ఐఫోన్ ఇన్స్పిరేషన్తో..బోలెడన్ని ఫీచర్లతో బడ్జెట్ ఫోన్! ధర ఎంతంటే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఇన్స్పిరేషన్తో 'రెడ్మీ నోట్ 11ఎస్ఈ' ఫోన్‌ను డిజైన్ చేసింది. అంతేకాదు ఐఫోన్లో ఉన్న ఫీచర్లు ఈ కొత్త చైనా ఫోన్లో ఉన్నాయి. ధర విషయంలో ఐఫోన్ అంత కాస్ట్లీ కాకుండా బడ్జెట్ ధరనే నిర్ణయించింది. మైక్రో ఎస్డీ స్లాట్ వరకు అప్‌గ్రేడ్ చేసుకునేలా 64జీబీ స్టోరేజ్,మీడియా టెక్ హీలియా జీ95 చిప్ సెట్‌తో వస్తుంది.
రెడ్మీ నోట్ 11ఎస్ఈ స్పెసిఫికేషన్లు
5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.43అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, హోల్ పంచ్ కటౌట్‌తో 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2400*1080పిక్సెల్ రెజెల్యూషన్‌తో డిస్ప్లే,ఎంఐయూఐ తరహాలో కంటిపై ఒత్తిడి తగ్గించేందుకు రీడింగ్ మోడ్ 3.0, సన్‌లైట్ మోడ్ 2.0, 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ర్యామ్ అండ్ 64జీబీ యూఎఫ్ఎస్2.2 స్టోరేజ్‌తో మీడియాటెక్ హీలియా చిప్సెట్, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది
దీంతో పాటు ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా, కెమెరా యాప్‌లో నైట్ మోడ్,ఏఐ బ్యూటీఫై, ఏఐ పోట్రేట్ వంటి మోడ్లు ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్,ఏఐ ఫేస్ అన్‌లాక్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ బ్యాండ్ వైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రెడ్మీ నోట్ 11ఎస్ఈ ధర
64జీబీ ర్యామ్ అండ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్మీ నోట్ 11ఎస్ ఫోన్ ధర రూ.13,499గా ఉంది. బ్లాక్,వైట్,బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇక ఈ ఫోన్ ఆగస్ట్ 31 నుంచి షావోమీ వెబ్సైట్, ఫ్లిప్ కార్ట్‌లో లభ్యం అవుతుంది. ఈ ఫోన్‌తో పాటు రెడ్ మీ నోట్ 11 రెగ్యూలర్ (రూ.13,499),రెడ్మీ నోట్ 11 టీ 5జీ (రూ.15,999),రెడ్మీ నోట్ 11 ప్రో (18,999)ఫోన్లు సైతం అందుబాటులో ఉంటాయని రెడ్ మీ ప్రతినిధులు తెలిపారు.