Ravi Krishna
-
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’
శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించనున్నారు. మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. -
20 సంవత్సరాల తర్వాత రిలీజ్..సినిమాలు ఎందుకు రిజెక్ట్ చేసానంటే..
-
12 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో
7/G బృందావన్ కాలనీ.. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. 20 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా, సోనియా అగర్వాల్ హీరోయిన్గా నటించింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడే రవికృష్ణ. 7/G బృందావన్ కాలనీ తమిళంలో 7/G రెయిన్బో కాలనీగా విడుదలైంది. అక్కడ కూడా సెన్సేషన్ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు రవికృష్ణ. తర్వాత తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు, కానీ మళ్లీ అంతటి హిట్ అందుకోలేకపోయాడు. 2011లో చివరగా అరణ్య కాండం అనే తమిళ చిత్రంలో కనిపించాడు. తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. ఇన్నాళ్లకు అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాను డైరెక్ట్ చేసిన సెల్వ రాఘవన్ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. 7/G బృందావన్ కాలనీ ఈ నెల 22న మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మీడియాతో మాట్లాడాడు. 'చాలారోజులుగా ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని నాన్నగారు అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నాం. దానికంటే ముందు ఈ సినిమాను మరోసారి మీరు చూసేయండి' అని చెప్పుకొచ్చాడు. అయితే అప్పటికి, ఇప్పటికి రవికృష్ణలో చాలా మార్పు వచ్చింది. అసలు 7/G బృందావన్ కాలనీ హీరోలానే లేడు. బరువు పెరిగి గుర్తుపట్టరానంతగా మారిపోయాడు. చదవండి: అజిత్‌తో సినిమాకు సిద్ధమైన జైలర్ నిర్మాతలు.. ఏకంగా అన్ని కోట్లు ఆఫర్! -
7జి బృందావన కాలనీ సీక్వెల్లో ఆ మలయాళ హీరోయిన్?
తుళ్లువదో ఇళమై.. ఈ సినిమాతో సెల్వరాఘవన్ దర్శకుడిగా, ధనుష్ హీరోగా పరిచయమయ్యాడు. వీరిద్దరూ తొలి చిత్రంతోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ధనుష్ హీరోగా కాదల్ కొండేన్ చిత్రం చేసి మరోసారి సక్సెస్ అందుకున్నాడు. కాగా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం 7 జీ రెయిన్బో కాలనీ. 2004లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. నిర్మాత ఏఎం రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆయనకు జంటగా నటి సోనియా అగర్వాల్ నటించింది. ఈమెకు ఇదే తొలి చిత్రం. వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఏఎం.రత్నం నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్టయింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత 7జీ రెయిన్బో కాలనీ(7జి బృందావన కాలనీ) చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి సెల్వరాఘవన్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నమే నిర్మించనున్నట్లు తాజా సమాచారం. కాగా ఈ చిత్రంలో నటి సోనియా అగర్వాల్‌కు బదులుగా మలయాళం హీరోయిన్ అనశ్వర రాజన్ నటించనున్నట్లు తెలిసింది. ఈమె బాలనటిగా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత పలు చిత్రాల్లో వివిధ పాత్రలో నటిస్తూ గుర్తింపు పొందింది. ఇటీవల త్రిష కథానాయికగా నటించిన రాంగీ చిత్రంలోనూ ముఖ్యపాత్రను పోషించింది. అదేవిధంగా థగ్స్ , హిందీ చిత్రం యారియన్ 2 తదితర చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. కాగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. నటుడు రవి కష్ణ కూడా ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ ఇవ్వనున్నారు. View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) చదవండి: థియేటర్లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్.. ఎక్కడంటే? -
సూపర్ హిట్ లవ్ స్టోరీకి సీక్వెల్ రెడీ.. హీరోయిన్ ఎవరంటే..?
కోలీవుడ్‌లో 'తుళ్లువదో ఇళమై' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత కాదల్‌కొండేన్, 7జీ రెయిన్బో కాలనీ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నటుడిగా బిజీ అవుతున్న ఈయన మళ్లీ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఈయన ఇంతకుముందు కోలీవుడ్‌లో దర్శకత్వం వహించిన సక్సెస్ఫుల్ చిత్రం 7జీ రెయిన్బో కాలనీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా విడుదలైంది. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?) తెలుగు వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అందులో 7/G బృందావన్ కాలనీ ఒకటి. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ మూవీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు యువతలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నారు సెల్వరాఘవన్. తొలి భాగంలో నిర్మాత ఏఎం.రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తరువాత ఆయన నటించిన పలు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో నటనకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది 7/G బృందావన్ కాలనీ చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. (ఇదీ చదవండి: BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ) కాగా ఇందులో నటించే కథానాయకి పాత్ర కోసం నటి అదితి శంకర్, ఇవనాలలో ఒకరిని నటింపజేయడానికి దర్శకుడు సెల్వరాఘవన్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. వీరిలో ఆ లక్కీ నటి ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అదితిశంకర్ నటించిన మావీరన్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అధర్వ తమ్ముడు ఆకాశ్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఇకపోతే లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న నటి ఇవనా నటుడు హరీశ్ కల్యాణ్‌కు జంటగా నటించిన ఎల్జీఎం చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. కాగా 7/G బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
విరూపాక్ష భారీ డిజాస్టర్
-
నవ్యస్వామితో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన 'విరూపాక్ష' నటుడు
బుల్లితెర నటుడు రవికృష్ణ-నవ్య స్వామి జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరు అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలకి జంటగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే కలిసి ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అలాంటిదేమీ లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పట్నుంచో సమాధానం ధాటేస్తున్న రవికృష్ణకు తాజాగా మరోసారి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీకు, నవ్యస్వామికి ఉన్న రిలేషన్ ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. సీరియల్లోనే తాము మొదటిసారి కలుసుకున్నామని, అప్పట్నుంచి తమ మధ్య మంచి స్నేహం ఉందని తెలిపాడు. అయితే ఒకవేళ నవ్యస్వామి వచ్చి ప్రపోజ్ చేస్తే మాత్రం ఆలోచిస్తాను అంటూ ఆమెతో రిలేషన్‌షిప్‌పై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం రవికృష్ణ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రీసెంట్గా విరూపాక్ష సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
సంచలనం సృష్టించిన..7/G బృందావన్ కాలనీ సీక్వెల్
-
ఫన్నీ స్పీచ్ తో నవ్వులు పూయించిన సోనియా.. తేజ్ రియాక్షన్ చూడండి
-
బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్, పోస్ట్ వైరల్
