stagnation
-
ప్రభుత్వం మారితే.. విరామం సహజమే!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా సరే స్థిరాస్తి మార్కెట్లో ప్రభుత్వం మారితే విరామం సహజమే. బ్రేక్ తర్వాతే సినిమాలో అసలు కథ మొదలైనట్టే.. రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ తాత్కాలిక స్తబ్ధత తర్వాతే రెట్టింపు వేగంతో పరుగులు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాత విధానాల సమీక్ష, కొత్త పాలసీల రూపకల్పనకు సమయం పడుతుందని అప్పటివరకు మార్కెట్ మందకొడిగా ఉండటం సాధారణమేనని అభిప్రాయపడ్డారు. ► అనుమతుల మంజూరులో కమిటీల నియామకం, మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థిరాస్తి రంగంపై ప్రభావం పడుతుంది ఇది సాధారణ ప్రక్రియే. దీంతో భూ లావాదేవీలలో స్తబ్ధత ఏర్పడుతుంది. గత 4 ఏళ్లలో హైదరాబాద్‌లో భూముల ధరలు అసహజంగా పెరిగిపోయాయి. స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు, బడా వ్యాపారస్తుల భూముల కొనుగోళ్లు జరుపుతుంటారు. దీంతో సహజంగానే రేట్లు పెరుగుతాయి నగరంలో జరిగిందే. కొత్త లాంచింగ్లొద్దు.. ప్రతికూల సమయంలో కొత్త ప్రాజెక్ట్‌లను లాంచింగ్ చేసి పరిశ్రమ మీద భారం వేయకూడదు. వచ్చే 1–2 ఏళ్ల పాటు కొత్త యూనిట్లను ప్రారంభించడం కంటే పాత ప్రాజెక్ట్‌లలో విక్రయాలు చేపట్టడం, నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. మా ర్కెట్ పరిస్థితులు, ధోరణులను సమగ్రంగా అధ్య యనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృథా ఖర్చులు తగ్గించుకుంటూ నిర్మాణ పనులకే నిధులను కేటాయించాలి. కొనేముందు జాగ్రత్తలివే.. ► రాత్రికి రాత్రే బిల్డర్లుగా అవతారం ఎత్తి, తక్కువ ధరకే ఫ్లాట్లను ఇస్తామని మాయ మాట లు చెప్పే డెవలపర్లకు దూరంగా ఉంటే బెటర్. ► అప్పటికప్పుడే నిర్ణయాలుకాకుండా 2–3 నెల లు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించాలి. ► ప్రతికూల సమయంలోనూ గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసే ఆరి్ధక స్థోమత ఉన్న బిల్డర్ల వద్ద కొనుగోలు చేయడమే సురక్షితం. ► అన్ని అనుమతులతో పాటు మార్కెట్లో పేరున్న నిర్మాణ సంస్థలోనే కొనడం ఉత్తమం. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినవివే.. ► 111 జీ.ఓ రద్దు చేశారు కానీ విధి విధానాలపై స్పష్టత ఇవ్వలేదు. జోన్ల కేటాయింపు, నిర్మాణ పనులకు అనుమతి తదితరాలపై క్లారిటీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగ మార్పు చాలా క్లిష్టతరంగా మారింది. బిల్డర్లకే కాదు సామాన్యులకు సైతం భూ మార్పిడి చేసుకునేందుకు వీలుండే విధంగా ప్రక్రియను సులభతరం చేయాలి. ► ధరణి లోటుపాట్లపై కమిటీ సమరి్పంచిన నివేదికను సాధ్యమైనంత తర్వగా అమలు చేయాలి. పర్యావరణ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలి. బేరసారాలకు ఇదే సమయం భౌగోళికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. హైదరాబాద్‌లో ఇప్పటికీ స్థిరాస్తి పెట్టుబడులలో సింహభాగం వాటా తెలుగు ప్రజలవే ఉంటాయని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. హైదరాబాద్ స్థిరమైన నగరం కావడంతో పాటు అధిక ఆదాయం, ఉద్యోగ కల్పన, మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఇక్కడ స్థిర నివాసానికి మొగ్గు చూపిస్తుంటారన్నారు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో మార్కెట్ స్తబ్దుగానే ఉంటుంది. అయితే వాస్తవానికి నిజమైన కొనుగోలుదారులకు గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయం. ఎందుకంటే విక్రయాలు మందకొడిగా సాగే ఈసమయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. రోజువారి కార్యకలాపాలు, నిర్మాణ పనులకు అవసరమైన వ్యయం కోసం రేటు కాస్త అటుఇటైనా డెవలపర్ ఒక మెట్టు దిగే ఛాన్స్ ఉంటుంది. -
ఆఫీస్ స్పేస్ డిమాండ్ అంతంతే
