మార్కెట్లోకి ఫోర్డ్ న్యూ ఎకో స్పోర్ట్
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమేకర్ ఫోర్డ్ ఇండియా కొత్త కంపాక్ట్ సెడాన్ ఎస్ యూవీ ఎకో స్పోర్ట్ ను గురువారం మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎక్స్ షోరూం ఢిల్లీలో దీని ధర రూ.8.58లక్షల నుంచి రూ.9.93లక్షల మధ్య ఉండనున్నట్టు కంపెనీ తెలిపింది. మూడు వేరియంట్లు ట్రెండ్ ప్లస్, టైటానియం, టైటానియం ప్లస్ లో ఈ వెహికిల్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజీన్, 1.5 లీటరు డీజిల్ ఇంజీన్, 1.0 లీటర్ ఎకోబూస్ట్ ఇంజీన్ సామర్థ్యాలతో ఈ వేరియంట్లను రూపొందించామని ఫోర్డ్ తెలిపింది. అన్నీ బ్లాక్ ఎక్స్ టీరియర్స్ తోనే ఈ బ్లాక్ ఎడిషన్ మార్కెట్లోకి వచ్చింది. బ్లాక్ గ్రిల్స్, బ్లాక్ ఔట్ మౌల్డెడ్ హెడ్ ల్యాంప్స్, 16 అంగుళాల బ్లాక్ అలాయ్ వీల్స్, బ్లాక్ మిర్రర్ కవర్స్, బ్లాక్ ఫాగ్ ల్యాంప్ బెజిల్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, రూఫ్ క్రాస్ బార్స్ తో ఈ బ్లాక్ ఎడిషన్ వినియోగదారుల ముందుకు వచ్చింది.