rayjasabha
-
అభయ ఘటన కేసు : సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి అభయ ఘటనలో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై అధికార తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తన పార్లమెంటరీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఆ లేఖలో.. తప్పు చేస్తున్నా సరే ప్రభుత్వంపై అభిమానం ఉందని కొంతమందిని, అవినీతిపరుల్ని పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, అందుకు సాధ్యపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు అవితీని పాల్పడ్డ అధికారులకు(లేదా వైద్యులు) ప్రమోషన్లు ఇచ్చి వారికి మరింత ఉన్నత స్థానాల్ని కేటాయించడాన్ని తాను అంగీకరించబోమని’ అని సిర్కార్ చెప్పారు.అంతేకాదు అభయ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరుగుతుందని ఆశించా. దారుణం జరిగిన నాటి నుంచి న్యాయం చేస్తారనే ఎంతో ఒపికతో ఎదురు చూశా. అది జరగలేదు. పైగా ప్రభుత్వం నిందితుల్ని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం విఫలమైంది అని దీదీకి రాసిన లేఖలో సిర్కార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీదీ ఓ సలహా ఇచ్చారు. రాజకీయం కోసం నిరసనలు చేయకుండా.. బాధితురాలికి న్యాయం చేకూరేలా.. నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలి కాలంలో ఆర్జీకార్ అభయం ఘటనలో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జీకార్ ఆస్పత్రి ఘటనలో సొంత పార్టీ నేతలే మమతా తీరును విమర్శిస్తున్నారు. అలా విమర్శించినందుకే టీఎంసీ నేత శాంతాను సేన్‌ను పార్టీ పదవి నుంచి తొలగించింది. సుఖేందు శేఖర్ సైతం తిరుగు బావుటా ఎగురవేశారు. అభయ ఘటనలో దీదీ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నారు. తాజాగా, రాజ్యసభ సభ్యుడు జవహార్ సిర్కార్ రాజీనామా చేయడం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. -
కొత్త నోట్ల ప్రింటింగ్ ఖర్చుఎంతో తెలుసా?
న్యూడిల్లీ: నవంబర్ 9 న పెద్దమొత్తంలోచలామణిలోవున్న రూ. 500, 1000 నోట్లను రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ముద్రించిన కొత్త నోట్ల విలువ ఎంతో తెలుసా? ఈ వివరాలను ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. కొత్తగా చెలామణిలోకి తీసుకొచ్చిన రూ.500, రూ.2000 నోట్లను ముద్రణ ఖర్చు వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలియ చేశారు. రాజ్యసభలో లిఖిత పూర్వకంగా ఈ వివరాలను ఆయన వెల్లడించారు. రూ.500 నోటు ప్రింట్ చేసేందుకు రూ.2.87 నుంచి రూ.3.09, రూ.2000 నోటు ముద్రణకు రూ.3.54 నుంచి రూ.3.77 మేర వెచ్చిస్తున్నట్లు రాజ్యసభలో మేఘవాల్ తెలిపారు. కొత్త నోట్ల ప్రింటింగ్ ఇంకా కొనసాగుతున్నకారణంగా పూర్తి ఖర్చు వివరాలను ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త కరెన్సీ నోట్లను ముద్రించే పేపర్ ను కొనుగోలు రిజర్వు బ్యాంకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. నిర్దిష్ట సరఫరాదారులకు తప్ప ఇతరులు అనుమతి లేదని, ఈ వివరాలను ఎవరికీ అందించలేమన్నారు.అ లాగే "రహస్యంగా మరియు ప్రత్యేకంగా" అనే నిబంధన ఒప్పందంలో చేర్చినట్టు మంత్రి తెలిపారు. అలాగే ఫిబ్రవరి 24, 2017 నాటికి దేశంలో రూ. 11.64 లక్షల కోట్ల కరెన్సీ చెలామణీలో ఉన్నట్టు వెల్లడించారు. 2016 డిసెంబర్ 10 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత రూ.500, రూ.1000 నోట్లు కరెన్సీ విలువ సుమారు రూ.12.44 లక్షల కోట్లు అని.. దీనిపై ఇంకా పరిశాలన జరుగుతోందని చెప్పారు. కాగా ప్రస్తుతం ఏటీఎం లు సరిగా పనిచేయకపోవడం, కొత్త నోట్ల కొరత కొనసాగుతుండడం పై కూడా ప్రశ్నలు చెలరేగాయి. అయితేదీనిపై స్పందించిన ఆయన. దేశవ్యాప్తంగా 2.18 లక్షల ఏటీఎంలు ఉండగా.. ఈ ఏడాది జనవరి 4 నాటికి 1.98 లక్షల ఏటీఎంల పునరుద్ధరణ జరిగినట్లు సమాధానమిచ్చారు. కొత్త నోట్ల కొరత త్వరలోనే పూర్తిగా తీరిపోనుందని అర్జున్ రామ్ సభలో హామీ ఇవ్వడం విశేషం.