అసంపూర్తిగా ముగిసిన సీఎం-విద్యుత్ జేఏసీ చర్చలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర జిల్లాల విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమ్మె విరమించాలని జేఏసీ నేతలపై సీఎం తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే సీమాంధ్ర జిల్లాల జేఏసీ నేతలు మాత్రం అందుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. చర్చలు మూడు గంటలకుపైగా కొనసాగాయి. అయినా ఫలితంలేదు.
రాష్ట్రం విభజించడంలేదని కేంద్రం నుంచి ప్రకటన వస్తేనే సమ్మె విరమిస్తామని జేఏసీ నేతలు తెగేసి చెప్పారు. మళ్లీ సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి మరోసారి జేఏసీ నేతలతో చర్చలు జరుగుతాయి.