ముంబై: వాణిజ్య కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్తబ్దుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. 32–34 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజు నమోదు కావచ్చని పేర్కొంది. అదే సమయంలో, దేశీయంగా వాణిజ్య రియల్టీ మార్కెట్లో ఉన్న సహజ బలాలు, ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చి పని చేస్తుండడం అన్నవి మధ్య కాలానికి భారత్‌లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్‌ను పెంచుతాయని తెలిపింది. దేశీ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు 42–45 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. బహుళజాతి సంస్థలకు చెందిన అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) సైతం గడిచిన కొన్ని సంవత్సరాల్లో కిరాయిదారులకు కీలక విభాగంగా మారినట్టు తెలిపింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్లో జీసీసీల వాటా మూడింట ఒక వంతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఆఫీస్ స్పేస్ నికర లీజు పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు అంశాల వల్ల ప్రభావితమవుతుంది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో నికర ఉద్యోగుల నియామకాలు నిలిచాయి. ఆదాయం తగ్గి, లాభదాయకతపై ఒత్తిళ్ల నెలకొన్నాయి. ఈ రంగం వ్యయ నియంత్రణలపై దృష్టి సారించొచ్చు. యూఎస్, యూరప్‌లో స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో జీసీసీలు దేశీయంగా పెద్ద స్థాయి లీజింగ్ ప్రణాళికలను వాయిదా వేయవచ్చు’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి వివరించారు. దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్, కల్సలి్టంగ్, ఇంజనీరింగ్, ఫార్మా, ఈ కామర్స్ విభాగాలు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో మిగిలిన వాటా ఆక్రయమిస్తాయని చెబుతూ.. వీటి నుంచి డిమాండ్ కారణంగా 2023–24లో 32–34 మిలియన్ చదరపు అడుగుల లీజ్ నమోదు కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. ఉద్యోగుల రాక అనుకూలం.. కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కోరుతుండడం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్‌కు ప్రేరణగా క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు ఇంటి నుంచే పనికి వీలు కల్పించిన కంపెనీలు, ఇప్పుడు వారంలో ఎక్కువ రోజులు కార్యాలయాలకు రావాలని కోరుతుండడాన్ని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు కార్యాలయాలకు రాక 40 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65–70 శాతానికి చేరుతుందని వివరించింది. సమీప కాలంలో సమస్యలు నెలకొన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 10–12 శాతం వృద్ధితో 36–38 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డేరెక్టర్ సైనా కత్వాల తెలిపారు. మధ్య కాలానికి వృద్ధి ఇదే స్థాయిలో ఉంటుందన్నారు. తక్కువ వ్యయాల పరంగా ఉన్న అనుకూలత, నైపుణ్య మానవ వనరుల లభ్యత నేపథ్యంలో జీసీసీలు ఆఫీస్ స్పేస్ లీజు మార్క్‌ను ముందుండి నడిపిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ఎంఎంఆర్‌లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ 2023 మార్చి నాటికి 705 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు తెలిపింది. ఆసియాలోని ప్రముఖ పట్టణాలతో పోలిస్తే భారత్‌లోని పట్టణాల్లోనే సగటు ఆఫీస్ స్పేస్ లీజు ధర తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. -
కాంగ్రెస్ వల్లే ‘ఇండియా’లో వేడి తగ్గింది: నితీశ్ కుమార్
పట్నా: విపక్ష ‘ఇండియా’ కూటమి స్తబ్ధుగా మారిపోయిందని, ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ పారీ్టయే అందుకు కారణమని జేడీ(యూ) సీనియ ర్ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మునిగిపోయిందని, దాంతో ఇండియా కూటమిలో వేడి తగ్గిందని అన్నా రు. గురువారం బిహార్ రాజధాని పట్నాలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన సభలో నితీశ్ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ పాలనను వ్యతిరేకించే పారీ్టలు ఒకే వేదికపైకి వచ్చాయని, ఆ కూటమిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. -
మున్సిపోల్స్ జరిగేనా..?
