జూన్ 5 నుంచి ఓయూ సెట్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఓయూసెట్ 2017 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి 13 వరకు రోజుకు మూడు పరీక్షల చొప్పున నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా ఓయూతోపాటు పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల పీజీ కోర్సులలో ప్రవేశాలు నిర్వహిస్తారు. హాల్టికెట్లను అభ్యర్థులు వచ్చే నెల 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
30 నుంచి సెల్ట్ తరగతులు
ఉస్మానియా వర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 30 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ జె.సావిత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్గా పిలిచే ఈ కోర్సుకు ఉదయం, సాయంత్రం వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తామన్నారు. రెండు నెలల కాల వ్యవధి గల ఈ కోర్సుకు ఫీజు రూ.4000 గా నిర్ణయించినట్లు ఓయూ విద్యార్థులు, ఉద్యోగుల, అనుబంధ కళాశాలల విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు 9652856107, 040-64575575, 27682354 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.