sales are manually
-
ఈ–టెండర్లకు బ్రేక్
వనపర్తి : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం ఉదయం రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న ధాన్యం విక్రయించేందుకు తీసుకొచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో సర్వర్డౌన్ కాగా ఈ–మార్కెటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. రైతులకు గేట్పాస్లు కూడా జారీ చేయలేదు. అంతలోనే మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. దీంతో రైతులు, కమీషన్ ఏజెంట్లు మార్కెట్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న కవర్లను ధాన్యం రాశులపై కప్పేశారు. ఆదివారం మార్కెట్కు సెలవు కావటంతో «ధాన్యం తడిసిపోతుందని, మరోరోజు రైతులు మార్కెట్లోనే ఉండాల్సి వస్తుందని అధికారులు మ్యానువల్ బిడ్డింగ్ పద్ధతిలోనే కొనుగోళ్లు జరిపారు. అనంతరం ధాన్యం మార్కెట్ నుంచి గోదాంకు తరలించారు. మొత్తం 4,405 క్వింటాళ్లు వచ్చినట్టు కార్యదర్శి నరసింహ, సూపర్వైజర్ అఖిల్అహ్మద్ తెలిపారు. మొక్కజొన్నకు గరిష్ట ధర రూ.1407, కనిష్టం రూ.1120 ధర పలికిందన్నారు. -
ఈ–టెంటర్లకు బ్రేక్
వనపర్తి : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం ఉదయం రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న ధాన్యం విక్రయించేందుకు తీసుకొచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో సర్వర్డౌన్ కాగా ఈ–మార్కెటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. రైతులకు గేట్పాస్లు కూడా జారీ చేయలేదు. అంతలోనే మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. దీంతో రైతులు, కమీషన్ ఏజెంట్లు మార్కెట్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న కవర్లను ధాన్యం రాశులపై కప్పేశారు. ఆదివారం మార్కెట్కు సెలవు కావటంతో «ధాన్యం తడిసిపోతుందని, మరోరోజు రైతులు మార్కెట్లోనే ఉండాల్సి వస్తుందని అధికారులు మ్యానువల్ బిడ్డింగ్ పద్ధతిలోనే కొనుగోళ్లు జరిపారు. అనంతరం ధాన్యం మార్కెట్ నుంచి గోదాంకు తరలించారు. మొత్తం 4,405 క్వింటాళ్లు వచ్చినట్టు కార్యదర్శి నరసింహ, సూపర్వైజర్ అఖిల్అహ్మద్ తెలిపారు. మొక్కజొన్నకు గరిష్ట ధర రూ.1407, కనిష్టం రూ.1120 ధర పలికిందన్నారు.