భారత్ కు రెండో ర్యాంక్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో
♦ ఆకర్షణీయంగా భారత రిటైల్ రంగం
♦ నిబంధనల సరళీకరణ, జీడీపీ జోరు ప్రధాన కారణాలు
♦ జీఆర్‌డీఐ నివేదిక వెల్లడి
సింగపూర్: వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భారత్ ఈ ఏడాది రెండో ర్యాంక్‌ను సాధించింది. గ్లోబల్ రిటైల్ డెవలప్మెంట్ ఇండెక్స్(జీఆర్‌డీఐ) రూపొందించిన ఈ జాబితాలో అభివృద్ధి చెందుతున్న 30 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో జనాభా అధికంగా ఉండడం, జీడీపీ జోరు పెరుగుతుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ప్రభుత్వం సరళీకరిస్తుండడం వంటి కారణాల వల్ల భారత రిటైల్ మార్కెట్ వృద్ధి జోరుపై విదేశీ రిటైలర్ల ఆసక్తి అధికమైందని ఈ జీఆర్‌డీఐ నివేదిక పేర్కొంది. అందుకనే భారత్‌కు ఈ ర్యాంక్ లభించిందంటున్న ఈ జీఆర్‌డీఐ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు..
♦ గత ఏడాది ర్యాంక్ నుంచి భారత్ 13 స్థానాలు ఎగబాకింది.
♦ ఈ జాబితాలో చైనాకు మొదటిస్థానం దక్కింది.
♦ సింగిల్-బ్రాండ్ రిటైల్ రంగానికి సంబంధించి పలు కీలక ఎఫ్‌డీఐ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. దీంతో బహుళ జాతి కంపెనీలకు భారత్‌లో ప్రవేశించడానికి మార్గం సుగమం అయింది.
♦ భారత రిటైల్ రంగం 2013-15 కాలంలో 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. వార్షిక విక్రయాలు లక్షకోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించాయి.
♦ భారత వృద్ధి జోరును ఈ-కామర్స్ మరింత పెంచడమే కాకుండా, భారత్‌ను మరింత ఆకర్షణీయ మార్కెట్‌గా మారుస్తోంది.
♦ {పపంచంలోనే భారత్ రెండో అతి పెద్ద ఇంటర్నెట్ మార్కెట్. ఆన్లైన్ షాపింగ్ పట్ల భారత వినియోగదారులు ఆసక్తి పెరుగుతుండటంతో వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఈ-కామర్స్ రంగంలో పెట్టుబడుల జోరును పెంచుతున్నాయి.