశన శంకరరావు సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఇక్కడ ఓటమి తప్పదని టీడీపీ నేతలు అంగీకరిస్తున్న పరిస్థితి. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆయనకు ఈసారి టిక్కెట్టు దక్కదనే ప్రచారం జోరందుకుంది. దీంతో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీ ఎత్తున వలసలు మొదలయ్యాయి. తెనాలిలో జనసేనతో చిక్కు... తెనాలి నియోజకవర్గంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన ఓట్లు భారీగా చీలుతాయని అక్కడ ప్రధానంగా వైఎస్సార్సీపీ, జనసేన మధ్యే పోటీ నడుస్తుందనే ప్రచారం సా గుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. చిలకలూరిపేట, గురజాల, పొన్నూ రు నియోజకవర్గాల్లో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు భా రీ స్థాయి అవినీతికి పాల్పడడంతో సొంత పార్టీ నేతల్లోనే వీరిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొత్తానికి రాజధాని జిల్లా గుంటూరులో అధికా ర పార్టీకి అభ్యర్థులే దొరక్క ఇబ్బందులు పడుతున్న దయనీయ పరిస్థితి నెలకొనడం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాజధాని కేంద్రంలోనూ అదే పరిస్థితి రాజధాని నియోజకవర్గాలుగా చెబుతున్న తాడికొండ, మంగళగిరి నియోజకర్గాల్లో అయితే టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మంగళగిరి ఇన్చార్జిగా ఉన్న గంజి చిరంజీవికి ఈసారి టిక్కెట్టు దక్కే అవకాశం దాదాపు లేనట్లే కనిపిస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు లేదా, ఆమె కుమార్తెకు టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం జరగడంతో మరోవర్గం అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు టిక్కెట్టు కేటాయిస్తే ఓడిస్తామంటూ ఆయన వ్యతిరేక వర్గం నాయకులు నారా లోకేష్ వద్ద కరాఖండిగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే శ్రావణ్‌కుమార్‌కు టిక్కెట్టు ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ శ్రావణ్‌కుమార్ వర్గీయులు సైతం సమావేశాలు నిర్వహించి మరీ హెచ్చరిస్తుండటంతో రాజధాని నియోజకవర్గంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు పార్టీని వీడడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీకి దిక్కే లేకుండా పోయారు. సరైన నాయకుడు లేకపోవడంతో మండలానికి ఒక ఇన్చార్జి చొప్పున నియమించి ఇప్పటికీ అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది. -
నేను దీక్ష చేస్తా : మాజీ మంత్రి రావెల
సాక్షి, గుంటూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పుకు నిరసనగా ఈ నెల 23న దీక్ష చేయనున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు వల్ల చట్టం బలహీన పడిందని, కోరలు పీకిన పులి లాగా అట్రాసిటీ చట్టం తయారైందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో, దేశ వ్యాప్తంగా దళితులలో అభద్రతభావం ఏర్పడిందని చెప్పారు. ఏపీలో కూడా దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆందోళనలో ఉన్న గిరిజనులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో అట్రాసిటీ చట్టానికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తాను దీక్షకు కూర్చోనున్నట్లు రావెల ప్రకటించారు. -
‘ఇష్టముంటే ఉండొచ్చు..లేదంటే వెళ్లిపోవచ్చు’
సాక్షి, విజయవాడ : మాజీమంత్రి రావెల కిషోర్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రావెల కిషోర్ బాబు తన పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. ‘రావెలకు ఇష్టముంటే పార్టీలో ఉండొచ్చు...లేదంటే వెళ్లిపోవచ్చు’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోని అంశమని, చంద్రబాబును కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వర్గీకరణపై టీడీపీకి ఓ సిద్ధాంతం ఉందని అన్నారు. ఆ వ్యాఖ్యలకు ఆయనే అర్థం చెప్పాలి ఎవరో చెప్పే మాటలు వినే పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ వ్యాఖ్యల్ని ఆయన తప్పుపట్టారు. మాదిగ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అని అన్నారు. రావెల వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటో ఆయనే చెప్పాలని ...ఆ వ్యాఖ్యలు రావెల వ్యక్తిగతమన్నారు. ఆయన ఏదో మానసిక ఓత్తిడిలో ఉన్నట్లున్నారని జవహర్ అన్నారు. మాదిగలకు టీడీపీకి ఉన్న బంధాన్ని విడదీయాలని మందకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుల పునాదులపై రాజకీయ పార్టీలు పెట్టాలనుకోవడం వారి అపరిపక్వతకు నిదర్శనమన్నారు. కాగా తనకు పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యమని గుర్రం జాషువా జయంతి ఉత్సవాలలో గురువారం మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ కోసం తాను శాసనసభ్యత్వాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధమన్న ఆయన...ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర పరిధిలోని అంశమని రావెల పేర్కొన్న విషయం విదితమే. -
రాజధానికి అరకొర
