reject
-
బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్
బీజింగ్ : చైనాకు బ్రెజిల్ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రణాళికకు బ్రెజిల్ అడ్డుకట్టవేసింది. చైనా చేపట్టిన బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేరకూడదని నిర్ణయించుకుంది. తద్వారా ఈ భారీ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వని బ్రిక్స్ గ్రూపులోని రెండో దేశంగా బ్రెజిల్ అవతరించింది.బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్ మీడియాతో మాట్లాడుతూ బ్రెజిల్ బీర్ఐలో చేరదని, అయితే ఇందుకు బదులుగా చైనా పెట్టుబడిదారులతో భాగస్వామిగా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. బ్రెజిల్ ఎటువంటి ఒప్పందాలపై సంతకం చేయకుండా, చైనాతో తన సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటోందన్నారు.హాంకాంగ్‌కు చెందిన వార్తాపత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'లోని వార్తల ప్రకారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించిన చైనా ప్రణాళికకు బ్రెజిల్ మద్దతునివ్వడం లేదు. బ్రెజిల్ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు ఇటీవల చైనా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఇప్పటికే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్ఐ ప్రాజక్టు అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలకు విరుద్ధమని భారత్ పేర్కొంది.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
‘సంజయ్ రాయ్‌పై నార్కో టెస్ట్ వద్దు’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్యకళాశాల జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు కోల్‌కతా కోర్టును సీబీఐ అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం జూనియర్ వైద్యుల సమ్మె కారణంగా ఆస్పత్రుల్లో వైద్యం అందక మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం ముందుకొచి్చంది. 29 మంది మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు ఇస్తామని సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానికి జూడాల లేఖ ఈ ఉదంతంలో స్వయంగా కలగజేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకూ పంపించారు. ‘‘ అత్యంత జుగుప్సాకరమైన నేరానికి మా తోటి సహాధ్యాయి బలైంది. న్యాయం జరిగేలా మీరు జోక్యం చేసుకోండి. అప్పుడే ఎలాంటి భయాలు లేకుండా మళ్లీ మా విధుల్లో చేరతాం’’ అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు. -
లిక్కర్ కేసు: కవితకు మళ్లీ నిరాశే
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురయింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ రిజెక్ట్ చేసింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలో రిజర్వు చేసిన తీర్పును సోమవారం(జులై1) సాయంత్రం వెలువరించింది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పిచ్చింది. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అన్ని కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం(మే21) బెయిల్ నిరాకరించింది. కేసు విచారణలో ట్రయల్ కోర్టు ఎలాంటి ఆలస్యం చేయడం లేదని, దీంతో ఈ కారణంపై బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.సిసోడియా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే సిసోడియా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ప్రతి వారం చూసేందుకు కోర్టు అనుమతించింది. కాగా, లిక్కర్ కేసులో సోమవారమే(మే20) సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ ఎవెన్యూకోర్టు మే 31 దాకా పొడిగించడం గమనార్హం. -
కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ స్కాం కేసుకు సంబంధించి ఆయన వేసిన మరో పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉదయం కొట్టేసింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ని లాయర్ కలిసేందుకు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్‌ను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్లో కోరిన కేజ్రీవాల్ కోరారు. అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరిస్తూ.. కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉంటే.. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ అరెస్టును సమర్థించిన కోర్టు.. సామాన్యులకు, సీఎంలకు న్యాయం ఒక్కోలా పని చేయదంటూ వ్యాఖ్యానించింది. -
Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా మొదటి షో నుంచే పలు వివాదాలను క్రియేట్ చేసింది. మరోవైపు సినిమాకు కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. కానీ చివరకు ఈ సినిమా లాభాలను తెస్తోందో, లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?) అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేశారు. నిజానికి మొదట UV క్రియేషన్స్ నిర్మాతలు 'ఆదిపురుష్' మూవీని తెలుగులో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఏమైందో తెలియదు వారి స్థానంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూ.185 కోట్లకు కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ తెలుగు రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అమ్మేందుకు పీపుల్స్ మీడియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ దిల్ రాజు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలిసింది. చివరకు నైజాం రైట్స్ అయినా తీసుకోవాలని వారు కోరితే దానిని కూడా దిల్ రాజు సున్నితంగా తిరస్కరించాడట. శాకుంతలం సినిమా వల్ల అప్పటికే దాదాపు రూ.30 కోట్లకు పైగా నష్టాలను చూసిన ఆయన మళ్లీ రిస్క్ చేయడం ఎందుకని తిరష్కరించాడని తెలుస్తుంది. ఆదిపురుష్ టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై నమ్మకం లేకపోవడం వల్లే దిల్ రాజు కొనుగోలు చేయలేదని, ఇప్పుడు ఆయన భయం నిజమయిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దిల్ రాజు అంచనా ఎలాంటిదో తేలాలంటే మరో వారం ఆగాల్సిందే. (ఇదీ చదవండి: అలా అంటున్నవారంతా తెలివి తక్కువ వాళ్లే!: ఆదిపురుష్ డైరెక్టర్) -
కావాలనే చేస్తుందా?.. మరో టాప్ హీరోకు షాకిచ్చిన కంగనా రనౌత్?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సంచలనాలకు చిరునామా, వివాదాలకు పేటెంట్ నటి కంగనా రనౌత్. ఆమె సమాజంలో జరిగే సంఘటనలపై తనదైనశైలిలో స్పందిస్తుంది. ప్రతిభకు తక్కువ కాదు అనే గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తన సత్తా చాటుకుంటున్న కంగనా తాజాగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పరిపాలన, నాటి సంఘటనలతో 'ఎమర్జెన్సీ' చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రను పోషించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడం విశేషం. తమిళంలో ఇప్పటికీ ధామ్ ధూమ్, తలైవి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్కడా అవకాశాలు వస్తున్నాయి. కానీ తమిళ చిత్రాల అవకాశాలను తిరస్కరిస్తుందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు.. ఆమె క్యాస్ట్‌పై తెగ వెతికేస్తున్నారు!) ఇంతకు ముందు నటుడు శింబు సరసన నటించే అవకాశాన్ని నిరాకరించిన కంగనా రనౌత్ తాజాగా నటుడు ధనుష్‌తో జత కట్టే అవకాశానికి నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ధనుష్ పాన్ వరల్డ్ నటుడు అన్నది తెలిసిందే. కాగా ఈయనలోనూ టాలెంట్‌కు కొదవ లేదు. ఇప్పటికే నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. తాజాగా తన 50వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఈయనే దర్శకత్వం వహించనున్నారు. భారీ తారాగణంతో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో ధనుష్‌కు జంటగా కంగనా రనౌత్‌ను నటింపజేసే ప్రయత్నం చేసినట్లు, ఆమె కాల్ షీట్స్ సమస్య అంటూ నిరాకరించినట్లు టాక్. దీంతో ధనుష్ తన అర్ధ సెంచరీ చిత్రంలో నాయకిగా నటి త్రిషను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. దీంతో మరో సౌత్ హీరోకు కంగనా నో చెప్పిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జజర్దస్త్ కమెడియన్) -
సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్‌కు షాక్.. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి లైన్ క్లియర్..
