‘పైకా’ రద్దు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ యువ క్రీడా ఖేల్ అభియాన్(పైకా) స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వ స్పోర్ట్స్ యూత్ సర్వీసుల శాల రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ యూత్ సర్వీసుల శాఖ డెరైక్టర్ ఆర్.డి. చౌహాన్ ఈ మేరకు ఆదేశాలను గత నెల 22వ తేదీన అన్ని రాష్ట్రాల క్రీడాధికారులకు జారీ చేశారు.
ఈ స్కీమ్ ద్వారా పని చేస్తున్న సిబ్బంది, క్రీడాధికారులను వెంటనే తమ విధుల నుంచి తొలిగించాలని ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. పైకా స్కీమ్ పేరుతో పది క్రీడాంశాల్లో రాష్ట్ర ,జాతీయ స్థాయిలో క్రీడోత్సవాలను ఇంతకాలం నిర్వహించారు. పైకా స్థానంలో కొత్తగా రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్(ఆర్జీకేఏ) ఏర్పాటు చేస్తారు.