4 అంతర్జాతీయ బ్యాంకులపై 2.5 బిలియన్ డాలర్ల జరిమానా
వాషింగ్టన్: అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికాలోని నాలుగు భారీ బ్యాంకులు 2.5 బిలియన్ డాలర్ల మేర జరిమానా కట్టనున్నాయి. 2007-2013 మధ్య కాలంలో జేపీమోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, బార్ క్లేస్, ది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఒకదానితో మరొకటి కుమ్మక్కై అమెరికన్ డాలర్, యూరో మారకం విలువల్లో అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపణలు ఉన్నాయి.
అభియోగాలను అంగీకరించిన బ్యాంకులు.. 2.5 బిలి యన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్తో సెటిల్మెంట్ చేసుకున్నా యి. కీలక వడ్డీ రేట్లను ప్రభావితం చేసినందుకు గాను మరో బ్యాంకు యూబీఎస్ విడిగా 203 మిలియన్ డాలర్లు కట్టేందుకు సిద్ధపడింది.