salary payment
-
వేతన జీవులను కనికరించేనా?
న్యూఢిల్లీ: బడ్జెట్ 2025పై మధ్య తరగతి, వేతన వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆదాయపన్ను ఉపశమనం లభిస్తుందన్న అంచనాలతో ఉన్నాయి. పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలు సైతం పన్ను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఆదాయం మిగిలించొచ్చని, ఇది మందగించిన వినియోగానికి ప్రేరణనిస్తుందని ఆర్థిక మంత్రికి సూచించడం గమనార్హం. దీంతో వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా కొంత ఉపశమనం కల్పించొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇదే కనుక నిజమైతే అది వినియోగానికి ఊతమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచొచ్చని, పన్ను శ్లాబుల్లో సర్దుబాట్లు చేయొచ్చని, స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వీటికితోడు పన్ను నిబంధనల్లో మార్పుల ద్వారా పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించొచ్చని భావిస్తున్నారు. అంచనాలు ఇలా..→ నూతన పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు ఆదాయ పరిమితి రూ.3లక్షలు. రూ.3–7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను అమల్లో ఉంది. రానున్న బడ్జెట్లో ఈ బేసిక్ మినహాయింపును రూ.5లక్షలకు పెంచొచ్చని తెలుస్తోంది. అప్పుడు రూ.3–7 లక్షల శ్లాబు కాస్తా రూ.5–7 లక్షలుగా మారుతుంది. దీంతో మొత్తం మీద రూ.10,000 మేర పన్ను ఆదా అవుతుంది. → 7–10 లక్షల ఆదాయంపై 10% పన్ను ప్రస్తుతం అమల్లో ఉంది. అలాగే, రూ.10–12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను అమలవుతోంది. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. → రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను ప్రస్తుతం అమలవుతోంది. బడ్జెట్లో దీన్ని రూ.12–18 లక్షలకు సవరించొచ్చని భావిస్తున్నారు. 30 శాతం పన్నును రూ.18లక్షలకుపైన ఆదాయం ఉన్న వారికి వర్తింపచేసే అవకాశం ఉంది. ఇది ఆచరణలోకి వస్తే రూ. 18లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రూ.3లక్షల ఆదాయంపై 30 శాతం రూపంలో సుమారు రూ.90వేల వరకు ఆదా అవుతుంది. రూ.18 లక్షలకు పైన ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఊరట ఉండకపోవచ్చు. → నూతన పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000గా ఉంది. దీన్ని రూ.1,00,000కు పెంచొచ్చని తెలుస్తోంది. నిజానికి రూ.50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను గత బడ్జెట్లో రూ.75,000కు పెంచారు. మొత్తం ఆదాయంలో దీన్ని నేరుగా మినహాయించుకోవచ్చు. పాత విధానంలో ఇది కేవలం రూ.50,000గానే కొనసాగుతోంది. 72 శాతం మంది కొత్త విధానంలోనే పన్ను రిటర్నులు సమర్పించారు. పెద్దగా పన్ను మినహాయింపుల్లేని, సరళతర నూతన పన్ను విధానంలోకి క్రమేణా అందరినీ తీసుకురావడం కేంద్రం లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కనుక మరిన్ని పన్ను ప్రయోజనాలు కొత్త విధానంలో కల్పించడానికే ఆర్థిక మంత్రి పరిమితం కావచ్చు. → రూ.2.5 లక్షలు మించిన పీఎఫ్ వడ్డీపై టీడీఎస్‌ను, ఉపసంహరణ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇ–సాప్లను విక్రయించినప్పుడే పన్ను చెల్లించేలా అనుమతించాలని, ఎన్ఆర్ఐల ఇల్లు విక్రయంపై టీడీఎస్ నుంచి మినహాయింపులు కల్పించాలన్న డిమాండ్లు సైతం ఉన్నాయి. ఆకర్షణీయంగా కొత్త పన్ను విధానం! మరింత మందిని ఇందులోకి తీసుకురావడంపై దృష్టి 5 % పన్ను శ్లాబులో మార్పు: రూ.10,000 వరకు ఆదా 30 శాతం పన్ను శ్లాబులోనూ మార్పు: రూ.90,000 వరకు ఆదా – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు కంపెనీ క్యూఐపీ ద్వారా నిధులు సేకరించింది. దాంతో రూ.3,000 కోట్లు సమీకరించింది.సంస్థ ఉద్యోగులకు జూన్ నుంచి వేతనాలు చెల్లించడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఏప్రిల్ 2020-ఆగస్టు 2023 మధ్య ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.220 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను మినహాయింపు)ను చెల్లించలేదనే వాదనలున్నాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే కంపెనీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా నిధులు సేకరించేందుకు పూనుకుంది. ఫలితంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్యూఐబీ) నుంచి రూ.3,000 కోట్లను సమీకరించింది. ఈ సొమ్ములోని కొంత మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలు, టీడీఎస్ చెల్లించేందుకు వినియోగించినట్లు కొందరు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!కంపెనీ ప్రకటించిన క్యూఐపీలో దాదాపు 87 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొని ఈ ఇష్యూను సబ్స్క్రయిబ్ చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, డీజీసీఏ డేటా ప్రకారం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా తగ్గిపోతోంది. జనవరిలో ఈ వాటా 5.6 శాతంగా ఉంది. క్రమంగా ఇది తగ్గిపోతూ ఆగస్టులో 2.3 శాతానికి చేరింది. 2021లో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా 10.5 శాతంగా నమోదవ్వడం గమనార్హం. సంస్థ పరిధిలోని విమానాల సంఖ్య 2019లో 74గా ఉండేది. 2024లో వీటి సంఖ్య 28కి చేరింది. -
పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు!