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. తమిళనాడు వ్యాప్తంగా రూట్ మార్చ్‌లు నిర్వహించాలనుకున్న ఆర్ఎస్ఎస్కు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ ర్యాలీలపై నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) దాడులకు పాల్పడే అవకాశం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కారణంగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిబ్రవరి 10న ర్యాలీలకు అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పుతో తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. చదవండి: జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ రాజకీయ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి? -
ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తుందని తేల్చి చెప్పారు. తాము దిగ్విజయ్ సింగ్ అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని కరాఖండీగా చెప్పారు. తాను ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పారు. అయినా సాయుధ దళాలు ఒక పనిని చాల అనుహ్యంగా చేయగలవు, వారి సామర్థ్యం గురించి కూడా తనకు తెలుసనని అన్నారు. దీనికి ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విమర్శలు రావడంతో రాహుల్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, దిగ్విజయ్ సింగ్ మాటిమాటికి సర్జికల్ స్ట్రైక్ జరిగింది ఇంతమందిని చంపాం అంటూ కేంద్రం కబుర్లు చెబుతోందే గానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. రాహుల్ సూచన మేరకే దిగ్విజయ్ సింగ్ అలా విషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు చేసింది. ఆర్మీపై గట్టి విశ్వాసం ఉండాలని, అది రాజకీయాలకు అతీతమైనదంటూ తిట్టిపోసింది బీజేపి. అయినా పదేపదే సర్జికల్ స్ట్రైక్ గరించి పూఫ్ అడుగుతున్నారు, అసలు ఆర్మీపై మీకు నమ్మకమే లేదనేది స్పష్టమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. అయినా కాంగ్రెస్‌కి ఇలా భాద్యతరహితమైన ప్రకటనలు ఇవ్వడం పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేదే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాహుల్, దిగ్విజయ్‌లకు నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషం కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని బాటియా దుయ్యబట్టారు. (చదవండి: వాటికి ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు) -
ఈవీఎంలో పార్టీ గుర్తుల తొలగింపునకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎం, బ్యాలెట్లపై పార్టీ గుర్తులు నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హత, ఫొటోలు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం విచారించింది. ఈవీఎంలో పార్టీ గుర్తులుండడంపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికలు పార్టీలతో ముడిపడి ఉంటాయని, పిటిషన్‌ను అంగీకరిస్తే అభ్యర్థి గెలిచాక పార్టీలు మారే ప్రమాదముందని పేర్కొంది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పార్టీల నీడలో అభ్యర్థులు ఉండడం వల్లే చట్టసభల సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. నేర చరిత్ర లేని వారికి పార్టీలు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పిటిషనర్ వాదనపై అటార్నీ జనరల్ వెంకట రమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలో ఓటు వేయడానికి ముందుగానే ఓటర్లు తమ అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారని ఏజీ పేర్కొన్నారు. పిటిషన్ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచన చేసింది. కోర్టు విచారణకు అంగీకరించని నేపథ్యంలో తాను ఈసీని ఆశ్రయిస్తాయని వికాస్ సింగ్ పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు వస్తే తప్పకుండా పరిశీలిస్తామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారు. చదవండి: ఎన్నికల వేళ.. బీజేపీలో ముసలం -
నూపుర్ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట
న్యూఢిల్లీ: బీజేపీ సస్పెండెడ్ నేత, న్యాయవాది నూపుర్ శర్మకు మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది. ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం కమ్యూనిటీ మనోభావాలను ఆమె దెబ్బ తీశారని, కాబట్టి ఆమెపై కఠిన చర్యల తీసుకోవాల్సిందేనని, అందుకుగానూ సంబంధిత అధికారులను ఆదేశించాలని పిటిషనర్.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించే క్రమంలో.. ‘‘ఆదేశాలు జారీ చేసేప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడమే మంచిది’’ అని పిటిషనర్‌కు సూచించారు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్. దీంతో పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు. ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల తర్వాత.. నూపుర్ శర్మ కామెంట్లపై అరబ్ దేశాల నుంచి, భారత్‌లోని ఇస్లాం కమ్యూనిటీ నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఒకానొక తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సైతం ఆమెపై నిప్పులు చెరిగింది. అయితే తదుపరి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సానుకూలంగా స్పందిస్తూ.. అరెస్ట్ నుంచి ఊరట ఇవ్వడంతో పాటు ఆమెపై దేశవ్యాప్తంగా దాఖలైన.. అవుతున్న ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదలాయించాలని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది. ఇదీ చదవండి: పక్కా ప్లాన్.. అయినా దుస్థితికి కారణాలేంటి? -
