కిడ్నాప్ డ్రామా...డబ్బు డిమాండ్...అరెస్ట్
న్యూఢిల్లీ: కొంతమంది శనివారం రాత్రి తనను కిడ్నాప్ చేశారని, రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని తన బావమరిది నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ప్రబుద్ధున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. "ఈ కేసులో నిందితులైన అనీస్, అతని సోదరుడు షోయబ్ ల సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా వారి ఫోన్ సంభాషణలను టాపింగ్లో పెట్టాం. సిగ్నళ్ల ఆధారంగా కాంథ్ రైల్వే స్టేషన్ సమీపంలో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నా"మని ధాంపూర్ సర్కిల్ అధికారి హరేందర్ తెలిపారు. బిజినెస్ లో నష్టాలు రావడంతో అనీస్ తాను కిడ్నాప్ కు గురైనట్లు, కిడ్నాప్ చేసిన వ్యక్తులు రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఒక పథకం ప్రకారం మోసానికి పాల్పడ్డాడని హరేందర్ తెలిపారు. తన భర్తను కిడ్నాప్ చేశామని, రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని అనీస్ భార్య రెహనా పోలీసులకు తెలియజేసింది. ఫోన్ కాల్ ఆధారంగా అనీస్ కంథ్ రైల్వేస్టేషన్లో ఉన్నాడని గ్రహించి అతన్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని హరేందర్ తెలిపారు.