ఎడపల్లి (బోధన్): నెలల తరబడి పని చేసినందుకు జీతం అడిగితే.. ఓ యువకుడిపై సంబంధిత అధికారులు పోలీసు కేసు నమోదు చేయించారు. వివరాలను బాధితుడు బోధన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామానికి చెందిన కె.శివకుమార్ అనే విద్యార్థి గ్రామంలో ఉన్న విజయ డెయిరీ పాల కేంద్రంలో గత 20 నెలలుగా పనిచేశాడు. కొన్ని నెలలు సక్రమంగా జీతం చెల్లించిన అధికారులు ఆ తర్వాత వేతనాలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేగాక తాను పనిచేసిన కాలంలో ప్రతి రోజు తాను డెయిరీకి పంపించిన పాలలో వెన్న శాతంలో కోత, పాల తూకంలో కోతలు విధిస్తూ ప్రతి నెల సుమారు రూ.ఐదువేల నష్టం చేకూర్చారని శివకుమార్ ఆరోపించారు. చదవండి: వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్.నారాయణమూర్తి డెయిరీ నుంచి వచ్చిన నష్టం నిజమేనని డెయిరీ సూపర్వైజర్లు కూడా ధృవీకరించారు. 11 నెలల కాలంలో వచ్చిన 55 వేల రూపాయలు నష్టం, 11 నెలల నెలసరి జీతం 55 వేల రూపాయలు తనకు డెయిరీ వారు చెల్లించాల్సి ఉందని శివకుమార్ తెలిపారు. దీంతో తాను రైతులకు రూ.37 వేలు బకాయి పడ్డానని ఆయన తెలిపారు. డెయిరీ అధికారులు తాను రైతులకు రూ.89 వేలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వాస్తవం లేదన్నారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ నందకుమారి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని శివకుమార్ ఆరోపించారు. ఈ విషయమై డీడీ నందకుమారి వైఖరిపై విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు శివకుమార్ తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం -
రిటైరయిన ఉద్యోగికి జీతం!