ఇంద్రాణీ ముఖర్జీతో కలిసి ఉండడానికి వీల్లేదు
ముంబై: ఇంద్రాణీ-పీటర్ ముఖర్జీల కూతురు విధీ ముఖర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తల్లితో కలిసి జీవించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను ముంబై ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించే ముందు సీబీఐ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. విధీ ముఖర్జీ గత కొన్ని సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తోంది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తన తల్లిని కలిసేందుకు సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ కోర్టు ముందుకు రావడంతో ఆమె లండన్ నుంచి వచ్చారు. కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ప్రథమ నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ.. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. ఆమెతో ఉండేందుకు అనుమతించాలని విధీ ముఖర్జీ తన అభ్యర్థనలో పేర్కొంది. అంతేకాదు.. 2015లో ఇంద్రాణీ అరెస్ట్ తర్వాత తల్లికి దూరమై తాను భావోద్వేగానికి లోనయ్యానని.. మైనర్‌గా ఉన్న తాను తల్లికి దూరమై కుమిలిపోయానని విధీ తన అభ్యర్థనలో చెప్పుకొచ్చింది. అయితే ప్రాసిక్యూషన్(సీబీఐ) మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. విధీ ముఖర్జీ సైతం ఈ కేసులో సాక్షిగా ఉందని, ఆమెను ఇప్పటివరకు ప్రశ్నించని విషయాన్ని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఆధారాల సేకరణ పూర్తయ్యే వరకు ఇంద్రాణీ ఎవరినీ కలవడానికి.. అనుమతి లేదన్న విషయాన్ని సీబీఐ, ప్రత్యేక న్యాయస్తానానికి గుర్తు చేసింది. ఒకవేళ విధి పిటిషన్‌ను విచారణకు గనుక స్వీకరిస్తే.. ఇంద్రాణీ బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. ఈ తరుణంలో.. సీబీఐ వాదనలో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజనీత్ సంఘాల్.. విధీ ముఖర్జీ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కన్నకూతురైన షీనా బోరా(24)ను.. ఇంద్రాణీ ముఖర్జీ తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌తో కలిసి కారులో 2012లో దారుణంగా హత్య చేసి.. శవాన్ని రాయ్‌గఢ్ జిల్లా శివారులోని అడవుల్లో తగలబెట్టింది. 2015లో వేరే కేసులో అరెస్ట్ అయిన శ్యామ్వర్ రాయ్ నోరు విప్పడంతో ఈ సంచలన కేసు వెలుగు చూసింది. ఈ కుట్రలో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉందని తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేయగా.. 2020లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆపై ఇంద్రాణీ-పీటర్లు విడాకులు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? -
క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే!
భువనేశ్వర్: ఇటీవల కొన్ని వివాహాలు పీటలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అయితే అందులో కొన్నింటికి వరుడు కారణమైతే, మరికొన్నింటికి వధువు కారణంగా నిలుస్తున్నారు. గతంలో పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెప్తుంటారు. మరి ఇప్పుడు అదే పెద్దలు చూడట్లేదేమో, మండపం వరకు వచ్చిన వివాహాలు చివరి నిమిషంలో పుల్‌స్టాప్ పడుతున్నాయి. తాజాగా ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలోనూ ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. కల్యాణ ఘడియల శుభవేళలో మంగళ వాద్యాలు మారుమోగుతున్న పెళ్లి పందిరిలో అకస్మాతుగా నిశ్శబ్దం ఆవరించింది. వరుడు సొమ్మసిల్లి పోయాడు. దీంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. కాసేపటి తర్వాత తేరుకన్న వరుడు వధువు పాపిట కుంకుమ పెట్టే క్షణంలో ఆమె అందరికీ షాకిస్తూ పెళ్లికి నిరాకరించింది. ఇంతకు ముందే తనకు వేరే వ్యక్తితో వివాహం జరిగినట్లు ప్రకటించి వేదిక నుంచి వైదొలగింది. బాలాసోర్ జిల్లా బలియాపాల్ ఠాణా రెమూ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఊహాతీత ఘటన చోటు చేసుకుంది. చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే? -
తాజ్ మహల్: గదులు తెరిపించాలన్న పిటిషన్ తిరస్కరణ
అలహాబాద్: తాజ్ మహల్లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్ చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రజలకు కూడా ఉంటుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టకుండానే తిరస్కరించింది. అంతేకాదు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వ్యవస్థను అవమానపరిచేలా వ్యవహరించొద్దంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయండంటూ తేల్చి చెప్పింది. ‘‘వెళ్లండి. వెళ్లి ఏదైనా పరిశోధనలు చేసుకోండి. ఎంఏలు, పీహెచ్‌డీలు చేసుకోండి. న్యాయస్థానాల సమయం వృథా చేయొద్దంటూ’’ అంటూ బెంచ్ న్యాయమూర్తులు ఉపాధ్యాయ్, సుభాష్ విద్యార్థిలు పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చిస్తే బాగుంటుంది. ఇలా కోర్టు రూమ్‌లో కాదు అంటూ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు బయట మెథడాలజీ, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయం అని బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలంటూ సూచించింది. సీల్ చేసి ఉన్న గదులను తెరిపించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ బీజేపీ యూత్ మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీష్ సింగ్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వాస్తవానికి తేజ్ మహాలయా అని.. అది శివుడి ఆలయం అంటూ ఆయన వాదించారు. అంతేకాదు నిజనిర్ధారణ కమిటీ ద్వారా అసలు చరిత్రను వెలుగులోకి తేవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కోరారు. మొఘలుల కాలానికి చెందిన తాజ్ మహల్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. ఈ కళాఖండం 1982లో యనెస్కో వరల్డ్ హెరిటేర్ సైట్ గుర్తింపు దక్కించుకుంది కూడా. చదవండి: తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా -
గేట్ పోస్ట్‌పోన్.. కుదరదు: సుప్రీం కోర్టు
గేట్ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పరీక్ష నిలుపుదలకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ.. యధాతధంగా పరీక్ష నిర్వహణ ఉంటుందని గురువారం తీర్పు వెలువరించింది. పరీక్షకు 48 గంటల ముందు గేట్ ఎగ్జామ్‌ను పోస్ట్‌పోన్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్పుడు ప్రతీది తెరుచుకుంటోంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణం అవుతున్నాయి. ఇలాంటి టైంలో విద్యార్థుల కెరీర్‌తో ఆడుకోలేం. ఇది అకడమిక్ పాలసీకి సంబంధించింది. పర్యవేక్షించాల్సింది వాళ్లు.. మేం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించింది బెంచ్. కొవిడ్-19 థర్డ్‌వేవ్ తరుణంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా గేట్‌ను వాయిదా వేయాలంటూ అభ్యర్థనల మేర పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు పిటిషన్లు దాఖలు కాగా..అందులో ఒకటి అభ్యర్థుల తరపున దాఖలైంది. పిటిషనర్ల తరపున పల్లవ్ మోంగియా, సత్పల్ సింగ్ వాదనలు వినిపించారు. కాగా, సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో యధాతధంగా గేట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. -
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేతకి నో!
ఆప్ సర్కార్ వర్సెస్ ఎల్జీ మరోసారి తెర మీదకు వచ్చింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఒక ప్రతిపాదనతో పాటు కొవిడ్ ఆంక్షల్ని సవరించాలన్న విజ్ఞప్తిని సైతం ఆయన తోసిపుచ్చారు. కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ తేల్చేశారు. అయితే 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి మాత్రం ఎల్జీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఎల్జీ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారంగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని రీజియన్‌లో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతూ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది. ఇదిలా ఉంటే కర్ణాకటలో ఓపక్క వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయగా.. తమిళనాడులో వీకెండ్లో పూర్తిగా లాక్డౌన్, మిగతా రోజుల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. -
ఇంటర్వ్యూలో అన్నీ కరెక్ట్‌గా చెప్పినా.. ఆ సిల్లి కారణంతో రిజెక్ట్ చేశారు
సాధారణంగా ఉద్యోగులను ఎంపిక చేసుకునేటప్పుడు హెచ్ఆర్లు తాము ఎంపిక చేయబోయే అభ్యర్థులకు కొన్ని అర్హతలు నిర్ణయించుకుంటారు. వాటిని అనుసరించే ఆ ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఇంటర్యూ సమయంలో చెప్పిన సమాధానాలను మరికొన్ని వాటిని పోల్చి చూసుకుని వారిని ఎంపిక చేయాలా, వద్దా అనేది తేలస్తారు రిక్రూటర్లు. కానీ ఓ యువతి ఒక వింత కారణం చెప్పి రిజెక్ట్ చేశారు. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఈ సిల్లీ రీజన్ చెప్పి ఉద్యోగానికి రిజెక్ట్ చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాపర్టీ రిక్రూట్మెంట్ సంస్థ డైరెక్టర్ ఫాయె ఏంజెలెట్టా తన క్లయింట్ కంపెనీలో ఓ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు తీసుకుంది. అందులో ఒక యువతిని ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఆ యువతి బయోడేటాను సదరు క్లయింట్‌కు పంపించింది. అయితే.. వాళ్లు మాత్రం ఆ యువతి లావుగా ఉందనే కారణంతో రిజెక్ట్ చేశారు. ఆ యువతిని ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం చూసి ఏంజెలెట్టా షాక్ అవుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో.. తను లావుగా ఉందని.. ఉద్యోగంలోకి తీసుకోకపోవడం అసలు కారణమే కాదు. ఇంతవరకు నేను ఇలాంటి కారణాలతో ఉద్యోగులను రిజెక్ట్ చేయడం చూడలేదు. ఇప్పుడు నేను ఆ యువతికి ఎలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అంటూ రాసుంది. నిజానికి ఆ యువతి అంత లావుగా కూడా లేదు, కానీ వాళ్లు ఎందుకు రిజక్ట్ చేశారో తెలియదు కానీ కారణం మాత్రం ఇదే చెప్పారని ఏంజెలెట్టా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు యువతిని రిజక్ట్ చేయడం పై మండిపడుతున్నారు. చదవండి: Interesting Facts About Toothbrush: మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! -
రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు..
