Singnagar
-
అధికారంలోని వారి అజ్ఞాన ఫలితం
రెండు ఆబ్జెక్ట్స్ ఒకే సమయంలో ఒకే స్పేస్‌లో ప్రవేశించే ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్ జరుగుతుందనేది ఫిజిక్స్ సూత్రం. మనుషులు సామాజిక జీవితంలోనూ తరచూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు. పాపం వాళ్ళకు యాక్సిడెంట్ సూత్రం తెలీక పోవచ్చు. కానీ, అత్యంత బాధ్యతగల పదవుల్ని నిర్వహిస్తున్న వారికి తెలియాలిగా? తెలియకపోతే విజయవాడ ముంపు లాంటి విషాదాలే జరుగుతాయి. ప్రకాశం బ్యారేజిని కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు దశల్లో నిర్మించాయి. ఇప్పటి ప్రకాశం బ్యారేజికి కొన్ని అడు గులు దిగువన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన ‘బెజవాడ ఆనకట్ట’ వుండేది. దీన్ని 1852లో మొదలెట్టి 1855లో పూర్తిచేశారు. ఆ ఆనకట్టను కెప్టెన్ ఆర్థర్ థామస్ కాటన్ డిజైన్ చేయగా, మరో కెప్టెన్ ఛార్లెస్ అలెగ్జాండర్ ఆర్ర్ నిర్మించాడు. ఒక శతాబ్ద కాలం సమర్థంగా పనిచేసిన కాటన్–ఆర్ర్ ఆనకట్ట 1952 సెప్టెంబరులో కూలిపోయింది. అప్పుడు ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేది. సి.రాజగోపాలాచారి ముఖ్య మంత్రి. అప్పుడే ఆం్ర«ధలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతోంది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టడంతో రాజకీయం వేడెక్కింది. ఈ సంక్షోభ సమయంలో మద్రాసు ప్రభుత్వం, బెజవాడ ఆనకట్ట కూలిపోవడాన్ని పట్టించుకోలేదు. 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం; చిన్న రాష్ట్రం; నిధుల కొరత వున్న రాష్ట్రం. అయినా సరే పాత ఆనకట్ట స్థానంలో భారీ బరాజ్ కట్టాలని తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నడుం బిగించారు. పాత ఆనకట్ట ఆయకట్టు కన్నా మూడురెట్లు ఎక్కువ – అంటే దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు, డెల్టా గ్రామాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ వద్ద కృష్ణానది వరద గరిష్ఠంగా 12 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుందని 175 యేళ్ళ క్రితం ఆర్థర్ థామస్ కాటన్ అంచనా వేశాడు. దాన్ని తగ్గించడం కుదరదు. అలా 12 అడు గుల ఎత్తు క్రస్ట్ గేట్లతో ఒక భారీ డిజైనింగ్ రూపుదిద్దుకుంది. బరాజ్ నిర్మాణ కాలంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా ఆంధ్రా ప్రాంతానికి తెలంగాణా కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి హయాంలో 1957లో బరాజ్ నిర్మాణం పూర్త యింది. మూడు రాష్ట్రాలు నలుగురు ముఖ్యమంత్రులు మారినా అంతటి నిర్మాణం మూడేళ్ళలో (1954–57) పూర్తయింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా చిత్తశుద్ధి తగ్గినందున భారీ బరాజ్‌ల నిర్మాణానికి దశాబ్దాలు పడుతోంది. సాంకేతికంగా ప్రకాశం బరాజ్ నిర్మాణంలో ఒక మెలిక వున్నది. వర్షాకాలంలో మాత్రమే బరాజ్‌కు నీరు వచ్చి చేరుతుంది. వేసవిలో ఎగువ నుండి నీరు రావు. బరాజ్ రిజర్వాయర్‌లో నిల్వవుండే మూడు టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడేవారు. నది ఎండిపోయినపుడు క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేసేవారు. జలాశయంలో చేరిన మేటను తొలగించే వారు. ఇప్పుడయితే నీరుండగానే గేట్లు మార్చే ‘స్టాప్ లాగ్ గేట్ల’ సౌకర్యం వచ్చింది. సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చినట్టు విజయవాడ సమీపంలో థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్) రావడంతో ప్రకాశం బరాజ్‌కు ముప్పు మొదలైంది. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో వేడి నీటిని చల్లార్చి మళ్ళీ వాడటానికి వీలుగా కూలింగ్ టవర్స్‌ను ఏర్పాటు చేయాలి. వీటీపీఎస్ నేరుగా కృష్ణా నదిని కూలింగ్ యూనిట్‌గా మార్చుకుంది. అందుకు అనువుగా కృష్ణానది నుండి వీటీపీఎస్‌కు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కాలువలు నిర్మించారు. ఇన్ ఫ్లో కాలువ లోనికి కృష్ణానది నీరు పారాలంటే (గ్రావిటీ ఫ్లో) రిజర్వాయర్ నీటి మట్టాన్ని పూర్తి స్థాయిలో (ఎఫ్ఆర్ఎల్) నిరంతరం నిండుగా వుంచాల్సి వచ్చింది. ఒక ప్రత్యేక లక్ష్యం కోసం నిర్మించిన బరాజ్‌ను వేరే లక్ష్యంతో నిర్మించిన వీటీపీఎస్తో లంకె పెట్టడం పొరపాటు. ఒకే సమయంలో ఒకే స్పేస్‌లో రెండు ఆబ్జెక్ట్స్ ప్రవేశించాయి. దీనివల్ల నాలుగు ప్రమాదాలు జరిగాయి. జలాశయాన్ని నిరంతరం నిండుగా వుంచాల్సి రావడంతో వేసవిలో దిగువ గ్రామాలకు తాగునీరు అందించడం సాధ్యం కాలేదు. వేసవిలో క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేపట్టడం కుదరలేదు. బరాజ్ పిల్లర్లు, క్రస్ట్ గేట్లు నీటిలో ఎలా వున్నాయో కనీసం పరిశీలించడానికి వీలు కాలేదు. మేటను తీయడం సాధ్యం కాకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ప్రకాశం బరాజ్ బలం తగ్గుతోందనే భయాలు 1980ల లోనే మొద లయ్యాయి. వీటీపీఎస్తో లింకు తెగ్గొట్టాలని ఆయకట్ట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సమస్యకు పరిష్కారంగా వీటీపీఎస్‌కు ఇన్–ఫ్లో కెనాల్ కోసం బరాజ్ ఎగువన పంపింగ్ స్టేషన్ నిర్మించారు. ఒక ప్రశ్నకు సమాధానం మరో ప్రశ్నకు దారితీస్తుంది అనేది జ్ఞాన సూత్రం. ఒక సమస్యకు పరిష్కారం మరో సమస్యకు దారితీయడం అజ్ఞాన సూత్రం. అలాంటిది వీటీపీఎస్ ఔట్ ఫ్లో (కూలింగ్) కెనాల్ విషయంలో జరిగింది. ఆ వివరాల్లోనికి వెళ్ళడానికి ముందు బుడమేరు చరిత్రను పరిశీలించాలి. అదొక చిన్న వాగు. తరచూ నీళ్లు లేక ఎండిపోయి వుంటుంది. ఏరు మార్గం త్రాచుపాములా మెలికలు తిరిగి వుంటుంది. నేరుగా వెళితే 10 కిలోమీటర్లు కూడా లేని దూరాన్ని మెలికలతో 33 కిలోమీటర్లు సాగుతుంది. అలా కిందికి పోయి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఖమ్మం జిల్లాలోనో, కృష్ణాజిల్లా వాయవ్య ప్రాంతంలోనో భారీ వర్షాలు కురిసినపుడు బుడమేరుకు అకస్మిక వరదలు వస్తాయి. వరద రోజుల్లో బుడమేరులో 20 వేల క్యూసె క్కుల వేగంతో నీరు పారుతుందని అంచనా. ఈ వేగానికి వాగు మెలికలు తట్టుకోలేవు గనుక గట్లు తెగి నీరు విజయవాడ మీద పడుతుంది. అందుకే బుడమేరుకు ‘విజయవాడ దుఃఖదాయని’ అని ఓ చెడ్డ పేరుంది. 