బిగ్‌బాస్ కంటెస్టంట్‌తో స్టార్ మా బీబీ జోడి అనే డాన్స్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో పాల్గొన్న పలువుడు కంటెస్టెంట్స్ జోడిగా పెర్పామెన్స్ ఇస్తున్నారు. ఇందులో సహా కంటెస్టెంట్స్ జోడిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు బిగ్‌బాస్ హౌజ్‌లో మాదిగా స్కోర్స్ విషయంలో స్ట్రాటజీ అప్లై చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ జోడి తమ స్ట్రాటజీ వాడి ఎలిమేనేట్ అయ్యింది. ఇక దీనిని తప్పు బడుతూ షో జడ్జస్ అయిన తరుణ్ మాస్టర్, నటి రాధపై అసహనం వ్యక్తం చేశాడు బిగ్‌బాస్ విన్నర్, నటుడు కౌశల్ మండా. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి ఇంతకి ఏం జరిగిందంటే.. ఈ బీబీ జోడి షోలో పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ జోడి కట్టి తమ డాన్స్ పర్ఫామెన్స్తో అదరగొడుతున్నారు. అందులో చెప్పుకొదగ్గ జోడిల్లో రవికృష్ణ, భాను జోడి ఒకటి. చెప్పాలంటే బిబి జోడి టైటిల్ కొట్టే సత్తా వారిలో ఉంది. అయితే గతవారం జరిగిన ఎపిసోడ్లో రవి, భాను స్ట్రాటజీ వాడి షో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమ కో-కంటెస్టెంట్స్ అయిన వాసంతి-అర్జున్ కల్యాణ్ జోడి తమ డాన్స్‌తో జడ్జస్‌ను మెప్పించారు. వారి చేత వావ్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. ఇక సహ కంటెస్టెంట్స్ కూడా వారి డాన్స్‌ని మెచ్చకుంటూ స్కోర్స్ ఇచ్చారు. అయితే రవి-భాను మాత్రం ఒక్క మార్కే ఇచ్చి షాకిచ్చారు. ఇది నిజమా? ప్రాంక్‌గా అని జడ్జస్ అడుగగా.. ఇది తమ స్ట్రాటజీ అని సమాధానం ఇచ్చారు. నిజానికి వారి ప్రెర్ఫామెన్స్‌కి 10 మార్కులు ఇవ్వాలి, కానీ తాము సేవ్ అవ్వాలంటే వారికి ఒక్క మార్కు ఇచ్చామన్నారు. దీంతో జడ్జస్ కూడా తమ స్ట్రాటజీని వాడి వారికి అతి తక్కువ మార్కులు ఇచ్చారు. ఫలితంగా భాను-రవి ఎలిమేనేషన్ ఫేస్ చేసి షో నుంచి వెళ్లిపోయారు. ఇక దీనిపై కౌశల్ మండా స్పందిస్తూ జడ్జస్‌పై తీరు తప్పుబడ్డాడు. ఈ మేరకు ఫేస్బుక్లో వివాదస్పద పోస్ట్ షేర్ చేశౠడు. ‘నా ఉద్దేశం ప్రకారం బీబీ జోడి విజేతలు రవి,భాను శ్రీ. ఎందుకంటే.. వాళ్లు డ్యాన్స్ చేసిన విధానం, ప్రతి రౌండ్లో పింక్ సీటు గెలుచుకున్న తీరు అద్భుతం. చదవండి: ఆ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? కారణం ఇదేనా! బిగ్‌బాస్ పోటీదారులుగా వారి వ్యూహాల ప్రకారం ఆడటానికి వారికి అన్ని హక్కు ఉంది. కానీ న్యాయనిర్ణేతలకు లేదు. జడ్జస్ కేవలం కంటస్టెంట్స్ డాన్స్ మాత్రమే జడ్జ్ చేయాలి, వారి వ్యూహలను కాదు. బిగ్‌బాస్‌లో ఏ జోడి గెలిచిన అది రవి-భాను తర్వాతే అనేది నా అభిప్రాయం. నాకు అనిపించింది చెప్పాను. నిజాన్ని మనసులోనే దాచుకోలేను. క్షమించండి జడ్జస్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కౌశల్‌కు మద్దతు తెలుపుతుంటే మరికొందర అతడిని తప్పుబడుతున్నారు. రవి భాను కేవలం ఒక్క మార్క్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే షోలో కౌశల్ కూడా కంటెస్టెంట్‌గా ఉండటం గమనార్హం. అభినయ శ్రీతో జోడి కట్టి తన డాన్స్‌తో మెప్పిస్తున్నాడు కౌశల్. -
లగ్జరీ కారు కొన్న నవ్య స్వామి, నటుడు రవికృష్ణ రియాక్షన్ చూశారా?
టీవీ నటి నవ్య స్వామి.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పలు టీవీ సీరియల్స్‌తో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైంది. తక్కువ సమయంలో నటిగా ఆమె మవంచి గుర్తింపు పొందింది. నటిగానే కాదు, పలు టీవీ షొలతో, సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని అలరిస్తు ఉంటుంది. ఇదిలా తాజాగా ఆమె ఓ లగ్జరీ బెంజ్ కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తాను కారు కొన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. దీంతో వెంటనే తన ఫొటోను షేర్ చేస్తూ బిగ్‌బాస్ ఫేం, నటుడు, ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రవికృష్ణ నవ్యస్వామికి శుభాకాంక్షలు తెలిపాడు. ‘హే కంగ్రాచ్యూలేషన్స్ రౌడీ ఫెలో.. లిస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది’ అని లవ్ సింబల్స్ పెట్టి తన స్టోరీలో పోస్ట్ చేశాడు. ‘అంతేగా అంతేగా’ అని నవ్యస్వామి బదులిచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. కాగా నటుడు రవి కృష్ణ, నవ్య స్వామి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆమె కథ’ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరికి అప్పుడే పరిచయం ఎర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరు ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు.పలు ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా వీరిద్దరు జంటగా పాల్గొంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో తరచూ వీరిద్దరి ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఒకరి పోస్ట్‌పై ఒకరు స్పందించడం, కామెంట్స్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నవ్యస్వామి ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఆహాలో ఈమె హీరోయిన్గా చేసిన ‘ఇంటింటా రామాయణం’ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. అలానే మరికొన్ని కూడా సెట్స్‌పై ఉన్నాయి. -
'7జీ బృందావన కాలనీ' సీక్వెల్‌కు రెడీ
తమిళసినిమా: నిర్మాత ఎంఎం.రత్నం నిర్మించిన చిత్రం 7జీ రెయిన్బో కాలనీలో ఆయన కుమారుడు రవికృష్ణను కథానాయకుడిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సోనియా అగర్వాల్ నాయకిగా నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోన 7జీ బృందావన్ కాలనీ పేరుతో అనువాదమై సక్సెస్ అయ్యింది. యువన్‌శంకర్ రాజా సంగీతం అందింన ఇందులోని పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఆ తర్వాత రవికృష్ణ కొన్ని చిత్రాలు నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో ఆయన చాలాకాలం నటనకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో 7జీ రెయిన్బో కాలనీ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించాలని ఆలోచన ఉన్నట్లు నిర్మాత ఎంఎం.రత్నం ఇటీవల ఒక వేదికపై పేర్కొన్నారు. అయితే ఇందులో నటించే హీరో హీరోయిన్లు ఎవరు, దర్శకుడు ఎవరు అనేది ఆయన ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన తెలుగులో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరిహర వీరమల్లు అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బహుశా ఆ చిత్రం పూర్తయిన తర్వాత 7జీ రెయిన్బో కాలనీ సీక్వెల్‌పై దృష్టి పెడతారేమో చూడాలి. -
‘గతంలో ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవి కృష్ణతో రిలేషన్!’
బుల్లితెరపై హీరోయిన్‌కు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి నవ్య స్వామి. కన్నడ బ్యూటీగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. నా పేరు మీనాక్షి అనే సీరియల్‌తో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచుకున్న నవ్య కన్నడ, తమిళంలో పలు సీరియల్స్‌లో నటించింది. ఇక తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. ఈ నేపథ్యంలో తను నటించిన ఆమె కథ సీరియల్ సహ నటుడు రవి కృష్ణతో ప్రేమాయణం సాగిస్తుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలు ఇంటర్వ్యూలో నవ్య అవి వట్టి పుకార్తేనని, తమ మధ్య ఏం లేదని స్పష్టిచేసింది. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లు, షోలు చేయడం, నవ్య షేర్ చేసిన ఫొటోలకు రవి కృష్ణ లవ్ సింబల్స్‌తో కామెంట్స్ చేయడం చూస్తుంటే ఆ వార్తలకు మరింత బలం చూకూరుతుంది. తాజాగా ఆమె ఫొటోపై రవి కృష్ణ ఇలాగే స్పందించడం చూసి నెటిజన్లు వీరి ప్రేమయాణం గురించి సోషల్ మీడియాలో చర్చికుంటున్నారు. ఓ నెటిజన్ ‘గతంలో నవ్య స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది. అతడితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది’ అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నవ్య, రవి కృష్ణల రిలేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. చదవండి: ఓ పార్టీలో చేదు అనుభవం, భయమేసి ఇంటికెళ్లి ఏడ్చాను: నటి -
‘బిగ్‌బాస్-3’ ఫేం రవికృష్ణకు కరోనా..
