ఎన్నారై యువకుడిపై హత్య కేసు!
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో 17 ఏళ్ల ఎన్నారై యువకుడిపై హత్యకేసు నమోదైంది. సియన్ పటేల్ అనే యువకుడు.. 37 ఏళ్ల వ్యక్తితో గొడవ జరిగిన తర్వాత అతడిని చంపేశాడని పోలీసులు చెప్పారు. గ్రేసన్ అనే ఈ వ్యక్తిని అతడి ఇంటివద్దే చంపేశాడని అంటున్నారు. పటేల్‌కు గ్రేసన్ ముందునుంచి తెలుసని, ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలై తర్వాత అది కాస్తా పెద్దదిగా మారిందని, అందుకే పటేల్ ఆయనను కాల్చి చంపేశాడని చెబుతున్నారు.
మృతుడు గ్రేసన్ కూడా ఇండియన్ అమెరికనే అని తెలిపారు. గ్రేసన్‌ను కాల్చేందుకు ఉపయోగించిన తుపాకిని కూడా పటేల్ జూన్ 11న మడైరా బీచ్‌లో తాళం వేయకుండా వదిలేసిన ఓ కారులోంచి దొంగిలించినట్లు పోలీసులు చెప్పారు. ఆ తుపాకిని కూడా స్వాధీనం చేసుకున్నారు.