సూపర్ హిట్
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు... ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఉత్సవాల్లో సోనమ్ కపూర్ ఎన్ని డ్రెస్సులు వేసుకున్నారో అన్నీ హిట్టే. పెట్టుకున్న నగలూ హిట్టే. రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా ఆమె నడిచిన నడకలూ హిట్టే. మాట్లాడిన మాటలూ హిట్టే. ఈసారి కేన్స్ ఉత్సవాల్లో సోనమ్‌కి తిరుగు లేకుండాపోయింది. అంతా సూపర్ హిట్.