సాక్షి, కొత్తగూడెం :మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో స్తబ్దత నెలకొనడంతో అసలు జరుగుతాయా లేదా అనే చర్చ జోరుగా నడుస్తోంది. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని..బరిలో నిలిచే వారంతా వారివారి వార్డుల్లో ఇప్పటికే తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా ప్రక్రియ నిలిచిపోవడం, ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదనే వార్తలు వస్తుండడంతో అయోమయంలో పడ్డారు.2010 సెప్టెంబర్ 29న మున్సిపల్ కౌన్సిళ్ల పదవీ కాలం ముగిసింది. నాటినుంచి వివిధ కారణాలతో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకుండా వాయిదాలు వేస్తూ ప్రత్యేక అధికారుల పాలనకు తెరతీశారు. అప్పుడు ఇప్పుడంటూ కాలయాపన చేసిన ప్రభుత్వం మూడేళ్ల తర్వాత ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెం, మధిర, ఇల్లెందు మున్సిపాలిటీ, సత్తుపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. ఏజెన్సీ వివాదం కారణంగా పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం లేదు. మిగతా అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్ పూర్తి కావడంతో అప్పుడే మాజీ కౌన్సిలర్లు రిజర్వేషన్ అయిన వార్డులో తమ భవితవ్యం పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంకా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న పలువురు అభ్యర్థులు కూడా ఎన్నికలు జరుగుతాయని భావించి వార్డులలో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుత పరిణామాలతో..ఇప్పుడు ఎన్నికలు జరగకపోయినా రిజర్వేషన్లు మారవు కదా అనుకుంటూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌గా ఏర్పడడంతో ఇక్కడ పోటీకి అన్ని పార్టీలు సై అంటున్నాయి. ఇక చైర్మన్ల రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చాల్సిన సమయంలోనే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. హడావుడి చేసిన అధికారులంతా ప్రస్తుతం మౌనం దాల్చారు. ఆశావహుల్లో ఉత్కంఠ.. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో అధికారికంగా వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయింది. అయితే చైర్మన్ల రిజర్వేషన్ నిలిచిపోవడంతో.. బరిలో ఉండాలనుకుంటున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. అన్ని పార్టీలకు చైర్మన్ అభ్యర్థిత్వం కీలకం కావడంతో రిజర్వేషన్ పూర్తి అయితే ఎవరినో ఒకరిని ఎంపిక చేస్తే ఓపని అయిపోతుందని భావించాయి. చైర్మన్ అభ్యర్థి వార్డులో పోటీచేసే అభ్యర్థుల ఖర్చు భరించాలని ఇప్పటికే అన్ని పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. ఆదిశగా చైర్మన్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారంతా ఖర్చు కోసం ఇప్పటికే డబ్బును సమకూర్చుకునే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. డబ్బుకు వెనకాడితే చైర్మన్ రేసులో ఉండలేమని ఎవరికివారు పోటీపడుతున్నారు. అసలు చైర్మన్ల రిజర్వేషన్ పూర్తి అయితే తమకు అవకాశం ఉందోలేదో తేలిపోతుందని, ఇప్పటి నుంచే ఈ తంటాలు ఉండేవికావని వారు భావిస్తున్నారు. గతంలో పరిస్థితులను అంచనా వేసుకొని ఈ సారి ఎలాగైనా తమ కేటగిరికే మున్సిపల్ చైర్మన్ పదవి రిజర్వు అవుతుందని ఎవరికివారే ఆశల పల్లకిలో ఉన్నారు. రిజర్వేషన్ మళ్లీ తమ కు అనుకూలంగా ఉంటుందని, ఈ సారి కూడా నేనే చైర్మన్ అవుతానని గతంలో ఆ పీఠంపై కూర్చున్న వారు అంచనాలు వేస్తున్నారు. ఈనేపథ్యంలో అసలు ఎన్నికలు ఉంటాయా ఉండవా అన్న విషయానికి ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక పాలన పొడగింపు ...? వచ్చే సెప్టెంబర్ 29 నాటికి మున్సిపల్ పాలకవర్గం పదవికాలం ముగిసి మూడేళ్లు అవుతుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించి కౌన్సిల్ నియామకం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక అధికారుల పాలన పొడిగించలేదు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోతే ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.