సాక్షి, హైదరాబాద్ : తెలుగు బుల్లితెర నటులపై కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా టీవీ సీరియల్ నటులను కరోనా వెంటాడుతోంది. తాజాగా బిగ్‌బాస్-3తో పాపులర్ అయిన రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రవినే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా తనకు పాజిటివ్ అని తేలిందని, మూడు రోజులు నుంచి ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవని పేర్కొన్నారు. కొన్ని రోజుల నుంచి తనను కాంటాక్ట్ అయిన వారు ఇంట్లోనే ఉండి వీలైతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. (మరో బుల్లితెర నటుడికి సోకిన కరోనా) View this post on Instagram A post shared by Rᴀᴠɪ ᴋʀɪsʜɴᴀ (@ravikrishna_official) on Jul 3, 2020 at 10:57am PDT తెలుగు సీరియల్ ‘మొగలి రేకులు’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవి కృష్ణ ఆ తరువాత వరూధిని పరిణయం, శ్రీనివాస కళ్యాణం, మహాలక్ష్మీ, బావా మరదల్లు వంటి సీరియల్స్‌లో నటించి మంచి పేరును సంపాదించారు. ప్రస్తుతం రవి కొన్ని సీరియళ్లతోపాటు సినిమాల్లో నటిస్తున్నారు. కాగా ఇటీవలే సీరియల్ నటి నవ్య స్వామి కూడా కరోనా బారిన పడగా, ప్రస్తుతం ఆమె కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే రవికృష్ణ, నవ్య కలిసి ఆమె కథ సీరియల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సీరియల్లోని ఇద్దరు నటులు కరోనా బారిన పడటంతో యూనిట్ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. (తెలుగు టీవీ నటికి కరోనా పాజిటివ్) -
పున్నును ఎత్తుకున్న రాహుల్, మొదలుపెట్టారుగా
రేపటితో బిగ్‌బాస్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. హలో యాప్ నిర్వహించిన కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన ఇద్దరు వ్యక్తులను బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్లను కలుసుకునే అవకాశం ఇచ్చాడు. అయితే వారు ఆకస్మాత్తుగా ఇంట్లోకి రావటంతో ఇంటి సభ్యులు మొదట షాకింగ్‌కు గురయ్యారు. అనంతరం తేరుకున్న హౌస్మేట్స్ వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వారు వెళ్లిపోయిన తర్వాత బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రత్యేక అతిథులను పంపించారు. వాళ్లను చూడగానే ఇంటి సభ్యులు ఆనందంతో ఎగిరి గంతేశారు. మొదటగా రవి హౌస్‌లో అడుగుపెట్టగా అలీ వెళ్లి గట్టిగా హత్తుకున్నాడు. ఇంటి సభ్యులందరూ రవికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశిండంతో ఇల్లు కళకళలాడింది. వారి అల్లరితో మళ్లీ పాత రోజులు గుర్తుకు చేశారు. ఇక పునర్నవి ఇంట్లోకి అడుగుపెట్టగానే శ్రీముఖి చంటిపిల్లలా ఎత్తుకుని ‘కరెక్ట్ ప్లేస్‌లో దింపుతా’నంటూ రాహుల్ దగ్గర వదిలిపెట్టింది. దీంతో రాహుల్ పునర్నవిని ఎత్తుకుని స్వాగతం పలికాడు. అనంతరం రాహుల్.. ‘బయట ఎలా ఉంద’ని ఆరా తీశాడు. ‘రెండువారాల్లో కొత్త బెస్ట్‌ఫ్రెండ్స్ అయ్యారు కదా.. నేనేం చెప్పినా ఫేక్ అనిపిస్తది, ఎందుకంటే నేను ట్రూ బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా’ అని పునర్నవి వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ‘ఈ మధ్య ఇంగ్లీష్ మాట్లాడుతున్నావ్..’ అని పునర్నవి అనగా ‘నీతో తిరిగి తిరిగి వచ్చింది’ అని రాహుల్ పంచ్ వేశాడు. ‘సెన్స్ కూడా నాలా వస్తే బాగుండేది’ అని పున్ను రివర్స్ కౌంటర్ వేసింది. ఇక పొట్టి డ్రెస్‌తో ఎంట్రీ ఇచ్చిన తమన్నాను ‘రంభలా రెడీ అయి వచ్చిందే’ అంటూ బాబా కామెంట్ చేశాడు. తన స్నేహితుడైన జాఫర్పైనా బాబా పంచ్‌లు విసిరాడు. అందరూ ఒకేచోటికి చేరడంతో బిగ్‌బాస్ ఇల్లు.. ఆనందాల హరివిల్లుగా మారింది. కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ఓ వీడియోను ప్లే చేశాడు. వారి ఆటపాటలు, అల్లరి జ్ఞాపకాల మేళవింపుతో చేసిన వీడియో చూశాక తమన్నా కాస్త ఎమోషనల్ అయింది. బాధపెట్టినందుకు క్షమించమంటూ రవి చేయి పట్టుకుని కన్నీళ్లతో అర్థించింది. పర్వాలేదు అంటూ రవి ఆమెను ఊరడించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంట్లో పార్టీ జరుగుతోంది. దీనికోసం ఇంటి సభ్యులు అందంగా ముస్తాబయ్యారు. ఈ పార్టీలో అవార్డుల ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అవార్డుల ఎంపికకోసం ఇంటి సభ్యుల సమాధానాలను బిగ్‌బాస్ అడిగి తెలుసుకున్నాడు. మరి ఈ పార్టీలో రచ్చ ఏరేంజ్‌లో ఉండబోతుందో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
పునర్నవిపై బిగ్‌బాంబ్ వేసిన రవి
సండేను ఫండేగా మార్చేందుకు నాగార్జున వచ్చేశాడు. వీకెండ్లో వచ్చిన నాగ్.. ఇంటి సభ్యులందరితో ఫన్నీ టాస్క్ ఆడించాడు. కంటెస్టెంట్లందర్నీ జంటలు విడగొట్టి.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాల్సిందిగా కోరాడు. బిగ్‌బాస్ టీవీ ఉంటుందని.. ఏ కంటెంట్ అయిన వాడుకుని అందర్నీ నవ్వించాలని ఆదేశించాడు. దీనిలో భాగంగా మొదటగా వచ్చిన మహేష్-శివజ్యోతి.. బిగ్‌బాస్ ముచ్చట్లను ప్రేక్షకులకు వినిపించారు. పును-రాహుల్ మధ్య రిలేషన్, ఈ వారంలో జరిగిన సంఘటనలపై బులిటెన్లా వినిపించారు. చివరగా ఇద్దరూ వారి విషయాలను కూడా వారు ఫన్నీగా చెప్పుకొచ్చారు. అలీ-వితికాలు.. అమాయకపు భర్త, అనుమానపు భార్య పాత్రలను పోషించి..చిన్న స్కిట్ వేశారు. రవి-వరుణ్‌లో రవి ఇంటర్వ్యూ చేసే వ్యక్తిగానూ.. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా వరుణ్ నటించారు. ఇంటర్య్యూలో భాగంగా రవి అడిగిన ప్రశ్నలకు వరుణ్‌గా సరదాగా జవాబులు చెప్పాడు. అనంతరం బాబా భాస్కర్-శ్రీముఖి డ్యాన్స్ రియాల్టీ షో ఎలా జరగుతుందో స్కిట్రూపంలో చూపించారు. ఆ షోకు రవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చివరగా రాహుల్.. ఇంటిసభ్యులందరిపై పేరడీ సాంగ్ పాడగా.. రాహుల్‌పై పునర్నవి సైతం ఫన్నీ లిరిక్స్‌తో అదరగొట్టింది. కిస్ అండ్ కిల్ అంటూ ఆడించిన నాగ్... హౌస్‌లో ఎవరు ఉండాలనుకుంటున్నారో.. వారికి కిస్ అని , ఎలిమినేట్ కావాలని అనుకునేవారికి కిల్ అంటూ కత్తిపోటును దించాలనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా వరుణ్-రాహుల్ వారి మధ్య జరిగిన గొడవను మరిచిపోయినట్లు కనిపిస్తోంది. వారిద్దరు కిస్ అని ఇచ్చుకున్నారు. అయితే అనూహ్యంగా పున్నును ఎలిమినేట్ చేయాలని వరుణ్ పేర్కొన్నాడు. టాస్క్‌లు సరిగా ఆడదని అందుకే కిల్ అనే ఆప్షన్ ఎంచుకున్నట్లు తెలిపాడు. అలీ.. బాబాకు, బాబా.. అలీకి కిల్ అనే ఆప్షన్ ఇచ్చుకున్నారు. ఈ టాస్క్ అనంతరం రవి ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. చేదు లడ్డూలు.. తీపి లడ్డూలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న పొజిషన్లో కంటెస్టెంట్ల పేరు చెప్పమని రవికి టాస్క్ ఇచ్చాడు. ఒకటి నుంచి ఐదు వరకు ఉన్నవారికి తీపి లడ్డూలు, ఆరు నుంచి తొమ్మిది వరకు ఉన్నవారికి చేదు లడ్డూలు తినాలనే టాస్క్ ఇచ్చాడు. అయితే పున్ను(9), వితికా(8), మహేష్(7), రాహుల్ (6) పొజిషన్స్లోపెట్టడంతో వారు చేదు లడ్డూలను రుచి చూడవల్సి వచ్చింది. బాబా(5), శ్రీముఖి(4), వరుణ్(3), అలీ(2), శివజ్యోతి(1) ఇవ్వడంతో వారంతా తీపి లడ్డూలను రుచి చూశారు. ఇంటి సభ్యులందరి బట్టలను ఉతకాలనే బిగ్‌బాంబ్‌ను పునర్నవిపై వేశాడు. ఇక పదకొండో వారంలో ఎలాంటి ఘటనలు జరగనున్నాయో చూడాలి. -
ఎలిమినేట్ అయింది అతడే!
బిగ్‌బాస్ షోలో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ ఎంత ఘోరంగా జరుగుతుందో అందరూ చూస్తున్నదే. ఒకప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలియాలంటే.. ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూసేవారు. అయితే ఈ మూడో సీజన్లో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు ఆగితే చాలు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నది తెలుస్తోంది. గత తొమ్మదివారాలకు జరిగినట్టే.. ఈ వారంలోనూ లీకు వీరులు ఎలిమినేషన్ విషయాన్ని ముందే బహిర్గతం చేసేశారు. అయితే ఈ పదోవారానికి ఓ విశిష్టత ఉంది. అదేంటంటే.. లీకువీరుల కంటే ముందే ప్రేక్షకులూ గెస్ చేశారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన మరుక్షణమే ఎవరు ఎలిమినేట్ కానున్నారో అందరూ పసిగట్టేశారు. పదోవారానికి గానూ బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్, రవికృష్ణలు నామినేట్ అయ్యారు. ఆ నలుగురిలో రవికృష్ణకే కాస్త తక్కువ ఫాలోయింగ్ ఉన్నది అందరికీ తెలిసిందే. దీంతో రవికృష్ణ ఈ వారం ఇంటి నుంచి వెళ్లడం ఖాయమని ప్రేక్షకులు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ప్రేక్షకుల ఊహకు తగ్గట్టే రవికృష్ణ ఎలిమినేట్ అయ్యాడని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక్కసారైనా కెప్టెన్ అవుదామని అనుకున్న రవి ఆశలు అడియాశలయ్యాయి. నిన్నటి కెప్టెన్సీ టాస్క్‌లో కెప్టెన్ అయ్యే అవకాశం లభించినా.. అది తృటిలో చేజారిపోయింది. -
బిగ్‌బాస్: కెప్టెన్ అయ్యేదెవరు?
ఎన్ని విమర్శలొచ్చినా బిగ్‌బాస్ తాను అనుకున్నదే చేశాడు. ఎలాంటి పోలింగ్ నిర్వహించకుండానే ఎలిమినేట్ అయిన అలీరెజాను తిరిగి ఇంట్లోకి పంపించాడు. తన రాకతో బిగ్‌బాస్ హౌస్ సందడిగా మారింది. ఒంటరిగా మిగిలపోయిన శ్రీముఖికి అలీ రాకతో కొండంత బలం వచ్చినట్టైంది. ఇటు శివజ్యోతికి ఏడవటానికి మళ్లీ ఓ అవకాశం దొరికింది. అటు రవి తన జిగిరీ దోస్త్ తిరిగిరావటంతో సంతోషంలో మునిగిపోయాడు. మరోవైపేమో టాస్క్‌లో జరిగిన గొడవతో వరుణ్-వితికా, రాహుల్- పునర్నవిల మధ్య దూరం పెరిగింది. నలుగురు మిత్రులు కాస్తా రెండు గ్రూపులుగా చీలిపోయారు. రాహుల్-పునర్నవిల జోడీ మొదట బాగా ఆడినప్పటికీ రెండురోజులుగా జరుగుతున్న గొడవతో చివరి నిమిషంలో డీలా పడిపోయి కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించలేకపోయారు. ఎవరెంత కాకా పట్టినా వీలునామాను మాత్రం ఎవరికీ దక్కకుండా జాగ్రత్తగా దాచుకున్న శివజ్యోతి కెప్టెన్సీ టాస్క్‌కు అర్హురాలిగా నిలిచింది. బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చి బాబా, ఎక్కువ ఇటుకలతో గోడను నిర్మించిన రవి- శ్రీముఖిలు కూడా కెప్టెన్సీ టాస్క్‌లో తలపడనున్నారు. ఇక వీరికోసం బిగ్‌బాస్ ‘కలర్‌ఫుల్ కెప్టెన్’ టాస్క్ ఇచ్చాడు. నాలుగు వేర్వేరు రంగులు నింపిన పాత్రలను ఇచ్చాడు. ఈ టాస్క్‌లో వారంతా ఇంటిని చిందరవందరగా మార్చుతూ చెలరేగిపోయినట్టు కనిపిస్తోంది. ఒకరు తప్పించుకోడానికి ప్రయత్నిస్తుంటే మరొకరు వారిని దొరకబుచ్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తనదైన కామెడీతో ఇంట్లో నవ్వులు పూయించే బాబా భాస్కర్, తన అరుపులతో ఇంటిని దద్దరిల్లించే రాములమ్మ, మంచివాళ్లకే మంచివాడుగా పేరు గాంచిన రవి, ఏడుపే ఆయుధంగా పెట్టుకున్న శివజ్యోతి.. ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! ఇప్పటివరకు రవి, శ్రీముఖికి ఒక్కసారి కూడా కెప్టెన్ అవలేదు. రవి అయితే కనీసం కెప్టెన్సీ టాస్క్ వరకు కూడా వెళ్లలేదు. మరి ఈ టాస్క్‌లో ఎవరికి రంగు పడుద్దో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! Who is our next Colorful captain for the house??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/1Jdf5zRnVu — STAR MAA (@StarMaa) September 27, 2019 -
బిగ్‌బాస్ : రవిపై ట్రోలింగ్.. అది నిజం కాదు