1960లలో విజయవాడ కృష్ణలంకను వరద ముంచేసినపుడు ఆ బాధి తులకు పట్టణ శివార్లలో పునరావాసం కల్పించారు అప్పటి మునిసిపల్ కమిషనర్ అజిత్ సింగ్. అలా ఆయన పేరున సింగ్ నగర్ ఏర్పడింది. నగరం విస్తరించే కొద్దీ సింగ్ నగర్ కూడా అనేక పేర్లతో విస్తరించింది. విచిత్రం ఏమంటే ఆ పరిసరాలన్నీ బుడమేరు పరివాహక ప్రాంతం. దాని అర్థం ఏమంటే కృష్ణా ముంపు బాధితులు బుడమేరు ముంపు బాధితులుగా మారారు. అంతిమంగా నీతి ఏమంటే, ఇళ్ళకు నీరు కావాలిగానీ, ఇళ్ళ లోనికి నీరు రాకూడదు. ఇళ్ళూ నీళ్ళూ ఒకే సమయంలో ఒకే స్పేస్‌లో వుండడం అస్సలు కుదరదు. నీటిలో ఇళ్ళు కట్టినా, ఇళ్ళ లోనికి నీరు వచ్చినా విపత్తు తప్పదు. డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు -
Vijayawada Floods: ‘సాయం’ లేక కన్నుమూత
వాంబే కాలనీ జీ బ్లాక్.. 4 రోజులుగా వరద నీరు చుట్టుముట్టింది.. బయటకు వచ్చే అవకాశమే లేదు.. ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి.. చాలా మందికి తినడానికి తిండి ఏమీ లేదు.. వీరిలో 78 ఏళ్ల రాజశేఖర్ అనే వృద్ధుడు కూడా ఒకరు.. పాస్టర్‌గా పని చేస్తున్న ఇతను తన భార్య కమలమ్మతో కలిసి జీవిస్తున్నాడు.. వయసు పైబడిన ఇద్దరూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. పూట పూటకూ మందులు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. ఒక్క పూట ఆహారం లేకపోతే షుగర్ స్థాయి తగ్గి నీరసించే వారు.. వరద కారణంగా 2 రోజుల పాటు ఏమీ తినకుండా ఉండిపోవాల్సి వచ్చింది. తాగేందుకు మంచి నీళ్లు లేని దయనీయ స్థితి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఉన్నట్లుండి రాజశేఖర్ తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వం ఆహారం, నీరు అందించి ఉంటే బతికి ఉండే వారని చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకుని ఇలా ఎందరో అర్ధంతరంగా తనువు చాలించడం అందరి హృదయాలను కలిచివేస్తోంది.వాంబే కాలని నుంచి సాక్షి ప్రతినిధి/ సాక్షి నెట్వర్క్ : ఆకలితో చనిపోవటం అనేది ఇటీవల కాలంలో మన ప్రాంతంలో ఎప్పుడూ వినలేదు. అంధ్ర అన్నపూర్ణగా పిలిచే కృష్ణా డెల్టాలో అకలి చావు సంభవించడం యావత్ రాష్ట్రాన్ని విస్మయానికి గురి చేస్తోంది. బుడమేరు వరదను అంచనా వేయడంలో, ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మంగళ, బుధవారాల్లో తిండి, నీరు లేక చనిపోయిన వారే ఎక్కువ. పాస్టర్ మృతి గురించి మాట్లాడుకుంటూ ఉండగా, ఇందిరానాయక్ నగర్లో ఓ మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు చెప్పారు. పాముల కాలువ వద్ద పడవ బోల్తా పడి గల్లంతైన పోతుల దుర్గారావు బుధవారం శవమై కనిపించాడు. పెరుగుతున్న మరణాల సంఖ్యవరద తగ్గు ముఖం పట్టే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. గల్లంతైన వారి లెక్క తేలటం లేదు. బంధువుల అచూకి తెలియక పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వీరి గోడు మాత్రం ఆలకించడం లేదు. మంగళవారం వరకు 32 మంది మృతి చెందినట్లు వెల్లడికాగా, బుధవారం మరో 15 మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. ఇంకా పలు మృతదేహాలు నీటిలో తేలియాడుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ వాటి లెక్క తేలడం లేదు. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఎవరూ వెళ్లలేదు. ఆ ప్రాంతంలో పరిస్థితి ఏమిటో తెలియదు. ఇంకెన్ని శవాలు బురదలో ఉన్నాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి బుధవారం సాయంత్రం వరకు 22 మృతదేహాలు వచ్చాయి. 11 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరో 11 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఆరు మృతదేహాలు కుళ్లిపోయి, పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. కాగా, పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులు ప్రైవేటు అంబులెన్స్లలోనే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయలేదు. తమవారి ఆచూకీ కోసం.. వరదలో చాలా మంది కొట్టుకుపోయారు. నాలుగు రోజులు గడిచినా వారి ఆచూకీ లభించలేదు. అయితే మార్చురీలో కొన్ని మృతదేహాలు ఉన్నాయనే విషయం తెలియడంతో గల్లంతు అయిన వారి బంధువులు పెద్ద సంఖ్యలో మార్చురీకి క్యూ కట్టారు. ‘నాలుగు రోజుల క్రితం మా అన్న పోలినాయుడు పనికి వెళ్లి వస్తూ.. వరదలో కొట్టుకుపోయాడు. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకు వెళ్లినా పట్టించుకోలేదు. మా కుటుంబ సభ్యులం, మా ప్రాంత వాసులం వెతుకుతున్నాం. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగైతే ఎలా?’ అని న్యూరాజరాజేశ్వరరావుపేటకు చెందిన కరుభుక్త సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. వరద మృత్యురూపంలో కబళించిన వారందరి మృతదేహాలను మార్చురీలో ఉండటంతో తమ వారిని గుర్తించేందుకు వందల సంఖ్యలో ముంపు ప్రాంత ప్రజలు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు. అక్కడ కుళ్లి ఉన్న తమ వారి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటి ముందే వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడుస్తాడని ఊహించలేదంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న దుర్గారావు మేనత్త అమ్మడమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలిసి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చామని, ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రోడు ఇంటి ముందే వరదలో కొట్టుకు పోయి మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో కొట్టుకుపోయి.. ఆచూకీ లభించని వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి వచ్చి తమ వారి మృతదేహాలేమైనా ఉన్నాయేమోనని చూస్తున్నారు. అక్కడ కుళ్లి, ఉబ్బిపోయి ఉన్న మృతదేహాలను ఆతృతతో పరిశీలిస్తున్నారు. వారిలో తమ వారు లేక పోవడంతో వెనుతిరుగుతున్నారు. అక్కడ ఉన్న అంబులెన్స్‌ల వారిని, పోలీసులను ఆరా తీస్తున్నారు. ఇలా సింగ్‌నగర్, పాయకాపురం, ప్రకాష్‌నగర్ ప్రాంతాలతో పాటు, వైఎస్సార్‌కాలనీ ప్రాంతాల నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. డీ కంపోజ్ అయిన మృతదేహాలు చాలా వరకు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. విపరీతమైన దుర్వాసన వస్తున్నప్పటికీ, వరదలో కొట్టుకుపోయిన వారి కుటుంబ సభ్యులు వాటిని వెళ్లి పరిశీలిస్తున్నారు. అడుగు కదలని పరిస్థితి...అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.. మూడు రోజులుగా మృతదేహం నీళ్లలోనే తేలియాడుతున్న దుస్థితి.. వ్యక్తి గల్లంతై నాలుగు రోజులు గడుస్తున్నా.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రాథేయపడుతున్నా, అధికారులు.. ప్రభుత్వం నుంచి కనీస సాయం కరువైంది. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఉన్నా.. కేవలం అలంకారప్రాయమే. సింగ్‌నగర్ పరిధిలోని నందమూరినగర్, ఇందిరానాయక్‌నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో తమ వాళ్ల కోసం వెతుకుతున్న దృశ్యాలు కంట నీరు తెప్పిస్తున్నాయి. చెట్టుకొకరు.. పుట్టకొకరు..తెల్లారేసరికి ఒక్కసారిగా వరద ముంచేసింది. ఎటు వెళ్లాలో తెలియలేదు. ఇంత ఉధృతంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు. పోనీ వరద ముంచెత్తుతున్నప్పుడైనా బయటకు వద్దామంటే అంత సమయం లేదు. అతికష్టం మీద వచ్చినా ఎక్కడికెళ్లాలో, ఎక్కడుండాలో తెలియదు. సర్కారు ఎలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇన్ని ఇబ్బందుల మధ్య దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు తమ ఇళ్లలోనే ఉండిపోయారు. వారిలో వృద్ధులున్నారు. చిన్న పిల్లలున్నారు. అనారోగ్యం పాలైన వారున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారున్నారు. వారిని ఎవరూ పట్టించుకోలేదు. కనీసం మందులు సమకూర్చలేదు. తాగునీరు, ఆహారం లేక, ఆకలితో, అనారోగ్యంతో ఎంతో మంది అభాగ్యులు ఇళ్లలోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు సాయం కోరేందుకు, అపాయం నుంచి తప్పించుకునేందుకు బయటకు వచ్చి వరద నీటిలో కొట్టుకు పోయారు. అలాంటి వారి మృతదేహాలు చెట్టుకొకటి, పుట్టకొకటిగా వేలాడుతున్నాయి. సింగ్‌నగర్ ప్రాంతంలోని ఇందిరానాయక్ నగర్లో మృతదేహం ఉందని స్ధానికుల ద్వారా తెలుసుకున్న ‘సాక్షి’ ఆ సమాచారాన్ని సహాయక చర్యల కోసం వచ్చిన జాతీయ విపత్తు నిర్వహణ బలగాల(ఎన్డీఆర్ఎఫ్)కు తెలియజేసింది. సాయిబాబా గుడి వీధిలో ఇంటి గోడపై అనాథగా పడి ఉన్న ఓ మృతదేహాన్ని గుర్తించింది. వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో బోటు సాయంతో ఒడ్డుకు చేర్చింది. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని తరలించారు. ఇలా ఎవరూ గుర్తించని మృతదేహాలు ఆ వరదలో ఇంకా చాలానే ఉన్నాయి. ముంపు కాస్త తగ్గుముఖం పట్టడంతో అవన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అంతిమ యాత్రకు కూడా నోచుకోకుండా, కనీసం బయటకుతీసేవారు లేక చాలా వరకూ కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల పరిధిలోని మునేరులో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన తోట శ్రీనివాసరావు(40)గా గుర్తించారు. అయ్యా.. ఈయన (ఫొటో చూపుతూ) ఇక్కడున్నాడేమో కొంచెం చూసి చెప్పండి.. ఇంట్లోంచి బయట పడదామని వెళ్తూ మా కళ్లెదుటే వరదలో కొట్టుకుపోయాడు. ఏమయ్యాడో ఏమో.. ఇక్కడ ఉండకూడదని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని ఓ వృద్ధురాలు విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద ఉన్న వారితో అంటున్న మాటలు అక్కడున్న వారందరికీ కంట నీరు తెప్పించాయి. ఇలాంటి వాళ్లు పెద్ద సంఖ్యలో బుధవారం ఆస్పత్రికి ఇదే పనిపై వచ్చి వెళ్లడం దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. గ్రౌండ్ ఫ్లోర్లో చిక్కుకు పోయిన వారు, గుడిసెల్లో ఉన్న వారు ఏమై ఉంటారోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మనిషిని బట్టి బోటు రేటుఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు షేక్ అమీనా. ఈమెది విజయవాడ పాయకాపురం ఏరియాలోని పాకిస్థాన్ కాలనీ. ఆమె ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. పీకల్లోతు నీటిలోనే నాలుగు రోజులు గడిపారు. కాస్త వరద తగ్గడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆరు కిలోమీటర్లు నడిచి బయటకు వచ్చారు. వరదలో చిక్కుకున్న తమను ఎవరూ పట్టించుకోలేదని అమీనా తెలిపారు. ఓట్ల కోసం మా ఇంటి ముందుకు వచ్చిన నాయకులు... ఇప్పుడు కనీసం మేం ఎలా ఉన్నామో అని చూసేందుకు కూడా రాలేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రాంతంలో ఒకటి, రెండు బోట్లు తిరుగుతున్నాయని, డబ్బులున్న వాళ్ల వద్దకే అవి వెళుతున్నాయని తెలిపారు. మనిషిని చూసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, రూ.300 తక్కువ ఇస్తే తీసుకువెళ్లలేమని తెగేసి చెప్పారని వాపోయారు. ఇక చేసేదేమీ లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆరు కిలోమీటర్లు నీటిలో నడిచి బయటకొచ్చామని, ప్రాణాలతో బయటపడతాం అనుకోలేదని అమీనా కన్నీటి పర్యంతమయ్యారు.జీవనోపాధిని దెబ్బతీసింది వరద ముంపు జీవనోపాధిని దెబ్బతీసింది. రూపాయి.. రూపాయి కూడబెట్టుకుని కిరాణా దుకాణం పెట్టుకున్నాం. వరద కారణంగా మా కష్టార్జితం మొత్తం పోయింది. షాపులోకి 5 అడుగుల నీరు వచ్చి మొత్తం నాశనం చేసింది. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ముంపు నష్టం నుంచి తేరుకోవాలంటే ఎంతకాలం పడుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – వాసంతి కేఎల్‌రావునగర్ -
చంద్రబాబూ.. ఎవరిదీ పాపం?