♦ గిరిజన సంక్షేమ శాఖ ఘనకార్యం ♦ పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగికి ఏడాదిగా జీతం ♦ బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆయనో చిరుద్యోగి. ఏడాది క్రితమే పదవీ కాలం పూర్తయింది. ఆ ఉద్యోగి రిటైర్మెంట్ను కప్పిపుచ్చి.. అక్రమంగా ఏడాదిపాటు కొనసాగించారు. నెలనెలా వేతనం చెల్లించారు. ఈ ఘనకార్యం ఎక్కడ జరిగిందో తెలుసా? గిరిజన సంక్షేమ శాఖలో. వివరాల్లోకి వెళితే.. కుల్కచర్ల మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో ‘వంట మనిషి’గా పనిచేసే కిష్టయ్య రికార్డుల ప్రకారం గతేడాది జూన్ 30న పదవీ విరమణ చేయాల్సివుంది. ఈ విషయాన్ని దాచిపెట్టారో.. మరిచిపోయారో తెలియదుకానీ, ఆశాఖ ఉన్నతాధికారులు ఈయన రిటైర్మెంట్ విషయాన్ని మరచిపోయారు. కిష్టయ్య కూడా ఇదేమీ పట్టించుకోకుండా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. జీతం (దాదాపు రూ.40వేలు) ఠంచన్‌గా తన ఖాతాలో జమ అవుతోంది. ఇలా ఏడాది గడచిపోయింది. ఇటీవల జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి ఉద్యోగుల సర్వీసుల రిజిస్టర్లను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఏడాదిక్రితమే ఉద్యోగ విరమణ చేయాల్సిన ‘కుక్’కు అక్రమంగా వేతనం చెల్లించినట్లు తేల్చారు. తక్షణమే ఆ ఉద్యోగిని విధుల నుంచి తప్పించి.. ఈ నిర్వాకానికి కారణమైన సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అలాగే సంబంధిత అధికారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రిటైర్ కావాల్సిన ఉద్యోగి ఏడాదికాలంగా పనిచేస్తున్నా.. గమనించకపోవడం చూస్తే ఆశాఖ అధికారుల నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతోంది. కాగా, జిల్లా కార్యాలయంలోనే ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు ఉంటున్నందున.. కిష్టయ్య రిటైర్మెంట్ ఎప్పుడనే సమాచారం ఆయన పనిచేసే ఆశ్రమ పాఠశాల వార్డెన్‌కు కూడా తెలియకుండా పోయింది. -
జీతాల సమస్య పరిష్కారం!
కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన 12 మంది విండీస్ ఆటగాళ్లు సెయింట్ జాన్స్: జీతాల చెల్లింపు విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ), ఆటగాళ్లకు మధ్య తలెత్తిన సంక్షోభం ఎట్టకేలకు పరిష్కారమైంది. బోర్డు తాజా కాంట్రాక్ట్‌పై 12 మంది క్రికెటర్లు సంతకాలు కూడా చేశారు. దీంతో టి20 ప్రపంచకప్‌లో స్టార్ ఆటగాళ్లు పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. అయితే డారెన్ బ్రేవో మాత్రం టెస్టులపై దృష్టిపెట్టేందుకు ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. గేల్, స్యామీ, బెన్, హోల్డర్, ఫ్లెచర్, బ్రేవో, బద్రీ, సిమ్మన్స్, టేలర్, రస్సెల్, శామ్యూల్స్, రామ్‌దిన్ సంతకాలు చేసిన వారిలో ఉన్నారని విండీస్ బోర్డు తెలిపింది. ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకున్న పొలార్డ్ (గాయం), నరేన్ (సందేహాస్పద బౌలింగ్)ల స్థానంలో ఆష్లే నర్స్, కార్లోస్ బ్రాత్‌వైట్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే డారెన్ స్థానంలో త్వరలోనే మరొకర్ని తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. ఐసీసీ నుంచి ఒత్తిడి లేదు: పాక్ కరాచీ: భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనాల్సిందిగా ఐసీసీ నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ అనుమతిపైనే తుది నిర్ణయం ఆధారపడి ఉందని తేల్చింది. టోర్నీ నుంచి వైదొలిగితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఐసీసీ ఇటీవల హెచ్చరించినట్టు కథనాలు వెలువడడంతో పీసీబీ స్పందించింది. ‘ఐసీసీ నుంచి మాకెలాంటి సమాచారం లేదు. ఇటీవలి సమావేశంలోనూ భారత్‌లో పాక్ ఆటగాళ్ల భద్రతపై చర్చించాం. ఇదే కారణంగా పాక్ ప్రభుత్వం జట్టుకు అనుమతినివ్వకపోతే పీసీబీ చేసేదేం లేదు. ప్రభుత్వం కూడా ఇంకా ఏ విషయమూ తేల్చలేదు’ అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. -
ఉపాధ్యాయులకు ఊరట