మంచోడు అనే ట్యాగ్‌లైన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో నెట్టుకొస్తున్న రవికృష్ణ.. ప్రస్తుతం వేరే గ్రూపుతో ఉంటున్నాడు. మొదట్లో వరుణ్-వితికా-రాహుల్-పునర్నవిలతో కలిసి ఉన్న రవి.. రానురానూ గ్యాప్ ఇస్తూ.. ప్రస్తుతం శ్రీముఖి గ్రూప్‌కి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే శివజ్యోతితో ఇంకాస్త ఎక్కువగా ఉంటూ హిమజతో కూడా మంచిగానే ఉంటున్నాడు. కానీ వరుణ్ బ్యాచ్‌తో దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే తొమ్మిదో వారానికిగానూ కెప్టెన్సీ టాస్క్‌లో అందరి అభిప్రాయం తీసుకుంటూ ఉండగా.. రవి నిర్ణయంపై పెద్ద చర్చే జరిగింది. ముందుగా.. వరుణ్ పేరు చెప్పావ్ కదా అని పునర్నవి అనగా.. ముందునుంచీ బాబా గారి పేరే చెబుతున్నానని తెలిపాడు. దీంతో అక్కడ పునర్నవి సైలెంట్ అయిపోయింది. మళ్లీ చివర్లో వరుణ్-వితికా-పున్ను-హిమజ మాట్లాడుకునేప్పుడు.. హిమజ కూడా అదే మాట చెప్పింది. మొదటగా వరుణ్ పేరే చెప్పాడని డిస్కషన్ పెట్టారు. ఇదే విషయమై సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా ట్రెండ్ అవుతోంది. అయితే ఆ వీడియోలో మొదటగా.. బాబా భాస్కర్ పేరునే చెప్పాడు. మళ్లీ రివైండ్ చేసి ప్లే చేసిన దాంట్లో మహేష్ అన్న మాటలను రవి అన్నట్టుగా చూపించారు. వరుణ్ బ్రో అని మహేష్ అన్న డైలాగ్.. రవి అన్నట్లు చూపిస్తున్నారు. అయితే రవి మాత్రం ముందునుంచి బాబా పేరే చెప్పినట్టు కనిపిస్తున్నా.. పున్ను, హిమజ మాత్రం కాదని వాదిస్తున్నారు. అయితే తాజాగా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో వరున్ బ్రో అన్నది మాత్రం మహేషే అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మీరూ ఓ సారి ఆ వీడియోను చూడండి. -
అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!
-
బిగ్‌బాస్.. రవిని బురిడీ కొట్టించిన బాబా
-
చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్
దొంగలు దోచిన నగరం టాస్క్ మొదటి లెవల్లో ఎంత హిస్మాతకంగా మారిందో అంతకన్నా దారుణంగా రెండో లెవల్ కొనసాగింది. అందరూ వారి సహనాన్ని కోల్పోయి అరుచుకుంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ.. దాడికి దిగారు. ఇంటిని అల్లకల్లోలం చేశారు. శిల్పకు గాయాలవడంతో మొదటిరోజే ఏడ్చేసింది. బిగ్‌బాస్ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయకపోవడంతో టాస్క్‌ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. హింసకు కారణమయిన వ్యక్తిని ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్ సూచించారు. ఇంటిసభ్యులంతా ఇరకాటంలో పడగా.. ఏ ఒక్కరూ తప్పు చేయలేదు అని కెప్టెన్ వరుణ్ చెప్పడంతో కోప్పడిన బిగ్‌బాస్ ఈ విషయం నవ్వులాటగా ఉందా అంటూ హెచ్చరించారు. నిజాన్ని దాయకుండా నిక్కచ్చిగా రెండు పేర్లను బిగ్‌బాస్‌కు తెలియజేయాల్సిందిగా ఇంటిసభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శ్రీముఖి- రాహుల్, రవిలు హింసకు పాల్పడ్డట్టుగా తెలియజేసింది. అదేవిధంగా శిల్పా చక్రవర్తి- అలీరెజా, రాహుల్.. వితికా- అలీ, రాహుల్.. రాహుల్- అలీ, హిమజ.. హిమజ- రాహుల్, రవి.. పునర్నవి- శ్రీముఖి, అలీ.. శివజ్యోతి- రాహుల్, అలీ.. రవి- వితిక, శివజ్యోతి.. అలీ- రాహుల్, రవి.. మహేశ్- రాహుల్, రవి.. బాబా భాస్కర్- పునర్నవి, రాహుల్‌ల పేర్లను సూచించారు. దీంతో ఎక్కువమంది రాహుల్, రవిలను సూచించడంతో.. వారిద్దరినీ జైలులో బంధించాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. వారికి తినడానికి తిండి కూడా ఇవ్వడానికి వీల్లేదని షరతు విధించాడు. ‘నా పేరు చెప్పని రవిని అనవసరంగా జైల్లో వేయించాను’ అంటూ అలీరెజా కన్నీరుమున్నారయ్యాడు. జైల్లో ఉన్న రవి దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు. జైలు కూడు ఎలా ఉంటుందో బిగ్‌బాస్ రుచి చూపించాడు. కాఫీ, టీ, ఆహారాన్ని అందించకుండా కేవలం రాగి సంగటిని మాత్రమే అందజేశాడు. దాన్ని తినడానికి రాహుల్, రవి నానాతంటాలు పడ్డారు. అనంతరం టాస్క్‌లో జరిగిన తప్పొప్పుల గురించి చర్చించుకున్నారు. రవి మాట్లాడుతూ.. వితిక ప్రవర్తన ఏం బాగోలేదంటూ చెప్పుకొచ్చాడు. వితిక, పునర్నవిలు మంచి ఫ్రెండ్స్‌లా ఉంటారు.. కానీ పునర్నవి లేని సమయంలో వితికా ఆమె గురించి చాలా దారుణంగా మాట్లాడుతుందంటూ.. మిత్రులంటే అలా ఉంటారా? అని రాహుల్‌తో చెప్పుకొచ్చాడు. అలా వెనకాల గోతులు తీయడం నచ్చలేదని, తన మీద నమ్మకమే పోయిందని విమర్శించాడు. రాహుల్ మాట్లాడుతూ.. శ్రీముఖి కావాలని నన్నే టార్గెట్ చేస్తుందంటూ వాపోయాడు. ‘శిల్ప దగ్గర ఎక్కువ చేస్తున్నావేంటి? గుద్దితే.. ముక్కు పచ్చడవుద్ది’ అంటూ రాహుల్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది పునర్నవి. ఆ ఇద్దరూ రోజంతా చిప్పకూడు తింటూ జైలు జీవితాన్ని రుచి చూశారు. ఇక టాస్క్ రద్దయినా వరుణ్, వితికాల మధ్య చిచ్చు చల్లారలేదు. మినిమమ్ కామన్సెన్స్ పెట్టి ఆలోచించు అంటూ వితికపై ఘాటుగా రియాక్ట్ అయ్యాడు వరుణ్. మనం షోకు వచ్చాం హనీమూన్‌కు కాదంటూ వితికపై ఫైర్ అయ్యాడు. దయచేసి నాతో మాట్లాడకు అంటూ వితిక ఏడుపు లంకించుకుంది. అయినా వరుణ్ కోప్పడుతూనే ఉన్నాడు. ప్రతీది భూతద్దం వేసుకుని చూస్తావంటూ నిందించి మరింత బాధపెట్టాడు. ఇక టాస్క్ రద్దు చేయటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హింసాత్మకమైన టాస్క్ ఇచ్చి హింస జరగకూడదు అనేదానిలో అర్థమేంటొ అంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. హింసకు చోటు లేదంటూనే బిగ్‌బాస్ కావల్సినంత హింస సృష్టించాడని అభిప్రాయపడుతున్నారు. -
బిగ్‌బాస్: రాహుల్ ఫ్లాష్‌బ్యాక్.. ప్చ్ పాపం!