ప్రభుత్వ వైఫల్యం వరద బాధితుల పాలిట అంతులేని విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ కన్నీటి సంద్రమైంది. వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ నీటిపై తేలియాడుతున్న శవాలతో ముంపు వాసుల గుండె చెరువవుతోంది. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమోన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతోంది. బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. మూడ్రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయి.మృతదేహాలు అలా కళ్లెదుటే వెళ్లిపోతున్నా, చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సంప్రదాయమనే విషయాన్ని విస్మరిస్తోంది. ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగుచూశాయి. మూడ్రోజులుగా ప్రజల మధ్యే ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట.సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: విజయవాడ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో తేలుతున్న శవాలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. ఇప్పటికే 32మంది మృతిచెందితే వీరిలో ఒక్కర్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం విస్తుగొల్పుతోంది. ఇంకా ఎంతమంది చనిపోయారోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పదుల సంఖ్యలో మృతదేహాలు!‘ప్రకాష్‌నగర్, సుందరయ్యనగర్, ఎల్బీఎస్ నగర్, పైపుల రోడ్డు ఇలా చాలా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మృతదేహాలు నీటిలో కొట్టుకువస్తూ కనిపించాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం మంగళవారం కలకలం రేపింది. పైపుల రోడ్డు ప్రక్క వీధిలో ఒక టీ స్టాల్ వద్ద మృతదేహం ఉందని, మూడు రోజులుగా దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతున్నా అధికారులెవరూ పట్టించుకోలేదు. కాగా, ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడులో వరదలో గల్లంతైన వ్యక్తిని నాగ వీరరాజు (63)గా గుర్తించారు.ఫ్రీజర్లు సిద్ధం చేయండి..వరదల్లో మరణించిన వారిని భద్రపరిచేందుకు ఫ్రీజర్లను సిద్ధం చేయాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. జీజీహెచ్‌లో 24 ఫ్రీజర్లు అందుబాటులో ఉండగా.. అవి ఇప్పటికే శవాలతో నిండిపోయాయి. ప్రైవేట్ వారి నుంచి ఏడు ఫ్రీజర్లను తీసుకోగా అవికూడా చాలవని మరో 10 ఫ్రీజర్లను అయినా సిద్ధం చేయమని ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు.. వరదల్లో చనిపోయిన వారి శవాలు మార్చురీలో ఫ్రీజర్లులేక పక్కన పెట్టేస్తున్నారు.చిన్నారులను చిదిమేసిన వరదవించిపేట(విజయవాడ పశ్చిమ): ఇద్దరు చిన్నారులను వరద నీళ్లు, ప్రభుత్వ వైఫల్యం చిదిమేశాయి. రెండు కుటుంబాల్లోని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చాయి. ఈ హృదయ విదారక ఘటనలు విజయవాడలోని కేఎల్ రావునగర్‌లో జరిగాయి. వివరాలు.. కేఎల్ రావునగర్‌లోని వైఎస్సార్ కాలనీలో బాలినేని కృష్ణారెడ్డి, గాయత్రి దంపతులు తమ పిల్లలతో నివాసముంటున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో అతి కష్టం మీద కేఎల్ రావునగర్‌లోనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా వరద ముంచెత్తడంతో.. అందరూ కలసి రెండో అంతస్తులో ఉంటున్నారు. సోమవారం రాత్రి వారి చిన్న కుమార్తె సాయిసుధ(6) ఆడుకుంటూ.. వరద నీటిలో పడిపోయింది. వెంటనే తల్లిదండ్రులు గమనించి చిన్నారిని బయటకు తీసి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అలాగే కేఎల్ రావు నగర్లోనే నీట మునిగి మరో బాలుడు మృతి చెందాడు. పెరుమాలపల్లి కిశోర్, రేణుక దంపతుల కుమారుడు వరుణ్‌సందేశ్(14) ఆదివారం వరద ప్రవాహాన్ని చూసేందుకని బయటకు వెళ్లాడు. ఇంటి సమీపంలోని నీటిలో నడుస్తూ కాలు జారి నీట మునిగిపోయాడు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా.. వరుణ్ ఆచూకీ లభ్యం కాలేదు. సాయంత్రం కోస్టల్ స్కూల్ వద్ద బాలుడి మృతదేహం బయటపడింది. ప్రభుత్వం తమను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడం వల్లే తమ పిల్లలను కోల్పోయామని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాలు శవాల మధ్య నరక యాతన ప్రకాష్ నగర్, సుందరీనగర్, ఎల్బీఎస్ నగర్, పైపుల రోడ్డు ఇలా చాలా ప్రాంతాల్లో 50 వరకూ శవాలున్నాయి. శవాలు వాసన వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలతో నరకం చూస్తున్నాం. తాగునీళ్లిచ్చినా బతికేలా ఉన్నాం. అసలు నీళ్లు రావడం లేదు. పడవ అడిగితే రూ.10 వేల నుంచి రూ.40 వేలు అడుగుతున్నారు. ఎక్కడినుంచి తెస్తాం? 40 పడవలు దించామన్నారు. ఒక్కటి కూడా మా దగ్గరకు రాలేదు. ఇంత మంది పోలీసులున్నారు. ఆహారం లేదు.. తాగడానికి నీరు లేదు.. ఏమీ రాలేదు. ఎట్టకేలకు నడుచుకుంటూ వస్తుంటే ఎవరో ఒకాయన పడవ ఎక్కించుకుని తీసుకువచ్చారు. ఎంతో కష్టంగా ఉంది. ఇంట్లో సామాన్లు తడిసిపోయి, బయటి చెత్తా చెదారం ఇంట్లోకి వచ్చేసి ఇల్లు నాశనం అయిపోయింది. ఒక్కరికి కూడా ఆహారం లేదు. ఒక్క రోజైతే పర్లేదు. నాలుగు రోజులుగా అలానే ఉన్నాం. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అంటూ ఉందా.. లేదా అర్థం కావడం లేదు. – ఓ వరద బాధితురాలి ఆవేదనఇవి బుడమేరు వరద మరణాలు కావా?⇒ మూడ్రోజుల కిందట వరదల్లో గల్లంతైన పాతపాడు గ్రామానికి చెందిన రేవూరి సతీష్‌కుమార్ (16) మృతిచెందాడు. ఆదివారం స్నేహితులతో కలిసి పాతపాడు నుంచి కండ్రిక వెళ్లే రోడ్డులో ప్రవహిస్తున్న వరదను చూసేందుకు వెళ్లి వరద ఉధృతిలో స్నేహితులతో పాటు సతీష్‌కుమార్ కొట్టుకుపోయాడు. స్థానికుల సాయంతో స్నేహితులు ఒడ్డుకొచ్చారు. సతీష్ గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకి దొరకలేదు. మూడో రోజు కండ్రికలో సతీష్ మృతదేహాన్ని కనుగొన్నారు. ⇒ అంబాపురం–జక్కంపూడి గ్రామాల మధ్య ఆదివారం వరదలో నున్న గ్రామానికి చెందిన దారా శ్యామ్ అనే వ్యక్తి మృతిచెందాడు. తమ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిందని మృతుని భార్య పద్మజ కన్నీరుమున్నీరవుతున్నారు. శ్యామ్, పద్మజలకు ఒక కుమార్తె. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో తమ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు. కేఎల్ రావు నగర్లో..⇒ కేఎల్ రావు నగర్ పాల ప్రాజెక్టు ప్రాంతానికి చెందిన పెరుమాలపల్లి కిశోర్ పాల ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు వరుణ్‌సందేశ్ (14) ఆదివారం వరద నీటిని చూసేందుకు బయటకొచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా కాలుజారి పడిపోయాడు. అయితే, వరుణ్‌ను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితంలేదు. రెండు గంటల తర్వాత కోస్టల్ స్కూల్ వద్ద బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.