సాక్షి, కొత్తగూడెంటౌన్ (ఖమ్మం): ప్రేమించిన అమ్మాయి దూరమైందని, అమ్మాయి తరఫువారు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తగూడెం పెనగడప గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలం అంబేడ్కర్‌నగర్ గ్రామానికి చెందిన ఏసుపాక గణేశ్ (22) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వారి కుటుంబ సభ్యులను అడుగగా వారు నిరాకరించారు. మనస్తాపానికి గురైన గణేశ్ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గణేశ్ తల్లి స్వరూప ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల కిందట గణేశ్.. సదరు అమ్మాయి ప్రేమించుకున్నారని, పెద్ద మనుషుల సమక్షంలో ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు మాట ఇచ్చి తప్పారని చెప్పింది. తన కుమారుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టి పెళ్లి చేయమని చెప్పారని, ఊరిని వదిలిపోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్ బుధవారం రాత్రి పాయిజన్ తాగి పడిపోగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని, గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ గణేశ్ మృతిచెందాడని స్వరూప వెల్లడించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. చదవండి: Madhya Pradesh: డెయిరీ ముసుగులో వ్యభిచార దందా.. -
అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి
ఆమ్స్టర్డామ్: ప్రపంచంలో ప్రస్తుతం ప్రతీది పైసాతోనే నడుస్తోంది. ఇక డబ్బు కోసం ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అలాంటి పరిణామాలు జరుగుతున్న ఈ రోజులల్లో ఓ యువతి కోట్ల రుపాయలను ఖర్చులకోసం ఇస్తుంటే సున్నితంగా తిరస్కరించింది. ఇది నమ్మలేకున్నా నమ్మాల్సిన నిజమండి. వివరాలల్లోకి వెళితే.. డచ్ సింహాసనం వారసురాలు నెదర్లాండ్స్ యువరాణి కాథరినా అమాలియా తనకు రానున్న భారీ వార్షిక అలవెన్స్ హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాగ్జిమా పెద్ద కుమార్తె శుక్రవారం డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టేకు ఓ లేఖను రాసి పంపింది. అందులో.. ఆమె రాజ విధులు చేపట్టే వరకు దాదాపు 2 మిలియన్ డాలర్ల భత్యాన్ని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. రాచరికపు నిబంధనల ప్రకారం ఆమెకు 18 ఏట నుంచి.. ప్రతి సంవత్సరం అలవెన్స్‌ల కింద సుమారు రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 7న అమ్మడుకు 18 ఏళ్లు రానుండగా.. ఆమె దీనిని వద్దంటూ వివరణగా.. కష్టపడకుండా వచ్చే డబ్బులు తనకొద్దని తెలిపింది. View this post on Instagram A post shared by Koninklijk Huis (@koninklijkhuis) చదవండి: టెన్త్ ఫెయిల్, కానీ మనోడి స్టోరీ రాజమౌళికి తెలిస్తే ఇక సినిమానే!? -
మామిడి దౌత్యం.. పాక్‌కు చైనా సహా 32 దేశాల ఝలక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు మామిడి పండ్ల షాక్ తగిలింది. స్నేహపూర్వకంగా పండ్లు పంపిస్తే.. వద్దని తిప్పి పంపించాయి కొన్ని దేశాలు. ఈ లిస్ట్‌లో మిత్ర దేశం చైనాతో పాటు అమెరికా, కెనెడా, నేపాల్, శ్రీలంక.. ఇలా 32 దేశాలున్నాయి. అయితే ఈ మామిడి పండ్ల దౌత్యాన్ని ఆయా దేశాలు సున్నితంగానే తిరస్కరించాయి. కరోనా వైరస్ క్వారంటైన్ కారణంగా చూపిస్తూ మామిడి పండ్లను వెనక్కి పంపాయి. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ కార్యాలయానికి ఆయా పార్శిళ్లు వెనక్కి వచ్చేశాయి. కాగా, మేలిమి రకాలైన అన్వర్‌రొట్టోల్, సింధారి రకాలు కరోనా ప్రభావంతో ఈసారి పండించకపోవడంతో.. చౌన్సా రకపు మామిడి పండ్లను పాక్ అధ్యక్షుడు డాక్టర్ అరిఫ్ అల్వి పేరు మీదుగా ఆయా దేశాలకు పంపింది పాక్. గల్ఫ్ దేశాలు టర్కీ, యూకే, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, రష్యా సహా.. అన్ని దేశాలు వద్దని పంపించడం విశేషం. ఇక ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయానికి పంపినట్లు పాక్ చెప్తున్నప్పటికీ.. అవతలి నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, ప్రతీ ఏడాది ఇలా స్నేహ పూర్వక సంబంధాల కోసం పాక్ ఇతర దేశాల నేతలకు మామిడి పండ్లు పంపడం ఆనవాయితీగా వస్తోంది. 