► బడ్జెట్లో జిల్లాకు మొక్కుబడి కేటాయింపులు ► వ్యవసాయం, జలవనరుల శాఖలకు అన్యాయం ► కృష్ణా పుష్కరాలకు రూ. 250 కోట్లు సరిపోయేనా! ► బడ్జెట్‌పై కనిపించని మంత్రులు ప్రత్తిపాటి, రావెల ముద్ర సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్ర బడ్జెట్లోనూ రాజధానికి అన్యాయమే జరిగింది. అరకొరగా నిధులు కేటాయించి అన్ని రంగాలనూ ఉసూరుమనిపించారు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ రంగం, దానికి అనుబంధంగా ఉండే సాగునీటి శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉందని అంతా భావించారు. ప్రాధాన్యత కలిగిన ఈ రెండు శాఖల్లో చేపట్టాల్సిన పనుల కేటాయింపులకు పొంతన కుదరడం లేదు. పులిచింతల, డెల్టా ఆధునికీకరణ, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ పరిరక్షణ, కాల్వల అభివృద్ధి, మరమ్మతులు వంటి పనులకు పెద్ద మొత్తంలో నిధుల అవసరం ఉంది. కానీ అందుకు భిన్నంగా నిధుల కేటాయింపు జరిగింది. నిజాంపట్నం హార్బర్‌ను పూర్తిగా విస్మరించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పుష్కరాలనూ పట్టించుకోలేదు.. రాజధాని నిర్మాణం, పర్యాటక రంగం, కృష్ణా పుష్కరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం అరకొరగానే నిధుల కేటాయింపు చేసింది. పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు పెంచుతానని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రంగానికి రూ.227.74 కోట్లు కేటాయించారు.గోదావరి పుష్కరాలకు రూ.1680 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపుష్కరాలకు రూ.250 కోట్లను మాత్రమే కేటాయించింది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పుష్కరాల్లో చేపట్టాల్సిన పనులకు రూ.2 వేల కోట్లకుపైగానే ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ ప్రభావం పుష్కరాల నిర్వహణపై కచ్చితంగా పడుతుంది. డ్వాక్రా రుణమాఫీ ఊసే లేదు.. రాజధాని నిర్మాణం నేపధ్యంలో తాడికొండ నియోజకవర్గం లాంలో వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణం, ఇతర పథకాల అమలుపై ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. హైదరబాద్ నుంచి యూనివర్సిటీ తరలింపునకు నిధుల కేటాయింపు మినహా రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు పెద్దగా లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికేతర విభాగంలో రూ.81.04 కోట్లు విధించనున్నదని, వాటితో నిర్మాణ పనులు చేపట్టనున్నామని ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. రుణమాఫీకి గత ఏడాది రూ.4వేల కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.3500 కేటాయించారు. డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ ప్రస్తావన లేకపోవడంతో మహిళా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పాత నిధులకే కొత్త మెరుగు... ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణానికి రూ.18000 కోట్లు ఖర్చు కాగలదని చెబుతున్న ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఎప్పటికి నిర్మాణం పూర్తిచేస్తారో సీఎం సమాధానం చెప్పాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఈ నిధులను గతంలో కేటాయించింది. వాటినే రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం చూపించడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.. సాగునీటి రంగానికి కేటాయింపులు పులిచింతల ప్రాజెక్టులో ఇంకా రూ.50 కోట్లకుపైగానే పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పనులు చేస్తున్న నిర్మాణ సంస్థకు రూ. 8 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. మొత్తం రూ.58 కోట్ల వరకు ఈ ప్రాజెక్టుకు నిధులు అవసరం కావాల్సి ఉండగా, బడ్జెట్లో రూ.43 కోట్లు కేటాయించారు. డెల్టా ఆధునీకరణకు రూ.112 కోట్లను కేటాయించారు. గత ఏడాది రూ.304 కోట్లు కేటాయించినప్పటికీ నిర్మాణసంస్థలు ముందుకు రాకపోవడంతో ఆ నిధులు పూర్తిగా వ్యయం కాలేదు. ఈ ఏడాది కొన్ని నిర్మాణ సంస్థలు డెల్టా ఆధునీకరణ పనులు చేస్తున్నాయి. పనులు పూర్తిచేస్తే నగదు చెల్లింపులు జరిగే అవకాశాలు లేకపోవడంతో పనులు ప్రారంభించని కొన్ని సంస్ధలు ఈ కేటాయింపుల్ని చూసి ముందుకు వచ్చే ఆలోచన విరమించుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజి పనులకు రూ.70 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం జరిగే దిగువ ఆప్రాన్ పనులకు ఈ నిధులు సరిపోతాయని, మిగిలిన పనులకు నిధుల కొరత తప్పదని ఉందని సాగునీటిశాఖ అధికారులు చెబుతున్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.260 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఈ కేటాయింపులు తక్కువుగా ఉండటంతో ఆధునీకరణ పనులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు సాధించలేని ప్రత్తిపాటి, రావెల సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులోనే మొండిచేయి చూపింది. కాపు కార్పొరేషన్ సంస్ధ ద్వారా రూ.1000 కోట్లు కేటాయించింది. మిగిలిన కార్పొరేషన్లకు నామమాత్రంగా కేటాయింపులు జరిగాయి. బ్రాహ్మణ కార్పొరేషన్, మైనార్టీ, ఎస్టీ, ఎస్టీ కార్పొరేషన్లకు రెండంకెలకు మించకుండా నిధులు కేటాయించారు. రాజధాని నిర్మాణం నేపథ్యంలో రోడ్లు-భవనాల శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించాలి. కానీ రూ.2 వేల కోట్లకు పరిమితం చేశారు. జిల్లా నుంచి వ్యవసాయశాఖ, సాంఘిక సంక్షేమశాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌లు ఆ శాఖలపై తమ ముద్రపడే రీతిలో నిధుల కేటాయింపుగానీ, కొత్త పథకాలను కానీ తీసుకురాలేకపోయారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ విడుదల చేయనున్న నిధులపైనే గృహ నిర్మాణాలు ఆధారపడి ఉన్నాయి. వీటికోసం విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లోని పేద వర్గాలు వేలల్లో దరఖాస్తు చేసుకున్నాయి.