సుశీలా చానుకు సారథ్యం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ఈనెల 30 నుంచి జరిగే నాలుగు దేశాల మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ రీతూ రాణికి విశ్రాంతి ఇచ్చి... ఆమె స్థానంలో సుశీలా చానుకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రజని ఎతిమరపు గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
భారత మహిళల హాకీ జట్టు: సుశీలా చాను (కెప్టెన్), దీపిక (వైస్ కెప్టెన్), సవిత, రజని, సునీతా లాక్రా, నిక్కి, దీప్ గ్రేస్, హినియాలుమ్ లాల్, రాణి, నమిత, నవ్‌జ్యోత్, మోనికా, రేణుక, పూనమ్, వందన, అనురాధ, లిలిమా మింజ్.