హాలీవుడ్ కింగ్ ఆఫ్ కల్ట్ రోజర్ కన్నుమూత
హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు రోజర్ విలియం కోర్మన్ (98) కన్నుమూశారు. 1926 ఏప్రిల్ 5న డెట్రాయిట్లో జన్మించారు రోజర్ కోర్మన్ . కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఈ నెల 9న ఆయన మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు హాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో కాస్త ఆలస్యంగా ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చింది. 1950లో స్టోరీ రీడర్‌గా ఆయన సినీ కెరీర్ మొదలైంది. కెరీర్ మొదట్లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత రోజర్ కోర్మన్ తొలిసారిగా ‘మాన్ స్టర్ ఫ్రమ్ ది ఓషియన్ ఫ్లోర్’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ నిర్మించగా మంచి విజయం సాధించింది. రోజర్ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 350కిపైగా సినిమాలను నిర్మించారు. అలాగే 20కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు 30 సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ చేశారు. రోజర్ కెరీర్లో ‘ఫైవ్ గన్స్ వెస్ట్’, ‘డే ది వరల్డ్ ఎండెడ్’, ‘ది అన్ డెడ్’, ‘టార్గెట్స్’, ‘వార్ ఆఫ్ ది శాటిలైట్స్’, ‘ఎక్స్: ద మ్యాన్ విత్ ది ఎక్స్ రే ఐస్’, ‘డెత్ రేస్’ వంటి ఎన్నో హిట్ సినిమాలున్నాయి. హాలీవుడ్ పరిశ్రమ రోజర్‌ను ‘΄ోప్ ఆఫ్ ΄ాప్ సినిమా’, ‘ది కింగ్ ఆఫ్ కల్ట్’ వంటి పేర్లతో పిలుచుకుంటుంది. రోజర్‌కు భార్య జూలీ కోర్మన్, కుమార్తెలు కేథరీన్, మేరీ ఉన్నారు. ఆయన మృతిపట్ల హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.