బిగ్‌బాస్ ఆరోవారంలోకి ఎంటరైందో లేదో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయింది. గొడవలతో గరం మీద ఉన్న ఇంటి సభ్యులను కూల్ చేయడానికి బిగ్‌బాస్ ఓ ఫన్నీ గేమ్ ఆడించబోతున్నాడు. ఇక దొరికిందే చాన్సు అన్నట్టు అందరూ యాక్టింగ్ కుమ్మేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇంటి సభ్యులు చేసిన జర్నీని పక్కనపెట్టి వారితో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టించాడు బిగ్‌బాస్. అదే బిగ్‌బాస్ బిగ్ ఎక్స్‌ప్రెస్... ఇక్కడ వినోదాలకు మాత్రమే చోటు అన్న రీతిలో తాజా ప్రోమో కనిపిస్తోంది. ఆటలు, పాటలు, డాన్సులతో బిగ్‌బాస్ హౌస్ దద్దరిల్లడం ఖాయం అని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పునర్నవి-రవిని జంటగా చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్న రాహుల్ ఊరికే ఉంటాడా అన్నది ఆలోచించాల్సిన విషయమే! సినిమాల్లోలాగా రాహుల్ దీన వదనంతో తన ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ పిల్ల ఉండేదంటూ తన లవ్‌స్టోరీ ఇంటిసభ్యులకు చెప్తూ ఉంటే మధ్య మధ్యలో శ్రీముఖి పంచ్‌లు పేల్చుతోంది. అసలు రాహుల్ తన గతాన్ని చెబుతోంది పోయిన అమ్మాయిని తిరిగి దక్కించుకోవటం కోసమా.. కళ్ల ముందు కులాసాగా తిరుగుతున్న జంట మధ్య చిచ్చు పెట్టడానికా అన్న అనుమానం రాక మానదు. పైగా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రేమను ఎవరో తన్నేసుకుపోవడం సహించలేని రాహుల్ తన లైన్ క్లియర్ చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే ఇంట్లో మరో కొత్త జంట అలీ రెజా, శ్రీముఖిలు ప్రేమ గీతాలు పాడుకుంటున్నారు. అయితే ఇది టాస్క్‌లో భాగమని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ ప్రేమ జంటలను అడ్డుకునేందుకు ఇంటిసభ్యులు ఎవరైనా యత్నిస్తారా? లేక ఈ రెండూ జంటలూ హాయిగా డ్యూయెట్ సాంగ్ వేసుకుని ఎంజాయ్ చేస్తుంటాయా.. ఒకవేళ అదే జరిగితే రాహుల్ మొహం మాడిపోవడం ఖాయం. ఇంటి సభ్యుల ఎంజాయ్మెంట్ చూస్తుంటే నేటి ఎపిసోడ్ నిజంగానే జోరుగా కొనసాగనుంది అని అనిపించక మానదు. #BBExpress lo joyful ride ki ready avvandi 😀#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/n0qySP7QtM — STAR MAA (@StarMaa) August 28, 2019 -
పునర్నవి లవ్ ట్రాక్ రాహుల్‌తో కాదా?
-
బిగ్‌బాస్: పునర్నవి లవ్ ట్రాక్ రాహుల్‌తో కాదా?
ఒకరోజు గొడవలు.. మరో రోజు సరదాలు.. రోజు విడిచి రోజు ఇదే తతంగం. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ ఈ ఫార్ములా మీదే నడుస్తోంది. ఒకరోజు అరుపులు పెడబొబ్బలతో ఎపిసోడ్ సాగింది అంటే కచ్చితంగా తర్వాతి ఎపిసోడ్ సరదాగా జోష్‌గా సాగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిన్న హీట్ ఎక్కిన ఇంటిని నేడు కూల్ చేసే పనిలో ఉన్నాడు బిగ్‌బాస్. అందులో భాగంగానే ఇంటి సభ్యుల చేత ‘చలో ఇండియా’ టాస్క్ ఆడించనున్నాడు. ఇందులో విస్తుగొల్పే విషయమేంటంటే రవి-పునర్నవిని హనీమూన్ జంటగా పేర్కొన్నాడు. దీంతో రాహుల్ పక్కలో బాంబు పడ్డట్టయింది. ప్రస్తుతం ఈ విషయాన్ని రాహుల్ గట్టి మనసుతో లైట్ తీసుకున్నా టాస్క్‌లో వారి తీరును చూసి ఎలా జీర్ణించుకుంటాడో.. అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. రాహుల్‌ను సేవ్ చేసి పునర్నవి ఎలిమినేషన్‌కు వెళ్లటంతో ఇప్పుడిప్పుడే వీరి లవ్ ట్రాక్ కాస్త గాడిలో పడుతుందనే సమయానికి అనూహ్యంగా పునర్నవి భర్తగా రవిని నియమించాడు. మరి దీని తర్వాతి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో..! స్నేహితురాలి కన్నా ఎక్కువైన పునర్నవి పక్కన వేరేవాళ్లను చూసి రాహుల్ తట్టుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో రాహుల్‌కు మంచి అవకాశం చేజారిపోయిందని రాహుల్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. ఇక చలో ఇండియా టాస్క్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేలా కనిపిస్తోంది. బాబా భాస్కర్‌ను చాయ్ అమ్ముకునే వ్యక్తిలా, రాహుల్, వరుణ్ ట్రైన్ డ్రైవర్, కండక్టర్లుగా అవతారం ఎత్తనున్నారు. ఇక ప్రోమో చూస్తే టాస్క్‌లో అందరూ విజృంభించి నటించినట్టే కనిపిస్తోంది. మరోవైపు బిగ్‌బాస్ ఆరోవారంలోకి ఎంటరై రెండు రోజులు కావస్తోంది. కానీ ఇప్పటివరకు కెప్టెన్సీ టాస్క్ ఆడించలేదు. మరి ప్రస్తుతం ఇచ్చిన గేమ్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చినవారిని కెప్టెన్‌గా ఎంపిక చేయనున్నాడా లేక శివజ్యోతినే కెప్టెన్‌గా కంటిన్యూ చేయనున్నాడా లేక అందుకు మరో పథకం సిద్ధం చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. -
బిగ్‌బాస్: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!
