జర్నలిస్ట్ అరుణ్ సాగర్ కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కవి అరుణ్ సాగర్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అరుణ్ సాగర్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ సాగర్ మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరుణ్ మృతిపట్ల తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఇంకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి తదితరులు అరుణ్ సాగర్ మృతికి సంతాపం తెలిపారు. అరుణ్ సాగర్ ఆంధ్రయూనివర్సిటీలో ఎంఏ చేశారు. తెలుగు పత్రికలతో పాటూ వివిధ టీవీ చానళ్లలో ఆయన పని చేశారు.