⇒ వైఎస్సార్ కాలనీకి చెందిన బాలినేని కృష్ణారెడ్డి, గాయత్రిలకు ఆరుగురు సంతానం. ఆదివారం కాలనీని వరద నీరు ముంచెత్తడంతో కట్టుబట్టలతో కేఎల్ రావునగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. సోమవారం రాత్రి కృష్ణారెడ్డి చిన్న కుమార్తె సాయిసుధ (6) ఇంటి ముందు ఆడుకుంటూ వరద నీటిలో పడిపోయింది. దీంతో అపస్మారక స్ధితికి చేరుకున్న సాయిసుధను ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.గుణదలలో..⇒ గుణదల వెటర్నరీ కాలనీకి చెందిన కొల్లిపర వెంకటేశ్వరరావు ఆదివారం సాయంత్రం తన కుమారుడు సాయి సందీప్‌తో కలిసి కార్మెల్ నగర్‌కు వెళ్లి తిరిగొస్తూ వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. వెంకటేశ్వరరావు మృతదేహం బుడమేరు సమీపంలో గుర్తించగా, సాయి సందీప్ మంగళవారం శవమై తేలాడు. కాగా, గుణదల ఈగల్ ఫర్నిచర్ షాప్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం (45)ను మంగళవారం పోలీసులు వరద నీటిలో గుర్తించారు. రాజీవ్‌నగర్‌లో..రాజీవ్‌నగర్‌కు వరద రావడంతో అనారోగ్యంతో ఉన్న సుభాష్ చంద్రబోస్ (80)ను అతని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రిలో ఉంచారు. అయితే, ఆసుపత్రిలో సుభాష్‌చంద్రబోస్‌కు సరైన చికిత్స లభించకపోవడం కారణంగానే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సింగ్‌నగర్‌లో..సింగ్‌నగర్‌లోని ఆంధ్రప్రభ కాలనీకి చెందిన శివారెడ్డి ఆదివారం తన షాపు మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా వరద ఎక్కువ కావడంతో కాలనీ 12వ లైన్లో ఓ గోడపై కూర్చున్నాడు. ఆ తర్వాత శివారెడ్డి కనిపించకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడని తమ్ముడు ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నారు.సింగ్‌నగర్‌లోనే మరో మృతదేహం..సింగ్‌నగర్‌లోని పైపుల రోడ్డు పక్కనే ఉన్న టీస్టాల్ వద్ద మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 50 ఏళ్లుంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇతను చనిపోయి మూడు రోజులై ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం నుంచి దుర్వాసన వెదజల్లుతోంది.ఇవికాక..⇒ ఆదివారం తొలిరోజే అజిత్‌సింగ్‌నగర్ వాంబే కాలనీకి చెందిన కర్రి భారతి అదే ప్రాంతంలోని గంగానమ్మ చెట్టు వద్ద వరదనీటిలో దాటుకుంటూ గుండెపోటుతో మరణించింది. స్థానికులు ఆమెను కారు మీద వదలేసి వెళ్లారు.⇒ అదేరోజు అజిత్‌సింగ్‌నగర్‌లో ట్రాక్టర్ కింద ఓ వ్యక్తిపడి మరణించారు. ఈ మృతదేహం ఎవరిదో ఇప్పటికీ తెలియడం. ⇒ ఆదివారం గొల్లపూడిలో దాది శ్రీనివాస్ కళ్యాణ్ (33) అనే వ్యక్తి కాలువలో పడి చనిసోయాడు.⇒ సోమవారం వరదలో నాలుగు శవాలున్నట్లు వరద ప్రాంతాల్లోని ప్రజలు చెబుతున్నారు. అలాగే, సింగ్‌నగర్‌లో సోమవారం ఇంట్లోకి నీరు రావడంతో పద్మావతి (48) మృతిచెందారు.⇒ మంగవారం బంధువులను తీసుకుని వస్తుండగా, రెండు శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ముందుగా హెచ్చరించి ఉంటే నాన్న బతికేవాడుఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని మా ఇద్దరిని (కుమారుడు, కుమార్తె), అమ్మ (శ్రీలక్ష్మి)ని ఒడ్డుకు చేర్చి, సామాను తెస్తానని వెళ్లిన నాన్న వెంకటేశ్వరరావు(43) అక్కడే చనిపోయాడు. మమ్మల్ని బతికించి నాన్న చనిపోయాడు. అసలే మాది పేద కుటుంబం. కూలికి వెళ్తేకానీ పూట గడవని స్థితి. అక్క పదో తరగతి, నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాం. మమ్మల్ని బాగా చదివించాలని నాన్న బాగా కష్టపడేవాడు. నాన్న ఉంటే మాకు ఏది అడిగితే అది ఇచ్చేవారు. ఇప్పుడు నాన్న లేని లోటు ఎవరు తీరుస్తారు? పులివాగు మా నాన్నను పొట్టనపెట్టుకుంది. ముందస్తు హెచ్చరికలు చేసి ఉంటే మా నాన్న చనిపోయేవాడు కాదు. – నన్నెబోయిన సంతోష్‌కుమార్, గంగినేని గ్రామం, జి.కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లావరద సమాచారంలేకే పెద్ద దిక్కును కోల్పోయాంమాకున్న ఎకరం పొలంతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకి తీసుకొని మా ఆయన శెట్టిపల్లి కృష్ణారెడ్డి(48) సాగు చేసుకుంటున్నాడు. వరి పొలంలో మోటారు వర్షానికి తడిసి పోతుందేమోనని దానిపై పట్టాలు కప్పేందుకు వెళ్లాడు. వరద ఉధృతి పెరగడంతో పక్కనే ఉన్న వేస్ట్‌మేనేజ్‌మెంట్ యూనిట్లోకి వెళ్లి తల దాచుకున్నాడు. ఉన్నట్లుండి వరద మరింతగా పెరగడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఉప్పెనలా వరద వచ్చే అవకాశం ఉందని ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకపోవడం వల్లనే మేము మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. – కృష్ణకుమారి, వెల్వడం, మైలవరం మండలంవరదల్లో మరణించిన వారి వివరాలు1. రేవూరు సతీష్ కుమార్, పాతపాడు, 2. దారా శ్యామ్, నున్న 3. పెరుమాలపల్లి వరుణ్‌సందేశ్, కేఎల్‌రావు నగర్, 4. బాలినేని సాయిసుధ, వైఎస్సార్ కాలనీ 5. కొల్లిపర వెంకటేశ్వరరావు, గుణదల వెటర్నరీ కాలనీ 6. సుభా‹Ùచంద్రబోస్, రాజీవ్‌నగర్7. శివారెడ్డి, ఆంధ్రప్రభ కాలనీ, సింగ్‌నగర్ 8. గుర్తు తెలియని వ్యక్తి, సింగ్‌నగర్ 9. కర్రి భారతి, వాంబేకాలనీ, సింగ్‌నగర్ 10. దాది శ్రీనివాస్ కళ్యాణ్, గొల్లపూడి, 11. పద్మావతి, సింగ్‌నగర్ 12. పాముల వర్దన్, న్యూ రాజీవ్‌నగర్, ఉడా కాలనీ 13. మాతా సన్యాసి అప్పడు, ఓల్డ్ రాజీవ్‌నగర్, సింగ్‌నగర్ 14. గుంజ రమణ, డాబాకొట్ల సెంటర్, సింగ్‌నగర్ 15. వజ్రాల కోటేశ్వరరావు, డాబాకొట్ల సెంటర్, సింగ్‌నగర్ 16. గుర్తు తెలియని 45 ఏళ్ల వ్యక్తి, ప్రకాశ్‌నగర్, నున్న 17. గుర్తు తెలియని 40 ఏళ్ల వ్యక్తి, జక్కంపూడి, పాముల కాలువ 18. కె.దుర్గారావు, రాజీవ్‌నగర్, 19. గుడ్డు, బిహార్ వ్యక్తి 20. కె.వెంకటరమణారెడ్డి, సింగ్‌నగర్ 21. నాగదుర్గారావు, ఇబ్రహీంపట్నం22. గుర్తు తెలియని వ్యక్తి, నున్న23. వలిశెట్టి చంద్రశేఖర్, గంగానమ్మ గుడిరోడ్డు, కృష్ణలంక 24, 25, 26, 27. సింగ్‌నగర్‌లో సోమవారం మరో నాలుగు గుర్తు తెలియని మృతదేహాలు28, 29. సింగ్‌నగర్‌లోనే మంగళవారం చెట్టుకు వేలాడుతూ రెండు మృతదేహాలు30. కొడాలి యశ్వంత్‌కుమార్, న్యూ రాజరాజేశ్వరిపేట 31. గుణదలలోని ఈగల్ ఫర్నిచర్ షాపు సమీపంలో గుర్తు తెలియని 43 ఏళ్ల వ్యక్తి మృతదేహం 32.