పగలు ప్రొఫెసర్.. రాత్రయితే పోర్న్ స్టార్!
లండన్: ఆయనకు 61 ఏళ్లు. ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్.. ఆచార్య హోదా అంటే దాదాపు ఉపాధ్యాయ వృత్తిలోనే ఉత్కృష్టమైనది. అన్ని అంశాల్లో తలపండినవాడు అంటుంటారు. అంతేకాకుండా ఎంతో పవిత్రంగా ఆ బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. కానీ, బ్రిటన్లో మాత్రం ఓ ప్రొఫెసర్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అతడు చేసే ఘనకార్యం కాదు. అవును.. ఉదయాన్నే చక్కగా వస్త్రాలు ధరించి టై, షూ కట్టుకొని వెళ్లి పాఠ్యాంశాలు బోధించే ఈ ఆచార్యుడు రాత్రి వేళ చేసేది మాత్రం రాస కార్యాలు. ఏ మాత్రం ఖాళీ దొరికినా వెంటనే పోర్న్ స్టార్ అవతారమెత్తుతాడు.
61 ఏళ్ల వయసును కలిగి ఉన్న అతడు తనకంటే దాదాపు 40 ఏళ్లు చిన్నవారయిన వారితో శృంగారంలో పాల్గొంటూ నీలి చిత్రాల్లో నటిస్తాడు. ఇన్ని రోజులు ఈ బాగోతాన్ని ఎంతో రహస్యంగా నడిపాడు. చివరకు అందరికి తెలిసేసరికి తనను తాను సమర్థించుకున్నాడు. విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో అది తన వ్యక్తిగత అంశమని, అందులో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని అంటున్నాడు.
నికోలస్ గోడార్డ్ అనే పేరు గల ఈయన కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ లో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తాడు. అతడి వ్యవహారం తెలిసిన కొంతమంది విద్యార్థులు మాత్రం అతడి బోధన శైలిని చూసి హీరో అని అనుకుంటే కొందరు మాత్రం డ్రీమ్ హబ్బీ అనుకుంటుంటారంట.