బిగ్‌బాస్ నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. తాజా ఎపిసోడ్లో బిగ్‌బాస్ ఇంటిసభ్యుల చేత కెప్టెన్సీ టాస్క్ ఆడించారు. అందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టగా వారి మధ్య ఐకమత్యం కనిపించలేదు. ఎవరికి వారే ఒంటరిగా టాస్క్‌లు గెలవడానికి పోరాడారు. టాస్క్‌లో గెలుపొందిన రాహుల్‌కు పునర్నవి గోరుముద్దలు తినిపించింది. ఎత్తుకు పై ఎత్తులతో సాగిన ఈ గేమ్‌లో శ్రీముఖి రాహుల్‌పై ఫైర్ అయింది. ‘నిన్ను నమ్మి టీంలోకి తీసుకున్నా. నన్ను మోసం చేస్తే నీతో జీవితంలో మాట్లాడను’ అని రాహుల్ పై సీరియస్ అయింది. అయితే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిలా రాహుల్.. శ్రీముఖికి పాద నమస్కారం చేసి మరీ తన దగ్గర ఉన్న గుడ్డును కొట్టేశాడు. దీంతో తెల్లముఖం వేయడం శ్రీముఖి వంతయింది. టాస్క్ ప్రారంభంలో అమ్మాయిలు హవా చూపించినప్పటికీ చివరికి ఆట అబ్బాయిల చేతిలోకి వెళ్లిపోయింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ‘నేనే రాజు-నేనే మంత్రి’ గేమ్ ఆడించారు. ఇందుకుగానూ ఇంటి సభ్యులను విక్రమపురి (రెడ్ టీమ్), సింహపురి (బ్లూ టీమ్)లుగా విడగొట్టాడు. రెడ్ టీమ్‌కు సేనాపతిగా శ్రీముఖి, బ్లూ టీమ్ సేనాపతిగా హిమజలను నియమించారు. రెడ్ టీమ్ సేనాపతి శ్రీముఖి.. అలీ, రాహుల్, మహేశ్, అషూరెడ్డిలను సైనికులుగా ఎంచుకుంది. బ్లూ టీమ్ సేనాపతి హిమజ.. వరుణ్, పునర్నవి, బాబా భాస్కర్, రవిలను సైనికులుగా సెలక్ట్ చేసుకుంటుంది. ఆట విషయానికొస్తే.. రెడ్ టీం దగ్గర ఎరుపు రంగు జెండాలు, బ్లూ టీం దగ్గర నీలం రంగు జెండాలు ఉంటాయి. రెడ్ టీం.. బ్లూ టీం రాజ్యంలో జెండాలు పాతాలి. అదే విధంగా బ్లూ టీం.. రెడ్ టీం రాజ్యంలో జెండాలను ఉంచాలి. పొరుగు రాజ్యం పాతిన జెండాలను నిర్దాక్షిణ్యంగా తీసి పాడేసే హక్కు సంబంధిత రాజ్యానికి ఉంటుంది. బజర్ మోగగానే హోరాహోరీగా సాగిన ఈ ఆట రాను రానూ రసవత్తరంగా మారింది. మొదట జెండాల కోసం కుస్తీ పడ్డా తరువాత అందరి దృష్టి డ్రాగన్ ఎగ్స్‌పైకే వెళ్లింది. గుడ్డు సంపాదించుకున్న వారికి ప్రత్యేక ప్రయోజనాలతో పాటు నేరుగా రెండో రౌండ్‌కు వెళ్లే అవకాశం ఉండటమే ప్రధాన కారణం. ఇరు రాజ్యాల సైనికులు ఎంతసేపూ గుడ్డు మీద కన్నేయడంతో రెండు టీమ్‌లు తదుపరి లెవల్‌కు వెళ్లలేదు. ఆట ప్రారంభానికి ముందే డ్రాగన్ ఎగ్స్ సంపాదించుకున్న వితిక, రోహిణి, శివజ్యోతిలు వాటిని కాపాడుకోడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ గుడ్లను జారవిడ్చుకుని కెప్టెన్సీ టాస్క్ మధ్యలోనే తప్పుకున్నారు. ఇక రెడ్ టీం.. జెండాలు కాపాడుకున్నా, సైనికులు లేక.. బ్లూ టీమ్ అటు జెండాలు, ఇటు సైనికులు రెండూ కోల్పోవడంతో తర్వాతి లెవల్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయాయి. వ్యూహాత్మకంగా సాగిన ఈ గేమ్‌లో చివరాఖరికి రాహుల్, రవి, అలీ రెజాలు డ్రాగన్ ఎగ్స్ దక్కించుకుని నెక్స్ట్ లెవల్‌కు వెళ్లారు. కెప్టెన్సీ టాస్క్‌లో ఈ ముగ్గురూ తలపడనున్నారు. కూల్‌గా ఉండే రవి, అతిగా ఆవేశపడే అలీ, నవ్వుతూనే ఎత్తులు వేసే రాహుల్.. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్‌గా నిలుస్తారో చూడాలి..! -
ఇక సారీలుండవ్.. అన్నీ అటాక్‌లే : తమన్నా
బిగ్‌బాస్‌లో తమన్నా-రవికృష్ణ వ్యవహారంలో వ్యక్తిగత దూషణలు స్థాయిని మించడంతో తమన్నాపై మిగతా హౌస్మేట్స్ ఫైర్ అవ్వడం.. తమన్నా ఎంతకీ తగ్గకపోవడం.. చివరకు బిగ్‌బాస్ ఓ టాస్క్‌ను ఇవ్వడంతో వీటన్నంటికి పుల్‌స్టాప్ పడ్డట్టైంది. రవికృష్ణ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తూ.. ఎవరితో మాట్లాడుతూ ఉన్న అక్కడికి వెళ్లి మరీ రెచ్చగొడుతోంది. పక్కనే ఉంటూ ప్రత్యక్ష నరకం చూపుతోంది. మగాడివేనా, పప్పుగాడు అంటూ హేళన చేస్తున్నా.. రవికృష్ణ మాత్రం మౌనంగా ఉంటూ తమన్నాను పట్టించుకోవడం లేదు. హౌస్మేట్స్ అందరూ తమన్నా చర్యలను వ్యతిరేకిస్తున్నా.. ఆమె మాత్రం రవికృష్ణను టార్గెట్ చేస్తూనే ఉంది. చంద్రముఖి వేశం వేస్తా.. పశుపతి.. అంటూ ఏదోదో పిచ్చిగా వాగుతూనే ఉంది. రవికృష్ణ నవ్వుతూ ఉన్నా సరే.. ఏదో పాట పాడుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంది. మిత్రమా ఇంత స్వార్థమా.. నీచమైన ఆట ఆడావు.. నేను కూడా నీచమైనే ఆట ఆడతాను అంటూ ఏవేవో కారుకూతలు కూసింది. క్షమాపణలు చెబితే కూడా వాడికి తప్పేనంటూ.. ఇక సారీలుండవ్.. అన్నీ అటాక్‌లే అంటూ తమన్నా రెచ్చిపోయింది. తనకింకా సహనమివ్వాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ.. కోపంలో ఒక్కసారిగా ఏం మాట్లాడేస్తానని భయంగా ఉందంటూ మిగతా హౌస్‌మేట్స్‌తో రవికృష్ణ చెప్పుకొచ్చాడు. (అరేయ్.. మగాడివేనా? : తమన్నా) రోహిణి, శివజ్యోతి, రాహుల్, అలీ రెజా ఇలా అందరితో తమన్నా వాగ్వాదానికి దిగుతూనే ఉంది. ఎంతకీ తమన్నా తగ్గడం లేదు. రవికృష్ణపై వ్యక్తిగత దూషణ చేస్తూనే ఉంది. ఇక తమన్నా వ్యవహారానికి పుల్‌స్టాప్ పెట్టేందుకే అన్నట్లు ఓ టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్. దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్‌లో భాగంగా తికమకపురంలో ఊరి పెద్ద వరుణ్ సందేశ్,తమన్నాలు ఉండగా.. పనీపాట లేని లాయర్ హిమజ.. బద్దకస్తుడైన పోలీస్ ఆఫీసర్ బాబా భాస్కర్.. స్ట్రిక్ట్ కానిస్టేబుల్‌గా శివజ్యోతి నటించారు. ఇక దొంగలైన అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణలు దొంగతనాలు చేస్తుండగా.. పోలీసులు పట్టుకుని జైల్లో వేయాలని తెలిపాడు. ఇక టాస్క్‌లో భాగంగా ఊరికి సంబంధించిన నిధిలో ఉన్న వస్తువులను, డబ్బును దొంగతనం చేయడమే దొంగల టార్గెట్‌గా ఉండాలని పేర్కొన్నాడు. టాస్క్‌లో భాగంగా ఊరిలోని నిధిని, వస్తువులను దొంగతనం చేసేపనిలో ఆ ముగ్గురూ పడ్డారు. ఇక శ్రీముఖిని మాత్రం ఉట్టిపుణ్యానికే అరెస్ట్ చేయబోయారు. అయితే డబ్బులిచ్చి ఆ వ్యవహారం సద్దుమణిగేలా చూసుకుంది. ఇక ఊళ్లోని నిధి చుట్టూ రాహుల్, వరుణ్ సందేశ్ కాపలకాయసాగారు. శ్రీముఖి అల్లరి, బాబా భాస్కర్ కామెడీతో సరదాగా గడిచిపోతోన్న ఈ టాస్క్ మరునాటికి సీరియస్ అయినట్లు కనబడుతోంది. నిధి ఉన్న బాక్స్ అద్దాలు పగిలి హౌస్‌మేట్స్‌కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ టాస్క్‌లో గెలుపొంది.. కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారో చూడాలి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
