sports youth service
-
పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని
బెంగాల్ క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారి ఈ ఏడాది రంజీ ట్రోపీలో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా జార్ఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో.. ఆపై మధ్య ప్రదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తివారి సెంచరీలతో కథం తొక్కాడు. అయితే బెంగాల్ ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.మనోజ్ తివారి టీమిండియా తరపున 12 వన్డేల్లో 287 పరుగులు, 3 టి20ల్లో 15 పరుగులు చేశాడు. ఇక 23 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన మధ్య ప్రదేశ్.. ముంబైతో అమితుమీ తేల్చుకోనుంది. రంజీల్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన మనోజ్ తివారి బెంగాల్ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఇటీవలే మనోజ్ తివారిని ఒక చానెల్ ఇంటర్య్వూ చేసింది. మంత్రిగా ఉంటూనే ఆటను ఎలా బ్యాలెన్స్ చేశారని ప్రశ్నించగా.. తన డ్యుయల్ రోల్‌పై మనోజ్ తివారి ఆసక్తికరంగా స్పందించాడు. ''ఒక రాష్ట్రానికి మంత్రిని కావొచ్చు.. కానీ టైంను మేనేజ్ చేసుకుంటే రెండు పనులు ఒకసారి చేయొచ్చనేది నా మాట. రంజీలో అడుగుపెట్టడానికి ముందే నా నియోజకవర్గంలో ఒక టీంను ఏర్పాటు చేసుకున్నా. వారితో నా ప్రజల సమస్యలకు సంబంధించిన పేపర్ వర్క్‌ను నేను ఉంటున్న హోటల్ రూంకు తెప్పించుకునేవాడిని. ఇలా పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గ పనులు పూర్తి చేసి తిరిగి పేపర్ వర్క్‌ను కొరియర్ ద్వారా పంపించేవాడిని. ఇక క్రీడాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నాకు అదనంగా మరొక మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. రంజీ క్రికెట్ ఆడినన్ని రోజులు ఆయన.. నేను చేయాల్సిన పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక బెంగాల్ క్రికెట్ కూడా నాకు అండగా నిలబడింది. జట్టు ఆటగాళ్లు కూడా ఒక మంత్రిగా కాకుండా తమలో ఒక ఆటగాడిగా చూస్తూ చక్కగా సహకరించారు. కొన్నిసార్లు రాత్రిళ్లు ఎమర్జెన్సీ ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు నాతో పాటు ఉన్న తోటి క్రికెటర్లు పరిస్థితిని అర్థం చేసుకునేవారు. వ్యక్తిగత జీవితంలో నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంది. నాలుగేళ్ల నా బిడ్డను.. ఇంటికి సంబంధించిన పనులను స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. ఆమె చేసేది చిన్న పనే కావొచ్చు.. కానీ నా దృష్టిలో అది చాలా గొప్పది. ఇక బెంగాల్‌కు రంజీ ట్రోపీ అందించాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగాను. సెమీ ఫైనల్ వరకు ఈసారి కప్ మాదే అనే ధీమా కలిగింది. కానీ అనూహ్యంగా మా ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు! బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్‌కు హక్కు ఉంటుందా? -
‘పైకా’ రద్దు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ యువ క్రీడా ఖేల్ అభియాన్(పైకా) స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వ స్పోర్ట్స్ యూత్ సర్వీసుల శాల రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ యూత్ సర్వీసుల శాఖ డెరైక్టర్ ఆర్.డి. చౌహాన్ ఈ మేరకు ఆదేశాలను గత నెల 22వ తేదీన అన్ని రాష్ట్రాల క్రీడాధికారులకు జారీ చేశారు. ఈ స్కీమ్ ద్వారా పని చేస్తున్న సిబ్బంది, క్రీడాధికారులను వెంటనే తమ విధుల నుంచి తొలిగించాలని ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. పైకా స్కీమ్ పేరుతో పది క్రీడాంశాల్లో రాష్ట్ర ,జాతీయ స్థాయిలో క్రీడోత్సవాలను ఇంతకాలం నిర్వహించారు. పైకా స్థానంలో కొత్తగా రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్(ఆర్జీకేఏ) ఏర్పాటు చేస్తారు.