12 రోజుల్లో రూ. 250 కోట్ల వ్యాపారం
రాజమండ్రి : రాజమండ్రిలో 12 రోజులపాటు జరిగిన గోదావరి పుష్కరాలతో నగరంలో వ్యాపార లావాదేవీలు ఓ రేంజ్లో జరిగాయని జిల్లా ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాల వల్ల ఒక్క రాజమండ్రిలోనే రూ. 250 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పుష్కరాల మొదలైన నాటి నుంచి ప్రతి రోజు 20 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు రాజమండ్రికి విచ్చేశారు.
పాన్ షాపులు, కిరాణ కొట్లు, బట్టల దుకాణాలు, హోటళ్లు, టీ స్టాల్స్, ప్రైవేట్ ట్రావెల్స్, టిఫిన్ సెంటర్లు... పుష్కర ఘాట్లలో పిండ ప్రధానం వరకు భక్తులు బాగానే ఖర్చు పెట్టారని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఒక్కో భక్తుడు ఎంత లేదన్నా కనీసం రూ. 200 ఖర్చు చేసినా... 12 రోజుల్లో వ్యాపారం రూ. 250 కోట్లుపైగానే ఉంటుందని భావిస్తున్నారు.
నగరంలోని అన్ని పుష్కర ఘాట్లలలో 55 లక్షల మంది పిండ ప్రధానం చేస్తే... ఒక్క కోటి లింగాల రేవులోనే 22 లక్షల మంది పిండ ప్రధానం చేశారు. దీంతో ఎంతగా వ్యాపారం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చని అంటున్నారు.