అరేయ్.. మగాడివేనా? : తమన్నా
తమన్నా సింహాద్రి నోటికి అడ్డూఅదుపు ఉండదని హౌస్‌మేట్స్‌తో పాటు బిగ్‌బాస్ చూసే ప్రేక్షకులకు అందరికీ తెలిసే ఉంటుంది. హౌస్‌లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆమెను తీసుకొచ్చారా? అంటూ నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తమన్నా ప్రవర్తనతో విసుగెత్తిన ఆడియెన్స్.. ఆమెను ఈవారం బయటకు పంపించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తమన్నా ఎలిమినేట్ అవడం గ్యారంటీ అంటూ కామెంట్లుపెడుతున్నారు. అయితే నిన్నటి నామినేషన్ ప్రక్రియలో తమన్నా వాగిన చెత్త అందరికీ తెలిసే ఉంటుంది. రవికృష్ణ.. తమన్నాను నామినేట్ చేయడంతో మొదలైంది ఈ గొడవ. ఇక అప్పటి నుంచి రవికృష్ణను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. సిగ్గులేదారా?. నువ్ మగాడివేనారా?.. పప్పుగాడు అంటూ హౌస్‌లో పిచ్చిపిచ్చి కూతలు కూస్తూ ఉంది. ఇక నుంచి తనెంటో చూపిస్తానని చెప్పిన తమన్నా.. అన్నంత పని చేసినట్టుగానే కనిపిస్తోంది. తమన్నా.. రవికృష్ణను దూషిస్తూ ఉన్న ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీంట్లో రవికృష్ణను అడుగడుగునా తమన్నా టార్గెట్ చేసినట్లు కనపడుతోంది. అరేయ్ మగాడివేనా? పప్పుగాడు అంటూ మళ్లీ కామెంట్లు చేస్తూ కనపడుతోంది. మరి రవికృష్ణ సైలెంట్‌గానే ఉన్నాడా? లేక తమన్నాకు గుణపాఠం చెప్పాడా? అన్నది చూడాలి. -
సిగ్గులేదురా.. అంటూ రెచ్చిపోయిన తమన్నా
బిగ్‌బాస్‌లో అందరిదీ ఓ దారి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమాన్న సింహాద్రిది ఓ దారి. ఎప్పుడు ఎవరితో మంచిగా ఉంటుంది? ఎప్పుడు ఏం మాట్లాడుతుంది? అన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇంట్లోకి వచ్చిన వెంటనే వరుణ్ సందేశ్-మహేష్ వ్యవహారంలో వరుణ్ సందేశ్‌ను తిడుతూ.. మహేష్‌కు సపోర్ట్‌చేసింది. అయితే వరుణ్ సందేశ్-తమన్నా కలిసి జైల్లో ఉండటంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనపడుతోంది. ప్రస్తుతం వరుణ్‌తో బాగానే ఉంటుంది. ఇక రవికృష్ణను పండు పండు అంటూ ఆటపట్టించడం.. రవికృష్ణ ఏదైనా అంటే అతనిపై మళ్లీ సీరియస్ అవుతోంది. (పునర్నవికి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్) ఇక మొన్నటి పవర్ గేమ్ టాస్క్‌లో అలీరెజా కింగ్‌గా మారడం.. మగవారిని ఆడవారిగా మారమని.. వారితో డ్యాన్సులు చేయించడం తెలిసిందే. ఈ ఘటనలో అలీపై తమన్నా ఎంతలా విరుచుకుపడిందో అందరం చూశాం. ఇక మళ్లీ ఆ గొడవలు సమసిపోయి ఆ ఇద్దరూ కలిసిపోయారని అనుకుంటే.. శనివారం నాటి ఎపిసోడ్లో మళ్లీ మొదటికి వచ్చింది. ఇక తమన్నా వ్యవహారంపై ఇంటిసభ్యులందరూ విసిగిపోయి ఉండగా.. నేడు జరిగే నామినేషన్ ప్రక్రియలో తనను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రవికృష్ణ.. తమన్నాను నామినేట్ చేయడం.. దానికి గల కారణాలను వివరిస్తూ ఉంటే.. అతనిపై ఘాటుగా స్పందించడం.. సిగ్గులేదురా అంటూ వ్యాఖ్యానించడం రీసెంట్గా విడుదల చేసిన ప్రోమోలో కనపడుతోంది. ఇప్పటికే పునర్నవి భూపాలం తనను తాను ఎలిమినేట్ చేసుకోవడం.. దీనిపై బిగ్‌బాస్ స్పందిస్తూ సీజన్ మొత్తం నామినేట్ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. తాజాగా తమన్నా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ప్రోమోను వదిలారు. మొత్తానికి నేటి నామినేషన్ ప్రక్రియ ఇంట్లో పెద్ద చిచ్చును పెట్టినట్లు తెలుస్తోంది. అసలింతకి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. అయితే ఈ వారంలో తమన్నా నామినేషన్స్‌లో ఉండబోతోందని, మూడో ఎలిమినేషన్లో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లనుందని ఇప్పటినుంచే సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి Nomination process goes rough between #Tamanna & #RaviKrishna#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/I7nK49Iwjb — STAR MAA (@StarMaa) August 5, 2019 -
రవికృష్ణ.. సీరియల్ హీరోకు కేరాఫ్
గ్రాండ్‌గా ప్రారంభించిన బిగ్‌బాస్ షోలో రెండో పార్టిసిపెంట్‌గా సీరియల్ నటుడు రవికృష్ణ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో క్యాటగిరీ నుంచి ఒక్కో సెలబ్రెటీని ఎంచుకునే బిగ్‌బాస్ టీమ్ ఈసారి సీరియల్లో నటించే వారికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనబడుతోంది. సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా రవికృష్ణ మారాడు. మొగలిరేకులు సీరియల్లో ఓ చిన్న పాత్రను చేసిన రవికృష్ణ.. ప్రస్తుతం పలు సీరియల్స్‌లో హీరో పాత్రలను పోషిస్తూ బిజీగా ఉన్నాడు. శ్రీనివాస కళ్యాణం, వరూధిని పరిణయం లాంటి సీరియల్స్‌తో మహిళాలోకానికి సుపరిచితుడు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా హీరోగా మారి చివరి వరకు నిలబడి టైటిల్ గెలుచుకుంటాడా? అన్నది చూడాలి.