2015లో నరేంద్ర మోదీ, ప్రణబ్‌ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, సోనియా గాంధీకి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీప్ మామిడి పండ్లు పంపించాడు కూడా. -
చోక్సీకి కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి,న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. క్యూబాకు పారిపోతూ డొమినికాలో అరెస్ట్ అయిన చోక్సీకి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్లైట్ రిస్క్ కారణాలతో బెయిల్ ఇవ్వలేమని అక్కడి న్యాయమూర్తి వైనెట్ అడ్రియన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. అలాగే చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కూడా ఉందని న్యాయవాది లారెన్స్ వాదించారు. కాగా పీఎన్బీ బ్యాంకులో 13,500 కోట్ల రూపాయల స్కాం కేసులో నిందితుడగా ఉన్న చోక్పీ 2018లో అంటిగ్వాకు పారిపోయిన సంగతి తెలిసిందే. మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని అనుభవిస్తున్న చోక్సీ మే 23న ఆంటిగ్వానుంచి పారిపోతూ డొమినికాలో అరెస్టయ్యాడు. దీంతో అక్కడ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు చోక్సీని అక్రమ వలసదారుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. చదవండి : చోక్సీ గర్ల్‌ఫ్రెండ్ : మరో ట్విస్టు క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్ -
H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట
వాషింగ్టన్: ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసాలను అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే ట్రంప్ పాలనా కాలపు విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. ఈ నిబంధన తొలగింపుతో లీగల్ ఇమ్మిగ్రేషన్‌కు ఉన్న అడ్డంకులు మరింతగా తగ్గనున్నాయి. జోబైడెన్-హారిస్ నేతృత్వంలో తీసుకున్న విధాన చర్యలు దేశ చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు అనవసరమైన అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడుతుందని యుఎస్సీఐఎస్ డైరెక్టర్ ట్రేసీ రెనాడ్ చెప్పారు. అలాగే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు సంబంధించి వలసదారులపై భారాన్ని తగ్గించాలన్న లక్ష్యానికనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రంప్ 2018లో తెచ్చిన ఈ నిబంధన హెచ్1బీతో సహా ఎల్1, హెచ్2బీ, జే1, జే2, ఎఫ్, ఓ తదితర వీసా అప్లికేషన్లపై పడింది. తాజాగా ఆర్ఈఎఫ్, ఎన్ఓఐడీ నిబంధనలను మారుస్తున్నట్లు, కొన్ని రకాల ఎంప్లాయ్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ల కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2013లో తీసుకువచ్చిన నిబంధనలనే తిరిగి అమలు చేస్తామని, 2018లోతెచ్చిన నిబంధనను తొలగిస్తామని తెలిపింది. తాజా నిర్ణయంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునే వీలు వీసా దరఖాస్తుదారులకు కలగనుంది. 2018 నిబంధన ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వీసాలు తిరస్కరించేందుకు ఏజెన్సీ అధికారులకుఅవకాశం ఉండేది. దీని ప్రభావం పలు ఐటీ కంపెనీల ఉద్యోగులపై పడింది. చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ సజావుగా కొనసాగేందుకు తాము తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని హోమ్లాండ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో తెలిపారు. చదవండి : Petrol Price: రూ.102 దాటేసింది! -