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: కొంతకాలంగా తమ జీతాల స్తంబ్దతపై ఆతృతగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఎట్టకేలకు ఊరట కలిగింది. 49 రోజుల సమైక్యాంధ్ర ఉద్యమ సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం కూడా చేశారు. ఉవ్వెత్తున ఎగసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిం చడంలో ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. సుమారు రెండు నెలలపాటు పాఠశాలలకు తాళం వేసి రోడ్డపైకి వచ్చారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు ఉండగా..వీరిలో 9 వేలకు పైగా సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకూడా విరమించి పాఠశాలల బాట పట్టారు. సమ్మె కాలంలో విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆదివారాలతోపాటు 2వ శనివారాల్లో కూడా స్కూళ్లకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా ఒకెత్తయితే సమ్మెకాలానికిగాను ఇంతవరకు జీతాలను ప్రభుత్వం అందజేయలేదు. దీంతో ఉపాధ్యాయులు నానా అగచాట్లు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెకాలపు పని దినాలను ఆన్‌డ్యూటీగా పరిగణిస్తు జీవో వెలువరించడంపై జిల్లాలోని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవో విడుదల చేసిన సీఎంకు, అందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడుకు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ భైరి అప్పారావు, హరిశ్చంద్రుడు, శివరాంప్రసాద్, రాజేంద్రప్రసాద్, కొనే శ్రీధర్, సాంబమూర్తి, పోలినాయుడు, వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. -
టీచర్లు, మెప్మా ఉద్యోగుల వేతనాలపై సందిగ్ధం
సాక్షి, విశాఖపట్నం : భీమిలి, అనకాపల్లి విలీనం జీవీఎంసీకి ఆర్థిక చిక్కుల్ని తెచ్చిపెడుతోంది. ఉపాధ్యాయులు, మెప్మా సిబ్బంది జీతాల చెల్లింపు సమస్యగా మారింది. ఇప్పటికే ఉన్న ఆర్థిక భారానికి అదనంగా ప్రతి నెలా రూ. 2.20 కోట్లు వరకు జీవీఎంసీపై భారం పడనున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ తాజాగా లేఖ రాయడం గమనార్హం. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. టీచర్ల జీతాలే రూ.2 కోట్లు అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 450 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పదవీ విరమణ చేసినవారు కూడా ఎక్కువమందే ఉన్నారు. వీరికి ప్రతి నెలా జీతాలు, పింఛన్ల రూపంలో దాదాపు రూ.2 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీల్లోని ఉపాధ్యాయులు 010 పద్దు కింద జీతాలు అందుకునేవారు. జీవీఎంసీలో ఈ మున్సిపాలిటీలు విలీనం కావడంతో వీరి జీతాల చెల్లింపును 010 పద్దు రూపంలో ఇక చెల్లించేది లేదంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇక్కడ పనిచేస్తోన్న మెప్మా ఉద్యోగులకు పురపాలక శాఖే జీతాలు చెల్లిస్తోంది. వీరి జీతాలు కూడా జీవీఎంసీ చెల్లించాలంటూ పేర్కొనడంతో జీవీఎంసీ ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతోంది. 010 పద్దు వచ్చేనా! జీవీఎంసీ, విజయవాడ కార్పొరేషన్లు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో ఉపాధ్యాయులు 010 పద్దు కింద ఠంచనుగా జీతాలందుకుంటున్నారు. జీవీఎంసీ, విజయవాడ కార్పొరేషన్లలో మాత్రం సాధారణ నిధుల నుంచే వీరికి జీతాలు చెల్లించుకోవాలి. తర్వాత ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఆ నిధులు ఈ కార్పొరేషన్లకు అందిస్తుంది. తమకు కూడా 010 పద్దు కింద జీతాలివ్వాలంటూ చాలా కాలం నుంచీ ఇక్కడి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనల ఫైల్ కూడా ఆగస్టు తొలి వారంలో విద్యాశాఖ ఆమోదం పొందింది. తర్వాత ఆర్థిక శాఖ నుంచి కూడా పచ్చజెండా లభించింది. తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల రూపంలో తెచ్చేందుకు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖకు వెళ్లింది. ఇది జరిగి మూడు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ దీనికి జీవో రాలేదు. ప్రభుత్వానికి నివేదించాం ఇప్పటికే జీవీఎంసీలో సిబ్బంది జీతాలకు రూ.175 కోట్లు, రుణాలపై వడ్డీకి రూ.60 కోట్లు ఏటా చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడి టీచర్ల జీతాల్నే 010 పద్దు కింద ప్రభుత్వం భరించేలా ఎప్పటి నుంచే మొరపెట్టుకుంటున్నాం. ఇపుడు భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలకు చెందిన ఉపాధ్యాయులు, మెప్మా ఉద్యోగుల జీతాల్ని కూడా చెల్లించాలంటే మరింత భారమవుతుంది. అందుకే దీనిపై ప్రభుత్వానికి నివేదించాం. వారి వరకు ప్రస్తుత చెల్లింపు విధానమే కొనసాగించేలా ప్రయత్నిస్తున్నాం. - ఎం.వి.సత్యనారాయణ, కమిషనర్