పడేసి రాజా, పాయకాపురంసర్టిఫికెట్స్ కోసం వెళ్లిన విద్యార్ధిని మింగేసిన వరదన్యూ రాజరాజేశ్వరీపేటలో తీవ్ర విషాదం అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): తన సర్టిఫికెట్లు తడిసిపోతాయనే భయంతో.. వాటిని తెచ్చుకొనేందుకు ఇంటికి వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్ధిని వరద మింగేసింది. విజయవాడ 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటలో ఈ విషాదం అందరినీ కలచివేసింది. న్యూ రాజరాజేశ్వరీపేటలో నివసిస్తున్న కొడాలి యశ్వంత్ కుమార్ (20) డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతని ఇల్లు మొత్తం వరద నీటిలో మునిగిపోవడంతో అతని కుటుంబం అందులోనే చిక్కుకుపోయింది. సోమవారం మధ్యాహ్నం స్థానికుల సాయంతో ఆ కుటుంబం అక్కడి నుంచి బయటపడింది. యశ్వంత్ డిగ్రీ సర్టిఫికెట్లు ఇంట్లోనే ఉండిపోవడంతో వాటిని తెచ్చుకొనేందుకు స్నేహితుడితో కలిసి మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లాడు. సర్టిఫికెట్లు తీసుకొని తిరిగి వస్తుండగా నీటి ప్రవాహం ధాటికి అదుపుతప్పి కొట్టుకుపోయాడు. ఓ చెట్టుకు చిక్కుకొని ఇరుక్కుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడ్డాడు. స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఇసరపు రాజు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి యశ్వంత్ కోసం గాలించగా వరదనీటిలో శవమై కనిపించాడు. యశ్వంత్ చెట్టుకు చిక్కుకొని రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాడాడని, ఎటువంటి సాయం అందకపోవడంతో మృత్యువాత పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యశ్వంత్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు అధికారులెవరూ ముందుకు రాలేదు. చివరకు వైఎస్సార్సీపీ నాయకుల సాయంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మృతదేహాన్ని అతి కష్టంమీద వెలుపలికి తీసుకువచ్చారు. చివరకు మృతదేహాన్ని తరలించేందుకు వాహనాన్ని ఇవ్వడానికి కూడా అధికారులు నిరాకరించారు. దీంతో కుటుంబసభ్యులే ఓ మోటారు సైకిల్‌పై యశ్వంత్ మృతదేహాన్ని పూర్ణానందపేటలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అధికారులు వారికి సహకరించకపోగా ప్రభుత్వం నుంచి సాయం కావాలంటే మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి మీరే తీసుకువెళ్లండంటూ సలహా ఇవ్వడం కొసమెరుపు. -
Vijayawada Floods: ‘కన్నీటి’ వరద
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సింగ్‌నగర్ పరిధిలోని వాంబే కాలనీలో నివసించే శ్రావణి రెండు రోజులుగా ఇద్దరు బిడ్డల ఆచూకీ తెలియక తల్లడిల్లుతోంది. శనివారం ఉదయం కూలి పనుల కోసం వెళ్లిన శ్రావణికి కొద్దిసేపటికే వాంబే కాలనీ మునిగిపోయిందన్న సమాచారం తెలియడంతో గుండెలు అవిసిపోయాయి. 36 గంటల నుంచి తన కుమారుడు, కుమార్తె ఇంట్లో చిక్కుకుని ఉన్నారని.. కనీసం వారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియడం లేదంటూ విలపిస్తోంది. చిన్నారులు ఇద్దరూ పదేళ్లలోపు వారే కావటంతో ఎలా ఉన్నారో అంతుబట్టక నిద్రాహారాలు లేకుండా కుమిలిపోతోంది. అధికారులకు తన మొర చెప్పుకుందామని వెళ్తే వినిపించుకునే నాథుడే లేకుండా పోయాడని కన్నీరు మున్నీరు అవుతోంది. ‘నా కన్నీటిని ఎవరూ పట్టించుకోవటంలేదు. కడుపున పుట్టిన బిడ్డలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వ పెద్దనా సమస్యను ఆలకించడం లేదు’ అంటూ రోదిస్తోంది!! వరద ప్రాంతాల్లో బాధితుల దుస్థితికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఎవరిని కదిలించినా ఇలాంటి దీన గాథలే! సహాయ చర్యల్లో సర్కారు వైఫల్యంతో పలుచోట్ల మహిళలు, పిల్లలను వారి బంధువులు, వలంటీర్లు పీకల లోతు నీళ్లలో భుజాలపైకి ఎక్కించుకుని కాపాడి తెస్తున్న దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. వరద నీటిలో వస్తుండగా కాళ్లకు పాములు, విష జంతువులు చుట్టుకోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. నీట మునిగిన సింగ్‌నగర్ ఏరియల్ వ్యూ తెల్లారేసరికి ప్రాణాలతో ఉంటారో లేదో..‘ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచేశారు. కనీసం ముందుగా చెబితే కట్టుబట్టలతో ఒడ్డుకైనా చేరేవాళ్లం. ఆదివారం తెల్లారేసరికి నీరు చుట్టుముట్టింది. ఎంతోమంది చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులున్నారు. ఆహారం మాట దేవుడెరుగు.. ప్రాణం కాపాడుకునేందుకు గుక్కెడు మంచినీళ్లూ దొరకటం లేదు. చిన్నపిల్లలు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నారు. మెయిన్ రోడ్డు మీద కొన్ని పడవలు తిరుగుతున్నాయి. వాళ్లను ఎంత బతిమాలినా లోపల సందులోకి రావటం లేదు. ఆహారం, పాలు, నీళ్లు.. రోడ్డుపైన ఉన్న కొన్ని ఇళ్ల వారికి మాత్రమే అందుతున్నాయి. లోపల వేలాది కుటుంబాలున్నాయి. తెల్లారేసరికి ప్రాణాలతో ఉంటాయో లేదో! ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాలనీల్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోవడంతో మిద్దెలు, పై ఫ్లోర్లలో తలదాచుకుంటున్నారు. ఏదైనా బోటు కనిపిస్తే నీళ్లు, పాల ప్యాకెట్లు పైకి వేయాలని వేడుకుంటున్నారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఆహారం, పాలు, తాగునీటి కోసం వరద బాధితుల అవస్థలు కట్టుబట్టలతో కొంతమంది ఎలాగోలా బయటపడగా చాలామంది ధైర్యం చాలక మిద్దెలపైన బిక్కుబిక్కుమంటు బతుకీడుస్తున్నారు. వరద ప్రభావిత కాలనీల్లో విద్యుత్ లేదు. ఫోన్లు పనిచేయడంలేదు. రాత్రిళ్లు నరకయాతన అనుభవిస్తున్నారు’ అంటూ వరద నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారు చెబుతుంటే కళ్లు చెమరుస్తున్నాయి. రాజీవ్‌నగర్, కండ్రిక, గుణదల, లూనాసెంటర్, పాయకాపురం, తోటవారివీధి తదితర కాలనీల్లో ఇప్పటికీ సహాయ చర్యలు అందలేదు. పశువుల షెడ్లు కూలిపోవడంతో రెండు రోజులుగా మూగజీవాలు నీరు, తిండిలేక రోడ్లపైనే ఉన్నాయి. ఇళ్లు నీట మునిగిపోవడంతో సామగ్రి పూర్తిగా దెబ్బతింది. దుకాణాల్లోకి నీరు చేరడంతో సరుకులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. బాధితులు లక్షల్లో.. బోట్లు పదుల్లోవరద బాధితులు లక్షల్లో ఉండగా ప్రభుత్వం తెప్పించామని చెబుతున్న బోట్లు ఏ మూలకూ సరిపోవటం లేదు. రోడ్లపైన బాధితులకు నీరు, పాలు, ఆహారం తరలించేందుకే పరిమితం అవుతున్నాయి. పలు బోట్లకు పంక్చర్లు కావడంతో వెనక్కి వస్తున్నాయి. ఇదే అదునుగా కొందరు వెల కడుతూ బోట్ల వ్యాపారానికి తెగబడుతున్నారు. కుటుంబం అయితే రూ.5 వేలు, మనిషికి రూ.1,000–1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. పేదలను మాత్రం బోట్లు ఎక్కనివ్వడం లేదు. 5 నియోజకవర్గాల పరిధిలో..బుడమేరు పొంగటంతో ఐదు నియోజక వర్గాలు.. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, మైలవరం, గన్నవరం పరిధిలో కాలనీలు నీట మునగడంతో సుమారు 4.5 లక్షల మందికి పైగా ముంపు బారినపడ్డారు. ఇప్పటికీ పూర్తిగా నీటిలో చిక్కుని 2.5 లక్షల మందికిపైగా బాధితులు అల్లాడుతున్నారు. వివిధ కాలనీలకు సంబంధాలు తెగిపోయి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రానికి 20వేల మందిని కూడా∙బయటకి తరలించలేని దుస్థితి.కనుచూపు మేర నీళ్లే 48 గంటల తరువాత కూడా లక్షల మందిని వరదల్లో వదిలేసి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. బాధితుల ఇళ్లల్లో వంట సామగ్రి, గ్యాస్ స్టవ్‌లు, బీరువాలు, బట్టలు, ఫర్నిచర్, పుస్తకాలు.. బురదమయమైపోయాయి. ఇంట్లో ఉండలేక బయటకు వద్దామంటే కనుచూపు మేర నీళ్లే కనిపిస్తుండటంతో అల్లాడుతున్నారు. ప్రభుత్వం కనీసం కొవ్వొత్తులు కూడా సరఫరా చేయలేదు. బాధితులను హెలికాప్టర్లలో ఎయిర్ లిఫ్ట్ చేస్తామని సీఎం చంద్రబాబు ఆదివారం చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. సహాయ చర్యల కంటే వీఐపీల హడావుడి బాధితుల ఇక్కట్లను మరింత పెంచుతోంది. వీఐపీల వాహనాలు కి.