భారత అథ్లెట్ గోమతి అప్పీల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మరిముత్తుకు చుక్కెదురైంది. డోపింగ్‌కు పాల్పడినందుకు గోమతిపై 2019లో నాలుగేళ్ల నిషేధం పడింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె సీఏఎస్‌ను ఆశ్రయించింది. 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగులో గోమతి స్వర్ణం గెలవగా... ఆ తర్వాత ఆమె డోపింగ్‌లో పట్టుబడటంతో వరల్డ్ అథ్లెటిక్స్ డిసిప్లినరీ ట్రిబ్యునల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. తాను పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడుతుండటంతో పాటు గర్భస్రావం జరిగిన కారణంగా శరీరంలో 19–నోరాన్డ్రోస్టిరోన్ ఎక్కువగా కనిపించిందని, సరైన రీతిలో పరీక్షలు కూడా నిర్వహించలేదని ఆమె తన అప్పీల్లో పేర్కొనగా... ఆర్బిట్రేటర్ జాన్ పాల్సన్ దానిని త్రోసి పుచ్చి నిషేధం కొనసాగుతుందని తీర్పునిచ్చారు. -
అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక
రష్మిక మందన్నా..ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ల కంటే ముందే ఈ అమ్మడికి బీటౌన్ నుంచి ఓ మంచి ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన జెర్సీ రీమెక్‌లో నటించేందుకు మొదట రష్మికనే సంప్రదించారట. బాలీవుడ్ పిలుపు కోసం హీరోయిన్లు తహతహలాడుతుంటే.. రష్మిక మాత్రం ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తాను ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు రిజెక్ట్ చేసిందో చెప్పుకొచ్చింది. 'జెర్సీ' మూవీలో నాని సరసన హీరోయిన్గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించిందని,ఆ పాత్రకు తనకన్నా గొప్పగా ఎవరూ న్యాయం చేయలేరని భావించిందట. అందుకే తాను ఈ సినిమా ఒప్పుకోలేదని తెలిపింది. ఇక తెలుగులో జెర్సీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరే బాలీవుడ్‌లోనూ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో షాహిద్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. చదవండి : ఆరోజు నా పేరెంట్సే నన్ను నమ్మలేదు : రష్మిక రష్మిక కోరిక త్వరలోనే నెరవేరుస్తానన్న బన్నీ -
సివిల్స్ అభ్యర్థులకు మరో అవకాశం లేనట్లే
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020 అక్టోబర్‌లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయలేక చివరి ప్రయత్నం(లాస్ట్ అటెంప్ట్) సైతం కోల్పోయిన వారికి మరో అవకాశం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల 2020లో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుతూ సివిల్ సర్వీసెస్‌లో ‘చివరి ప్రయత్నం’ దాటిపోయిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఎ.ఖన్వీల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది. ఈ మేరకు 40 పేజీల తీర్పును వెలువరించింది. ఇలా లాస్ట్ అటెంప్ట్‌లో పరీక్ష రాయలేకపోయినవారికి మరో అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, సివిల్స్ అభ్యర్థుల వయో పరిమితిలోనూ ఎలాంటి సడలింపులు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సడలింపులు ఇవ్వడం ఇతర అభ్యర్థులపై వివక్ష చూపినట్లే అవుతుందని స్పష్టం చేశారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 6 సార్లు సివిల్స్ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 32 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు సివిల్స్ రాయొచ్చు. వయో పరిమితి 35 సంవత్సరాలు. ఇక ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా ఈ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 37 ఏళ్లు. గత ఏడాది కరోనా ప్రభావం ఉన్నప్పటికీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల 10,000 మందికిపైగా అభ్యర్థులు నష్టపోతారని అంచనా.