అందరికీ న్యాయం అందాలి: మోదీ
న్యూఢిల్లీ: పేదలకు న్యాయం అందించడంలో లోక్ అదాలత్‌లు కీలక పాత్ర పోషించాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. 'పేదలకు న్యాయం ఎలా అందించాలనే దానిపై చర్చ జరుగడం నాకు ఆనందం కలిగించింది. ఇక్కడికి రావడం ద్వారా చాలా విషయాలు తెలుసుకోగలిగాను. పేదల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ, వారిలో సరైన అవగాహన కల్పించడం లేదు' అని ఆయన పేర్కొన్నారు.
న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అందరికీ న్యాయం, అందరికీ అభివృద్ధి అందాలన్నదే తన అభిమతమని చెప్పారు. అందరికి చేయూత (సబ్ కా సాథ్), అందరి వికాసం (సబ్ కా వికాస్)తోపాటు అందరికీ న్యాయం (సబ్కా న్యాయ్) అందాలని చెప్పారు. అందరికీ న్యాయం అందించడంలో దేశంలోని న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని కోరారు.