మీ. కొద్దీ బారులు తీరాయి. అంబులెన్సులు వెళ్లే మార్గం కనిపించడంలేదు. పాలు, ఇతర నిత్యావసరాల ధరలు రెండు మూడు రెట్లు పెంచేసి దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.అన్నం పెట్టండంటే.. బాబు అభివాదంరెండు రోజులుగా ఆహారం లేక అల్లాడుతున్న బాధితులు తమ ప్రాంతానికి వస్తున్న ప్రజాప్రతినిధులను కనీసం తినడానికి ఏదైనా అందించాలంటూ నిస్సహాయంగా అర్థిస్తున్నారు. సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు బోటులో పర్యటిస్తుండగా ఓ వృద్ధురాలు చిన్నారిని చూపిస్తూ ఆహారం అందించాలని ప్రాథేయపడింది. అయితే చంద్రబాబు నవ్వుతూ ఆమెకు అభివాదం చేస్తూ బోటులో వెళ్లిపోయారు. ఆమెకు ఆహారం అందించాలని అధికారులను కనీసం ఆదేశించకపోవడం విభ్రాంతి కలిగించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పునరావాస కేంద్రాల జాడేదీ..?వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిలో కొందరు ఎలాగోలా ధైర్యం చేసి వలంటీర్లు, బంధువుల సాయంతో కర్రలు, తాళ్ల ద్వారా బయటికి వచ్చినా తలదాచుకునేందుకు ప్రభుత్వం కనీసం సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేదు. అరకొర శిబిరాలు సైతం నీళ్లలో మునగడంతో రోడ్లపై దయనీయంగా ఉన్నారు. తిండి లేక అల్లాడుతున్నారు. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడుతున్నారు. వరద ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో బాధితులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.మంత్రులపై మండిపాటు.. ఫొటోల కోసం టూరిస్టుల్లా వచ్చారా?సింగ్‌నగర్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో మంత్రులు అనిత, సంధ్యారాణి అచ్చెన్నాయుడు, డీజీపీని వరద బాధితులు నిలదీశారు. సహాయ చర్యలు అందటం లేదని, విజయవాడను కాపాడలేనివారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని, టూరిస్టుల్లా బోట్లలో వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారని నిలదీశారు. మంత్రులు అనిత, సంధ్యారాణి బాధితుల ఆగ్రహం చూసి అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు.‘నా భార్య మౌనిక సింగ్‌నగర్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో ఆగస్టు 31న బిడ్డకు జన్మనిచ్చింది. 15 రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఆసుపత్రి చుట్టూ నీళ్లు చేరడంతో మమ్మల్ని బయటకు పంపేశారు. మాతోపాటు మరో 15 మంది బాలింతలు పురిటి బిడ్డలతో ఒడ్డుకు చేరుకున్నాం. మమ్మల్ని కాపాడేందుకు ఒక్క బోటూ రాలేదు. మేమే ఈదుకుంటూ వచ్చాం. పచ్చి బాలింతైన నా భార్యను ఒక చేత్తో, అమ్మను మరో చేత్తో పట్టుకుని ఈదుకుంటూ ఫైఓవర్ వరకు తీసుకొచ్చా. మళ్లీ వెనక్కి ఈదుకుంటూ వెళ్లి మాకోసం ఆస్పత్రికి వచ్చిన బంధువును, సామాన్లను తెచ్చా. ఇక్కడ నుంచి కనీసం అంబులెన్స్ కూడా దొరకడం లేదు. ఏం చేయాలో.. ఎక్కడకి వెళ్లాలో అర్ధం కావట్లేదు’’ – రాగబాబు, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం ‘‘పక్షవాతంతో బాధపడుతున్న నా భర్తతోపాటు కుమారుడు, కోడలు, మనవడితో కలసి ఉంటున్నాం. ఉన్నట్టుండి ఇల్లు మునిగిపోయింది. చుట్టూ పీకల్లోతు నీళ్లు. ఒడ్డుకు చేర్చేందుకు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ రాత్రంతా డాబాపై వర్షంలో నిరీక్షించాం. చివరకు నా భర్తను ఓ చెక్కపై కూర్చోబెట్టి చంటి బిడ్డను భుజాన వేసుకుని కర్రల సాయంతో ఒడ్డుకు చేరాం. పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వస్తుంటే పోలీసులు మా పక్క నుంచే బోట్లలో వెళ్లారు. రక్షించాలని అరుస్తున్నా వినపడనట్లు వెళ్లిపోయారు. ఫైఓవర్ దగ్గరకు వచ్చిన తరువాతనైనా కనీసం మంచి నీళ్లు ఇచ్చే దిక్కు లేకుండా పోయింది’’ – నందమూరి లక్ష్మి, వాంబే కాలనీమమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి మేం బుడమేరు మధ్య కట్టలో ఉంటున్నాం. ఓ వైపు వరద నీరు.. మరోవైపు పాములు, తేళ్ల భయం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికాం. రెండు రోజుల నుంచి భోజనం లేదు. తాగటానికి నీరు కూడా లేదు. భోజన ప్యాకెట్లు ఇచ్చారంటా. కానీ మా వరకు రాలేదు. ఇచ్చే ప్యాకెట్లు కూడా కొంతమందికే అందుతున్నాయి. సహాయం చేయటానికి వచ్చిన అధికారులు, సింబ్బంది మమల్ని కసురుతున్నారు. ఎలాంటి సహాయం అందలేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. – మంగ, సరస్వతి, బడమేరు మధ్య కట్ట ఏరియా పిల్లలు తప్పిపోయారు నేను రిక్షా బండి తోలుకుని బతుకుతా. మమల్ని చూడటానికి మా అమ్మాయి ఊరి నుంచి వచ్చింది. ఆమె కూడా వరదలో చిక్కుకుపోయింది. ఇంట్లో వారికి భోజనం తీసుకువెళదామని ఒడ్డుకు వచ్చా. ఇప్పుడు పోలీసులు నన్ను లోపలికి వెళ్లనీయటంలేదు. లోపల పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. తాగటానికి నీరు లేదు. తినటానికి తిండిలేదు. నేను బయటకు వచ్చాక నన్ను వెతుకుంటూ మావాళ్లు వచ్చారంటా. వారు తప్పిపోయారు. ఎక్కడ ఉన్నారో తెలియడంలేదు. – కృష్ణ, రిక్షా కార్మికుడు, బొంబాయి కాలనీ, పాయకాపురంప్రభుత్వం చెప్పేవన్నీ డొల్ల మాటలేనా భార్య రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటంతో సింగ్‌నగర్‌లోని అమెరికన్ ఆస్పత్రికి వస్తే టైఫాయిడ్ అన్నారు. అక్కడే ఆస్పత్రిలో చేర్పించాను. ఆకస్మికంగా వరద రావడంతో జర్వంతో బాధపడుతున్న నా భార్యను, పిల్లను తీసుకుని ఒడ్డుకు రావాలని ప్రయత్నించగా, ఎవరూ సాయం చేయలేదు. నిన్నటి నుంచి తిండిలేదు. తాగటానికి నీరులేదు. అతి కష్టం మీద చేతికర్ర సాయంతో వరద నీటి నుంచి ఒడ్డుకు చేరాం. మాతోపాటు ఉన్న రోగులందరూ అలాంటి పరిస్థితే. గర్భిణులు, బాలింతల కూడా నీటిలో నడిచే వస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టామని చెబుతున్నవన్నీ డొల్ల మాటలే. – శంకర్, మమత, సింగ్‌నగర్ ఏరియా ఆర్భాటం.. హడావుడే.. సాయం శూన్యం శుభకార్యం ఉందని బెంగళూరు నుంచి నాలుగు రోజుల క్రితం విజయవాడ వచ్చా. వరదలో చిక్కుకుపోయా. ఆర్భాటం, హడావిడి తప్పా బాధితులను పట్టించుకునేవారే లేరు. ఎవరెవరో వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళ్తున్నారు.. కానీ సహాయం మాత్రం శూన్యం. నీరు, తిండి కోసం అల్లాడాం. – సాధిక్, బెంగళూరు కట్టుబట్టలతో మిగిలాం రెండు రోజుల నుంచి నరకం చూశాం. వరదతో కట్టుబట్టలతో వయటకు వచ్చేశాం. రాజరాజేశ్వరిపేటకు బోట్లు రావటం లేదు. లోపల ఉన్నవారంతా గగ్గోలు పెడుతున్నారు. మా ఇంటిలో సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు మా పరిస్థితేంటో అర్థం కావటంలేదు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. కానీ మమల్ని అక్కడికి తీసుకెళ్లేనాథుడు ఏరి? – ధనలక్ష్మి, దుర్గాప్రసాద్, రాజరాజేశ్వరిపేట -
దేవుడా.. పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించు !
విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్) : భగవంతుడా.. ప్రజలకు మంచి పాలన అందించేలా అధికారులు, పాలకులకు సద్బుద్ధిని ప్రసాదించు.. అని కోరుతూ కాంగ్రెస్ నగర కమిటీ ఆధ్వర్యాన సర్వమత ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆధ్వర్యాన సింగ్‌నగర్ ఎక్సెల్ ఫ్లాంట్ వద్ద ఆదివారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ హామీలను మరచిపోవడం.. ప్రజల బాధలను పట్టించుకోకపోవడం.. వంటి దుర్మార్గమైన చర్యలతోపాటు అబద్ధాలతో తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సింగ్‌నగర్‌లో చెత్త సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి రెండున్నరేళ్లయినా దానిని నెరవేర్చలేదన్నారు. ఇప్పటికీ ఎక్సెల్ ఫ్లాంట్‌లోనే చెత్త డంప్ చేయిస్తున్నారన్నారు. పాలకులకు ఇటువంటి మోసపూరిత బుద్ధిని తొలగించి ప్రజలకు మంచి పాలన అందించేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల దుర్గారావు, మీసాల సత్యనారాయణ, రేపల్లి కిరణ్, దుర్గారావు, మస్తాన్‌వలి, జయకర్ పాల్గొన్నారు. -
ప్రేమ, పెళ్లి పేరుతో యువకుడి మోసం
ముహూర్తం సమయానికి మాయం సింగ్‌నగర్ స్టేషన్లో కేసు మధురానగర్ : ప్రేమించిన యువతిని ముందుగా రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని, తరువాత పెద్దల సమక్షంలో వివాహమాడతానని ఆమె తల్లిదండ్రులను ఓ యువకుడు నమ్మించాడు. తీరా ముహూర్తం సమయానికి మాయమయ్యాడు. దీనిపై సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన యువతి (21) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ పైనలియర్ చదువుతోంది. వర్సిటీలో ఆమె సహచరుడైన గుండా మల్లిఖార్జునరావు గత నెల ఎనిమిదో తేదీన యువతి ఇంటికి వచ్చాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ పెళ్లి విషయంలో తమకు అభ్యంతరం లేదని ఆమె తండ్రి చెప్పారు. మీ కుటుంబసభ్యులు అంగీకరిస్తే వివాహం చేస్తానని చెప్పారు. తన కుటుంబసభ్యులతో మాట్లాడతానని చెప్పి మల్లికార్జునరావు వెళ్లిపోయాడు. కొన్నిరోజుల తరువాత తిరిగి వచ్చి తమ ఇంట్లో పెళ్లికి అంగీకరించటం లేదని చెప్పాడు. తన ప్రేమ స్వచ్ఛమెనదని, తాను కచ్చితంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారు సరేనన్నారు. ఈనెల 13వ తేదీన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకోండంటూ చెప్పి ఖర్చుల కోసం రూ.10 వేలు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. 13వ తేదీన ముహూర్తం సమయానికి అతడు రాలేదు. దీంతో మోసపోయామని యువతి కుటుంబీకులు భావించారు. దీనిపై యువతి తండ్రి ఫిర్యాదు మేరకు సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మా ఆశలపై నీళ్లు.. టీడీపీ వాళ్లకు ఇళ్లు
సొంత ఇళ్లు ఇస్తారని ఎదురుచూస్తున్న తమ ఆశలపై నీళ్లు చల్లి అధికార పార్టీ కార్యకర్తలకు కేటాయిస్తున్నారని సింగ్‌నగర్‌కు చెందిన 150 మంది మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం ఎదుట వారంతా ఆందోళన చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సింగ్‌నగర్ మహిళల నిరసన లబ్బీపేట : ఇళ్లులేని పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను.. పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతున్నారు. నిరుపేదలను మాత్రం పట్టించుకోవడం లేదు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలోను అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. కాల్వగట్లుపై,రోడ్డు పక్కన ఉన్న వారికి కేటాయిస్తున్నామంటున్నారు. మా పరిస్థితి ఏమిటని సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 150 మంది మహిళలు మంగళవారం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఇళ్లు విషయమై ఎమ్మెల్యే అడిగేందుకు లోనికి వెళ్లగా, కొత్తగా నిర్మిస్తున్న భవనాలను పూర్తయిన తర్వాత ఇస్తామని చెప్పడంతో, అవి ఎప్పుడు పూర్తవుతాయి. మాకు ఎప్పుడు ఇస్తారంటూ పలువురు మహిళలు కార్యాలయం బయట ఆందోళనకు దిగారు. నాలుగేళ్ల కిందట సర్వే నిర్వహించి ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పి స్లిప్పులు ఇచ్చారని, కానీ ఇప్పుడు పట్టించుకునే వారే లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దెలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం నిర్మించిన ఎన్యూఆర్ఎం గృహాలను ప్రజాప్రతినిధులు వారి అనుయాయులకు ఇస్తుంటే తమపరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు వున్నాయని, వాటిని తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కాల్వగట్టులపై ఆక్రమణదారులకు ఇస్తామంటున్నారు కానీ, ఇళ్లులేని మాకు ఇవ్వనంటున్నారని, అంటే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తేనే ఇళ్లు ఇస్తారా అని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు కొన్ని ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాత ఇస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు. అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకూఎన్యూఆర్ఎం ఇళ్లు వస్తాయని ఆశ పడ్డాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాల్వగట్లు ఆక్రమించిన వారికి ఇస్తామంటే మరి మాపరిస్థితి ఏమిటి? - కోమల జ్యోతి అద్దెలు కట్టలేక పోతున్నాం ఎన్నో ఏళ్లుగా సొంత ఇళ్లులేకుండా అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నాం. ఇప్పుడు అద్దెలు పెంచేశారు. రెండు, మూడునెలలు అడ్వాన్సులు అడుగున్నారు. ఎన్యూఆర్ఎం పథకంలో మాకు ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో నిర్మాణాలు పూర్తవ్వాలంటున్నారు.దశాబ్దాలుగా ఇళ్లులేని మాపరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. - షేక్ మజాన్బీ వైఎస్ కడితే..వీళ్లు అజమాయిషీ చేస్తున్నారు నిరుపేదల సొంత ఇంటి కల నేరవేర్చాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి నగరంలో ఎన్యూఆర్ఎం పథకం ద్వారా వేలాది గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అవి పూర్తయిన తర్వాత ఇప్పుడ మరోపార్టీ నాయకులు వారి అనుయాయులకు కట్టబెడుతున్నారు. నిజమైన నిరుపేదకు ఇళ్లు దక్కడం లేదు. - నెమ్మాది కుమారి