‘జాతీయ ఉత్తమ టీచర్ అవార్డీ’ల ఎంపికకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2013కు టీచర్లను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్గా పాఠశాల విద్య కమిషనర్ వ్యవహరిస్తారని, సభ్యులుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్, మైసూరులోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డీజీ రావు వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సెకండరీ విద్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.